Jun 18, 2009

హంస గాయత్రి

॥తృతీయ న్యాసే హంస గాయత్రీ స్తోత్రమ్॥
అస్య శ్రీ హంస గాయత్రీ మహామంత్రస్య। ఆత్మా ఋషిః। పరమాత్మా దేవతా।
అవ్యక్త గాయత్రీ ఛన్దః। హంస గాయత్రీ ప్రసాద సిద్ధ్యర్ధే హంస గాయత్రీ జపే వినియోగః॥

హంసాం అంగుష్ఠాభ్యాం నమః॥
హంసీం తర్జనీభ్యాం నమః॥
హంసూం మధ్యమాభ్యాం నమః॥
హంసైం అనామికాభ్యాం నమః॥
హంసౌం కనిష్ఠికాభ్యాం నమః॥
హంసః కరతలకరపృష్ఠాభ్యాం నమః॥

హంసాం హృదయాయ నమః॥
హంసీం శిరసే స్వాహా॥
హంసూం శిఖాయై వషట్॥
హంసైం కవచాయ హుమ్॥
హంసః అస్త్రాయ ఫట్॥
భూర్భువస్సువరోమితి దిగ్భన్ధః॥

ధ్యానమ్

గమాగమస్థం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారమ్।
పశ్యామి తే సర్వజనాన్తరస్థం నమామి హంసం పరమాత్మరూపమ్॥

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః।
త్వజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్॥

హంస హంసః పరమ హంస్సోహం హంసః సోహం హంసః॥

హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి।
తన్నో హంసః ప్రచోదయా"త్॥

హంస హంసేతి యోబ్రూయాద్ధంసో నామ సదాశివః।
ఏవం న్యాసవిధిం కృత్వా తతస్సంపుటమారభేత్॥


మహాన్యాసంలో మూడో న్యాసం హంసగాయత్రీ స్తోత్రమ్.
మహాన్యాసంలో హంస గాయత్రి ఎందుకు చెయ్యాలి?
అసలు హంస గాయత్రి అంటే ఎవరు?

4 comments:

  1. * రామరాజు గారు, "రాతిలోనే దేముణ్ణి దర్శించంగలమనుకుంటే నా ఆకలి తీర్చగ నూకలు విసిరే తిరుగలినే పూజిస్తాను" - కబీరు. "నాదో ప్రశ్న - మీరు http://sahajmarg.org/ రామచంద్రజీ మిషన్ ని ఎందుకు అనుసరిస్తున్నారూ? మీరూ మెంబరా అందులో? చారిజీ ని చూసారా ఎప్పుడైనా?"
    అంటూ మీరు అడిగిన ప్రశ్నకి http://maruvam.blogspot.com/2009/06/blog-post.html
    నేను సమాధానం ఈ టపాకి వ్యాఖ్యగా మాత్రం కాదు. మీరు గమనించే అవకాశం ఇక్కడ అధికమని వ్రాస్తున్నానిక్కడ. అన్యధా భావించవద్దు. ఈ మంత్రోపాసనలు ఉత్కృష్టమైనైవే. కాలగమనంలో ఎన్నిటికో ప్రాభవం తగ్గిపోయింది. అయినా నా పరిమిత జ్ఞానంతో ఇక పొడిగించను.
    మాఇంటో అన్నయ్య [నాగేశ్వరరావు/నాగు] పుట్టినపుడు త్రాచుని చంపారట, పాప పరిహారంగా గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేయించి నిత్య పూజలు, అభిషేకాలు జరిగేవి. నా వూహ వచ్చేసరికి భజనలు, పూజలు, గుడికి వెళ్ళటం, నది స్నానాలు ఇలా దైవారాధనలోమునిగితేలేవారం. మా మేనత్త గారికీ ఇదే పరిస్థితి. అత్త కొడుకు నాగరాజు/చిన్న నాగు పుట్టినపుడు పొలంలో త్రాచుని చంపారట. అది మావయ్య గారికి కలలో కనిపించిందట. అలా వాళ్ళింట్లోనూపూజలే. గుడి పూజారికన్నా ముందుగ ఉదయానా, చివరిగా రాత్రిలో శ్రీశైల మల్లయ్యని పూజించేవారు. నిత్య ఉపవాసాలు, సమారాధనలు. ఈ నేపథంలో పెరిగిన నాకు, కాథలిక్ కాన్వెంట్ మూలాన ఆ మతపర విషయాలు కూడా పరిచయం చేయబడ్డాయి. నాకు 16సం. వయసపుడు మేనత్త కుటుంబం మొత్తం సహజమార్గ అభాసులుగా మారారు. ఒక విధమైన కూతూహలం, అదెలా జరింది అని. నా చేతివ్రాత బాగుంటుందని బాబూజీ ఉపదేశాలు వ్రాయించారు. అలా జిజ్ఞాస కలిగింది. మా మేనమామ గారి భార్య కూడా అభ్యాసి అయ్యారు, తను నేను బాగా ఉత్తరాలు వ్రాసుకునేవారం. బాగా ఆస్తిపరులైన తనలో క్రమేణా వైరాగ్యపరమైన దృష్టి రావటం గమనించాను. దాదాపు 6ఒ సం. పైగా శివ పూజల్లో మునిగి తేలి, గీత పఠనంలో జీవించిన నానమ్మ కూడా మారటం, తను నాకు యూనివర్సిటీలో చదివినపుడు తోడుగా రావటంతో మరింత బలపడింది. అలా అభ్యాసిగా మారాను. ఈ క్రమంలో, "రాతిలోనే దేముణ్ణి దర్శించంగలమనుకుంటే నా ఆకలి తీర్చగ నూకలు విసిరే తిరుగలినే పూజిస్తాను" అన్న కబీరు మాటలు, "గుడి మెట్లకి రాయే, గుళ్ళోనూ రాయే మీకు అని గేలి చేసిన వ్యక్తితో నీ తల్లి స్త్రీ, భార్యా స్త్రీ ఆ ఇద్దరిలో వేర్వేరు రూపాలు చూడగలవుగా, ఇదీ అంతే" అన్న వివేకానందుని నుండి, గీతా భోధలు, "క్రింద పడ్డ సూది నెత్తటానికి క్రేను అవసరం లేదు, చెయ్యి చాలు" అన్న సహజమార్గ సందేశం వరకు చదివిన వాటి పట్ల అవగాహన కలిగిందనే భావిస్తున్నాను. చాలా రోజుల తరబడి నాతో ఆధ్యాత్మిక చర్చలు జరిపిన శంకర్ మనోహర జోషి గారు కూడా "అదములు భజనలు, మధ్యములు పూజలు, ఉత్తములు ధ్యానం" చేస్తారు అని అంగీకరించారు. అటువంటి ఉత్తమ మానసిక స్థాయి రావాలంటే నిరాకారమైన, నిర్గుణ,నిర్మల మూర్తిని, ఆ పరమాత్మని మనలో మనం దర్శించగలగాలి. అందుకే నా ఈ సహజ మార్గ పయనం, సాధన. చారీజీని 2 సార్లు, ఒకటి బసంత్ పంచమి సందర్భంగా, మరోసారి ఆశ్రమంలోను చూసాను. నేను నా పిల్లలకి చేతులు ముకుళించటం వచ్చిన ప్రాయం నుండీ నేర్పింది అదే మీ హృదయంలో వసించే స్వామిని ప్రార్ధించండి, కోరికలనేవి కోరకండి, మరో ప్రశాంతమైన రోజు ఈ వసుధైక కుటుంబానికి ఒసగమని అడగండి అని. నాకు కలిగిన అనుభవాలు పెక్కు. నా సమస్యాత్మక వేదనా భరిత బౌథిక జీవితంలో ఆ మార్గం మూలంగానే ఇంకా మనగలుగుతున్నాను. సెలవిక.

    ReplyDelete
  2. >>ఈ మంత్రోపాసనలు ఉత్కృష్టమైనైవే
    ఉష గారు -
    నేను అమిత భక్తి పరుణ్ణి కాదు. నేను పూజించేది చాలా తక్కువ. మా ఇంట్లో మా అమ్మతప్ప భక్తిమార్గం పట్టినవాళ్ళు లేరు. నేను పుట్టినప్పటినుండి దేవుళ్ళ పటాలకన్నా లెనిన్ పటాలు, స్థూపాలు, కంకికొడవలి, సుత్తికొడవళ్ళే ఎక్కువచూసా. ఈరోజున! నేను మంత్రాన్ని చదువుతున్నా. నేను మంత్రోపాసనలు ఉత్కృష్టమైనైవే అని భావించను. నేను మంత్రోపాసన చెయ్యను. మంత్ర పఠనం చేస్తా. అదీ నా మానసిన ప్రశాంతత కోసం మాత్రమే. ఓ కోరికతో నేనెప్పుడూ చెయ్యలేదు. ఇలా చేస్తే రేపటికి దేవుడు ప్రత్యక్షమౌతాడు అనికూడా భావించను.

