May 27, 2009

ట్రెండ్ మార్చిన సూరిగాడు

ఈ మధ్య, కార్లో మోగే పాత యం.పి.మూడు సీడీలని మార్చా. కొత్తగా దహేలి ఆరు, రాక్ ఆన్, సిన్గ్ ఈజ్ కిన్గ్, లాంటివి మోగిస్తున్నా పిల్లల్తో బయటకెళ్ళేప్పుడు. ఇంతకముందు సూరిగాడు జల్సా పాటల్ని, షారుక్ పాట "గుంషుదా" పాటని ఎక్కువగా ఇష్టపడేవాడు. జల్సా పాటని ఇలా నెత్తిమీదరాయి పెట్టి కొట్టినట్టుందే అని హం కూడ చేసేవాడు.
ఇప్పుడు పాటలు మార్చంగనే వాడు ఇట్టే పట్టేసిన పాట "సిన్ద్బాద్ ది సైలఱ్" "సోచాహై సోచానహి తో సోచో అభి" "రాక్ ఆన్ జిందగి మిలెగి న దొబర"
సోచాహై, ఖిడికి ఖోలే జోషీలే లాంటి కొన్ని కీ మాటల్ని పట్టేసాడుకూడా!!!
బోనస్ షాక్ - నన్నా, నాకు ఎలక్ట్రిక్ గిటార్ కొనిపెట్టు. సరెలేరా అంటే నీకొస్తుందా ఎలక్ట్రిక్ గిటార్ వాయించడం? రాదమ్మ అంటే, నాకొచ్చుగా అని, నేను రాక్ స్టార్ అంటాడు. అదీ కధ.
ఏమాటకామాట - రాక్ ఆన్ పాటలు అత్భుతంగా ఉన్నాయ్. సింద్బాద్ ది సైలర్ అనే పాట అనుకుంటా ప్రపంచ టాప్ 10 లోకి వెళ్ళింది అని విన్నట్టు గుర్తు.
రాక్ ఆన్ సినిమాకి సంగీతం శంకర్ ఎహ్షాన్ లాయ్. రియల్ రాక్ సంగీతం. మనవైన ఈ పాటల్ని వినేప్పుడు నా వాల్యూంని పెంచుతా. తెల్ల నాయాళ్ళారా, మాకూ ఉన్నాయ్ రాక్ పాటలు అని.


ఈ పాటలన్నీ దాదాపు ఫరాన్ అక్తరే పాడాడు. బాగనే పాడాడు.
ఇక్కడ వినండి రాక్ ఆన్ పాటల్ని.ఇక మా పిల్లకి ఇళయరాజా పాటలు వినకపోతే నిద్ర పట్టదు. ఇన్స్ట్రుమెంటల్ సంగీతం. అవి పెడితేనే పడుకుండేది.
వాటిల్లో నాకు ఈ పాట బాగా నచ్చింది. పాట - సెన్తాళం పూవిల్ వన్తాడుం. చిత్రం ముల్లుం మలరుం. పాడినవారు శ్రీ ఏసుదాస్.
సెంతాళం పూవిల్ వంతాడుం తెండ్రల్
ఎన్ మీదు మేడుదమ్మ
పూవాసం మేడై పోదుదమ్మ
పెణ్ణ్ పోల జాదై కాత్తుదమ్మ
అమ్మమ్మా ఆనందం
ఇక్కడ వినండి ఈ పాట బీట్ ని.

దానికోసం యూగొట్టం లో వెతికితే ఈ లంకె దొరికింది.

ఈ పాటకి ఎవ్వరికైనా అర్ధం తెలిస్తే పంచుకోండేం!!!

6 comments:

 1. బాగుంది సోదరా.. ఎందుకో రాక్ రొద వినగానే మార్చేయాలనిపిస్తుంది.. వీలు చూసుకుని శ్రద్దగా వినాలి ఓ రోజు. ఇళయరాజ గారి పాట మాత్రం సూపర్ బర్గర్ తింటూ మజ్జిగ తాగిన ఫీలింగ్ :-) తెలుగు లో కూడా ఉండాలి ఈ పాట కాని గుర్తు రావడం లేదు. దొరికితే చెప్తాను.

  ReplyDelete
 2. బాగా చెప్పారు..సరిన ట్రాక్ లోనే వున్నాడు అని నా అభిప్రాయం.. సోచా హై పాట నాకు బాగా ఇష్టం..ఫర్హాన్ బాగా పాడాడు

  ReplyDelete
 3. సూరిబాబు టేస్ట్ కి ఎవరూ వంక పెట్టలేరని తెలియజేసుకుంటున్నా...

  ReplyDelete
 4. Rock On నాకు సినిమా, పాటలు రెండూ నచ్చాయి. మిగిలిన పాటల్లో బచనా ఏ హసీనా, Delhi 6, కూడా బాగానే వున్నాయి. తెలుగులో "ఓయ్" బాగున్నాయి. మేము ఈ మధ్య క్రొత్త తమిళ పాటల మీద పడ్డాము. అవి వినసొంపుగా, వీనులవిందుగా వున్నాయి, వారి వాయిద్యాల్లో ఏదో వైవిథ్యం వుంటుంది కనుక. ఈ సెంతాళం పూవిల్ పాట విన్నట్లే వుంది కానీ సాహిత్యం తట్టటం లేదు అందులో పని చేస్తూ ఈ Multi-Tasking గోల ఒకటి ;)

  ReplyDelete
 5. కామెంటు పెట్టిన అందరికీ ధన్యవాదాలు.

  ReplyDelete