Jul 21, 2011

దున్నపోతా!! సిగ్గులేదూ?

ఏపీ భవన్‌ ఘటనపై విచారం వ్యక్తంచేసిన హరీష్‌
న్యూఢిల్లీ : ఏపీ భవన్‌లో జరిగిన ఘటనపై తెరాస శాసనసభ్యుడు హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. చందర్‌రావుకు క్షమాపణ చెప్పానని దీన్ని మరింత రాద్దాంతం చేయడం తగదని ఆయనన్నారు.

http://timesofindia.indiatimes.com/videos/news/Drama-at-AP-Bhavan-TRS-MLA-beats-up-official/videoshow/9311399.cms
ఇందులో వీడియోలో క్రిస్టల్ క్లియర్గా హరీష్ రావ్ ఓ వ్యక్తిని కొట్టడం చూపించారు. హరీష్ రావు ఒప్పుకున్నాడు.
మరో వ్యక్తిపై చేయి చేస్కోటం నాకు తెలిసైతే నేరం. ఇతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు?
మరింత రాద్ధంతం చేయడం తగదా?

దున్నపోతా!! సిగ్గులేదూ?

26 comments:

 1. దున్నపోతా! సిగ్గులేదూ?

  జవాబులు తెల్సిన ప్రశ్నలు మళ్ళీ అడక్కూడదు అధ్యక్షా!

  ReplyDelete
 2. మీ జీవితం లో మీరెవరితోనూ గొడవ(తిట్టుకోవటం,కొట్టుకోవటం) పడలేదు అని చెప్పి ఈ ప్రశ్న వేస్తే బాగుంటుంది. సుజాత గారు కూడా.. ఒక మనిషి మృత దేహాన్ని కన్న వాళ్ళకి తెలియపర్చకుండా ఉంచి, శ్మషానంలో దహనం చేయమని అధికారిక ఉత్తరం రాసిన వాడిని కొట్టక ఏం చేయాలో చెప్పండి.

  ... అంటే సమైక్యాంధ్ర కోసం ఆత్మ హత్య చేసుకునేంత భావావేశం మీ ఇద్దరిలో ఎవరికీ లేకపోయినా.. ఆ శవం మీదే అయితే...ఏ దిక్కుమాలిన చావో చస్తే .. కనీస మర్యాద చూపరా ?

  ఇప్పుడు దున్నపోతా! సిగ్గులేదూ?

  ReplyDelete
 3. మన సమైక్యవాదులు కూడా దున్నపోతులే కదా http://telugu.stalin-mao.in/61948323

  ReplyDelete
 4. 1.ప్రవీణ్ 'మనవాళ్ళు కూడా' అని హరీష్ రావును దున్నపోతు అని ఒప్పుకుంటూనే, మన-పర భేధ భావం చూపుతున్నారు - ఇది శోచనీయము.

  2.'కన్నవాళ్ళకు చూపకుండా' శవాలను ఖననం చేయడానికి AP Bhavan శ్మశానవాటిక కాదు,గెస్ట్ హౌస్ అనుకుంటా. అయినా వాళ్ళ అనుమతి ఎవరడిగారో CBIతో దర్యాప్తు జరిపించాలి.

  ReplyDelete
 5. సన్నాసిని చూసి బైరాగి నవ్వితే ఎలా ఉంటుంది? హరీష్ రావు కండకావరం చూసి సమైక్యవాద గూండాలు నవ్వితే అలాగే ఉంటుంది.

