Dec 3, 2010

భావం - భాష

భావాన్ని వ్యక్తపరచాలంటే భాష కావాలి.
మన భాష తెలుగు. కాబట్టి మనం మన భావాలని తెలుగులో వ్యక్తపరుస్తాం.
మరి తేడా ఎక్కడా? భావంలోనా భాషలోనా?
ఉదాహరణ -
౧. రేడియో విరిగింది.
మొన్నీ మధ్య టీవీలో ఓ ప్రకటన చూసా. విక్స్ అనుకుంటా. ఒక ముసలాయన కుర్చిలో కూర్చుని రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటుంటాడు. రేడియో కిందపట్టమో జరుగుతుంది. అరెరె రేండియో విరిగిందే అంటాడా ముసలాయన, వెంటనే ఓ ఔత్సాహిక కుఱ్ఱాడు కామెంటరీ చెప్పేందుకు ముందికి వస్తాడు...బ్లబ్లబ్ల.
రేడియో విరిగేందేవిట్టా వాడి బొంద.
లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి మాస్ కమ్యూనికేషన్స్ చదువాతారు కొందరు. మాస్ తో కమ్యూనికేట్ చేయాలంటే దృశ్యం ఎంత ముఖ్యమో శ్రవణం కూడా అంతే ముఖ్యం అనే ఓ సింపుల్ పాయింటుని సదరు కళాశాల అధ్యాపకులు నేర్పరా ఏవిటి వీళ్ళకి?

సరే పరాయి భాషనుండి దిగుమతి చేస్కున్న ప్రకటన, తెలుగీకరించారనుకుందాం. ఇంతక మునుపట్లో కూడా ఇలా జరిగిందే మరి. ఇదేమీ కొత్త కాదుగా. విక్స్ కి గోలీలో ఖిచ్ ఖిచ్ దూర్ కరో. గొంతులో గుర గురా విక్స్ తీస్కో అనే ఓ వాక్యాన్ని తెలుగులో చెప్పించటానికి ఓ పెద్ద భాషమీద పట్టు, భాషాపాండిత్యం ఏం అక్కర్లేదుగా.
౨. మరక మంచిదే. మరకవల్ల ఏమన్నా లాభం కలిగితే మరక మంచిదే.
ఈ ప్రకటన ఓ దౌర్భాగ్యపు నీచ నికృష్టపు విలువలకు నిదర్శనం. ఇందులో భాషా ప్రయోగమే కాదు దృశ్య ప్రయోగం కూడా ఘోరం. చదువు మనిషికి ఆలోచలని రేకెత్తించేలా ఉండాలి. ఇది తీసిన వాడేవడోగానీ వాడికి కనీస లాజిక్కు లేదు.
పిల్లాడు బడికెళ్ళాడు.
స్నేహితుణ్ణి అడుగుతాడు రోజీ మిస్ రాలేదేం అని.
వాళ్ళ కుక్క పిల్ల సచ్చిందిగా అందుకే రాలేదు అని చెప్తాడా సదరు మితృడు.
కట్ చేస్తే రోజీ మిస్ ఇల్లు
పిల్లాడు, కుక్క సచ్చిందని బాధపడకు రోజీమిస్ నేనున్నాగా అని కుక్కలా ప్రవర్తిస్తాడు.
మిస్ అయిన లాజిక్కు -
పిల్లాడికి రోజీ మిస్ ఇల్లు ఎలా తెలుసు?
పిల్లాడు బడి ఎగ్గొట్టి రోజి మిస్ ఇంటికి ఎలా వెళ్ళాడు?
ఆ వయసు పిల్లాడు ఒక్కడే ఎలా వెళ్ళగలడూ?
మరక మంచిదే, మరక వల్ల లాభం కలిగితే వాడి పిండాకూడు కలిగితే మరక మంచిదే? ఏం మరకా? వాడి బొంద మరకా?
బడి ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరిగితే పడే మరక సంగతేవిట్టా?
[బడీ అయ్యాక, ఇంట్లో చెప్పి, వాళ్ళా నాన్న దింపితే....నాకు కొంచెం అకల్ ఉంది బట్]

ఇలా ప్రకటనల్లో వచ్చే తెలుగు, లేక మన యాం౨కరు అమ్మాయిల ముద్దు ముద్దు (ఆపాట పట్టుకుని ముక్కు మీద గుద్దు గుద్దు) తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. అదలా ఉంచితే, మనలోనే కొందరు ఖూనీ చేసేస్తున్నారు తెలుగుని, తమ మాతృభాషని.
వీపు ఇరగ్గొడతా అంటాడు ఓ మితృడు
నెయ్యి గుప్పెడు తింటే అత్భుతం ఈ పచ్చడితో అంటాడు ఇంకో మితృడు
చేయి పగిలిందంటాడు ఇంకొకడు
తల విరిగింది అంటాడు మరొకడు

ఎక్కడా లోపం?

