Jul 8, 2011

ఆపీస్ అగసాట్ల కైత

మా మేడమ్మ పిలిస్తే
అలా వెళ్ళానా
ఇలా ఓ సెవికి రింగేసి కూకో బెట్టింది
అటైపునుండి భావేష్ మొదలెట్టాడు
తీటాలో తాట
తాటలో తేట
మీటా బాటా
బటాటా అయ్యింది
అయ్యా భావేషయ్యా
నా చెవులు చేటలయ్యాయ్యా
ఇహ వదలవయ్యా అని
వదిలించుకుని
కసరుకొని
కసురుకుని
కాళ్ళు లాక్కుని
బూటలో పెట్టుకుని
చేతులు గుంజుకుని
పాయింటూ జోబిలో పెట్టుకుని
లటక్కున లగెత్తుకుంటూ
తల తిరుగుతుంటే తూలుతూ
పొర్లుకుంటూ
పడుతూ లేస్తూ
వస్తుంటే
దారిమధ్యలో
మా మేనేజరమ్మ
బాబూ నీ సమయపత్రం మీద
దస్తఖత్తు చేసిస్తా రా
చేయ్యాలంటే నా సోది మరి
పాతిక కేజీలు వినాలంటే
బెంగతో
బుంగమూతితో
బుంగెడు నీళ్ళతో
భారంగా కదులుతూ
విని
తరించి
ఇదిగో ఇప్పుడే వచ్చి కూలపడ్డా
నా కుర్చీలో
కాళ్ళే లేని కుర్చీలో
బతుకు కుర్చీలో

4 comments:

  1. అంతే అన్నాయ్ ఈ బాస,బాసిణులింతే. మనం కూడా బాసవ్వకపోతాం? ఉందిలే మంచి కాలం ముందు ముందునా..

    ReplyDelete
  2. ఊర్కోండి. ముందు కళ్ళు తుడుచుకోండి. కష్టాలు మడుసులకి కాక మేడమ్ములకి వస్తాయా. ఏం చేస్తాం. కొన్ని జీవితాలంతే :(

    ReplyDelete