Mar 15, 2010

ఇయ్యాల రగతం కళ్ళజూసా !!

నాయాల్ది రగతం కళ్ళజూసా పొద్దున పొద్దున్నే
అహా!! ఎవుర్దీ?? అదీ సోంవారం, మటన్కొట్టెట్టావా? ఎంతకమ్ముతున్నావేంది కిలో ఇట్టా అడుగుతారని తెల్సు.
పొద్దునపొద్దున్నే, తలకిబోస్కుని, అడ్డగుడ్డ సుట్టేస్కుని ఓ డెగిశాలో పాలుపోసి కారన్ ఫ్లేక్స్ దాంట్లో ఏస్కుని కారన్ ఫ్లేక్సు అల్పాహారం బోంచేద్దాం ఇయ్యాళ అనుకుని, డేగిశని మైక్రోవేవ్లో పెట్టి, కొలువులో *కత్తి* లేదు కమలాలు గట్రా కోస్కోటానికి అని నిన్నకొన్న సిన్న *కత్తి*ని కాయితకంలో సుట్టి ఎనకమాల్నేసుకునే సంచిలో పెట్టుకుందాం అని *కత్తి*ని తీస్కున్నా. దీనెక్క సానా పదునుగా ఉంది, కాయితకం యాడుందబ్బా అన్జూస్తే పక్కమ్మెట ఓ పొట్లంలో కాయతకం ఓటుంది. ఆ పొట్లం *కత్తి*తో కోసి అవ్వతల్నూకి ఆ కాయితకం బయటకి తీద్దాం అని కోసా, అది కుడిసేతి చూపుడేలుని కొట్టేసింది కస్సుక్కున, సెక్కేసినట్టయింది. ఓ ఆరు లీటర్ల రగతం కారి వృధా అయిపోయింది. సిరన్జీవి బ్లెడ్డుబ్యాంకీకి ఇచ్చినా పుణ్యం వచ్చునే అనుకున్నా. అది సోదరా ఇయ్యాల్టి యవ్వారం.
ఎంత *కత్తుల్తో* ఆడుకునేవోడికైనా *కత్తి* తెక్క మానదు!!

ఏందీ!! అట్టుందీ ఏలూ!! ఏంపెట్టావూ ఏలుమీన అనుకోమాక. పసుప్పెట్టా!
ఇదిగో ఇదే ఆ *కత్తి*!! కొత్త *కత్తి*!! పదునైన *కత్తి*!!!

ఏటిసేత్తాం సోదరా. తప్పు *కత్తి*ది కాదు. దాన్ని ఉపగోగింసుకున్న నా ఎడం సేత్తిద్ది. అదేటి, *కత్తి*కి కేవలం నరకటమో తెగ్గొయ్యటమో మాత్రమే తెల్సు కద!! మరి దాన్ని కూసిన్త జాగరత్తగా వాడకపోతే సూసేవా ఎన్ని అనర్ధాలు జరిగిపోతయో!!
చివరాకరుగా సెప్పేదేంటన్టే!! *కత్తుల్తో* జాగ్రత్త.

11 comments:

 1. చిర్‌ర్‌ర్‌ మంటూ చీరకొంగుచింపి కట్టేసి, ఉబికొచ్చే కన్నీళ్ళు ఆపుకుంటూ ... సెంటిమెంట్ సీన్ కళ్లముందు కనిపిస్తుంది. వొదినకి తెలుసా ఇంతకీ

  ReplyDelete
 2. *కత్తి*లాంటి టపాతో మమ్మల్ని పొడిచీసినారే!

  ReplyDelete
 3. సో... కత్తులతో చాలా జాగ్రత్తగా ఉండమని మరోసారి గుర్తుచేశారన్నమాట....

  ReplyDelete
 4. వొదిన లేదుగా.. :)

  ReplyDelete
 5. పల్నాటోళ్లకు కత్తి,నెత్తురు కామనేగదా !

  ReplyDelete
 6. LOL
  బాగా వ్రాశారు.మీది రాయలసీమా? డేగిశా,యెందబ్బా లాంటి పదాలు చదివి అనుమానం వచ్చింది.

  ReplyDelete
 7. పోనీలెండి! మీ రక్తంతో ఈ సంవత్సరానికి చుక్కపెట్టి,వికృత నామ సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించారనుకుందాం:) మీకు ఉగాది శుభాకాంక్షలు!

  ReplyDelete
 8. ఒక్కదెబ్బకి రెండు పిట్టలను కొట్టారుగా! :-P

  ReplyDelete
 9. హయ్యో పాపం ! భాస్కరం గారూ, హప్పట్లో మీరు బరువు తగ్గే పన్లో పడినా అని పోస్ట్లేసినోరు కదా, మరి మీ బిఫోరు, ఆఫ్టర్ బొమ్మలెట్టి మా అందరికీ స్ఫూర్తి కలిగించండి సార్ .అలాగే మీరు పాటించిన ఇదానం కూడా.

  ReplyDelete