Jul 14, 2011

అమెరికాలో ముంబై తరహా దాడులు జరగక పోవటానికి కారణాలు.

అమెరికాలో ముంబై తరహా దాడులు ౯౧౧ తర్వాత జరగక పోవటానికి అనేకానేక కారణాలు.
అమెరికనులు ఎట్లాంటివారైనా బాహ్య ప్రపంచానికి, వాళ్ళూ ప్రజలే.
౧. వీరికి సామాజిక (వాళ్ళ సమాజమే అనుకోండి) స్పృహ కొంతైనా ఉంది.
౨. సందేహాస్పదంగా ఎవరైనా తిరుగాడుతుంటే వెంటనే ౯౧౧ కి కాల్ చేసేందుకు వెనుకాడరు
౩. ఇక్కడి చట్టం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తుంది.
౪. పోలీసు వ్యవస్థ నిర్ధిష్టమైన ఆడిట్ తో నడుస్తుంది. మనలాగా వార్డ్ కౌన్సిలర్ కాల్ చేస్తే ఉచ్చ పోస్కుంటూ నేరస్తులను వదలరు.
౫. పోలీసులు నేరస్తులను ఖచ్చితమైన ఆధారాలతో అరెస్టు చేస్తారు. ఆ ఆధారాలను అత్యంత ఆధునిక టెక్నాలజీతో సంగ్రహిస్తారు.

మనకి
౧. సమాజిక స్పృహ లేదు
౨. మనం ఎవర్నీ అనుమానించం, అనుమానించినా పోలీసులకు కాల్ చేయం. హా ఆ తలనొప్పి ఎవడిక్కావాలి అనుకుంటాం. ఒక వేళ కాల్ చేసినా, మైనారిటి అనే ప్లకార్డ్ పైకి వస్తుంది.
౩. మన చట్టం వాయిదాల చట్టం. శిక్ష పడటానికి పట్టే కాలం జీవితకాలం కన్నా ఎక్కువే. ఒకవేళ కఠినంగా శిక్ష పడినా, అది పేపరు మీదనే.
౪. పోలీసు వ్యవస్థకి ఆడిట్ లేదు. ఇష్టా రాజ్యం. వార్డ్ కౌన్సిలరుకు కూడా యస్.ఐ సెల్ ఫోన్ నెంబర్ తెలుస్తుంది. స్టేషన్ కి వచ్చే కాల్స్ లాగ్ అవవు. పోలీసులు కమ్యూనికేషన్ కొరకు సొంత సెల్స్ వాడతారు. ఇత్యాదివి.
౫. పోలీసులు ఎవర్ని అరెస్టు చేస్తారూ వారు నేరం అంగీకరిస్తారు. టెక్నాలజీ అంటే మనవాళ్ళకి, వెదురు కఱ్ఱల స్థానంలో ప్లాస్టిక్ పైపులు.
౬. మన పోలీసులు సమాజాన్ని కాపాట్టం కన్నా రాజకీయ నాయకులను వారి ఆస్థులను కాపాట్టం తవ విధిగా కర్తవ్యంగా పరమావధిగా భావిస్తారు

6 comments:

 1. సింపులుగా ఓ ముక్కలో చెప్పాలంటే, ఇలాంటి యెధవ వేషాలేసే వాల్లను (తీవ్రవాద దాడులు) .. డిక్కీలో తొంగో బెట్టేస్తారు, ఓటుబ్యాంకు రాజకీయాలకు పోకుండా. అంతే కదా.. :-)

  ReplyDelete
 2. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ SSN ఉంటుంది, ప్రతి వాణ్ని వాడి క్రెడిట్ కార్డ్ వాడకం తోనో మరోలాగో పట్టుకోవచ్చు,

  ReplyDelete
 3. ఆ మనమేమీ కాలేదు, మనవాళ్ళకి ఏమీ కాలేదు. మరింకేమేతే నేమిటి. ఇది సగటు మనిషి అలోచనా ధోరణి. ప్రతివాడికీ భగత్ సింగ్ అంటే ఇష్టమే. కాని ఎవరికివాళ్ళకి భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాలనే! ఎప్పటికప్పుడు ఇలా జరగనూ, రాజకీయ నాయకులను ఓ పుంజీడు తిట్లు తిట్టి ఊరికోవటం. ఒక సమాజంగా ధైర్యంగా ఇటువంటి వాటిని ఎదుర్కునే స్థైర్యం లేకపోయింది. అనవసరపు అపరాధ భావాన్ని, అనవసరపు జాలిని (misplaced sympathy)విసర్జించి, మనమందరమూ చైతన్యవంతులమైతే సంఘ వ్యతిరేకులను అరికట్టటం కష్టమైన పని కాదు. కాని, ముందు సమాజంలో క్రమశిక్షణ కావాలి. అది రాకుండా గాలి తరహాలో బతకటానికి అలవాటుపడిపోయి, ఏది మనది ఏది మనది కాదు అన్న విచక్షణ కూడ లేకుండా పోయినాక ఎప్పటికి అందరం కలిసి ఒకటిగా ఒకే గొంతుకతో మాట్లాడగలం?

  ReplyDelete
 4. మన వాళ్ళు ఈజీ మనీ కి అలవాటు పడి ఇలా పాడు పనులకు సహకిరస్తారు .
  దేశం అంటే ప్రేమ సినిమా లో చూపించినట్టు మనసులో ఉండదు .
  స్వార్ధం ఎక్కువ .
  శిక్ష అన్టే బయం లేదు ఎందుకంటే వాడికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది రాజకీయనాయకులనించి.

  ReplyDelete
 5. ౧. కేవలం ఒకదొంగని పట్టిస్తేనే ఇక్కడ వాడు ఎప్పుడు బయటకి వస్తాడో ఏమ్చేస్తాడో అని బయపడే విదంగా పరిస్తితి ఉంటె జనాలని మాత్రం ఏమి అనగలం చెప్పండి

  ౨. పోలీసులు ఎవరికీ బయపడకుండా
  సమాచారం ఇచ్చినవాడికి దైర్యం కలిగించేలా ప్రవర్తిన్చినప్పుడే పరిస్తితిలో మార్పువస్తుంది

  దేశం అంటే ప్రేమ సినిమా లో చూపించినట్టు మనసులో ఉండదు
  -------------------------------------------
  సినిమా లలో చూపించేవి చాలావరకు ఉండనివే

  ReplyDelete
 6. శ్రీకాంత్ - అవును, నిస్సందేహంగా డిక్కీ ఎక్కిస్తారు
  డియన్‌సి గారూ - నిజం. యస్.యస్.యన్ కి అన్నీ జతచేసి ఉంటాయి.
  శివరామప్రసాదు గారు - ఎప్పటికీ ఒక్క గొంతుక రాదండీ!! రాలేదు కూడా. మహా నగరాల్లో ఐతే ఇక చెప్పే పనిలేదు.
  సాయి - సగం సినిమాల వల్ల చెడిపోతున్నారండి.
  రవితేజా - ఔను. సినిమాలు కేవలం ఉత్తుత్తి ఎంటర్టైమెంటు కొఱకే

  ReplyDelete