Mar 20, 2009

ఆహార పరిశోధకులు

మనం తినే ఆహారంలో ట్రాన్స్-ఫ్యాట్ ఎంత ఉటుంది?
మనం వాడే నూనెలు ఎంతవరకూ మంచివి?
అసలు ఫ్రై కోసం వాడే నూనెని ఎన్నిసార్లు తిప్పి తిప్పి వాడొచ్చు?
ఏ నూనె మంచిది?
ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఈ కార్యక్రమాన్ని చూసి తీరాల్సిందే. ఇది ఫుడ్నెట్వర్క్ వారి ఫుడ్ డిటెక్టివ్స్ అనే కార్యక్రమం.



Ted Allen అనేవాడు దీనికి వ్యాఖ్యాత. మొన్న దీన్లో ఈ క్రిందివాటిని గురించిన కార్యక్రమాన్ని చూపించాడు, టెడ్ ఆల్లెన్ గాడు:
రుచి పరీక్ష. అంటే, కళ్లు, ముక్కు మూస్కుని ఓ పదార్ధాన్ని తిని అదేంటో చెప్పాలి. బంగాళదుంపని ఇలా తిని అదేంటో చెప్పగలరా, అలానే కళ్లు ముక్కు మూస్కుని ఓ యాపిల్ ముక్కని తిని అదేంటో చెప్పగలరా.
అలానే, ఫ్రైడ్ ఫుడ్ ఎంతవరకూ ఆరోగ్యకరం? ఏది అత్యంత వాడతగిన, ఆరోగ్యకరమైన నూనె? చివరగా, కత్తిపెట్టి తరగటానికి/కొయ్యటానికి, చెక్కపీట బెస్టా లేక ప్లాస్టిక్కు పీట బెస్టా?
వీడి రీసెర్చి, పరీక్షల ప్రకారం - బెస్ట్ నూనె - వెజిటెబిల్ ఆయిల్. మనం అనుకున్నట్టుగా పల్లీ నూనె మరీ అంత డేంజరస్ కాదు. అదో పెద్ద కాన్స్పిరసి అనిపించింది నాకు. ఐతే, మళ్లీ మళ్లీ వాడటం ఏడీ మంచిది కాదు. ఇలా మళ్లీ మళ్లీ వాడితే ట్రాన్స్-ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది నూనెల్లో, పల్లీ నూనెలో కూడా. పొద్దుతిరుగుడు నూనే కూడా అంటే, మళ్లీ మళ్లీ వాడకూడదు.
మాంసం తినేవాళ్లు, కత్తితో మాంసాన్ని కొట్టటానికి చెక్కపీటనో(వుడెన్ బోర్డ్) లేక ప్లాస్టిక్కు పీటనో(ప్లాస్టిక్ బోర్డ్) వాడతారు. వీళ్ల పరీక్ష -
౧. కొత్తవి, అప్పుడే తీసిన చెక్క,ప్లాస్టిక్కు పీటలు -
వీటిమీద మాంసాన్ని కొట్టి లేక తరిగి, కడిగి, మరుసటిరోజు వాటి మీద ర్యాండంగా అక్కడక్కడా పరీక్ష కలెక్టర్ తో అద్ది, పరీక్షా విధానానికి వాటిని గురిచేసి, పరీక్షచేసి ఇలా తేల్చారు -
కొత్త చెక్క పీటైనా, లేక ప్లాస్టిక్కు పీటైనా, ఒక సారి వాడాక వాటిపై సమానమైన బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, తేలిందేంటంటే - మాంసాహారులు - బహుపరాక్ అని. మీరు వాడే బోర్డ్స్ ని వినిగర్ తో శుభ్రంగా కడుక్కుని తీరాలి అని.
౨. పాతవి చెక్క, ప్లాస్టిక్కు పీటలు-
వీటిమీద గాట్లు పడి ఉంటాయి కాబట్టి, ఆ గాట్లలో పదార్ధం కొంత మిగిలి ఉండే అవకాసాలు ఎక్కువ. పైన పరీక్షలు వీటీమీద జరిపితే తేలింది ఇది-
పైన వాటికన్నా వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. ఐతే - చెక్కలో ఆ శాతం తక్కువగా ఉంది. కారణం - కొంత శాతం బ్యాక్టీరియాని చెక్క పీల్చేస్కుంటుంది, మరియూ, చెక్కలోని కొన్ని గుణాల వల్ల, కొంత శాతం బ్యాక్టీరియా నశిస్తుంది.
యేమైనా వినిగర్ తో, వేడి నీళ్లలో ఈ పీటల్ని శుభ్రంగా కడుక్కుని వాడుకోవటం మంచిదీ.
వీళ్లు తేల్చిందేమంటే, చెక్క పీట మంచిది అని.
వీళ్లు ఇచ్చే సలహా - కూరగాయలు తరగటానికి ఒక పీటనీ, మాంసాలను కొట్టటానికి ఇంకో వేరే పీటనీ వాడటం ఆరోగ్యకరం అని.

