Mar 29, 2010

తొలిసంధ్య వేళలో - జ్ఞాపకాల దొంతర

ఈనాడు టీవీలో ఇదేదో సినిమా చూస్తుంటే మధ్యలో ఈ పాట.
తొలిసంధ్య వేళలో. ఆర్నీ ఈ పాటి ఈ నిమ లోదా అని గూగుల్లో గెలికితే నే చూసేది సీతారాములు అనే సిత్రం అని తెలిసింది.
పాట ఇదీ -

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
ఎగిరొచ్చే కెరటం సింధూరం


ఈ పాట అందరకీ తెలిసిందే. ఐతే ఈ పాట చిత్రీకరణ నన్ను మళ్ళీ కట్టిపడేసింది, చూసిన ప్రతీసారీ ఇలానే అనుకుంటా. సూర్యోదయం, తొలిపొద్దు వేళ, సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపుతూ అలా పైకి వచ్చే అత్భుత దృశ్యం, అదీ కేప్ కమేరియన్ వద్ద. అల్లంత దూరంలో వివేకానందా మెమోరియల్. ఎంత సుందరమైన దృశ్యం.

నాకు భావుకత అనేది తెలిసినప్పటి నుండీ ఓ ప్రబలమైన కోరిక, సముద్ర ముఖంగ నిల్చొని, పచ్చిగాలి పీలుస్తూ, ఆకాశంలో మర్డరు జరిగినట్టుండే ఆ అరుణవర్ణాన్ని, ఆ నెత్తురుగడ్డలాంటి సూర్యుణ్ణి కళ్ళారా చూడాలని, ఆ పెత్తెచ్చ నారాయుడి సేవసేస్కోవాలని. మరే ముత్యలముగ్గు ప్రభావంలేని మడిసుంటాడా? ఉన్నాడంటేసెప్పు, డిక్కీ ఎక్కించేద్దాం ఏటంటావ్ సెగెట్రీ?

అలాంటి కోరిక మరి సూరీడు నా మనసుని సదివేసాడో ఏటోగాని, నేను యం.సీ.ఏ సదివే రోజుల్లో మానాయనా వాళ్ళు దచ్చిన భారద్దేశ యాత్రకి శ్రీకారం చుట్టారు. బడి ఎక్స్కర్షన్. ఓ సీటు ఖాళీ ఉందిరా, నువ్వూరా, ఇంటో ఒక్కడివీ ఆడపిల్లలకి లైను కొట్టుకున్టా ఏవుంటావూ? వచ్చేయ్యి అన్నాడు నాయన.

సెన్నై, మద్రాసు, మెడ్రాసు అన్నీ సూడొచ్చు, సెన్నై నుండి మధురై మీదుగా కన్యాకుమారి వరకు. మధ్యలో వచ్చే గుళ్ళూ గోపురాలు సూస్కున్టా ఎళ్ళటం....

