May 8, 2009

తుంటరి సూరీడు - ఇంకొంత..

మనోడి దగ్గర్ కొన్ని చిన్న చిన్న పురుగులు, కొన్ని పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయ్. అదేంది పురుగులు అనుకుంటున్నారా?
చెప్తా.
మీలో ఎంతమందికి గుర్తు ఇదీ?
నా చిన్నప్పుడు, అదేదో పురుగు పట్టి, అగ్గిపెట్టెలో పెట్టి దానికి మేత వేసేవాళ్ళం. మేత, అనగా ఆకులు, ఏమి ఆకులు? అంటే!!! పెద్ద తుమ్మ చెట్టు. పెద్ద పెద్ద ముళ్ళుంటాయ్ ఆ చెట్టుకి. మేకలు ఆకుల్ని మహా ఇష్టంగా తింటాయ్. ఏదో పిచ్చి అది. అలా ఆకులు పెడితే ఆ పురుక్కి గుడ్లు పెడుతుంది అనీ. అవి సీతాకోకచిలుకలు అవుతాయ్ అని.

సరే వీడి పురుగులు ఏంటంటే.
ఒక్కో రోజు పొద్దున్నే కుడుతుంది చిన్నపురుగు. అంతే కొంచెం పిచ్చి ఎక్కుతుంది. బ్రష్ చేస్కోను అంటాడు. టిఇ వద్దూ, మిక్కిమౌస్ వద్దు, ఓసో వద్దు అని అలిగి మంచం ఎక్కుతాడు.
ఒక్కో రోజు పెద్ద పుర్గు కుడుతుంది, పొద్దున్నే, మహా పిచ్చి ఎక్కుతుంది. అలాంటప్పుడు, అరుపులు కేకలు, డోర్ ధడా మని వెయ్యటాలు ఇలా.
సాయంత్రాలు కూడా ఇలా పురుగులు కుడుతుంటాయ్ అప్పుడాప్పుడు.
ఒక్కో రోజు మంచిపురుగులు కుడాతాయ్. అప్పుడు ఇలా బెరుకుతుంటాడు.
వాడి ఉద్దేశంలో ఇది గుఱ్ఱం.
From fun

మరి ఐదు కాళ్ళు ఉన్నాయ్ ఏంటీ అని అడక్కు.

ఇది యాలిగేటర్
From fun


ఇది డిస్నీ కార్. దీనిపేరు లైటెనింగ్ మెక్ క్వీన్. దీని నంబర్ 95, కార్ బొమ్మపైన ఉన్నది లైటెనింగ్ అన్నమాట. మెరుపు. దాంట్లో 95 వేసాడు. ఆ పైన కార్స్ సినిమా లోగో. ఆ వి ఆకారంలో మధ్యలో ఉర్దూలా అనిపించేది, వాడి దృష్టిలో "Disney cars" అని.
From fun


ఇదొక అత్భుత కళాఖండం:
From fun

పై బొమ్మ గురించి మీ మట్టి బుఱ్ఱకి అర్ధం కాలేదు కదా. హి హి హి, ఎక్స్పెక్ట్ చేసా (రాజేంద్రప్రసాద్ స్టైల్లో)
చెట్టూ, దాని కింద పులి, పైన సూర్యుడు, బ్లూ వి మబ్బులు.
సరే ఈ కిందదేంటో చెప్పగలరా...
From fun

సరే, అంత దృశ్యం లేదులే, నేనే చెప్తా. కిందవి రెండు పూలు అది మా పిల్లకూడా చెప్తుంది. పైది, పూల్ టేబుల్, పక్కన కఱ్ఱ, ఆ మధ్యలో పిచ్చిగీతలు బాల్స్.
బుఱ్ఱ గిఱ్ఱున తిరిగిందా...
ఇంకొన్నితర్వాత...

10 comments:

  1. కానీ చాలా బాగా వేసాడు బొమ్మలు.
    మంచి చిత్రకారుడవుతాడు.

    ReplyDelete
  2. ఇలాగే అంటూ ఉండండి .. ఏదో రోజు మీరు మీ అబ్బాయికి తండ్రీగా అందరికి తెలుస్తారు ..మీ పేరు కూడా మర్చిపోతారు మీరు... కాని బాబు ఇంత చిన్న వయసులో అంత బాగా బొమ్మలు వేయడం రావడం గ్రేట్

    ReplyDelete
  3. ఆఖరు బొమ్మ మినహాయించి మిగిలిన వన్నీ చాలా బాగ ప్రస్పుటంగా ఉన్నాయి. వయసు ఇంకా కిండర్ గార్డెన్ కూడా కాదు కదా? ట్రైనింగ్ ఇప్పించండి. మంచి అర్టిస్ట్ అవుతాడు.

    ReplyDelete
  4. సూరిబాబువి మంచి ఆర్టిస్టిక్ ఫింగర్స్.. తన గురించి రెగ్యులర్ గా రాయండి..

    ReplyDelete
  5. "ఇదొక అత్భుత కళాఖండం:"

    హహ్హహ్హ! నా దృష్టిలో కూడా. మోడర్న్ ఆర్ట్ అంటే, అదే :P

    ReplyDelete
  6. సొదరా
    అగ్గి పెట్టెలో పెంచే కీటకం పేరు జీరంగి అనుకుంటా !

    ReplyDelete
  7. చిన్న వయసులో అంత బాగా బొమ్మలు వేయడం గ్రేట్!మంచి అర్టిస్ట్ అవుతాడు

    ReplyDelete
  8. సూరిగాడిని ఆశీర్వదించిన మీ అందరికీ (వాడి) హృదయపూర్వక నమస్కారాలు.

    ReplyDelete