నిన్న మా అమ్మ మాటల మధ్యలో రేట్లు మండుతున్నాయిరా అంది. ఏమ్మా అన్నా. లెక్కచెప్పుకొచ్చింది.
కందిపప్పు కిలో - 67/-
మినప్పప్పు కిలో - 60/-
పెసరపప్పు కిలో -60/-
పెసలు కిలో - 60/-
బియ్యం కిలో - 34/- బాపట్ల మసూరి, ఒంటిపట్టు
ఇదయం నువ్వుల నూనె కిలో - 185/-
పచ్చడి మావిడికాయ ఒకటికి - 12/-
బంగినపల్లి మావిడి పండ్లు ఒకడజను - 250/-
పైనుండి సూరీడు మంటాడిస్తుంటే, కింద జనాలు పై రేట్లకి గగ్గోలు పెడుతుంటే ఏ ప్రభువులు జనాలని ఆదుకోగలరూ? ఏ ప్రభుత్వాలు ఈ మంటల నుండి రక్షించగలరూ?
అంతా విష్ణుమాయ.
పనిలో పని, మాటాలో మాట, నేను ఓ కొత్త బ్లాగు పెట్టా. దానిపేరు పల్నాటి వీరులు http://palnativeerulu.blogspot.com/
పల్నాటి చరిత్ర, పల్నాడు గురించి, జనాల సరళి గురించి ఇలాంటివన్నీ పెడదాం అని నా ఆలోచన.
May 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
చాలా గొప్ప ప్రయత్నం. మాకు తెలియని పలనాటివీరుల పేర్లను తెలుసుకోగలిగాము. మీరు కోరితే ప్రస్తుతము పలనాటి వీరాచార పీఠాధిపతి తో మాట్లాడిస్తానుస్తాను. వాడు మాపక్కవూరు తిమ్మాపురం అమ్మాయి సరస్వతి కొడుకు. వానితేజస్సు బాలచంద్రుని పోలివుంటుంది.పదకొండేళ్ళకే పీఠాధిపతి అయ్యాడు.
ReplyDelete'దేవుడా రక్షించు నా దేశాన్ని..' అనడం తప్ప ఇంకేం చేయాలో అర్ధం కావడం లేదు..
ReplyDeleteఅన్నట్టు..'కోనసీమ' గురించి ఓ బ్లాగు మొదలు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన రేకెత్తించారు..
మాష్టారూ - తప్పకుండా.
ReplyDeleteమురళీ భాయ్ - కోనసీమ - కేక. మరిక మొదలెట్టూ.
out of context comment...
ReplyDeleteభాస్కర్ గారు, మీరు 'అరుణం' బ్లాగులో ప్రస్తావించిన "శ్రీ సూర్యనారాయణా, వేదపారాయణా, లోకరక్షామణీ.." దండకం నా దగ్గర ఉందండీ.. మీ మెయిల్ ఐడి ఇస్తే పంపిస్తాను..
నిషిగంధ గారు
ReplyDeleteనమస్తే
ఓహ్!! మీవద్ద ఉందా సూర్యనారాయణ దండకం
నా మెయిల్
admin.websphere@gmail.com
ధన్యవాదాలు
Sent it :-)
ReplyDeleteనిషిగంధ గారు
ReplyDeleteధన్యవాదాలు
ఇంట్లో వంటావార్పుచేసుడూ, పిల్లల పెంపకం నడుపుడూ, ఓ పక్కన ఉజ్జోగం, ఇంకో పక్క కసరత్తులూ,ఎలక్షన్ కవరేజిలూ... కాక మళ్ళీ ఇప్పుడు ఏడొదో, ఎనిమిదోదో బ్లాగా! మీది మహా ఖుషీ జాబ్ లా ఉంది :) Congrats!
ReplyDeleteపప్పు కూర చద్ది వాసనొస్తోంది, తర్వాతి దప్పళమో, వేపుడో రానీండి.
మీరు ఇవ్వాళ చెబుతున్నారు. నేను అల్రెడీ ఒకసారి ఈ మంటల్లో వళ్ళంతా కాల్చుకుని బైట పడ్డాను.అలాగే తెరిసా గారి మాటే నాదీను.
ReplyDelete