May 29, 2009

నగదుబదిలి..

బాబు మహానాడులో మళ్ళీ "నగదు బదిలి" పధకం ఆ విధంగ ముందుకి తీస్కెళ్ళాలి అని తెలియజేస్కున్నాడు.

మొన్న వోట్ల కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, టివీ9లో జరిగిన డిస్కషన్స్లో పాల్గున్న ఒకడు ఇలా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు పక్కనున్న తెదెపా ప్రతినిధిని -
నగదు బదిలి ఎలా సాధ్యం, 20000 కోట్లు కనీసం కావాలి ఆ పధకానికి అని.
ఒక్కసారి చూద్దాం. మన రాష్ట్ర జనాభా ఈ రోజున పది కోట్లు.
నాయుడు గారి ప్రకారం,
ప్రతీ నిరుపేద బడుగు కుటుంబానికి నెలకి పదిహేను వందలు.
ప్రతీ మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి నెలకి.
సగటున, మన జనాభాలో పదిశాతం మంది అట్టడుగు నిరుపేదలు ఉన్నారు అనుకుందాం. అనగా, కోటి మంది. అనగా
10000000 * 1500 = 1500 కోట్లు, నెలకి. అనగా, సంవత్సరానికి, 18000 కోట్లు.
మిగిలిన తొమ్మిది కోట్లల్లో ఐదు శాతం మధ్యతరగతి కుటుంబాలు అనుకుందాం.
అనగా 45 లక్షల మంది. అనగా 4500000 * 1000 = 450 కోట్లు. అనగా సంవత్సరానికి 5400 కోట్లు.
మొత్తానికి 23400 కోట్లు కావాల్సొస్తుంది కేవలం నగదు బదిలీకి, సంవత్సరానికి. ఇంత కేటాయించాలంటే వార్షిక బడ్జెట్ ఎలా ఉండాలో?
ఇప్పటికే, గత నాలుగు బడ్జెట్లని తీస్కుంటె దాదాపు ప్రతీ ఏడాది లక్ష కోట్లు దాదాపు (ప్లాన్డ్ మరియూ నాన్ ప్లాన్డ్ కలిపి). మరి పైన 23400 కోట్లు దేంట్లోంచి కోస్తారు, ఎక్కడ సర్దుతారు? ఎలా సర్దుతారు?
నా ప్రశ్న బాబుని ఉద్దేశించి కాదు. నా ప్రశ్న బాబు కింద ఉన్న ఎం.ఎల్.యే లకి, ఆయన వెనకున్న బిజినెస్ వర్గానికి, ఆ ఎం.ఎల్.యే లని నమ్ముకుని ఎంతోకంత ఎనకేద్దాం అనుకునే జాతికి.
కారణం -
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా కళ్ళ ముందు జరిగిన కధ ఇది.
ఒకానొక సంవత్సరం, తుపాను వచ్చింది. కొన్ని గుడిసెలు కూలినై. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు నీళ్ళల్లో మునిగినై. వెంటనే ప్రభుత్వం సహాయ ప్యాకేజీ ప్రకటించింది. గోడకూలితే ఇంత, ఇల్లే కూలితే ఇంత, నీళ్ళు మోకాళ్ళలోతు వస్తే ఇంత యాట యాట యాట.
ఒకడు ఒక నోటుబుక్కు తీస్కుని వచ్చాడు, ఓ కుర్చీ ఏస్కుని ఓ ఇంటో కూర్చున్నాడు. రూలింగ్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఆళ్ళకి తెల్సినోళ్ళ పేర్లు చెప్పుకున్నారు. ఏ కేటగిరీకి ఎక్కువ మొత్తం వస్తుందో దాంట్లో వాళ్ళోళ్ళ పేర్లు రాయించుకున్నారు. బయట నిజంగా ఆస్తి నష్టం ఐనోళ్ళకి ఎంగిలి చెయ్యిని విదిల్చారు. కొందరు నిజంగా ఆస్తినష్టపోయినోళ్ళకి ఇలా ప్యాకేజీ ఇస్తున్నారు అని తెలియనుకూడా తెలియదు.
ఐతే, ఈ తంతు కొత్తేమీ కాదు, ఓ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు ఈ వ్యవహారంలో. ఏ పార్టీ రూలింగులో ఉన్నా ఈ తంతు జరిగేదే. ఇప్పుడు ఈ నగదు బదిలీ పధకం గురించి దేనికయ్యా అంటే ఇది డైరెక్ట్ క్యాష్ ఫ్లో. అభ్యర్దిల్ని ఎవరు ఎంపిక చేస్తారూ? వాళ్ళ ఆదాయాన్ని ఎవరు కొలుస్తారూ? ఏ ప్రాతిపదికన? ఒక సర్టిఫికేట్ పెడితే సరిపోతుందా, అయ్యా నా ఆదాయం నెలకి ఇంత, కావున నేను పేద బడుగుని అని. ఆ సర్టిఫికేట్ సంపాదించటం ఎంతసేపు?
మనకి కావాల్సింది పేదోడికి నెలకి పదిహేనువందలు సంపాదించుకునే ఉద్యోగం చూపించగల ప్రభుత్వం, నాయకత్వం, దార్శనీకత. అంతే కానీ వందకే నెలకి సరిపడా సరుకులు, కిలో బియ్యం రెండు రూపాయలకే, ప్రతీ పేదోడికి టీవీ, ప్రతీ మధ్యతరగతి మహిళకు నెలకి వెయ్య కాదు.

