Mar 26, 2010

విద్యుత్తు ఉత్పత్తి పెంచాలి - రోత(శ)య్య

ఇవ్వాళ్ళ వార్తల్లో రోతయ్య ఇలా అన్నారు -
రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి జరగటం లేదు
రాబోయే రెండు మూడేళ్ళలో విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు ఘట్టిగా ప్రయత్నాలు జరగాలని మీముందు సూచిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు లేని రాష్ట్రం కాదు ఎక్సెస్ విద్యుత్తు గల రాష్ట్రం అని నిరూపించుకోవాలి.

వాహ్!! ఎంత మంచి ఆలోచన. భేష్.
ఐతే!! ఎలా? ఎలా పెంచుతావయ్యా రోతయ్యా? అదీ చెప్పు...
ఎంత విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు
ఎంత వైట్ వినియోగమౌతోందీ
ఎంత చోరీ కాబడుతోందీ
ఎంత సరఫరాలో సచ్చిపోతోందీ
ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్న విద్యుత్తు ఎంత
కొనే ధర ఎంత

ఇవన్నీ పక్కనబెట్టి -
మనం ఇలా ఎందుకు ఆలోచించం?
కోర్టులు, యూనివర్సిటీలి, ప్రభుత్వ కార్యాలయాలు, కలక్టరేటు కార్యాలయాలు, కాలేజీలు, హైటెక్ సిటీలు - వీటి టాపులు వృధాగా పడిఉన్నాయిగా, వాటీపై సూర్యరశ్మితో విద్యుత్తుని ఎందుకు తయ్యారు చేస్కోలేము?
ఎన్ని చదరపు అడుగులు ఉండవచ్చు, ఎన్ని సోలార్ ప్యానల్స్ ని స్థాపించవచ్చు, ఎన్ని వాట్స్ విద్యుత్తుని తయ్యారు చేయవచ్చూ?
ఎవరైనా ఓ సర్వే చేస్తే బాగుండు.....

5 comments:

  1. బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది, జనాల డబ్బు దొబ్బి తినటానికి రోతయ్యకు ఇంకో క్రొత్త అవుడియా ఇవ్వకండి. ఆ సర్వే పేరు చెప్పి కనీసం ఓ వంద కోట్లు అయినా వెనకేసుకొంటాడు మా సీరాల సిన్నోడు aka రోతయ్య cum కాశయ్య.

    ReplyDelete
  2. సొలార్ పేనల్స్ కి డబ్బులేక్కడియండి... అవంత చీపు కాదు కదా

    ReplyDelete
  3. రిలయన్స్ కెజి బెసిన్ లో ని గాస్ అంతా బయట కు తీసుకెలుతున్నది.ప్రబుత్వ యంత్రాంగం ఇంతకు ముందు ,ఇప్పుడు ,ఎప్పుడూ నిద్ర ఫొతుంది .
    Out of 65 MMSCMD AP is getting only 11 SCMD.Do u know some of the GAS power plants are not operating at full capacity.

    ReplyDelete
  4. > వీటి టాపులు వృధాగా పడిఉన్నాయిగా
    అవి వృధా గా పడియున్నాయి అని మీకు ఎవరు చెప్పారు, చాలా చోట్ల Advt హోర్డింగ్స్ ఉన్నాయి..

    ReplyDelete
  5. ఫన్ ఎపార్ట్ -
    నా ఉద్దేశంలో - ఇలాంటివాటికి, మనకున్న కొన్ని వందల ఇంజనీరింగు కళాశాలల్ని ఉప్యోగించుకోవచ్చు. ఫైనల్ ఇయర్ విద్యార్ధులు ఎలాగూ ప్రాజెక్టు వర్క్ చెయ్యాలి. వారిని ప్రోత్సహించ వచ్చు.
    @ పానీపూరి - నిజమెలే...కాదన్ను.

    ReplyDelete