  ReplyDelete
 6. "శ్మషానంలో దహనం చేయమని అధికారిక ఉత్తరం రాసిన వాడిని కొట్టక ఏం చేయాలో చెప్పండి."
  కాయ గారూ కాస్త తలకాయ వాడి ఆలోచిస్తే అసలు ఆ లేఖ రాసిన వాడెవడో తెలుసుకోకుండా కనిపించిన వాడిని కనిపించినట్టు చేలో పడ్డ దున్నపోతులా కుమ్ముకుంటూ పోతుంటే మరేమనాలండీ? అన్నట్టు ఆ మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపిన తరువాతే ఈ గొడవ జరిగిందని తమకు తెలియాదాండీ? శవంతో పాటు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిన వి.హెచ్ తెలంగాణా నాయకుడు కాదండీ? మృత దేహాన్ని ముందు కన్నవాళ్ళకి పంపించకుండా దగ్గర పెట్టుకుని ధర్నాలు, ఆందోళనలు చేసి తరవాత పంపిస్తామంటే దాన్ని శవరాజకీయాలు అంటారని తమకు తెలియదండీ?

  "ఆ శవం మీదే అయితే.."
  ఆ శవాలు మావే అయినా కూడా ఇలా తగలేయకుండా రాజకీయాలు గట్రా చేస్తూంటే మా ఆత్మలు ఘోషిస్తాయండి బాబూ..

  "ఏ దిక్కుమాలిన చావో చస్తే .. కనీస మర్యాద చూపరా ? "
  ఎంత మాటన్నారు? అంటే ఇప్పుడు పాపం అక్కడ ఆత్మ హత్య చేసుకున్నా వ్యక్తిది దిక్కుమాలిన చావా? ఈ మాట హరీష్ విన్నాడంటే మీ మెడకాయ మీద తలకాయ ఉండదు . జాగర్తండి బాబూ జాగర్త.

  ReplyDelete
 7. శవాలని తగలెయ్యకపోతే ఆత్మలు ఘోషిస్తాయా? తెలంగాణావాదులు రోడ్ల మీద బతుకమ్మలు ఆడితే అది మూఢనమ్మకం అనే సమైక్యవాదులు ఆత్మలని మాత్రం నమ్మొచ్చా?

  ReplyDelete
 8. Well said SHANKAR.S

  Praveen,
  to remind you... you are supposed to support seperatists, but you are bashing them too... very bad! :)

  ReplyDelete
 9. మేటరు పూర్తిగా తెలియకుండా మధ్యలో దూరిపోకూడదు. అయినా ఓ పాలి మీ చీక్కోలు వీధుల్లోకెళ్ళి గట్టిగా "జై తెలంగాణా" అని నినాదమిచ్చి చూడరాదూ. ఓ గొడవొదిలిపోతుంది

  ReplyDelete
 10. ఇక్కడ జై తెలంగాణా అంటే ఏమీ కాదు. ఇక్కడ హైదరాబాద్‌లో ఆస్తులు సంపాదించినవాళ్ళు చాలా తక్కువ కాబట్టి.

  ReplyDelete
 11. కాయగారూ, ( ఏ కాయ ఇంతకీ)

  అదీ సంగతి! మీరూ హరీష్ రావు లాగే ఉత్తరం ఎవరు రాశారో తెలీకుండా కనపడ్డవాళ్ల మీద ఎగబడిపోతున్నారు.ఉత్తరం రాసింది చందర్ రావని మీకెవరు ఫోన్ చేశారూ?

  సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్యలు చేసుకునే భావావేశం__________భావావేశంతో సమస్యలు పరిష్కారం కావనేది కామన్ సెన్స్!అక్కడైనా నాయకులు కాకుండా సామాన్య ప్రజల భావావేశాన్న్ని ఎవరు రెచ్చగొడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి.

  మీరు మాత్రం భావావేశాన్ని అదుపులో ఉంచుకోండి! ఇలా సమైక్యవాదుల్ని తిట్టడానికి మీలాంటి మనుషులు ఉండాలి మరి! తొందర పడేరు సుమా!

  ReplyDelete
 12. @ఒక మనిషి మృత దేహాన్ని కన్న వాళ్ళకి తెలియపర్చకుండా ఉంచి, శ్మషానంలో దహనం చేయమని అధికారిక ఉత్తరం రాసిన వాడిని కొట్టక ఏం చేయాలో చెప్పండి....
  ...uttaraMlO emi undo mundu poortigaa chadivi tarvaata commeny cheyandi...podi mukkalaku ardaalu maaratayi..

