Mar 19, 2010

ఆ వేళ!

ఎంత మధురంగా ఉందా వేళ!!
పచ్చని చెట్ల పందిరి కింద
మిత్రబృందంతో ఉన్నాడతను
గప్పాలు కొట్టుకుంటూ
వయ్యస్సు ఇచ్చిన గర్వంతో
అప్పుడే విడిచినపెట్టిన కళాశాల
బిలబిలమంటూ
బయటకురుకుతున్న కాళ్ళు
కుర్రాళ్ళ కొంటెచూపులు
అమ్మాయిల దొంగచూపులు
ఇంతలో బెదిరించే
డిసిప్లైనరీ సైగలు
ఈ మధ్యన!!
మనోడికి చురుక్కున
ఏదో గుచ్చుకుంటున్న భావన
చెట్టి కిందున్నాడుగా
గొంగళి పురుగేమో అనుకున్నాడు
ఈ గుచ్చుకొనుడు ఇంకెదో గుచ్చుకొనుడని అర్ధం అయ్యింది
మనోడికి అర్ధం అయ్యింది
అది ఓ స్నిగ్ధ
మూగకళ్ళ బాకని!!
ఓ నిండైన యవ్వనపు
పదునైన చూపని
తల విదిల్చి
చుట్టూ ఉన్న బస్సుల జాతరలో
ఆ కళ్ళకోసం వెతుకులాట
మొదలెట్టాడు
అన్ని బస్సులు
వందల కళ్ళు
అన్ని బస్సులు వందల కళ్ళు
కొన్ని అందమైనవి
కొన్ని పొగరైనవి
కొన్ని కాటుక దిద్దినవి
కొన్ని సొగసైనవి
కొన్ని తమ ప్రియునితో మౌనంగా ఊసులాడేవి
కొన్ని తమ ప్రియుణ్ణి చూపుతోనే దహించివేసేవి
ఇన్నిటిమధ్య
ఇన్ని కళ్ళ మధ్య
ఓ బస్సు కిటికీలోంచి
బాణం వేసినట్టుగా
తీక్షణంగా
ఏకధారగా వస్తోన్న ఆ చూపునీ
ఆ కళ్ళనీ పట్టేసాడు మనవాడు
దొరికిపొయ్యాయి ఆ కళ్ళు
ఆహా!!
ఎంత అందంగా ఉన్నాయా కళ్ళు
ఎంత విశాలంగా ఉన్నాయా కళ్ళు
ఎంత లేతగా ఉన్నాయీ అవి
ఎంత అమాయకంగా ఉన్నాయవీ
కళ్ళు కళ్ళు కలిసాయి
చూపులు కలిసాయి
అర్రె!! పట్టుపడ్డానే అనుకున్న ఆ కళ్ళు
ఇంకోవైపుకి టకామని తిరిగాయి
అహా! నేవదులుతనా అని
మనోడు కళ్ళతో తన్ని గుచ్చుతునే ఉన్నాడు
తనవైపుపుకి తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు
నేనింకా నీవైపే చూస్తున్నా
అని సంకేతాలు పంపుతునే ఉన్నాడు
విజయం సాధించాడు
ఆ సంకేతాలను డీకోడ్ చేస్కుందా
తెలివైన అమ్మయి
ఆ మీనాక్షి
ఆ సోగకళ్ళ సుందరి
మళ్ళీ కళ్ళూ కళ్ళూ కలిపింది
మనోడు ఏడిపిద్దాం అని
తనచూపుని మరల్చాడు
ఆ కళ్ళు గుచ్చాయి
ఆ విరహం తట్టుకోలేక
మనోడు ఓటమిని అంగీకరించి
అలా కళ్ళాతోనే ఊసులాట్టంలో
మినిగిపొయ్యాడు
ఇద్దరూ
వారిద్దరూ
ఇక ప్రపంచంలో
ఎవరూలేరూ
మేమిద్దరమే
మాకింకేం పట్టవ్
మాకింకెవరూ పట్టరూ
అన్నట్టుగా మునిగిపొయ్యారు
అతనెక్కడో దూరంగా చెట్టుకింద
ఆమె బస్సులో కిటికీ పక్కన
కళ్ళు మాట్లాడుకుంటున్నాయి
చామనఛాయ ముఖం
లేతగా ఉంది ఆమె
చెక్కినట్తున్న ఆమె ముక్కు చెంపలు
అతన్ని చిత్తు చేసాయి
ఇంతలో
విధి వింతనాటకం [అని అంటాడతను] ఆడింది!
ఆమె కూర్చున్న బస్సు కదిలింది
ఆమె ఎక్కిన బస్సు తన గంమ్యం వైపుకి నడిచింది
ఆమె ఎక్కిన బస్సు నిర్దయగా తను రోజూ చేసే పనినే చేసింది
ఆ బస్సు చాలా సమయపాలన చెస్తుంది
దానికి దయా దాక్షిణ్యాలు లేవు
దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయిందా బస్సు
ఆందోళన నిండిన చూపులు
విలవిల్లాడాయి
తపించిపొయ్యాయి
చూపులు మళ్ళీ కలుస్తామా అన్నట్టు
మళ్ళీ కలిసాయి
చివరిసారా అన్నట్టు కలిసాయి
ఎన్నో భావాలతో కలిసాయి
వేదనతో కలిసాయి
ఒకే కళాశాలలో ఉన్నా
కొన్ని వేల కళ్ళలో
ఎక్కడని వెతకాలా కళ్ళకోసం
ఎంతకష్టమో ఆ వెతుకులాట
బస్సు వెళ్ళిపోయింది
మనవాడూ
తను ఎక్కాల్సిన బస్సువైపు నడిచాడు
తన గమ్యంవైపుకి నడిచాడు
మనోడిబస్సు వాణ్ని వాడి గమ్యం వైపుకి లాక్కెళ్ళెంది
మనోణ్ణి
మనోడి జ్ఞాపకాలనీ
ఆ వింతైన తీయనైన మధుర క్షణాల్నీ
విరహాన్నీ దుమ్మునీ కలుపుకుని!!!

4 comments:

  1. కన్ను కన్ను కలుపుకొని
    ఎన్నో ఎన్నో కలలుగని :))

    ReplyDelete
  2. ఇక్కడ *మనవాడు* అనేపదాన్ని *చైతన్య* అనేపదంతో మార్చేసుకుని మళ్ళీచదివెయ్యండహో

    ReplyDelete
  3. చాలా బాగుంది. ఒక్కసారి flashback లోనికి తీసుకెళ్ళారు.

    ReplyDelete