Mar 18, 2010

నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

ఆ రోజు ఆ కళ్ళు
ఎంతో నిశ్శహయతో
ఆర్తితో
బాధతో
నిన్ను ఈ గుండెలమీద పెట్టుకు పెంచారా
నాకేమీ చేయలేవా
నీ బాటలో ముళ్ళుండకుండా ఊడ్చారా
నన్ను బతికించలేవా
నీ ఉన్నతులకోసం నా రక్తం ధారపోసారా
నన్ను కాపాడాలేవా
నిన్ను గుండెల్లో పెట్టుకుచూసారా
నన్ను యముడి పాశం నుండి తప్పించలేవా
అని విలవిల్లాట్టం చూసా
ఆ కళ్ళు
ఉన్నట్టుండి
గుండెని ఎవరో పిసికేస్తున్నార్రా అనే భావం ప్రకటించాయి
ఏమీ చేయలేని నా నిశ్శహాయత
నేను ఆటో తెచ్చేలోపే ఆ కళ్ళు రెప్పవెయ్యటం ఆగిపొయ్యాయి
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి
నాకు బాగా గుర్తు
ఆరోజున ఈ కళ్ళే తన తండ్రి కళ్ళను ఇలానే భద్రపరచుకున్నాయి
చివరిచూపులకోసం ఆ కళ్ళు ఈ కళ్ళ కోసం వేచిచూసాయి
ఇదిగో వచ్చాడు రమాకాంతం
ఇదిగో వచ్చాడు రమాకాంతం అన్న ప్రసాదరావుగారి
మాటకు చివరిసారిగా స్పందించాయి ఆ కళ్ళు
నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి

మార్చ్ పద్దెనిమిది మా తల్లితండ్రుల పెళ్ళిరోజు. మా నాన్న గారి నిష్క్రమణకు నా ఈ కవిత అంకితం.

12 comments:

  1. ఓహ్,భాస్కర్,అమ్మనాన్నల పెళ్ళిరోజుకు ఓ మంచికానుక.
    "ఆరోజున ఈ కళ్ళే తన తండ్రి కళ్ళను ఇలానే భద్రపరచుకున్నాయి
    చివరిచూపులకోసం ఆ కళ్ళు ఈ కళ్ళ కోసం వేచిచూసాయి"
    చాలా బాధ పెట్టావు ఈ వాక్యాలతో.

    ReplyDelete
  2. కాలచక్ర భ్రమణం !
    చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయండీ....

    ReplyDelete
  3. bhasker gaaru meeru raasina kavithanu chadivanu... nijamgaa devudi tharuvatha manalaku kallamundu kanabade daiva swaroopulu mana amma naannale ..
    nenu jesus ni nammutha ... bible chebuthundi ..nee thallini, nee thandrini sanmaanichu... appudu neevu deerghayushmanthudavu avuthaavu ani ... bhasker gaaru nenu mee kosam, mee thalli dandrula kosam prarthisthaanu... NAAKU MEEVALE AMMA NAANNA ANTE CHALAA ISTAM ... VAARU JEEVINCHINANTHA KAALAM SUKHAMGAA JEEVINCHELAA MANAM SAHAKARIDDA..

    by
    your loving brother
    B. JONA RAMARAO ,JOURNLIST, HYD.
    9030715343

    ReplyDelete
  4. చదువుతుంటే కళ్ళు చెమర్చేలా రాశావు సోదరా !!

    ReplyDelete
  5. రాజే అన్నా!! నా బ్లాగుకి పునఃస్వాగతం. నా ఈ కవితలోని ఆర్తిని అర్ధం చేస్కుని వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు
    ఇద్దరు చైతూలు, హను, సునీత గారూ పరిమళం శ్రావ్యా - ధన్యవాదాలు.
    రామారావు గారూ - నమస్తే. మంచిమాట చెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. వేణూ బ్రదర్ - నీ భావాల్ని నే అర్ధం చేస్కోగలను. ఇద్దరం దాదాపు ఇలాంటి నష్టానికి గురైనవాళ్ళమే కదా!!

    ReplyDelete
  7. నాకు ఆరేళ్ళ వయస్సప్పుడే వెళ్ళిపోయిన మా నాన్నగారి తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.

    ReplyDelete