  ReplyDelete
 13. తక్కువ కులం వాడు కబట్టే అంత దైర్యంగా దొరగారు కొట్ట గలిగారు......dora maha muduru...

  ReplyDelete
 14. kvsv gaaru,

  What Harish did is ridiculous and he should be punished.

  But I do not think he considered caste etc. before exhibiting his arrogance. I do not think caste (whatever caste it is) is irrelavant here.

  ReplyDelete
 15. @కాయ
  >>మీ జీవితం లో మీరెవరితోనూ గొడవ(తిట్టుకోవటం,కొట్టుకోవటం) పడలేదు అని చెప్పి ఈ ప్రశ్న వేస్తే బాగుంటుంది<<
  ఆహా!! ఏమి తర్కం బాసూ!! వావ్!! హాట్స్ ఆఫ్.
  ఐతే, మరి ఏపి భవన్లో ఎవరెవరు *గొడవ* పడ్డారూ? ప్రభుత్వ అధికారి తన విధులను నిర్వర్తించటం తమ దృష్టిలో గొడవ అన్నమాట. భేష్!!
  >>ఒక మనిషి మృత దేహాన్ని కన్న వాళ్ళకి తెలియపర్చకుండా ఉంచి,<<
  ఎక్కడ ఉంచారూ?
  ఎవరు ఉంచారూ?
  ఎలా ఉంచారూ?
  ఇలాంటి *రాజకీయ హత్యల్లో* మృతదేహాన్ని ఎపి భవన్లో తెలియపర్చకుండా దాపెడతారా?
  తెలియపరచకుండా అంటే ఏంటీ? తెలియపరచకుండా ఉంచాల్సిన అవసరం సదరు దెబ్బలు తిన్న అధికారికి ఎందుకుందీ? అతను ఈ హత్య చేయలేదే? అసలు సదరు ప్రాణనష్టం జరిగింది ఎపి భవన్లో కాదుకదా? బయట, చెట్టుకి ఉరేసారు కదా?
  >>సమైక్యాంధ్ర కోసం ఆత్మ హత్య చేసుకునేంత భావావేశం<<
  సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య చేసుకునేంత భావావేశం నాకైతే లేదు, మరి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకునేంత విశాలహృదయం భావావేశం మీకు లేదా? ఉంటే మరెందుకు ఆత్మహత్య చేస్కోలేదింకా?

  >>ఏ దిక్కుమాలిన చావో చస్తే .. కనీస మర్యాద చూపరా ? <<
  అబ్బో ఇంత కఠినమైన ప్రశ్నలు వేస్తే ఎలా?

  ReplyDelete
 16. బాబూ ప్రవీణ్!!
  నీ కామెంట్లు ఇక్కడ అవసరమా?
  ఇక్కడి టపాకీ నీ కామెంటుకీ ఏంటీ సంబంధం?
  హరీష్ రావ్ డ్యూటీలో ఉన్న ఓ అధికారిని కొట్టాడు.
  మనిషా దున్నపోతా అనేది టపా

  *మా సమైక్యవాదులు*
  పుండు పగుల్తుంది పిచ్చి వాగుడు వాగావంటే...ఛల్ పూట్!!

  ReplyDelete
 17. @Praveen Sarma said...

  శవాలని తగలెయ్యకపోతే ఆత్మలు ఘోషిస్తాయా? తెలంగాణావాదులు రోడ్ల మీద బతుకమ్మలు ఆడితే అది మూఢనమ్మకం అనే సమైక్యవాదులు ఆత్మలని మాత్రం నమ్మొచ్చా?
  -------------

  ఏవిట్రా ఈ గోల. ఎవరూ ఈతగాన్ని నిలుపలేరా పిచ్చి కామెట్లు పెట్టకుండా?