ఎళ్ళాం, యాట యాట యాట. మధురైలో బయల్దేరాం.
మధురై నుండి రెండొందల యాభై కిలోమీటర్లనుకుంటా. బస్సు బయల్దేరింది మధురై నుండి. నాకు నిద్ర లేదు.
ఎంత ఎక్సైట్ అయ్యానంటే, పొద్దున్నే ఐదుకల్లా అక్కడుంటాం అని డ్రైవర్ రామారావు చెప్పాడు. అందరూ గుఱకలు పెట్టి నిద్ర. నేను, రోమాంచతో, జుట్టు రేపుకుని, కళ్ళకి క్లిప్పులు పెట్టెస్కుని కిటికీలోంచి చూస్తూ కూర్చున్న. పొద్దున మూడు సమయం. డ్రైవర్ పక్కకెళ్ళి కూర్చున్నా ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక.
నాలుగైంది అంతలో నన్ను ఇంకా ఏడ్పించటానికి. ఎండ్లకాలం కదా, నాలుక్కే ఆకాశం రంగు మారటం మొదలైంది. నాలుగున్నరకల్లా కన్యాకుమారి బీచ్ దగ్గరకి వెళ్ళిపొయ్యాం. నా ఎక్సైట్మెంట్ కి అవధుల్లేవు. కళ్ళు కూడా కొట్టుకోటం ఆపెసాయి. అరుణవర్ణం అని కవులు ఎందుకలా వర్ణిస్తారో అప్పుడర్ధం అయ్యింది. అత్భుతమైన ఆ రంగు. ఎవ్వరూ కలపలేని, ఎవ్వరూ తెరకెక్కించలేని రంగు అది.
సూర్యుడు నెమ్మదిగా బయటకి రావటం మొదలెట్టాడు. ఓరి దేవుడో అనుకున్నా. కానీ, నా అదృష్టం నన్ను ఎక్కిరించింది. మబ్బులు, నల్లటి మబ్బులు, గుంపులు గుంపులు, ఎక్కణ్ణుంచొచ్చయో, తుర్రున వచ్చి, సూర్యోదయాన్ని అరచేతిని అడ్డుపెట్టి ఆపేసినట్టు నాకళ్ళకి అడ్డునిలిచాయి.
హ్మ్!! భగవంతా, ఎన్నయ్యా ఎదో, ఎప్పిడీ, న్యాయమా అనుకున్నా.
తర్వాత కాలంలో నా ఎం.సీ.యే అయ్యింది. మద్రాసు పెంటాఫోర్ లో ఇంటర్వ్యూ కాల్. వెళ్ళా. ఇంటర్వ్యూ గట్రా అయ్యాక, ఆ మరుసటి రోజు పొద్దున్నే సూర్యోదయం సూసేద్దాం ఈ సారి నాయాల్ది అనుకున్నా. కారణం నే ఉన్న రూం, మా అన్న మితృడుది, క్యాతెడ్రాల్ రోడ్డు మొదట్లో, అమ్రికోడి కాన్సులేట్ దగ్గర్లో, తెయినంపేటలో, స్టెల్లా మారిస్ కళాశాల దగ్గర్లో. అక్కణ్ణుండి ఆర్కె సాలై మీదుగా వెళ్తే మెరీనా బీచ్ వస్తుంది. మూడు కిళొమీటర్లు అనుకుంటా. పొద్దున్నే నాలుక్కే లేచి, ఆటో మాట్టాడుకొని ఎళ్ళా. మెరీనా బీచ్. హ్మ్!! వెళ్ళి అలల అంచుల దగ్గరకి వెళ్ళా. ఆ అలలను గమనించే సోయలో లేను. నా దృష్టంతా సూర్యోదయం పైనే. అప్పటికే అల్లంత దూరంలో, సముద్రపుటంచు ఆకాశంలో కలిసిపొయ్యే దగ్గర, వర్ణం మారుతోంది. ఐతే ఆ సీక్వెన్స్ ని, ఆ సూర్యోదయపు ప్రక్రియని పట్టించుకునే స్థితిలో లేరు ఆ బీచ్ లోని జనాలు. వాళ్ళ జీవితం నా దృష్టిని వారివైపుకి లాక్కుంది. వాళ్ళంతా వాళ్ళవాళ్ళ దైనందిన జీవతంలో మునిగిపొయ్యి ఉన్నారు. వాళ్ళే జాలరులు. అంతలో కొన్ని చేపల పడవలు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ దృశ్యం అత్భుతం. దాని గురించి వేరే టపాలో. వచ్చే పడవలు వస్తున్నాయ్.
సూర్యుడు ఇవేంపట్టించుకోకుండా బయటకి వస్తున్నాడు. ఆహా అనుకునే లోపు - ఓ జాలరి నాకు కొంచెం ముందు, లుంగీ ఎత్తి డ్యాష్ విసర్జనం చేసి కప్పెట్టిసి నిష్క్రమించాడు.
నే లేచి వచ్చెసా.

8 comments:

 1. చివరి మూడు లైనులు తీసేస్తే చాలా బాగుంది. మా కన్యాకుమారి ట్రిప్ గుర్తుకు వచ్చింది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

  ReplyDelete
 2. పచ్చి గాలి పీలుస్తారా? మేం వండిన గాలి మాత్రమే పీలుస్తాం బాబూ!

  ReplyDelete
 3. Nice One.
  I've been here for 3+, many times thought of going to beach for Sunrise and on full moon day :(

  ReplyDelete
 4. బాగుంది ..

  >>ఆ దృశ్యం అత్భుతం. దాని గురించి వేరే టపాలో.
  వెయిటింగ్ ఇక్కడ...

  ReplyDelete
 5. ఔను నిజం. గత జూన్నెల్లో కంపెనీ పని మీద విశాఖలో మూడు వారాలు, రోజూ ఉదయం ఇదే సూర్యోదయోపాసన. కానీ మన తూర్పు తీరంలో, ముఖ్యంగా సంజె వేళ మబ్బెక్కువ. చాలా సార్లు సూర్యుడు రెండు బారలు పైకొచ్చాక కానీ కనబడ్డు.
  మిషిగన్‌లో సూర్యాస్తమయాలు చాలా అద్భుతంగా ఉంటాయి.

  ReplyDelete
 6. యవ్వారం చానా బాగుంది కానబ్బయా,ఆ పాటది ఆడియో,ఈడియో కూడా పెట్టకపాయా??
  సూర్యోదయం అంటే మనవల్లకాదు గానీ,(మాయింటి నుంచి యేబీచీకైన మనం బోయెసరికి మిట్టమద్దానం అయ్యిద్ది గట్టిగా,సూర్యాస్తమయం అంటే యావన్న ...యెప్పుడన్నా ..ట్రయ్ మాత్రమ్ చెయ్యొచ్చు.

  ReplyDelete
 7. రావు లక్కరాజు గారు - అదే కహానీలో ట్విస్ట్. :):)
  మందకిని గారూ - మేము హప్డు హప్డు వేడీ గాలీ భీ పీలుస్తాయ్.
  గణేశా - మరే!! సెన్నైలో ఉన్టా సముద్రం కాడికిబోలెదంటే నాయాల్ది!!
  హను - ధన్యవాద్
  సైతు - రాస్తా రాస్తా!!
  కొత్తపాళీ అన్నగారూ - హ్మ్!! నిజమే సుమా!! మిషిగన్ లో నా అనుభవం గురించి తొందర్లో పంచుతా
  రాజే అన్నగారూ - :):) పాట ఆడియో వీడియో పెట్టుండాల్సింది. నిజఁవే.
  ఇసాపట్నంలో సూర్యాస్తమయమా? ఎట్టా సూత్తా?

  ReplyDelete