Jul 27, 2011

పులి ఆత్మఘోష

1972-73కు ముందు దేశవ్యాప్తంగా 40 వేలకు పైగా పులులు ఉండేవి. తరువాత వివిధ కారణాల వల్ల వీటి సంఖ్య 1800కు పడిపోయింది.
ఈవేళ పొద్దున ఈనాడు పేపరులోది పై వార్త.
ఎక్కడ నలభై వేలు ఎక్కడ పద్దెనిమిది వందలు??? సిగ్గులేన ప్రభుత్వం, వన్యప్రాణులంటే బాధ్యత లేని ప్రజ అని పై వార్త చూడగానే బజ్జాను.
ఇందాక ఛానల్స్ అటు ఇటు తిప్పుతుంటే కరెంట్ టివీలో వాన్గార్డ్ టైగర్ ఫార్మ్స్ అనే ప్రోగ్రాం దగ్గర ఆగింది రిమోటు. ఏట్రా అనిచూస్తే వళ్ళు జలదరించిండి ఆ కార్యక్రమం. పులిచర్మాల దుకాణాల దగ్గరనుండి పులి మాంసం అమ్మే దుకాణాలు, పులి వైను అమ్మేదుకాణాలు పులి వంటాలు అమ్మే అంగళ్ళు మియాన్మార్లో ఉన్నాయని చూపాడు. క్రితంతోజు చంపుకొచ్చిన పులి కిచెన్లో పడేసుంది. చర్మం వొలిచారు. మాంసం ముద్ద అలా పడేసుంది. ఈ కార్యక్రమాన్ని తీస్తున్నవాడు, వాడి పేరు యమగూచి, బాబూ నాకు ఫ్రెష్ టైగర్ కావాలి ఉందా అనడిగాడు. యా ఉంది, కిచెన్లోకి రండి అని తీస్కెళ్ళిందామె. పులి మాంసాన్ని కత్తితో కోసి సూప్ పెడుతుందట.



నలభైవేల టైగర్లు పద్దెనిమిది వందలు చేయటానికి మానవమృగానికి ఆట్టే సమయం పట్టలేదు. చైనాని మియాన్మార్ని అనుకుని మనం సాధించేదేమీ లేదు. మనమూ అందులో పాలుపంచుకుంటున్నవాళ్ళమే అని చెప్పటానికి సిగ్గుతో తలవంచుకోవాలి.

చట్టం న్యాయం గట్టి చేస్కోనంత కాలం, డబ్బు లంచం చేతులు మారినంత కాలం, అధికారులు రాజకీయ నాయకులు అమ్ముడు పోయినంతకాలం మాణవమృగానికి ఎదురులేదు. అడవిమృగాల వేటకు తిరుగులేదు.

కొనసాగుతూనే ఉంటాయి. అవి అంతరించిపోయేంతవరకూ!!!!!

వాన్గార్డ్ టైగర్ ఫార్మ్స్ వీడియోలు ఇక్కడ లభ్యం -
http://current.com/shows/vanguard/video/#

పులి చావుని చూడాలనుకుంటే పై వీడియో చూడచ్చు!!

జై హింద్

3 comments:

  1. పులి మాంసం తింటారని అసలు ఐడియా లేదు. భారతీయులు కూడా తింటారా?

    ReplyDelete
  2. తినొచ్చండి. మన రాజకీయ నాయకులకు రాజ్యపాలకులకు ఇది తినదగునిదితినవలదు అనే నియమాల్లేవు. నెమళ్ళు, రకరకాల పిట్టలు, అడవి ప్రాణులు..అన్నీ ఈడిబులే!!
    ఫ్రీగా వస్తే ఏదైనా తింటారు..

    ReplyDelete