16 comments:

  1. విని భరిస్తున్న మనలోనే :)
    I feel and share your pain !

    ReplyDelete
  2. బడి ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరిగితే పడే మరక సంగతేవిట్టా?
    :D :D

    నాకైతే ఆ షారుక్ ఖాన్ కి తెలుగు డబ్బింగ్ చెప్పే వాడిని పట్టుకొని తన్నాలని పిస్తుంది నవరత్న తైల్,ఫెయిర్ అండ్ handsome ఇంకా hundai వాది ads మొత్తం అన్నీను

    ReplyDelete
  3. చురక మంచిదే
    అయినా భాషని చూడకండి మాస్టారు
    భావం ముక్ష్యం
    క్రియేటివ్ యాడ్ అయితే మాత్రం చూస్తా , మిగిలిన వాటిని పట్టించుకోను
    మీరు వాటి మీద బ్లాగ్ కూడా రాసేసారు
    మంచి చతురులు సుమీ ..

    ReplyDelete
  4. నాకైతే తెలుగు "నేర్పించడం" అనేది పునాదుల్లోనే సరిగ్గా జరగట్లేదని ఓ (అప?)నమ్మకం.
    తెలుగు సినిమాలు ఎన్ని బోల్తా కొట్టినా లారీలతో డబ్బు గుమ్మరించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాం.
    టిక్కెట్టు ధర ఎంత పెరిగినా, నాణ్యత ఎంత తగ్గినా చూసి మరీ తిడతాము.
    ఆరోగ్యకరమైన వినోదం మాత్రం పిల్లలనుంచీ పెద్దల దాకా అరువు తెచ్చుకుంటాము.
    అదేమంటే మనది పేద దేశం అంటాము.
    ఇంకో చోట పిల్లలకు తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం యానిమేషన్లలో దొరికితే బావుండును,అంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారమని తేలికగా తేల్చేశారు. చక్కగా మన హైదరాబాదులోనే తయారయ్యి బహుమతి పొందిన ఈ యానిమేషను
    http://www.youtube.com/watch?v=BO3N6VdYCjY

    ఆత్రంగా చూస్తే అర్థమైంది - శుభ్రంగా మాటలే లేకుండా తీస్తే సరిపోతుంది అని!
    రెండు మాటలున్నాయి కదా అంటారేమో, అవి తెలుగే అంటే కాదంటారా?

    ReplyDelete
  5. అనుకరణ వాళ్ల వచ్చిన తంటా ఇదంతా
    తెలుగు ని అదేదో రకం గా మాట్లాడటం ఒక రోగ మయ్యింది
    ఆ అనుకరించే వాళ్ళే ఎక్కువ టీవీ చూస్తారని అదే భాషలో ప్రకటనలు అని ఒక వాదన ఉంది.
    నా కాలేజీ రోజుల్లో(1986) ఒక అనుకరణ ఉండేది ఎడమ చేతి వాటం చూపటం
    ఆఖరికి కరచాలనం కూడ
    బహుశా అమితాబ్ ని అనుకరణేమో ...
    కానీ ఆ ఎడమ చేతి కరచాలనం కీ, అరచేతిలో గిల్లటానికీ వేరే అర్ధాలు ఉన్నాయట,
    ఆలస్యం గా తెలిసింది (ఖర్మ కాలి నాది నిజంగానే ఎడమచేతి వాటం)

    ReplyDelete
  6. అసలు ఇదంతా కాందండీ. సంస్కారవంతమైన సోప్ అంటే అర్థమేమిటో చెప్పండి నాకు ముందు. అదేదో దిక్కుమాలిన XXX సబ్బు ముక్కలో సంస్కారం ఉండడం ఏమిటో నాకర్థం కావట్లేదు. ఆ దృశ్యం అయితే మరీ దరిద్రం. ఓ చిన్న కుర్రాడు ఓ పెద్దాయనకి చాలా మర్యాదిస్తాడు. ఆ పెద్దాయన 'ఎంత సంస్కారం' అని ఆశ్చర్యపోతాడు. అవును మరి వాళ్ళింట్లో XXX సబ్బు వాడుతున్నారుగా అని ప్రకటన. శాస్త్రీయ నృత్యం చేస్తూ కళకళలాడే XXX, మిలమిలలాడే XXX అని పాట. తొక్కలో సబ్బు ముక్క కళకళలాడడమేమిటి నా పిండాకూడు. అయినా సబ్బు కొనుక్కునేటప్పుడు అది కళగాఉందో, మిలమిలలాడుతుందో చూసి కొనుక్కుంటారా ఎవరైనా? వీళ్ళ భావదారిద్ర్యం మండిపోనూ. మన ఖర్మ కాలి...బుర్ర ఎక్కడ పెట్టుకు పనిచేస్తారో...ఇంక నాకు బూతులొస్తాయి.