  ReplyDelete
 18. సుజాత గారూ
  ఎనుబోతుని ఎన్నిసార్లు ఎనుబోతా అంటే ఉపయోగం ఏవుంటుందీ? మీరన్నది నిజం అధ్యక్షా
  శంకర్ గారూ - బాగా చెప్పారు
  యస్‌యన్‌కెఆర్ - ఔనౌను!! సిబీఇ దర్యాప్తు చేయించాల్సిందే
  @కిరణ్ కుమార్ - :):) భావావేశం ఉంటే ఆత్మహత్య చేస్కుంటారట గురుగారూ!! అలా ఏడ్చింది వీళ్ళ ఆలోచన.
  @కెవియస్‌వి గారూ- బాగా అడిగారు
  @Weekend Politician - మీ మొదటి కామెంటు చూసి, ఇదేట్రా అనుకున్నా!!

  ReplyDelete
 19. శంకర్: అతను ఆ ఉత్తరం లో సంతకం పెట్టానని ఒప్పుకున్నాడు న్యూస్ లో చూపించారు కూడా. ఎవరో తెలియకుండా పొయి, మూసి ఉన్న తలుపు ని తన్ని ఎవడు దొరికితే వాడిని కొట్టలేదు. ఉత్తరం పై సంతకం చేసిన వాడినే కొట్టారు.

  ఇక ఇక్కడి కొంత మందికి,
  దిక్కుమాలిన చావు కాదు.. దిక్కు లేని అని నా ఆలోచన.

  భావావేశం సరైంది అని నేననలేదు. నేను చచ్చే టైప్ కాదు లెండి. చివరి వరకూ ఉండే టైప్.

  "తెలియపర్చాల్సిన అవసరం ఆ అధికారికి ఎందుకుందీ" అంటే అది అతని విదుల్లో ఒకటి.
  "తెలియపరచకుండా ఉంచాల్సిన అవసరం సదరు దెబ్బలు తిన్న అధికారికి ఎందుకుందీ? అతను ఈ హత్య చేయలేదే?" :
  ::అతనూ కుట్ర గాంగ్ లో సభ్యుడేమో. కొంతమంది డిసైడ్ చేస్తే అతను సంతకం పెట్టి అమలు చేశాడు.


  :విమానం లో శవం వెళ్ళిపోయాక ఈ గొడవ జరిగింది" అన్నాడో మనిషి ఇక్కడ.
  ::ఇతన్ని కొట్టాకే అతను రజత్ భర్గవ పేరు చెప్తే అతని దగ్గరికి పొయినంక అసలు విషయం బయట పడి ఏపీ భవన్ కు తీస్క రమ్మని మళ్ళా లొల్లి చేసింది.

  అటువి ఇటు చేసి తిమ్మిని బమ్మిని చేసి ఇక్కడ చాలా మంది రాతలు వ్రాశారు. మీ ఈగో లని సంతృప్తి పర్చుకోడానికి ఇంత దిగజారుడు శోచనీయం. ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు వ్రాశి వాదించండి.