ముగింపు -
రాబోయే తరాల్లో అయినా, రాజకీయనాయకులు, అధినాయకులు, కారకులు, నిర్మాతలు - ఎవ్వరైనా -
కిలో రెండుకే ఇస్తాం కాకుండా - మన ఆర్ధిక వనరుల్ని నియంత్రించుకుంటూ, రెండురూపాయల యొక్క విలువని అంత ఎత్తుకి తీస్కెళ్ళగలిగే విప్లవాత్మక నిర్ణయాలు తీస్కోవాలని కోరుకుంటా.
వందరూపాయలకే సరుకులొచ్చే విధంగా మన ఆర్ధిక వ్యవస్థ రూపొందించాలని కోరుకుంటా.

18 comments:

 1. అబ్బయ్యా నువ్విట్టాటోడివని తెలియదే. నీ సొమ్మేంబోద్దయ్యా ?

  ReplyDelete
 2. బాగా చెప్పారు . ఈ ఎన్నికల్లో నగదు బదిలీ పదకమే తెదేపాకి , మహాకూటమికి ఊపిరి పోసింది. ఆమాత్రం ఓట్లైనా సాదించి పెట్టింది.

  ReplyDelete
 3. >>"ప్రతీ నిరుపేద బడుగు కుటుంబానికి నెలకి పదిహేను వందలు.
  ప్రతీ మధ్యతరగతి కుటుంబానికి వెయ్యి నెలకి.
  సగటున, మన జనాభాలో పదిశాతం మంది అట్టడుగు నిరుపేదలు ఉన్నారు అనుకుందాం. అనగా, కోటి మంది. అనగా
  10000000 * 1500 = 1500 కోట్లు, నెలకి. అనగా, సంవత్సరానికి, 18000 కోట్లు.
  మిగిలిన తొమ్మిది కోట్లల్లో ఐదు శాతం మధ్యతరగతి కుటుంబాలు అనుకుందాం.
  అనగా 45 లక్షల మంది. అనగా 4500000 * 1000 = 450 కోట్లు. అనగా సంవత్సరానికి 5400 కోట్లు.
  మొత్తానికి 23400 కోట్లు కావాల్సొస్తుంది కేవలం నగదు బదిలీకి, సంవత్సరానికి. ఇంత కేటాయించాలంటే వార్షిక బడ్జెట్ ఎలా ఉండాలో?"


  భాస్కర్ రామరాజు గారు, మీ అంచనా ప్రకారం జనాభాలో పది శాతం మంది అట్టడుగు నిరుపేదలు అయితే, నగదు బదిలి కుటుంబానికి ఇస్తారు కాబట్టి, ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు లేదా ఇంకెంతమందైనా ఉండొచ్చు.

  ఉదాహరణకు కుటుంబానికి నలుగురు అనుకుందాం. ఒకవేళ కోటి కుటుంబాలు అట్టడుగు నిరుపేద కుటుంబాలైతే కోటిx4=4కోట్ల మంది నిరుపేదలు ఉండాలి మనరాష్ట్రంలో. లేదా కోటి మంది నిరుపేదలు అనుకుంటే కోటి/4 = 25 లక్షల కుటుంబాలు.