    ఇంకోటి...దగ్గరగా రం దగ్గరగా రం దగ్గరగా రమ్మా......చీ తూ వీళ్ళ క్రియేటివిటీ తగలడ....ఎర్రటి ఎండలో వేన్నీళ్ళు పోసుకుని,రగ్గు కప్పుకుని పడుకునే వెధవలు.

    ReplyDelete
  7. సౌమ్య గారూ, ఆ సంస్కారవంతమైన సబ్బు ప్రకటన చూసినప్పుడల్లా నాకూ మీలానే అనిపిస్తుంది. ఒంటిమీద తేళ్లూ జెర్రులు పాకినట్టుంటుంది.

    ReplyDelete
  8. @ ఆ.సౌమ్య, ఇంత చక్కటి వైదిక బ్రాహ్మణ (సంస్కారవంతమైన) తిట్లు విని చాలా రోజులైంది - వీనుల విందుగా ఉంది! :)

    ReplyDelete
  9. @కొత్తపాళీ గారూ
    ఏవో నోటికి అలవాటైన తిట్లు :))

    ReplyDelete
  10. అదేదో 'కాంప్లాన్' యాడ్ లో ఓ కుర్రాడు 'అమ్మా నాకు వయసొస్తేతూంది' అంటాడు. మై బఢ్ రహా హూ కి వచ్చిన తిప్పలు !!

    ReplyDelete
  11. ఆ సంస్కారవంతమైన సబ్బు వారు - సంస్కారమ్ లేని సీరియళ్లను , వెఱ్ఱియాలిటీ షో లనూ ఎలా స్పాన్సర్ చేస్తున్నారో

    ReplyDelete
  12. vooka meister .. వెర్రియాలిటీ .. brilliant!

    ReplyDelete
  13. కొత్తపాళీ అన్నగారూ - ఔను, భరిస్తున్న మనదే తప్పు. తమిళ ప్రకటనలు తెలుగీకరిస్తే భరిస్తూ చూస్తాం. కానీ, తెలుగు ప్రకటనలు తమిళంలోకి అతితక్కువ టు జీరో తర్జుమా ఔతున్నాయన్న విషయాన్ని గమనించం.
    హరే - మరే, సితక్కొట్టాలి నాయ్యాళ్ళని.
    అప్పారావు - భావం ముక్ష్యం?? ఏం భావం? ఆంగ్లంలో భావాన్ని మాతృభాషలోకి మక్కీకి మక్కీ కాపికొట్టేప్పుడు ఆ భావం అభావం అవుతున్నది.
    లలిత గారూ
    >>నాకైతే తెలుగు "నేర్పించడం" అనేది పునాదుల్లోనే సరిగ్గా జరగట్లేదని ఓ (అప?)నమ్మకం.
    నిజమే. అసలు తెలుగు భాష అబేదే కరిక్యులంలోంచి తీసవేయబడుతుంటే ఇంక చేసేదేవుంది

    ReplyDelete
  14. సుజాత -హ్మ్..నా లిస్టులో చాలా ఉన్నాయి
    ఆత్రేయ గారూ - అనుకరణ ఒకటే కాదు. మక్కీకి మక్కి తెలుగీకరించుట.
    సౌమ్య - హహ. బాగా చెప్పావు.
    *ఎర్రటి ఎండలో వేన్నీళ్ళు పోసుకుని,రగ్గు కప్పుకుని పడుకునే వెధవలు.*
    కేక
    సిరిసిరిమువ్వ గారూ, హరెఫల గారూ - హ్మ్.
    వూకదంపుడు గారూ - వెఱ్ఱియాలిటి. హహ.....బాగుందీ ఈ పదం

    ReplyDelete
  15. వూకదంపుడు గారూ
    వెఱ్ఱియాలిటీ........wonderful! చితగ్గొట్టేసారు ఒక్క పదంతో :D

    ReplyDelete