Dec 2, 2010

కసబ్‌ పడవలో రాలేదు.. రైల్లో వచ్చాడు

కసబ్‌ పడవలో రాలేదు.. రైల్లో వచ్చాడు
ముంబయి: ముంబయి మారణకాండకు అజ్మల్‌ కసబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు బొంబాయి హైకోర్టులో వాదించారు. 26/11 దాడుల కోసం తొమ్మిది మంది ఉగ్రవాదులతో కలిసి ముంబయి తీరంలోని బద్వార్‌ పార్కుకు కసబ్‌ ఓ పడవలో వచ్చినట్లు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.కసబ్‌ మరణశిక్ష నిర్ధరణపై గురువారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన చిన్న పడవలో 10 మంది వ్యక్తులు, వారి బ్యాగులతో సహా ప్రయాణించడం సాధ్యం కాదని కసబ్‌ న్యాయవాదులు అమిన్‌ సోల్కార్‌, ఫర్హానా షా ధర్మాసనానికి తెలిపారు. ఆర్థర్‌ రోడ్డు జైలులో ఉన్న పడవను స్వయంగా పరిశీలించాలని న్యాయమూర్తులను కోరారు. దీనిపై అవసరమైన ఆదేశాలను తర్వాత జారీ చేస్తామని జస్టిస్‌ రంజనా దేశాయ్‌, ఆర్‌.వి.మోర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదులతో కలిసి కసబ్‌ ఓ పడవలో ముంబయి వచ్చినట్లు ఆధారాలు లేవని సోల్కార్‌ వాదించారు. ఆయన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వచ్చారని చెప్పారు. తర్వాత హిందీ సినిమాలు చూడడానికి ముంబయి చేరుకున్నారని తెలిపారు. జూహూ బీచ్‌ వద్ద 26/11 రోజున కసబ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి కేసులో ఇరికించారని వాదించారు. తదుపరి ఆదేశాల కోసం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
----------------------
నేను మొట్టమొదటి నుండీ మొత్తుకుంటూనే ఉన్నా. కసబ్ అసలు ఆరోజు ముంబైలోనే లేడు. ఎక్కడో లాహోర్లో ఉంటే మన పోలీసులు అన్యాయంగా అక్రమంగా దారుణంగా అతన్ని అరెస్టు చేసి ముంబైకి ఎత్తుకొచ్చి ఇరికించారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.
హిందీ సినిమాలు సూట్టానికి పాకిస్థాన్ నుండి ముంబై వచ్చాట్ట పాపం కసబ్. పత్రికల భాష చూడండి ఆయన, ఇంకానయం వారు శ్రీ కసబ్ గారు అనట్లా.
రెండేళ్ళాయ ఈ ఘోరకలి జరిగి. కసబ్ కేవలం సినిమాలు సూట్టానికే ఒచ్చినోడని ఎనక్కి పంపిస్తే పోలా, మనకి ఖర్చన్నా తగ్గుద్ది.
ఛీఛీ.....

17 comments:

  1. అందరికీ తెలుసు కదా ఈ విషయం?? ఫొటోలో కూడా డైరెక్ట్ గా కనపడ్దాడు.అయినా కూడా..ఇంక సాక్ష్యాలు అవి ఇవి అంటూ వాడిని జైల్లో కొత్త అల్లుడిలా మేపడం తప్ప ఏం చేస్తున్నారు మనవాళ్ళు? అందుకే మనదేసం అంటే ఇతరల దేశాలకి చులకన.మన మంచితనం వారికి చేతకానితనం.ఇదే వేరే దేశం ఐతె..వాడు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు.

    ReplyDelete
  2. edi khachhitamga mana desam manchitanam kaadu. Problem with our court system. Our court gave him a lawer and the lawer is acting stupid.

