Jun 28, 2011

కార్స్ ౨ (త్రిడి)

మేం సినిమాహాలుకి వెళ్ళి సినిమా చూసి ఆరేళ్ళపైనే అయ్యింది. చివరిసారి కుటుంబసహితంగా వెళ్ళి చూసిన సినిమా శంకర్ దాదా యంబిబియస్. ఆతర్వాత థియేటరుకి వెళ్ళి సినిమా చూసిన సందర్భం లేదు. అమెరికా వచ్చిన తర్వాత, సూరిగాణ్ణి ఒకటి రెండు సందర్భాల్లో తీస్కెళ్దాం అనుకున్నా మనోడు తెలుసుగా, ఒకడు ఇద్దరితో సమానం కాబట్టి, కొంత భయపడ్డాం. అనఘ పుట్టినాక రోజూ సినిమాలే కాబట్టి ఇక ప్రత్యేకించి థియేటరుకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు.
ఇహ ఇప్పటి సందర్భానికి ప్రేరణ -
రెండువేల ఆరులో ఈ కార్స్ సినిమా రిలీజు అయ్యింది. అప్పట్నుండి సూరిగాడు లైటెనింగ్ మెక్వీనుకి పెద్ద పంఖా అయిపొయ్యాడు.

Cars_2006.jpg

ఎంతలా అంటే నిద్రలో లైటెనింగే లేస్తే లైటెనింగే పడుకుంటే లైటేనింగే. మావిడ ఏదో ఓ మాట చెప్తుంది ఈలాంటి పిచ్చికి. లాఫ్ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ? అనుకుంటా. అంటే, వాడినకొద్దీ పిచ్చి పెరగటం. ఎవరికైనా వాడినకొద్దీ మోజు తగ్గుతుంది. కానీ మనోడికి చూసినకొద్దీ పిచ్చి ఎక్కువౌతున్నది. వాడు గీసే బొమ్మలన్నీ లైటెనింగ్ మెక్వీనువే. మొదట్లో ఓ యాంగిల్లో గీస్తే ఇప్పుడు రకరకాల యంగిల్సులో గీస్తున్నాడు.
అనఘకీ ఎక్కించాడు. అనఘ ఎక్కడ లైటెనింగ్ మెక్వీన్ కనిపించినా సూర్యా మెకీన్ మెకీన్ అన్నకి చూపిస్తుంది.
ఇహ ప్రస్థుతంలోకి వస్తే మూడు నెలల ముందునుండి ఈ కార్స్ రెండు చిత్ర ప్రకటనలు మొదలైయ్యాయి. వీడి గోల మొదలైంది. ఇట్టే పట్టేసాడు ఆ ప్రకటనలలలో వచ్చే పేర్లను. ఫ్రాన్చెస్కొ బెర్నౌలి పేరు పట్టేసాడు. చూద్దామా రిలీజ్ అయ్యిందా చూద్దామా రిలీజు అయ్యిందా అని గోల మొదలైంది. జూన్ ఇరుబత్తినాల్గున రిలూజు. దాన్ని నోట్ చేస్కున్నాడు. ఇవ్వాళ్ళ జూన్ పది, పదకుండు, ఇవ్వాళ్ళ పన్నెండు ..ఇలా లెక్కబెట్టటం మొదలైంది. మొత్తానికి జూన్ ఇరుబత్తినాల్గు రానేవచ్చింది. నాన్నా రిలీజు అయ్యింది నాన్నా, ఎత్తుకెళ్తవా నాన్నా అని పాట పాట్టం మొదలెట్టాడు. మా టైని టీనీ ఊళ్ళో అది రిలీజు కాలేదు. ఏంజేస్చాం బాబూ దగ్గర్లోని సిటీలోని ఏ.యం.సి వారి ఐమాక్స్ త్రి-డీ థియేటరులో టిక్కెట్లు బుక్ చేసి ఎత్తుకెళ్ళాను జనాలని.
వాడికి, వాడి జీవితంలోనే మొట్టమొదటి సినిమా, థియేటరులో, అదీ త్రీడీ. ఎక్జైట్మెంట్ తట్టుకోలేక పొయ్యాడు బిడ్డ.
Cars_2_Poster.jpg

బాగా ఎంజాయ్ చేసాడు. అనఘ కూడా అరవకుండా కూర్చుంది. ఐమాక్స్ లో మాకూ మొదటి సినిమానే. మేమూ ఎంజాయ్ చేసాం. ఆరేళ్ళ తర్వాత థియేటరుకి వెళ్ళటం బాగుంది.
ఇక కార్స్ ౨ త్రిడి సినిమా కథ ఇవన్నీ పక్కనపెడితే, తెల్లోడి టేకింగ్ బాగుంది. వాడి ఊహా స్థాయి అత్భుతం.
డిస్నీ గాడు వరసబెట్టి వాడి పాతసినాలకి బూజుదులిపి త్రీడీలోకి వదుల్తున్నాడు. లైయన్ కింగ్ రాబోతోంది త్రిడీలో. సదరు ప్రకటన అత్భుతంగా ఉంది కూడా.
ఐతే త్రిడీ చూట్టం మంచిదేనా కళ్ళకూ? అనేది ప్రశ్నే! కళ్ళు బాగా స్ట్రైన్ అవుతాయట. అంతేకాక తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉందట. కాబట్టి, ఇకపై సూరిగాణ్ణి కేవలం టుడి సినిమాలకే తీస్కెళ్ళాలని నిర్ణయించాను.
article-1271618-096A5718000005DC-566_468x479_popup.jpg

2 comments:

  1. 60-90 నిముషాల మధ్యలో నిడివి ఉన్న సినిమాలు ఐతే పర్లేదు భయ్యా... మొదటి రెండు మూడు సినిమాలు ఐమాక్సులోనే కళ్ళులాగేస్తాయ్.. ఇక ౩డి ఐమాక్స్ అంటే చెప్పక్కర్లేదు.

    ఏదైనా సినిమా నిడివిని బట్టి కనీసం నెలరోజుల గ్యాప్ తో అప్పుడప్పుడూ చూపిస్తుండు భయ్యా. పాపం పూర్తిగా బ్యాన్ అంటం అన్యాయం. మనకెలాగూ సిన్నపుడు ఎంటీవోడి సిన్మాలతోనే తీరిపోయింది..
    వీళ్ళనైనా ఎంజాయ్ చేయనీయ్యాలి కదా..

    ReplyDelete
  2. అంటే మనం ఎంటీవోడి సిన్మాలతో ఎంజాయ్ చేయలేదని అర్ధం కాదు.. మన ఎంజాయ్మెంట్ మనది వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళదీనూ..

    ReplyDelete