May 28, 2009

అప్పుడప్పుడు ఇలాంటివి...

తెల్సుకుంటుండాలి..అప్పుడే మజా.
నిన్నటి నా పోస్టులో సెన్తాళుం పూవిల్ గురించి రాసా. ఆ సిరీస్ లో నా ఎలుకకి ఈ లింకు తగిలి బోర్లా పడింది.
ఇళయనిల పొళీగిరధె ఇధయం వరై ననైగిరధె
ఉలా పొగుం మేగం కణా కాణుమె విళా కాణుమె వాళమే

నా ప్లేలిస్టులో ఇదీ ఉంది. దాంట్లో ఓ పెద్ద గొప్పేముంది!! తమిళపాటలు కూడా వింటావా? ఏం పనీ పాట లేదా? అనుకోవచ్చు. సంగీతానికీ, దట్ టూ ఇళయరాజా సంగీతం వింటానికి, భాషతో పనిలేదు.
సరే ఈపాట గురించి చాలా ఇంటరెస్టింగ్ విషయాలు -
ఈ పాట వింటె టక్కున గుర్తుకొచ్చే, ఛాఛా మర్చిపోతే కదా గుర్తుకొచ్చేది, స్లీప్ మోడ్ లోంచి బయటకొచ్చే పాట
నీలె నీలె అంబర్ పర్.
ముందుగా ఇళయనిల -
చిత్రం - పయనంగళ్ ముదివతిలై
పాడినవారు - బాలసుబ్రహ్మణ్యం
సంగీతం - ఇళయరాజా
సంవత్సరం - 1982
నీలె నీలె అంబర్ పర్ -
చిత్రం - కళాకార్
సంగీతం - కళ్యాణ్ జి ఆనంది జి
పాడినవారు - కీ।శే॥ కిషోర్ కుమార్
సంవత్సరం - 1983

ఈ రెండు పాటలు ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉన్నాయ్ కదా, ఎవరు ఎవరికి కాపీ అని పెద్ద పెద్ద పోట్లాటలు, వాక్యుద్ధాలు, కత్తి పోరాటాలు క్రూసేడులు జరిగైనై.

ఐతే కొందరు ఇలా తేల్చారు -
ఈ పాటకి మాత్రుక తమిళం. కల్యాణ్ జి/ ఆనంద్ జి ఈ పాటని ఇష్టపడి హిందీలోకి తీస్కుని, ప్రతిఫలంగా కస్ మే వాదే ప్యార్ వఫా సబ్ (చిత్రం - ఉపకార్) అనే పాటని ఆయనకి బహుమతిగా ఇచ్చారట. ఆపాట తమిళంలో కణవు కాణుం వళ్కై ఆగుం ( చిత్రం - నీన్గల్ కేట్టవై). మన శంకరాభరణం సోమయాజి కీ।శే॥ జె.వి సోమయాజులు ఈ పాట పాడతారు తెరపై. హిందీలో ప్రాణ్.
ఇళయనిల -

నీలె నీలె అంబర్ పర్

కణవు కాణం

కస్/మే వాదే ప్యార్ వఫా సబ్

10 comments:

  1. ఎందుకో తెలీదు కాని నేను ఏ బ్లాగులో నైనా వీడియోలు చూడలేకపోతున్నాను. వాటిస్తానంలో ఒక పెద్ద చతురస్రం ఒక మూల చిన్న ఐకాన్ వస్తుంది. ఎందుకో తెలీదు. అలానే ఈ వీడియోలు మిస్స్ ఐయ్యాను.

    ReplyDelete
  2. సునీత గారు,
    మీకు ఫ్లాష్ ప్లగిన్ లేదు.

    ReplyDelete
  3. భాస్కర్ రామరాజు, what is flash plugin :(-:-) ?

    ReplyDelete
  4. Flash Plugin is nothing but, Adobe Flash Player plugin for WebClients like IE, FireFox and so on.
    http://www.adobe.com/software/flash/about/
    Follow the above URL to install it for your browser

    ReplyDelete
  5. భలే భలే చెప్పారు భాస్కర్ గారు.

    ReplyDelete
  6. Your father is very logical in naming of you,why bcz a setting sun always raises.It means,you will bounce back with what you dreamt off.

    ReplyDelete