    ReplyDelete
  3. ఛీ ! అనిపిస్తున్నది మన వ్యవస్థను చూస్తుంటే

    ReplyDelete
  4. వి కాంట్ పీక్ ఎనీ థింగ్

    ReplyDelete
  5. ఆనంద్ కిరణ్ గారు
    ఈ కేస్ లో కసబ్ తరపున defence లాయర్ Nikam చనిపోయాడు ఈ February లో..
    లాయెర్ ని పెట్టడం కోర్ట్ ని జైలు కి తీసుకు రావడం.. ఇదంతా delay చేస్తున్న ప్రభుత్వం మూర్ఖత్వం

    ReplyDelete
  6. All countries have similar systems. Even Saddam wasn't hanged in the first hearing! India is at least what it is today, essentially due to the Judiciary system that's working within its limited scope with less number of courts and lawyers and judges! Let's realize that and respect that too. (How many of our relatives are in the law profession? Or police? And, we want excellent law and order? Great! What a hypocrisy!!)

    ReplyDelete
  7. Clarification:

    I responded to the comments above - which seemed to believe that India is the only country that allows criminals in the open to have a lawyer! (The answer is no, of course! Nearly every country does it!! And all lawyers are the same brand - they try to defend their client, of course! What else are they supposed to do?!)

    And, about the article itself:

    I do agree the argument by the lawyer was utterly ridiculous!

    ReplyDelete
  8. @.C
    సద్దాంకి కసబ్ కి పోలిక ఎక్కడా?
    కసబ్ కేసుని సద్దాంకేసుతో పోల్చలేం.
    ఇక్కడ సమస్య - కళ్ళముందు జరుగుతున్న మారణకాండలో, ఇప్పటికే పిచ్చెక్కినట్టుగా వాగిన ఓ అంతర్జాతీయ ముద్దాయికి వర్తింపచేసే న్యాయప్రక్రియ, న్యాయ సూత్రాలు అనేవి ఒకేత్తు, రాజకీయ ఎత్తుగడలు రాజకీయ లబ్ది లాంటివి మరొక ఎత్తు కాగా, న్యాయ సంస్థల రాజకీయ స్వార్థపరుల మధ్య కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లంకె.

    రేపొద్దున ఏదోక పార్టీనో లేక సంస్థో కసబ్ అమాయకుడు వదిలేయండి క్షమాభికష పెట్టండీ అని లేస్తే, న్యాయాన్ని పక్కనపెట్టి రాజకీయానికే పట్టంకట్టే ప్రమాదం లేకపోలేదు.

    సినిమాలకోసమే వచ్చే వ్యక్తి, సరైన మార్గంలో వస్తాడని కనీస అనుకోలు నామటుకు నాకు. కాబట్టి అతని ప్రయాణ పత్రాలను ఒక్కసారి వీక్షిస్తే సరి.

    అతని అటార్నీ పై విధంగా అన్నప్పుడు కసబ్ ఏ తేదీన వచ్చాడు దేశంలోకీ, అతని టిక్కెట్టు నెంబరు, రిజర్వేషన్ సమాచారం గట్రా తెరపైకి తెచ్సే సరిపోతుంది కదా. రెండేళ్ళ అతని పోషింపు మిగిలుండేది, టా౨క్స్ పేయర్స్ డబ్బు కనీసం వేరే పనులకు ఉపయోగింపబడి ఉండేది.

    ReplyDelete
  9. >>I responded to the comments above - which seemed to believe that India is the only country that allows criminals in the open to have a lawyer!
    పై సెటైరు నత్తనడక నడిచే మన న్యాయవస్థపై. న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా అందులో భాగమే.
    నిజంగా ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకీ చిత్తశుద్ధి ఉంటే కేసు ఎప్పుడో తేలిపోయి ఉండేది.
    రేపొద్దున పాకిస్థాన్, కసబ్ని వదిలేయండి అని ఏదోక డీల్ కుర్చుకుంటే భారత ప్రభుత్వం, న్యాయవవస్థ *చట్టబద్ధం*గా అతన్ని వదిలేసే అవకాశాలు లేకపోలేదని పై సెటైరు.

