Jun 1, 2009

జ్ఞాపకాల దొంతర - గానాట

మన నెమలికన్ను మురళిగారి ఈతపళ్ళు ముంజలబండి స్పూర్తితో..
ఆ రోజుల్లో, మరి ఆరు, ఏడు తరగతులప్పుడు, కొంచెం కాలక్షేపం ఎలా? ఇప్పట్లా టీవీ గట్రా ఉండేవికాదుగా...
దాదాపు ప్రతీ ఊళ్ళో ఒక చెఱువు ఉండేది ఒకానొక సత్తెకాలంలో. ఆ చెరుఎమ్మట, ఓ వైపు నిప్పులు. ఇంకో ఐపు, నిలుపుకున్న గుర్రబ్బళ్ళు, గుర్రాలు, బర్రెలు, ఇయన్నీ తిరుగాడతా ఉండేయి. ఇంకోఐపు కరకట్ట మస్టు. ఆ కరకట్టమీన, ఎద్దులబళ్ళ సెక్రాలకి ఇనప తొడుగులు కాల్చేవోళ్ళు. ఇనప సెక్రం ఎట్టి, దానిమీన పిడకలు అయ్యి ఇయ్యి ఏసి నిప్పెడితే, ఎర్రంగ కాలుద్దా, అప్పుడు, దాన్ని సుత్తితో కొడితే షేపు వొచ్చుద్ది.
కొన్తమంది కుర్రోళ్ళు ఊరి ఆచారికాడికిబొయ్యి, సిన్న సిన్న ఇనప గాన్లు సేయించుకునేవోళ్ళు. ఆటినీ కరకట్టమీన్నే కాలిపించుకునేవోళ్ళు. ఎలా ఉండిద్దంటే, బండిసెక్రం ఉందా, దానికి మద్దెలో, ఇరుసుని ఇరికించటానికి ఒక పెద్ద సెంటర్ పాయింట్..దానికి సివర్న, అది పగిలిపోకుండా ఓ ఇనప సట్రం. ఆ సట్రం ఓ గాను అనుకో.
ఇక ఓజాన కర్ర. దానికి చివరాకర్న ఒక మేకు. ఇక గాన్ని, ఆ మేకుతో నెట్టుకుంటా తిరగటం. యాడికిబోయినా అది ఎమ్మటుండాల. అది నెట్టుకుంట, సర్రున సౌన్డు జేస్కుంటాబోవాల. ఆ ఇనప గాన్ని తగిలియ్యటానికి గోడకి ఓ మేకు. ఇంటికిబోంగనే గాన్ని ఆ మేక్కి తగిలించల.

మన్లాంటోళ్లకి అట్టాటియి ఉండేయి కాదు. ఉన్నోళ్ళకాడికిబొయ్యి, బతివలాడుకొని ఓ సుట్ట సిట్టుకొచ్చి, అబ్బా ఇట్టాంటిది మనకాడ ఉంటే ఎంతబాగుండు అనుకోటం.

సైకిలు టైరు, కర్రబెట్టి కొట్టుకుంటా తిరిగేవోళ్ళం.
ఇక, సైకిలు రిమ్ము. స్పోకులు తీసేసిన సైకిలు రిమ్ము. ఈ సెక్రం మద్దెనలోకి నొక్కినట్టుగా ఉండిద్దా, ఓ కర్రముక్కతో ఆ మద్దెనబెట్టు తోస్కుంటా ఆడుకునేవోళ్ళం.

ఇయన్నీ కేక. ఇప్పుడు యాడున్నై ఇయ్యి.

16 comments:

  1. టైర్లు బొయ్యి బైర్లొచ్చింటేను...ఏంది కేకలు బెట్టేది ?.. :)

    ReplyDelete
  2. మేమూ ఆడాం సార్, మురళీ గారి టపాలో పూర్తి వివరాలు పెట్టాం, చదివారా మరి? కబాడీ కూడా మనకు కొట్టినపిండే.

    ReplyDelete
  3. మాకైతే సైకిల్ టైర్లు దొరికేవే కావు అప్పుడు మాఊరిలో సైకిల్లు కూడా తక్కువే.మాకంతా బద్దిగుండ్లు అవేనండి గోళీలు,బొంగరాలు.గోళీలు కూడా రాతితో మొలుచుకునేవాళ్ళం.గోళీలు జేబుల్లో వేసుకోవడంవల్ల ప్రతిజేబుకీ బొక్కే.సిగరెట్టు పెట్టె సైడు ముక్క తీసుకుని జొన్న దంటుకు తుమ్మముళ్ళుతో గుచ్చి గాలికి ఎదురుగా పరుగెడతావుంటే నాసామిరంగా పేపరు ముక్క పుల్లు స్పీడుగా తిరిగేది.జొన్నదంటు పొడవుది తీసుకుని ముందర కొంచెం వంచి బస్సు శబ్దం చేసుకుంటూ పరుగెత్తేవాళ్ళం. మంచి మధురమైన జ్ఞాపకాలు.

    ReplyDelete
  4. అన్నా బొమ్మలెక్కడ పట్టినవ్?

    ReplyDelete
  5. వంశి భాయ్ - :):) నిజమే.
    ఉష - మీరు మరీ అండి!! కేక. ఆల్-ఇన్-ఆల్..
    విజయమోహన్ - :):) అవును, రాళ్ళ గోలీల్తో ఆట్టం చూసా
    యోగయ్య - నేనే వేసా. బాగున్నయా?

    ReplyDelete
  6. అయినా ఇసుమోటివి బొమ్మలు పెట్టకపోతె మీ సూరిగాడికి ఒకటి చెయ్యిచ్చొచ్చుగా. పాపం ఇలాటివి ఏవీలెకే పాపంకుంచె పట్టుకొన్నాడు మీగుంటడు.

    ReplyDelete
  7. బాసూ, బొత్తిగా నీకు లోక జ్యానం లేనట్టుందే, కార్రముక్కట్టుకుని నాలుగిచ్చాడనుకో మనకి బొక్కలు ఇరుగుతై. :):) మావాడి సంగతి నీకు తెలవదు..

    ReplyDelete
  8. ఇప్పుడు రాంసోవి --ఇది నాకు అర్ధంకాలా

    ReplyDelete
  9. :):):) ఇప్పుడు నా బ్లాగుని చూస్తున్న వ్యక్తి, ఉబ్బరగా అంటే సరదాగా రాంసోవి అంటే రామస్వామి అని పేరుపెట్టా
    అంటే ఇప్పుడు నా బ్లాగు చూసే అతని పేరు రాంసోవి అని.

    ReplyDelete
  10. సిరిగెట్టు ఓకులు.. ఓ గడిలో పెట్టి.. బెచ్చాతో పడగొట్టడాలూ...
    పల్గిన పలక పెంకులు.. ఓ పిచ్చిబంతి.... వీపులు విమానం మోతలు..అబ్బో ఆరోజులు.. కోతి కొమ్మచ్చడుతూ.. నిక్కరు బొందులు కొమ్మల్లో ఇరుక్కుని వాటికి వ్రేళ్ళాడిన రోజులూఉ.. అబ్బో అబ్బ్బో .. బాగా గుర్తు తెచ్చారండి (మేము చిన్నప్పుడు సిరిగెట్టు.. పల్గిన అనే అనేవాళ్ళం) ధన్యవాదాలు.

    ReplyDelete
  11. వీపు గుద్దులాట ,కుబుడు దుంకులాట మళ్ళీ ఆడగలమా అవన్నీ :(

    ReplyDelete