  కాబట్టి నా అంచనా ప్రకారం 25 లక్షలు x 1500= 375 కోట్లు.

  అలాగే మధ్యతరగతి 50 లక్షలు అనుకుంటే 50 లక్షలుx1000/4 = 125 కోట్లు.

  375 + 125 = 500 కోట్లు/నెలకు.
  500x12= 6000 కోట్లు/సంవత్సరానికి.

  సంవత్సరానికి ఆరువేల కోట్లు బడ్జెట్ నుంచి కేటాయించాలి. ఇది సాధ్యపడుతుందని నా అభిప్రాయం.

  http://hasyadurbar.blogspot.com/2009/04/26.html

  ఒకసారి పైటపా చదవండి. నగదు బదిలీ ఎటువంటి వాళ్లకి ఉపయోగపడుతుందో సత్యప్రసాద్ గారు వివరించారు.

  ReplyDelete
 4. చూస్తుంటే...మీరు సత్తెకాలపు సత్తెయ్యలా ఉన్నారు...
  >మన రాష్ట్ర జనాభా ఈ రోజున పది కోట్లు.
  మీకు బాబు సంగతి గురించి తెలియదు.అందులో 1% మందికి ఇచ్చినా గ్రేట్.

  ReplyDelete
 5. ఒక విషయం గమనించలేదు..ఈ నగదు పధకాన్ని రూపు దిద్దింది ఇప్పుడున్న నాయకులు కాదు, భవిష్యత్ నాయకుడే.. పథకం ఘనత లోకేష్ బాబుదే అని 'ఈనాడు' కోడై కూసింది, చాలాసార్లు.. ఇంకా ఫలితాలు రాకముందే, పథకం అమలుని అధ్యయనం చేయడానికి లోకేష్ బాబు నాయకత్వంలోని బృందం లాటిన్ అమెరికా దేశాలకి బయలుదేరింది కూడా.. (ఇదీ 'ఈనాడు' వార్తే)

  ReplyDelete
 6. ఎంత బాగా చెప్పరండి. మీకు నా జొహర్లు

  అలి

  ReplyDelete
 7. నాగ ప్రసాద్!!
  సరే. అవును, నిజమే. కుటుంబానికి అన్నారు కానీ, కుటుంబంలోన్ ప్రతీ మనిషికి అనలేదు.
  ఇది ఒక్కసారి ఆలోచించి చెప్పు-
  ఒక మధ్యతరగతి కుటుంబం, పదిహేను వందలకు ఆశపడి దిగువతరగతిలో తమని ప్రొజ్రెక్ట్ చేస్కోటాని ఎంత సమయం పడుతుంది?
  అలా కిందకి అందరూ దిగితే ఆ లెక్క కోటి కావటం ఎంతసేపు?

  ReplyDelete
 8. నాకు తెలిసిన సామెత ఒకటుంది (చాలా సినిమాల్లో కూడా వాడారు)....ఒక పేదకి ఒక పూట అన్నం పెట్టడంకంటే అతనికి అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తే అతనితో పాటు అతని కుటుంబం కూడా బాగుపడుతుంది.....!
  నగదు బదిలీ పథకం ఈ సామెతకు పూర్తి విరుద్ధం......! కొలమానం లేకుండా పేదలను ఎలా గుర్తిస్తారు.......!

  అలాగే నగదు బదిలీ పథకం పేరుతో మరో కుంభకోణానికి రాజకీయం చేస్తున్నారు......

  ReplyDelete
 9. పొత్తులు పట్టుకున్న పార్టీల అబ్యర్దులకు వోట్ల బదిలీ చేయని తే.దే.పా నగదు బదిలీ సరిగ్గా చేస్తుందంటారా.....! లేకుంటే ఏరు దాటేదాక ఓడ మల్లన్న ....దాటినాక బోడి మల్లన్న అన్నట్లు చేస్తారా......!