    ReplyDelete
  10. Trial

    Towards the end of December 2008, Ujjwal Nikam was appointed as Public Prosecutor for trying Kasab and in January 2009 M. L. Tahiliyani was appointed the judge for the case. Indian investigators filed a 11,000 page Chargesheet against Kasab on 25 February 2009. Due to the fact that the chargesheet was written in Marathi and English, Kasab had requested that an Urdu translation of the charge sheet be given to him. He was charged with murder, conspiracy and waging war against India along with other crimes. His trial was originally scheduled to start on 15 April 2009 but was postponed as his lawyer, Anjali Waghmare was dismissed for a conflict of interest. It resumed on 17 April after Abbas Kazmi was assigned as his new defense counsel. On 20 April the prosecution submitted a list of charges against him, including the murder of 166 people. On 6 May Kasab pleaded not guilty to 86 charges. The same month he was identified by eyewitnesses who testified witnessing his actual arrival and him firing at the victims. Later the doctors who treated him also identified him. On 2 June 2009, Kasab told the judge he now also understood Marathi.

    In June 2009, the special court issued non-bailable warrants against 22 absconding accused including Jamaat-ud-Dawa (JuD) chief Hafeez Saeed and chief of operations of Lashkar-e-Toiba, Zaki-ur-Rehman Laqvi. On 20 July 2009 Kasab retracted his non-guilty plea and pleaded guilty to all charges. On 18 December 2009, he retracted his guilty plea and claimed that he was framed and his confession was obtained by torture. Instead he claimed to have come to Mumbai 20 days before the attacks and was simply roaming at Juhu beach when police arrested him. The trial concluded on 31 March 2010 and on 3 May the verdict was pronounced - Kasab was found guilty of murder, conspiracy, and of waging war against India. On 6 May he was sentenced to the death penalty.

    Currently, the case is being argued in the Bombay High Court before the bench of Hon'ble Ms. Justice Ranjana Desai and Hon'ble Mr. Justice R V More; who are hearing the appeal against the Death Penalty filed by Kasab.

    ReplyDelete
  11. నిందితుడుకి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వల్సిందే అందుకుగాను నిందితునికి ఒక లాయరును appoint చెయ్యాల్సిందే వాద ప్రతివాదనలు జరగాల్సిందే, శిక్ష విధించబడటానికి ముందు నేరం ఋజువుకావాల్సిందే. కానీ process పేరుతో సమయాన్ని, తద్వారా ప్రజాధనాన్ని వృధాచేస్తుండటమే గర్హనీయం. గుట్టలుబడివున్న ఫోటో, వీడియో, ప్రత్యక్ష సాక్ష్యాల నేపధ్యంలో ఇప్పటిదాకా మన వాళ్ళు చర్చించిన విషయాలు వింటె నవ్వొస్తుంది. కసబ్ మైనరా కాదా?ఫలానా రాష్ట్రానికి చెందినవాడా కాదా? కుటుంబ పరిస్థితులెలాంటివి? హతవిధీ! హేవిటిది? ఆ ఇచ్చే క్షమాభిక్షేదో అమెరికా బెదిరించక ముందే ఇచ్చేస్తే మన బొక్కసానికి బొక్కన్నా తప్పుతుంది.

    ReplyDelete
  12. domestic vs international. domestic crime కేసులో వాద ప్రతివాదానికి అవును లాయర్లు ఉండాలి. కానీ ఈ కేసులో ????

    ReplyDelete
  13. అజ్మల్ కసబ్ గుఱించి కన్నా నాకు అఫ్జల్‌గురు విషయమే ఇంకా మంట. అతను భారతీయ ముసల్మాన్ కనుక అతని విషయంలో బొంకులు చాలానే పలికింది కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరేళ్ళలో! నేరం స్థాయిని బట్టి కాదు విచారణ జఱిగేది. రేపు లాడెన్‌ని పట్టుకున్నా అమెరికా ప్రభుత్వం అతనికైనా ఒక వకీలుండేటట్టు చూసి విచారణ చెయ్యవలసినదే. (అతనూ చాలా వీడియోలలో కనిపించి, నేరాంగీకారము, నేరప్రేరేపణ చేసినా సరే... ఇది సాధారణమైన, సార్వత్రికమైన క్రమానుసారమే.)

