Mar 30, 2009

నాలుగో ఏడు

నాకు బాగా గుర్తు. ఆరోజు, మార్చ్ 29, 2005. సాయంత్రం ఐదు అలా అయ్యిందనుకుంటా. దేనికో ఆ రోజు కార్యలాయం నుంది, తొందరగా ఇంటికి చేరుకున్నా. ఇంట్లో అందరికీ కొంచెం ఉద్విగ్నగా ఉంది. ఇంటికి చేరుకోంగనే హరి, ఇక వెళదాం పద అంది. గొంతులో ఓ గుక్క కాఫీ పోస్కునేలోపు, తను, కావాల్సిన అన్ని సర్దుకుంది. ఓ కఱ్ఱల సంచీ సిద్ధం చేస్కుంది. నేను తనూ నా బండి, టి.వి.యస్ స్కూటి మీద బయలుదేరాం. అమ్మా నాన్నా ఆటోలో బయలుదేరారు. అప్పట్లో మేము రాజా అన్నామలై పురం లో ఉండే వాళ్ళం. వెళ్లాల్సింది లజ్-కార్నర్. అభిరామపురంలోంచి సందులు గొందులద్వారా వెళ్తే పెద్ద దూరమేమీ కాదు. వెళ్లాసిన చోటకు చేరుకున్నాం. హరి ని చేర్చుకున్నారు, అందరితో పాటుగా తనకీ ఓ మంచం ఇచ్చారు. కొంతసేపయ్యాక ఇక మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు. నేను, నా స్నేహితుడు బయట అరుగు మీద పడుకోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మానాన్నని ఇంటికి పంపేసాం. ఇక స్నేహితుడు రావటమే తరువాయి. ఇంతలో హరి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకి వచ్చింది. అలా నడిచి వద్దామా అంది. సరే అన్నా. సాయంత్రం ఏడు ఎనిమిది అవుతోంది. ఇంకా కొంచెం వేడిగనే ఉంది. వద్దులే అందాం అనుకున్నా కానీ సరే పదా అని బయటకి వచ్చాం. పక్కనే ఓ చిన్న హోటేల్ ఉంది, వెళ్లి ఓ కాఫీ ఎక్కువ డికాషన్తో తాగాం. చేతిలో చెయ్యిపెట్టి నడుచుకుంటూ మళ్లీ వెనక్కి వచ్చాం. అంతలో అక్కడామే, ఎక్కడకి వెళ్ళారు మీరు చెప్పకుండా అని ఛీవాట్లేసింది తమిళంలో. ఇంతలో స్నేహితుడు వచ్చాడు. ఇక మాకు బయట జాగారం, పిలవని మిత్రబృందాలు మీదపడి పలకరించి వెళ్తున్నారు అదే దోమలు. మొత్తానికి ఏమీ పిలుపు లేదు లోపటి నుండి. ఇంకోవైపు మా అమ్మ నాన్న నుండి దూరవాణి, ఏరా ఏమైనా తేలిందా కదిలిందా కధ అని.
మర్రోజు, మార్చ్ 30, చెన్నైలో మరీ పొద్దున్నే ఉదయిస్తాడు సూర్యుడు, ఐదుకల్లా తెల్లారిపోతుంది. లేచాం, మితృడు కూడా తన గూటికి వెళ్లి కార్యలయానికి వేళ్లిపోతా అని నిష్క్రమించాడు. లోపలి నుండి ఏమీ వార్తలేదు, నేనూ ఇంటికి వెళ్లాను, మా అమ్మ అప్పటికే తయ్యారుగా ఉంది ఇడ్లీ, కాఫీ గట్రా అన్ని తయ్యారుచేసి తను తిని నాకోసం చూస్తోంది. అమ్మని హరి దగ్గర దింపటానికి వెళ్ళేప్పటికి తనని ఇంకో గదిలోకి మార్చారు. గది బాగనే ఉంది. ఏ.సి కూడా ఉంది. అమ్మని అక్కడ దింపి నేను కాలకృత్యాలు తీర్చుకోటానికి తిరిగి ఇంటికి చేరుకున్నా. ఎనిమిది టైం, ఏమి కబురులేదు. నాన్నా నేను బయలుదేరాం అక్కడకి. తొమ్మిది. నెమ్మదిగా నొప్పులు వచ్చిపోతున్నాయ్ అని చెప్పారు, సేయింట్ ఇసబెల్స్ ఆశుపత్రి నర్శులు. అమ్మ లోపల ఉంది, నేనూ నాన్న బయట. పది నలభైకి అనికుంటా తను లేచి లేబర్ రూం వైపు వెళ్లిపోతోంది, నేను ఆగు ఆగు నర్శ్ ని పిలుస్తా అనేలోపే తను లోపకి వేళ్లిపోయింది. సరిగ్గా పదకుండు పదకుండు కి, మూడేమూడు పెద్ద నొప్పులతో ఇంతకళ్లతో, సూరిగాడు పుట్టాడాని, పదకుండూ పదిహేనుకి బయటకి తీస్కొచ్చి మాకు చూపించారు. అమ్మా నాన్న కళ్లల్లో ఆనంద భాష్పాలు, నాకు ఊరట. వెంటనే నామెడలోని గాలి గొలుసుని నర్శ్ ఇచ్చేసా. ఆమె తీస్కోలేదు. బంగారంది కావాలి అంది. మనదగ్గర లేదు అన్నా, సరే అని పిల్లాడ్ని జస్ట్ బార్న్స్ రూమ్ లోకి తీస్కెళ్లిపోయింది.