  ReplyDelete
 10. మన రాష్ట్రజనాభా పదికోట్లు లేదు. మొన్న 2001 జనాభా లెక్కల ప్రకారమే ఏడుకోట్ల డెబ్భై లక్షల చిల్లఱ. అది ఎనిమిదేళ్ళలోనే పదికోట్లయిపోతుందా ? అసంభవం. మన జనాభా పెఱుగుదల చొప్పు (రేట్) కేవలం 13 శాతం చిల్లఱ (ప్రతిపదేళ్ళకి).

  అదీ గాక పేదల్ని, మధ్యతరగతివారినీ నిర్ధారించడం మీరు చెబుతున్నంత కష్టం కాదు.

  ఇహపోతే నాయుడుగారి నిజాయితీని శంకించడానికి ఇప్పటిదాకా సరైన ఆధారాల్లేవు. ఎవరికీ ఏ అపకారమూ చెయ్యకపోయినా ఆయన మీద జఱిగిన దుష్ ప్రచారం గొప్పది. నాకు సంశయం ఉన్నది ఈ మాంద్యంలో ప్రభుత్వ ఆర్థికపరిస్థితి మీదనే. మిగతా సంగతులెలా ఉన్నా పేదలకి నేరుగా నగదుబదిలీ జఱిగితే మతమార్పిళ్ళు తగ్గుతాయి. అయితే ఈ పథకప్రయోజనాల కోసం బయటి రాష్ట్రాల పేదలు పొలోమని తంబలు తంబలుగా ఇక్కడికొచ్చి తిష్ఠ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  --తాడేపల్లి

  ReplyDelete
 11. మన సమాజంలో ఇప్పుడున్న ఆర్థిక వైరుధ్యాల వల్ల నగదు బదిలీ వంటి పథకం అవసరం ఉంది. అయితే ఈ పథకాన్ని అర్థ సత్యం లాగ చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉంటాడనేది నా ఉద్దేశం.

  ఒక వేళ గెలిచినట్టయితే ఇలా చేసి ఉండే వాడనిపిస్తుంది...

  అత్యంత బీదవారు రెండు వేలకన్నా తక్కువ ఆదాయం కల వారయితే ప్రభుత్వం పనికి ఆహారం, గ్రామీణ ఉపాధి మొదలయిన పథకాల ద్వారా ఉద్యోగం కల్పిస్తుంది. ఒక వేళ అలా కల్పించలేని పరిస్థితిలో మాత్రమే నగదు ఇస్తుంది. ఇది ఒక రకంగా ప్రతి పౌరుడికి ఉద్యోగ భీమా వంటిదని నా అభిప్రాయం. పౌర ఉపాధికి ప్రభుత్వం ఇచ్చే హామీ. అయితే ఇది ముందే చెపితే పడే ఓట్లు కూడా పడవని ముందే తెలుసు కాబట్టి చంద్ర బాబు అలా చెప్పి ఉంటాడు. నిజంగా అమలు చెయ్యాలనుకుంటే, ఒక్క పైసా యివ్వకుండా పై పద్ధతిలో అమలు చేయ వచ్చు.

  చరిత్ర చూస్తే ఏ పథకం కూడా వాగ్దానం చేసినట్టు యధా తథంగా జరగ లేదు. 25 కిలోల బియ్యం ఇస్తానన్న NTR తర్వాత మనిషికి ఐదు కిలోలు గా మార్చాడు. రాజశేఖర్ రెడ్డి 9 గంటలు ఉచిత కరెంటు కాస్తా ఏడు గంటలు గా మారింది. (మిగతా రెండు గంటల కరెంటు అమ్ముకుంటే చాలు, ఈ ఏడు గంటలు ఉచితంగా ఇవ్వటానికి).