    రాజకీయం మన న్యాయవ్యవస్థను నియంత్రించటం అన్నదే కనుక అదుపు తప్పి ఉంటే దేశమేనాడో నాశనమయ్యేది పూర్తిగా! రాజకీయనాయకులను న్యాయపరంగానూ, ఎన్నికల ద్వారానూ ఎదుర్కోవటం, శిక్షించటం పౌరుల బాధ్యత. అది మనం సక్రమంగా చెయ్యకుండా ఎంత యేడ్చినా ఉపయోగం లేదు!

    ReplyDelete
  14. domestic vs international. domestic crime కేసులో వాద ప్రతివాదానికి అవును లాయర్లు ఉండాలి. కానీ ఈ కేసులో ????
    --------------------------------------------------------------------------
    ఏ కేసులో నైనా ఉండాల్సిందే ! కొన్ని రోజులు కసబ్ తరుపున వాదించటానికి ఎవరు ముందుకు రావకపోటం తో కూడా కొద్ది గా జాప్యం జరిగింది .

    ReplyDelete
  15. @భాస్కర్ గారూ: అభియోగం ఋజువు కావాలి కందండీ. ఒకవేళ ఆ రోజు మాయకుడైన 'జసబ్' పట్టుబడ్డాడనుకుందాం. జసబ్ పై మోపబడిన అభియోగాలు తప్పు/ఒప్పు అని ఋజువుకావాల్సిందే నేరస్తుడు జసబ్ కాదు కసబ్ అని ఋజువుకావాల్సిందే శిక్షలు అమలు జరగాల్సిందే. international violence సంబంధించిన శిక్షాస్మృతి వేరే వుండాలి( ఇతర దేశ పౌరులనుకూడా సంస్కరించాల్సిన బాధ్యత మనకులేదు అని నా అభిప్రాయం) కానీ అభియోగాన్ని ఋజువుపర్చే న్యాయప్రక్రియ మాత్రం ఒకటే వుండాలి.

    ఇక్కడ నాబాధ అంతా ఎందుకవుతోందో తెలీని జాప్యం గురించి. సమస్య సాక్ష్యాల సేకరణలోనా? లేక విచారణ ప్రక్రియలోనా? లేక ఇంకేమైనా జోక్యాలున్నాయా?

    ReplyDelete
  16. ఉరి తీస్తే నిమిషంలో ప్రాణం పోతుంది. ఆ తరువాత మనం బాధ పెడదామన్నా కసబ్ ఉండడు. కాని వాడు సృష్టించిన విధ్వంసం వల్ల ఎంతో మంది ప్రజలు బాధ పడుతూనే ఉంటారు. అందుకే వాడిని జీవితాంతం జైల్లో ఉంచటమే కరక్ట్, ఇప్పుడైతే వాడి జీవితం రోజూ ఒక యుగం లా గడుస్తూ ఉంటుంది. ఇదే బెటర్ వాడికి.

    మీకు గుర్తుందో లేదో, కొన్ని నెలల/సంవత్సరాల క్రితం అఫ్జల్ గురు తనని ఉరి తియ్యమని అని అడిగాడు. అదేదో సరదాగా అన్నమాట కాదు, నాలుగు గోడల మధ్య దిక్కుమాలిన బతుకు బతకలేక, జీవితం అంటే విరక్తి కలిగి ఉరి తీయమన్నాడు. కానీ మనం అలా అడగ్గానే ఉరి తేసేస్తామా ఏంటి, వీళ్ళు చేసిన పనులకు ప్రతి క్షణం వాళ్ళు బాధ పడేటట్లు శిక్షించొద్దూ, ప్రతి క్షణం వాళ్ళు తాము ఈ తప్పు ఎందుకు చేసామా అని కుమిలి కుమిలి బాధ పడేటట్లు చెయ్యొద్దు.. అదే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. చప్పట్లో చప్పట్లు ఈ ప్రభుత్వానికి.. ఈ పనైనా తిన్నగా చేస్తున్నందుకు.

    ReplyDelete