Mar 16, 2010

డాలరు పంట - నా ఉగాది కవిత

మత్త కోయిలలూ
మత్తు కాకులూ
రాబందులూ రెక్కల పక్షులూ
అన్నీ
నా ఉగాది చెట్టుమీదనుంచి
ఉన్నట్టుండి
ఒక్కసారిగా
రకరకాల అరుపులతో
కొన్ని జీరబోయిన గొంతులతో
కొన్ని శ్రావ్యమైన కంఠాలతో
ఎగిరిపొయ్యాయి
నా ఉగాది చెట్టుని విడిచిపొయ్యాయి
ఖాళీ చేసాయి
అవున్లే
అవిమాత్రం ఏంచేస్తాయి పాపం
నేనేమన్నా పండ్లు కాయించానా
నేను ఎమన్నా పండ్లు ఫలలా కాయించానా
మంచు నీళ్ళు పోసి డాలర్లు కాయించాలని చూసాను
స్వార్ధం ఎరువేసి బంగారపు దిమ్మెలు పూయించాలని చూసాను
కానీ ప్రకృతి నన్ను చూసి నవ్వింది
చెట్టుకి అనురాగం మాత్రమే పూస్తుందీ అని చెప్పింది
అలా ఎలా అన్నాను
చెట్టుకి ప్రేమా వాత్సల్యాల ఫలాలు మాత్రమే వస్తాయని చెప్పింది
నెను విన్లా
నేను వినలా
నా ప్రయత్నలు చెస్తూనే ఉన్నా
డాలర్ల పంట పండుతుందేమో అని
మంచుపడే దారులవెంట
ఆశగా చూస్తూనే ఉన్నా
రోజులు
నెలలు
రోజులూ నెలలూ గడిచిపొయ్యాయేగానీ డాలరుపూత లేదు
ఇదిగో ఇప్పుడొచ్చింది
ఇప్పుడే వచ్చింది ఇంకో ఉగాది
ఇంకో యుగాది
నాలోని ప్రేమతత్వాన్ని నిదురలేపే యుగానికి ఆది
మరో కొత్త సమచ్చరంలోకి
ప్రకృతితో మమేమకమౌతూ
ఆప్యాయాలనూ అనురాగాలనూ పంచుతూ
ముందుకురికే యవ్వనాన్ని చిలకరిస్తూ
వచ్చింది ఉగాది
కొత్త కొత్త ఆశలూ
కొత్త కొత్త కోరికలూ
మూటగట్టుకున్న మనసుకి
చేయందించటానికి వచ్చింది ఉగాది
కుక్కతోక వంకరన్నట్టున్నా ఈ మనస్సు
ఈఏడాదన్నా ఈ దూరపుకొండల నునుపుని
కొలవటం మానుకోవాలని ఆ ఉగాది లక్ష్మిని కోరుకుంటా

5 comments:

  1. వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

    ReplyDelete
  2. మీ కోరిక నెరవేరాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  3. మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. mama katti .....nee kalam jhari kalakaalam ilane konasagalani asistu...ee yugadi nee dollarla gaadi nimpalani kamkshistu,,,,mitrudu radhakrishunudu

    ReplyDelete
  5. వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు మరియూ శుభాకాంక్షలు.
    రాధా!! నా బ్లాక్కి వచ్చి, నా కవిత చదివి, వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete