May 22, 2009

అలారం - వేకప్ కాల్

రుద్ర కి ఇప్పుడు ముప్పైనాలుగేళ్ళు. అతను ఎక్కడో ఒక పల్లెలో పుట్టాడు. పుట్టినప్పటినుండి చాలా ఉత్సాహంగా ఉండెవాడు. మహా హుషారుగా ఉండేవాడు. బాయిలోంచి నీళ్ళు తోట్టం, పనులు చెయ్యటం, కంపకొట్టడం. బళ్ళో చెట్లు నాటటం, ఆటికి నీళ్ళు పొయ్యటం, గంపలు గంపలు మట్టి మొయ్యటం ఇలా. కుఱ్ఱోడు మహా గట్టోడుకూడ.
తర్వాత్తర్వాత పై చదువులకి పట్నం ఎళ్ళటం. అక్కడా సైకిలు తొక్కుకుంటు కాలేజీకి ఎళ్ళటం ఇలా బాగనే ఉండేవాడు. రోజుకి తిన్నదాంట్లో బాగనే ఖర్చుపెట్టుకునేవాడు శక్తిని. ఐతే, వయసు ప్రభావం వల్ల, స్నేహాలవల్ల దమ్ముకొట్టడం మొదలెట్టాడు. అప్పుడప్పుడూ దొంగతనంగా మందుకొట్టడం మొదలెట్టాడు. అలాఅలా, వ్యాయామం నెమ్మదిగా అటకెక్కింది. చదువు అయ్యాక, ఉద్యోగప్రయత్నాలు, ఉద్యోగం తొందరగా దొరక్కపోవటం, ఇంటికి దూరంగా ఎక్కడో హైద్ లోనో బెంగలూరులోనో ఉండటం వల్ల, దమ్ముకొట్టుట, మందుతాగుట ఎక్కువయ్యాయ్. అయినా, అతను, అతనిమీద నమ్మకాన్ని కోల్పోలేదు. తను చలా గట్టి, తనకేమీ కాదూ అనుకునేవాడు. ఇక ఉద్యోగం దొరికినాక, అతన అలవాట్లు చాలా మారిపొయ్యాయ్. అంతక ముందుదాకా వారాంతానికో లేక ఎప్పుడన్నా మందుకొట్టేవాడు ఇప్పుడు దాదాపు వారానికి రెండుమూడు సార్లు కొట్టటం మొదలుపెట్టాడు. కార్యాలయంలో పని తీవ్రత, పని వొత్తిడిల వల్ల, పీర్ ప్రెస్సర్స్ వల్లా తీవ్ర అందోళనలకి, తీవ్ర వొత్తిడులకీ గురవ్వటం, ఒక పద్ధతి పాడూ లేని భోజనం, ఎప్పుడు ఎక్కడ ఏది తింటున్నాడో గమనించే స్థాయిలో లేకపోవటం, పార్టీలు, మందు, దమ్ముకొట్టుట ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయింది.
ఇంతక ముందు కనీస వ్యాయామం అన్నా ఉండేది. ఇప్పుడు అస్సలులేక, కిందపొట్ట పెరగనారంభించింది. కొంచెందూరం వెళ్ళటానికి క్కూడా హా బొంగులే ఎవడు నడుస్తాడూ అని బండేస్కెళ్ళటం, ఇలాంటి వాటితో కండరాలన్నీ సుఖానికి అలవాటయ్యాయి. ఇంతలో స్పాజ్మాటిక్ పైన్స్ అవీ ఇవీ ఆన్ అండ్ ఆఫ్ గా రావడం మొదలైంది. డాక్టర్ దగ్గరకి వెళ్తే ఆటలు ఆడు అని చెప్పాడు. ఐతే ఇతను నిర్లక్ష్యం చేసాడు. ఇంతలో పెళ్ళి అయ్యింది కుఱ్ఱాడికి.
ఒకానొక రోజున దేనికో డాక్టర్ వద్దకు వెళ్తే, రక్త పరీక్ష చేయించమని చెప్తాడు డాక్టర్. రక్త పరీక్ష ఫలితాలు - రుద్రకి ప్రి-డయబెటీస్ అని తేలింది.
తను ఎంతో గట్టి, తనకేమీ కాదూ అని గట్టిగా నమ్మిన రుద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తల గిఱ్ఱున తిరిగింది. అప్పుడు, జీవితంలో తొలిసారిగా రుద్ర, తనని తాను ఒక్కసారి ప్రశ్నించుకుని, ఒక్కసారి వెనక్కితిరిగి తను అప్పటిదాకా నడచిన బాటని చూస్కున్నాడు. అతను చేసిన తప్పులు అతనికి తెల్సినై.
అప్పటికీ మించిపోయింది లేదు అని అతని అంతరాత్మ, అతని జీవిత భాగస్వామీ మోటీవేట్ చెయ్యనారంభించారు.
డాక్టర్ సూచన - పొట్ట తగ్గించుకో, లెకపోతే నువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తుడివి అవ్వటానికి ఎంతో సమయమ్ పట్టదూ అతని కళ్ళముందు కలాడనారంభించింది. కళ్ళు తెరిచినా మూసినా ఆ సూచనే స్పురిస్తోంది అతనికి.

రుద్ర తన ప్రధమ కర్తవ్యాన్ని గుర్తించాడు. మూడు నెలలో కనీసం బఱువు తగ్గాలని గట్టినిర్ణయం తీస్కున్నాడు. తన ఆహారపు అలవాట్లన్ని కూలంకుషంగా పరిశీలించి విప్లవాత్మకంగా తన తిండిని మార్చుకునేందుకు ప్రణాలికని నిర్మించుకున్నాడు.

ఇప్పుడతనికి ఒక్కటే లక్ష్యం - ఆరోగ్యాన్ని కాపాడుకోవటం - సరైన తూకంతో భోజనం, సరైన వ్యాయామాలతో.


-----------
ఎక్కడో చదివినట్టు, లేక రుద్ర లాంటోడిని చూసినట్టు ఉందా?
రుద్ర లో నన్ను నేను చూస్కున్నాను. నేనూ వ్యాయామం మొదలుపెట్టాను. దమ్ము కొట్టూట మానేసాను. మందు మానేసాను. మరి మీరు?

ఓ సాఫ్ట్వేర్ మిత్రమా!! రుద్ర జీవితం నీ జీవితానికి అతి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోందా? నీకూ పొత్తికడుపు ముందుకు వస్తోందా? కొంతదూరం నడిస్తే ఆయాసం వస్తోందా? నిద్రపట్టకపోవటం లాంటి పరీస్థితులు ఉన్నాయా, వ్యాయామం అంటే ఏంటి అని అడుగుతున్నావా? పొద్దున్నే ఆరింటికి లేచి కొన్ని యుగాలైందా? ప్రతీ చిన్న దూరానికి బండి వాడుతున్నావా?
ఒక్కసారి డాక్టర్ వద్దకు వెళ్ళు. రక్త పరీక్ష చేయించుకో. మధుమేహ వ్యాధి ఉందేమో తేల్చుకో.
వ్యాయామం వైపుకి మొదటి అడుగు వెయ్యి.

13 comments:

  1. :))
    మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు..

    "ఎపుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు.."
    :-)

    ReplyDelete
  2. ఇంకొంచం ముందు కళ్ళు తెరిచిన జీవిని నేను. గత 10 యేళ్ళుగా సాగించిన వ్యాయామం, ఒక సంవత్సర కాలంగా ఇంకాస్త నిబద్దతతో చేస్తున్నాను. అందుకే 13.1 మైల్స్ మారథాన్ లక్ష్యంగా పెట్టుకుని క్రమశిక్షణలో పడ్డాను. అదే కాక ధ్యానంతో కూడా మానసిక ఆరోగ్యం కాచుకుంటున్నాను. ఆ పార్శ్వం కూడా ముఖ్యమే, మీరన్న వాటితో పాటుగా.

    ReplyDelete
  3. నా కేసు కొంచం డిఫరేంట్. నేను ఆరోగ్యం కొంచం జాగర్తగానే చూసుకునేదాన్ని. మా నాన్నగారి అఫక్ట్త్ తో గత 15 సంవత్సరాలుగా నేను వ్యాయామం, కాస్త తిండి చూసుకుని తిండం చేస్తున్నాను ఐనా గత సంవత్సరం నా హీమోగ్లోబిన్ లో చక్కర ముందు 6.5 తరువాత కొంత కాలానికి 7 కు వచ్చింది.చక్కెర శాతం 7% అంటే రోగం వచ్చేసినట్లే.(డయాబిటిస్ మా అమ్మకి నాన్న కు ఉంది.ఇంట్లో నేను ఫస్టు బార్న్).మరలా మందులూ, ఒక ఏడాది వ్యాయామం,తిందగినవి మాత్రమే తిండం, ఏరోబిక్స్ తో వదిలించుకున్నాను.డాక్టర్ కూడా ఇప్పుడు నార్మలేకాని ఈ జాగర్త జీవితకాలం అవసరం అని చెప్పింది. మరలా ఈమధ్య కొంచం బద్దకిస్తున్నాను ఏమౌతుందో చూడాలి.

    ReplyDelete
  4. చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు భాస్కర్‌గారు. ఇక్కడికొచ్చాక మరుముఖ్యంగా ఈ టన్నుల కొద్ది ఐస్‌క్రీములు, చాక్లెట్లు, పిజ్జాలూ, బర్గర్‌లూ తినేసి ఏ విధమైన వ్యాయామం లేకుండా ఉండేసరికి మా ఇద్దరికీ ఇప్పుడు లెక్కపెట్టలేనన్ని ఆరోగ్యసమస్యలు - మా హజ్బెండ్‌కి ఇలానే పాంక్రియాస్ గ్రంధితో సమస్య, నాకు థైరాయిడ్ గ్రంధితో సమస్య. ఏకంగా గ్రంధులతో పెట్టుకున్నాం. మాకు చుక్కలు చూపిస్తున్నాయవి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏదైనా పోతేగానీ అర్ధం కాదంటారు. కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదు.
    I earnestly appeal to each and everyone to act wise and take good care of their health.

    ReplyDelete
  5. It seems ladies are more health cautious.
    Wealth is lost nothihg is lost
    Health is lost Every thing is lost

    ReplyDelete
  6. భా.రా.రె, నిషిగంధ, అనంత్, పరిమళం, మురళి, అరుణాంక్ - ధన్యవాదాలు.
    ఉష గారు - మీ వ్యాఖ చలా స్పూర్తిదాయకంగా ఉంది.
    సునీత గారు -
    >>6.5 తరువాత కొంత కాలానికి 7 కు వచ్చింది.చక్కెర శాతం 7% అంటే రోగం వచ్చేసినట్లే.(డయాబిటిస్ మా అమ్మకి నాన్న కు ఉంది.ఇంట్లో నేను ఫస్టు బార్న్).మరలా మందులూ, ఒక ఏడాది వ్యాయామం,తిందగినవి మాత్రమే తిండం, ఏరోబిక్స్ తో వదిలించుకున్నాను.
    చాలా ఇన్స్పైరేషనల్ గా ఉంది మీ వ్యాఖ్య.
    భవాని గారు - కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదు
    బాగా చెప్పారు. అవును. ఇది పచ్చి నిజం, ఆరోగ్యాన్ని పోగొట్టుకోటం అంత మూర్ఖత్వం మరోటి లేదు

    ReplyDelete
  7. చెడు అలవాట్లు ఏమి లేవు కానీ....భోజన ప్రియున్ని....!
    గతం లో వ్యాయామం చేసేవాడిని. ఈ మద్య సమయం దొరకటం లేదు.....
    అందుకీ....బైక్ కొనలేదు....రోజు ఆఫీసుకి వెళ్ళే క్రమంలో కొంత నడక సాగుతుంది....
    ప్రతి వారం అదివారం...ఎర్రగడ్డ సంతలో రెండి చుట్లు.....కూరగాయల సంత కు వెళ్లి సరుకులు మోసుకొని ఇంటికి రావడం....! కానీ బస్ పాస్ వుండటం వలన...ట్రాఫిక్ వలన.....కొంత నడకకు అంతరాయం....!

    ReplyDelete
  8. please see these videos :

    http://www.youtube.com/watch?v=p7YqgKcWQYs&feature=related

    see also part 2 and part 3, it will really help ! Mantena explains everything logically and scientifically, no need to believe blindly, listen to his videos and then decide if you will follow.

    ReplyDelete