  ReplyDelete
 20. అయ్యా కాయ గారూ
  తమరు చచ్చే టైపు కాదు. తెలుస్తూనే ఉంది, చంపే టైపని. భావావేశమ్ ఉంటే ఆత్మహత్య చేస్కోండని ప్రేరేపిస్తున్నారుగా!!
  ఇగోలా? ఇక్కడ ఇగో గోల ఎక్కడా?
  >>::అతనూ కుట్ర గాంగ్ లో సభ్యుడేమో. <<
  ఏమో??? వావ్!! కేక. ఏమో? ఇదసలు ఆత్మహత్యే కాదేమో? హత్యేమో? ఏమో??
  కేసీఆరే చంపించిండేమో?
  మీకు కాంక్రీట్గా తెలిస్తే చెప్పుడి. ఊహలు చెప్పే పనైతే హాప్పీస్గా ఓ బీరు కొట్టి బబ్బోండి, బెస్ట్!!
  >>దిక్కుమాలిన చావు కాదు.. దిక్కు లేని అని నా ఆలోచన<<
  ఎలా? దిక్కుమాలిన చావుకీ దిక్కులేని చావుకీ ఏంటీ తేడా? పై సంఘటన దిక్కులేని చావు అని ఎలా చెప్తారూ?
  తెలంగాణ రాదేమో అని చావటం దిక్కులేని చావా? తెలంగాణా రాకపోతే ప్రాణత్యాగాలు చేయిస్తాం అంటం చీకట్లోకి నెట్టడం కాదా?
  >>"తెలియపర్చాల్సిన అవసరం ఆ అధికారికి ఎందుకుందీ" అంటే అది అతని విదుల్లో ఒకటి.
  అతని విధులు ఏంటీ? మీరు అతని విధులు ఇవి అని చదివారా? ఎక్కడా? ఆ డాక్యుమెంట్ షేర్ చేయండి, ప్లీజ్.
  >>ఇతన్ని కొట్టాకే అతను రజత్ భర్గవ పేరు చెప్<<
  ఓహో!! అంటే కొట్టడం జరిగిందన్నమాటా, కొట్టాక, అతను తన పై అధికారి పేరు చెప్పాడన్న మాట. అలా చేయటం తెలంగాణ చట్టం ప్రకారం నేరం కదూ?
  >>అటువి ఇటు చేసి తిమ్మిని బమ్మిని చేసి ఇక్కడ చాలా మంది రాతలు వ్రాశారు.<<
  నేను వ్రాసిందాంట్లో తిమ్మిని బమ్మి ఏంచేసానో కాస్త వివరిస్తారా?

  ReplyDelete
 21. :)) fitting reply.

  How idiotic are some regional fanatics! That's why KCR like buffoons are flourishing in Tg. :))

  ReplyDelete
 22. http://dare2questionnow.blogspot.com/2011/07/blog-post_23.html

  నాన్నా, పైన బ్లాగ్లో లిస్ట్ చేసిన వారంతా దున్నపోతులైతే mee post correcte..ledante mee blog title meeke vartistadi

  ReplyDelete
 23. @ఫణి
  నేరం ఎవరు చేసినా తప్పే!! నా టపాలో మిగతావాళ్ళు పత్తిత్తులని చెప్పలేదుగా!! ఏవంటారూ?

  ReplyDelete
 24. అదేనండీ నేను అనేది..మీరు ఇలాంటి శీర్శిక తోనే పయ్యావుల కేశవ్ పైనో, లగడపాటి పైనో(ఒక ప్రత్యెకంధ్రాని బలపరిచె అతనిని కొట్టినపుడు) ఒక టపా ప్రచురిస్తే నేను సంతోషించేవాడిని. అందరి తప్పులను ఎత్తిచూపితేనే నిష్పక్షపాతం అనిపించుకుంటుంది.

  ReplyDelete
 25. >>మీరు ఇలాంటి శీర్శిక తోనే పయ్యావుల కేశవ్ పైనో, లగడపాటి పైనో(ఒక ప్రత్యెకంధ్రాని బలపరిచె అతనిని కొట్టినపుడు) ఒక టపా ప్రచురిస్తే నేను సంతోషించేవాడిని.<<
  ఆ సంఘటనలు ఇప్పుడు జరిగాయా?
  నేను ప్రస్తుత సందర్భంలో వ్రాస్తున్నప్పుడు వాళ్ళపై ప్రచురిస్తే సంతోషించేవాణ్ణి అంటే ఎలా?
  మరో ముఖ్య విషయం - తెలంగాణ వచ్చుడు, లగటపాటి, పైయ్యావుల ఇలాంటివాటికి నేను న్యూట్రల్.
  కాబట్టి మీ వ్యాఖ్యలోని శ్లాంగ్ నాకు బాగా అర్థమైంది. నేనెదో వారిని వెనకేస్కొస్తున్నా అనుకుంటే నే చేయగలిగింది ఏవీ లేదు.

  నాకు ప్రస్తుత వార్తపై స్పందించాలనిపించింది, స్పందించాను.

  *తప్పు ఎవరు చేసినా తప్పే*
  దట్స్ ఆల్ యువరానర్

  ReplyDelete