వీడు పుట్టినప్పటి నుండీ గోలగాడే. ఉన్నట్టుండి ఏడ్చేవాడు. తల ప్రాణం తోక్కొచ్చేది ఆ ఏడుపుని ఆపటానికి. సరే మొత్తానికి...ఈరోజు వాడి పుట్టిన రోజు. నాలుగోది. అప్పుడే నాలుగేళ్లైంది వాడు పుట్టి. రేపీపాటికి నాన్నా ఆపీస్ కెళ్లొస్తా అంటాడేమో, వచ్చే ఏడాదికి, డాడ్, షీ ఈజ్ నాన్సీ, యువర్ డాటర్-ఇన్-లా అంటాడేమో...ఈ క్రింది ప్రకటనలో లాగా

[మానాన్న ఉండి ఉంటే వీణ్ని చూస్కుని వాడితో ఆడుకుంటూ ఆడిస్తూ చాలా ఆనందిస్తూ ఉండిఉండేవాడు. మా అమ్మ నుండి అల్లంత దూరంలో ఉన్నాం మేము. అమ్మలేకుండా వాడి పుట్టినరోజు పడుగ అదో వెలితిగా ఉంది. తోందర్లో పిల్లలు, నానమ్మ దగ్గరకావాలని కోరుకుంటా.]

19 comments:

 1. అదేంటి మేమంతా లేమూ మీతో కలిసి ఆనందం పంచుకోవడానికీ పంచడానికీ.
  సూరికి జన్మదిన శుభాకాంక్షలు .. తండ్రిని మించిన తనయుడు కావాలని.

  ReplyDelete
 2. అయితే ఈ వీకెండ్‌ మైసూర్‌పాక్‌ అచ్చులు కోసి, లడ్లు ఉండలు చుట్టి, కోవా బిళ్ళలద్దీ బిజీ అన్న మాట మీరు :) సూరీడుకి మా ఆశీస్సులు!

  ReplyDelete
 3. సూరిబాబూ,శతమానంభవతి.నాన్నా నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ మీ నాన్నని,ఆయన నీ ముచ్చట్లు చెబుతుంటే విని మమ్మల్నీ ఆనందింపచేయాలని కోరుకుంటూ....

  ReplyDelete
 4. సూరిబాబూ జన్మదిన శుభాకాంక్షలు

  ReplyDelete
 5. ఒక సూర్యుండు.. తరహాలో మీవాడు దినదినప్రవర్థమానం కావాలని, మీ పుత్రోత్సాహం అవధుల్లేకుండా పెరగాలనీ ఆకాంక్ష. మీ చిన్నవాడికి ఆశీస్సు.

  ReplyDelete
 6. యాపీ బర్త్ డే సూరిబాబు.. మీ నాన్న కోరికలన్నీ పెద్దయ్యాక తీర్చేయరా నాని.


  భాస్కర్ గారు, మా అందరి ఆశీర్వాదాలు, అభినందనలలో మీ అమ్మా, నాన్న కూడా ఉన్నారండి..