    నా దృష్టిలో మంత్రం -
    నేను ఎప్పుడూ మంత్రం వింటూనే ఉంటా. నా కార్లో నేను, ప్రత్యేకించి నేను మాత్రమే ప్రయాణం చేసే ప్రతీసారి రుద్రం వింటాను. కారణం? నాకు ఆ మంత్రం ఆలోచనలతో సతమతమయ్యే మనస్సుని తనవైపుకి లాక్కుంటుందీ అని. ఒక పాట నచ్చినప్పుడు అదే పాటని మళ్ళి మళ్ళీ వినాలనిపిస్తుంది. దాంతో మనగొంతు కలిపి పాడాలనిపిస్తుంది. మంత్రం నా దృష్టిలో ఓ పాటలాంటిదే. నాకు రుద్రం నచ్చింది. వింటా. మహన్యాసం వైపు లాక్కెళ్ళింది. తొవ్వుతున్నా. అలా తవ్వకంలోంచి బయటపడిందే ఈ హంస గాయత్రి.
    వేదం, మంత్రం ఏదైనా - మన దృష్టిని తనవైపుకి లాక్కుంటాయి అని మాత్రమే నేను నమ్ముతా. ఓ భగవంతుడు మంత్రం చదవంగనే ఇలా ప్రత్యక్షమౌతాడూ వెంటనే వరాలిస్తాడు అని నేను నమ్మను. నేను ఇంతవరకూ గుడికి వెళ్ళినా దండం పెట్టుకుని వచ్చేస్తా. అనగా దేవుడంటే నమ్మకమా? కాదు, అది ఓ తృప్తి, భరోసా. అంతే. ఆ భరోసా బలాన్ని ఇస్తుంది. అదేదో సినిమాలో మాస్క్ పెట్టుకుంటే అసాధ్యాలు చేయవచ్చు అని భావించిన హీరో "ఆత్మస్థైర్యం"ని మించిన ముసుగు లేదు అని తెల్సుకుని ఆ మాస్క్ ని విసిరేసినట్టు, నేనుకూడా నన్నునేను నమ్ముతా.

    మీరన్నట్టు, మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత. అధ్యాత్మికం అంటే ఓ అదో వేరే ప్రపంచం అని నేను అనుకోను. మనస్సుని ఆలోచనలనుండి ఐసోలేట్ చెయ్యడమే మెడిటేషన్ లాంటి ప్రక్రియల అంతిమ లక్ష్యం అని నేను భావిస్తా.

    మా మామ అంటుండేవాడు. రకరకాల ఆలోచనా ఈగలు పడుకునేప్పుడు మనసు అనే బెల్లం మీద ముసురుతాయి. అన్నింటినీ పట్టుకుంటే ఇక నిద్ర తెల్లారినట్టె. కాబట్టి ఆ ముసురులోంచి ఒక ఈగని పట్టుకు గెలుకు అని.

    "అదములు భజనలు, మధ్యములు పూజలు, ఉత్తములు ధ్యానం"
    ఏదీ చెయ్యని జాతి నాది. "రాతిలోనే దేముణ్ణి దర్శించంగలమనుకుంటే నా ఆకలి తీర్చగ నూకలు విసిరే తిరుగలినే పూజిస్తాను" - కబీరు
    నాకు దేవుణ్ణి దర్శించుకోవాలనే కోరికేలేదు.

    ReplyDelete
  3. తవ్వకాల్లో బయటపడ్డ విషయం చెబుతున్నాను.

    ప్రయత్నంతో నోటితో గాని, మనసుతోగానీ మంత్రము నడుపుటను జపమంటారు. ప్రయత్నరహితంగా చేయబడునది అజపా అను జపం. ఇది సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసలచే జరుపబడు 'హంసస్సోహం' అను అప్రయత్న జపం. దీనినే అజపా గాయత్రి అంటారు. దీనినే హంసగాయత్రి అని కూడా అంటారు. కులమతాల కతీతంగా ప్రతి వ్యక్తి చేసే ఉచ్ఛ్వాశ నిశ్వాసల జపమే హంస గాయత్రి. హంస అను శబ్దం ప్రాణశక్తికి సంకేతం. గాయంతం (జపం చేయువానిని) త్రాయతే (రక్షించునది). కాబట్టి మానవునిలో సహజంగా, ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియను హంసగాయత్రి అంటారని చదివానండి.

    ReplyDelete
  4. కిరణ్ గారు
    నమస్తే!! హంసస్సోహం గురించి ఇప్పుడే చదువుతున్నా. ధన్యవాదాలు.

    ReplyDelete