3 comments:

  1. మరీ ప్రతీ విషయం లోనూ పట్టి పట్టి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే శాస్త్ర ప్రకారం అన్నట్లు,ఇంతకు పూర్వం మన ఇళ్ళల్లో ఇలాంటివి ఏమన్నా చూసామా ఇప్పుడే ఈ జాగ్రత్తలు ఎందుకు వస్తున్నాయో చెప్పు...టెడ్ అల్లెన్(నల భీమా)

    ReplyDelete
  2. పప్పు యార్ - ఇంతకు పూర్వం కాదు, ఇప్పటికీ మనం గమనించం, పట్టించుకోం. కానీ, కొన్ని కొన్ని తెల్సుకోవటంలో తప్పులేదు. తెల్సుకుని తీరాలి కూడా. ఒకానొక రోజుల్లో పొట్టానిండా తిని అది అరిగిందాకా పనిచేసారు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు తినటం సగం అయ్యింది, అది అరగటం పావైయ్యింది. కాబట్టి మనం ఏం తింటున్నామో తప్పకుండా తెల్సుకోవాలి. అదీ, ఈ మన పాశ్చాత్యదేశాల ప్రభావంలో ఉన్న జీవితాల్లో, మ్యాక్ డోనాల్డ్స్ లాంటి పూటకూళ్లు సందు సందునా పెడుతున్న తరుణంలో, వాళ్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యటానికి ఏమి నూనె వాడుతున్నారో అది ఎంతవరకు ఆరోగ్యకరమో తెల్సుకుని తీరాలి.
    గమనిక - మ్యాక్ డోనాల్డ్స్ లాంటి ఆహార బేహారులు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వేపుడు వంటల్ని ఇలా చేస్తారు - అన్నిటినీ అనగా కోడి, మీట్, దుంపలు అన్నీ ఒకే నూనెలో వేయిస్తారు. నూనెని తిప్పి తిప్పి వాడగలిగేందుకు నూనెకి తట్టుకునే శక్తి పెంపొందించటంకోసం కొన్ని రకాల కొవ్వులని వాడతారు.
    ఇక అందరికీ తెలిసిన విషయం - ఒక సాధారణం కన్నా తక్కువ బరువున్న వ్యక్తిని ఒక నెలరోజుల పాటు మ్యాక్ డోనాల్డ్స్ కి పంపిస్తే ఊబకాయుడౌతాడు.

    ReplyDelete
  3. ప్రస్తుత కాలుష్యభరిత జీవిత విధానాల్లో ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగ వుండగలిగితే అంత మంచిది.
    ఒకప్పడి తిండి వేరు ఇప్పటి తిండీ వేరు. అప్పట్లో ఒకవేళ పిచ్చి తిండి తిన్నా అప్పటి శారీరక శ్రమ వల్ల వారికి అది పెద్ద విషయం కాదు.
    ప్రస్తుతం మన శారీరక శ్రమ మనం తీసుకునే ఆహారం ఎక్కడా సమానంగా వుండట్లేదు.

    ReplyDelete