  ReplyDelete
 12. తాడేపల్లి గారూ -
  అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది
  >>అదీ గాక పేదల్ని, మధ్యతరగతివారినీ నిర్ధారించడం మీరు చెబుతున్నంత కష్టం కాదు.
  ఎంత తెలికో వివరించి ఉండాల్సింది.
  >>ఇహపోతే నాయుడుగారి నిజాయితీని శంకించడానికి ఇప్పటిదాకా సరైన ఆధారాల్లేవు.
  ఇది మరీ హాస్యాస్పదం. ఇంతవరకూ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీదనైనా, నిజాయితీని శంకించే ఆధారాలు ఎక్కడన్నా బయటపడ్డాయా? ఒక్కటి చూపండి మచ్చుకి. బాబూ, ఈనాడు, జ్యోతి, గోతి అందరూ రెడ్డి మీద ఎగబడ్డారు గంటకి పదికోట్లు సంపాదిస్తున్నాడు అని వెలుగెత్తి అరిచారు. చివరికి ఏమైంది? ఓడిపొయ్యారు.
  నిజంగానే అంత సంపాదించి ఉంటె, కనీసం 240 సీట్లు గెల్చుకుని ఉండేవారు. అంస సమ్పాదించినోళ్ళకి ఒక వెయ్యి రెండువేల కోట్లు ఖర్చుపెట్టడం ఓ లెక్క కాదు. కానీ అలా జరగలేదే. చలా సీట్లు నష్టపొయ్యారే? ఎందుకలా జరిగింది?
  కాంగ్రేస్ గెలుపోటములకి తానొక్కడిదే బాధ్యత అన్నాడు రెడ్డి. బాబు ఏమన్నాడు? గెలిస్తే తానే అన్నాడు. ఓడితే అందరూ అన్నాడు.
  >>ఎవరికీ ఏ అపకారమూ చెయ్యకపోయినా ఆయన మీద జఱిగిన దుష్ ప్రచారం గొప్పది.
  ఇది అత్యంత అత్బుతమైన స్టేట్మెంట్. మీడియా మొత్తం గడాచిన పదమూడు సంవత్సరాల నుండి బాబు జపం చేస్తున్నాయ్. గత నాలుగేళ్ళగా ఆ వ్యధని, ఆ సోత్కర్షని, తట్టుకోలెక సాక్షి వెలిసింది. దొంగడాబ్బు అన్నారు. అదన్నారు ఇదన్నారు. రామోజీ చేసిందీ అదే. జ్యోతి వేమూరి రాధాకృష్ణ చేసిందీ అదే. డాష్ కింద నలుపెట్టుకుని ఓ అని రంగుపులిమారు. ఒకానొక రోజున, ఈనాడు రోత భరించలెక నేనూ ఓ పేపర్ పెడదాం అనుకున్నా. ఓ సామాన్య మానవుణ్ణైనా నాకే అంతలా కాల్తే, కేవలం కులం పేరుతో ఇలా రచ్చచేస్తే ఎవ్వడికి మండదు?
  >>మిగతా సంగతులెలా ఉన్నా పేదలకి నేరుగా నగదుబదిలీ జఱిగితే మతమార్పిళ్ళు తగ్గుతాయి.
  మీలాంటి చదువుకున్నోళ్ళ స్థాయి వ్యాఖ్య కాదిది. ఇది బట్టనెత్తికి, మోకాలుకి ముడేసినట్టు ఉంది.
  మతం మారుతున్నారూ అంటే, హిందూ మతంలోని లోపాలపై ఆ మూలాలపై ఎక్కడా రాయని జనాలు, మీరూ, ఇలా ప్రతీదానికి మతం రంగు పులమడం దురదృష్టం.

  అయ్యా హరి దోర్నాల గారు -
  >>మన సమాజంలో ఇప్పుడున్న ఆర్థిక వైరుధ్యాల వల్ల నగదు బదిలీ వంటి పథకం అవసరం ఉంది.
  ఇంతక ముందు ఇలాంటివి దేనికి రాలేదంటారూ? ఆర్ధిక వైరుధ్యాలకి బదిలీకి సంబంధం ఏంటి? మనకి కావల్సింది స్వావలంబనా లేక కన్నీళ్ళతుడుపా?

  ReplyDelete
 13. నీకేమన్నా కొద్దిగా ఉప్పూ,కారం కావాలంటే ఫ్రీగా (నగదుబదిలీ లాగాకాదు, నిజంగానే ) బదులిస్తా భాస్కర్ తీసుకో :)

  ReplyDelete
 14. కామెంటు పెట్టిన అందరికీ ధన్యవాదాలు.
  నాకైతే బాబు పెదానమంత్రి ఐతే బాగుండు అని ఉంది. పెదాన మంత్రి అయ్యి, నదగుబదిలి దేశం మొత్తానికి వ్యాప్తిజేస్తే అత్భుతం. అనతికాలంలోనే భారత దేశం ఆరో అభివృద్ధి చెందిన దేశంలా ఆవిర్భవిస్తుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

  ReplyDelete