  పార్టీ స్పెషల్స్, వివరాలు రేపు చెప్పాలి మరి...

  ReplyDelete
 7. భాస్కర్ గారూ,
  సూరిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. నాలుగేళ్ళు గిర్రున తిరిగినట్లున్నాయేమో కదా మీకు?

  ReplyDelete
 8. many happy returns of the day to suri, god bless :)

  ReplyDelete
 9. @అన్నగారు, తెరెసా గారు - ధన్యవాదాలు. ఔను ఇంతమంది ఉండగా చింతేల.
  @విజయమోహన్ గారు - :):) వాడిది పిచ్చిగోల.కో.ఇన్. http://nalabhima.blogspot.com/2009/03/blog-post_30.html దీంట్లో మొదటి వీడియో చూడండి. నేను వంటాచేస్తుంటే వచ్చి, ఏంటి సంగతి అని అడుగుతున్నాడు
  @నా బ్లాగ్ - మీ బ్లాగ్ ఏది? ధన్యవాదాలు.
  @శ్రావ్య - ధన్యవాద్.
  @అరుణపప్పు గారు - ధన్యవాదాలండి.
  @జ్యోతి గారు - నాకోరికలు వాడు తీరుస్తాడో, నేనే వాడి కోరికలు తీరుస్తానో..అసలు కోరికలే వద్దురా బగమంతుడా అనుకుంటుంటే మీరు మరీను.
  పార్టీ స్పెషల్స్ వివరాలు కేకు ముక్కలు కత్తులు అన్నీ రేపో వీడియో, మరియూ కొన్ని బొమ్మలతో...
  @ఉమా శంకర్ భాయ్ - వెల్!! గిర్రున తిరిగినై రోజులు. కొన్ని సార్లు కళ్లుతిరిగి కిందకూడా పడ్డా. :):) పిల్లలుంటే అంతే కదా. అదీ మావాడిలాంటోడు ఉంటె ఇక అంతే.

  ReplyDelete
 10. సూరిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. Ah, Suri.. happy birthday!!

  I wish him a lifelong passion for learning, earning and yearning(for knowledge)

  ReplyDelete
 12. @రాణి గారు - ధన్యవాదాలు
  @అమర్ - థాంక్స్ సోదరా
  @నువ్వుమాయ (ఐ.మాయ) - :):) థ్యాంక్యూ.

  ReplyDelete
 13. రామరాజు గారు,

  నేను గొప్పగా ఏమి వ్రాయనులెండి. నా బ్లాగ్----
  http://sunitatelugublog.blogspot.com

  ReplyDelete
 14. Surya,

  Many Many HAppy Returns of the Day

  -Didi

  ReplyDelete
 15. Surya,

  Many Many HAppy Returns of the Day

  -Didi

  ReplyDelete
 16. రేవతి - ధన్యవాద్ :):)
  @"నా బ్లాగు" - ఓ నేనో పెద్ద రైటర్నేం కాదు. అలా అయిఉంటే ఇప్పటికి నా బ్లాగుకి ఓ నలభైవేల హిట్లు పడి ఉండాలి, కనీసం ఓ పదిమంది ఫాలోయర్స్ ఉండి ఉండాలి.
  మీకు అరుణాచలం సినిమా గుర్తుందా, అరుణాచలం శాసించాడు, ఈ అరుణాచలం పాటించాడులా. మనసుకి ఏదో స్పురిస్తుంది ఠకామని దాన్ని బ్లాగుకెక్కించటమే...ఎంజాయ్ మాడి రి.

  ReplyDelete
 17. "నా బ్లాగుకి ఓ నలభైవేల హిట్లు పడి ఉండాలి, కనీసం ఓ పదిమంది ఫాలోయర్స్ ఉండి ఉండాలి."

  అన్నా... నాకు ఇంకో రజనీ కాంత్ డవిలాగ్ గుర్తొస్తాంది.
  "నాన్నా, పందులే గుంపులుగా వస్తాయి... సింహం, సింగిల్ గా వస్తుంది."

  హిహి

  ReplyDelete
 18. ఇదిగో నేనుమాయ ఊర్కే కాళ్లు లాగమాక. :):) అంతా విష్ణుమాయ నాయనా..:):)

  ReplyDelete