Mar 19, 2009
మాలామాల్ వీక్లీ
2006 లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగులో కూడా తీసారు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అని.
సరే కధ ఏంటంటే, ఓ ఊళ్ళో లాటరీ టిక్కెట్లు అమ్ముకునే ఒకాయన, తను అమ్మిన ఓ టిక్కెట్టుకి బంపర్ డ్రా తగిలిందని తెల్సుకుంటాడు. అది ఎవరికి దొరికిందీ ఏంటి అని ఊరుని తూర్పార పడితే యాంతొని అనే వాడి టిక్కెట్టే అని తెల్సుకుని, వాడి దగ్గరకి వెళ్లి బాసు, నాకు ఇనాం మంచిగా ఇవ్వు అని చెప్పేంతలో యాంతొని చచ్చిపొయ్యాడని తెల్సుకుంటాడు. అదే సమయంలో అక్కడకి ఇంకోఅతను వచ్చి యాంతొనిని ఇతను చంపుతున్నాడు అనుకుని జనాల్ని పిలవటానికి వెళ్లబొయ్యేంతలో ఆ టికెట్లతను, బాసూ ఇదీ సంగతి, డ్రా తగిలింది, వాడు ఆ ఆనందంలో సచ్చిపోయినట్టున్నాడు అన్జెప్పి, మనమిద్దరం సగం సగం కొట్టేద్దాం అంటాడు. ఇంతలో ఇంకోడు తగులుతాడు, వాడికీ నచ్చజెప్పి, సరే డ్రా ని ముగ్గురం సమానంగా పంచుకుందాం అంటాడు. ఇంతలో ఆ యాంతొని గాడి సిస్టర్ వస్తుంది. ఆమెకి నచ్చజెప్పి అందరం సమానంగా పంచుకుందాం అంటాడు టికెట్లవాడు. ఇంతలో కొంతమంది కూలీలు వచ్చి, యాంతొని మమ్మల్ని రమ్మన్నాడు, డ్రా గెల్చిడాటకదా డబ్బిస్తా అన్నాడు అందుకే వచ్చాం అంటారు. టిక్కెట్లవాడు అందర్నీ లెక్కబెట్టి, సరే అందరం సమానంగా పంచుకుందాం అంటాడు. ఇంతలో మరి యాంతొని శవాన్ని ఖననం చేద్దాం అనుకుంటారు అందరూ. దానికి ఓ పాదరీని తెస్తారు అతన్నీ చేర్చుకుంటారు భాగస్తుడిగా. ఇలా ఊరంతా దాదాపు ఆ డ్రా డబ్బులో భాగస్తులౌతారు.
ఇప్పుడీ కధ దేనికంటే -
కరెక్టుగా ఈ కధ మహా కూటమికి సరిపోతుంది. సీట్ల పంపకాలు, టీ.ఆర్.యస్ భాగం, కమ్యూనిష్టుల భాగం ఇంకా తేలక ముందే, మందా కిట్న మాదిగ మేమూ జేరతాం, మాకెంత అని. అంతలోనే జూ.యంటీఆర్, మావాడికి సీటు కావాలి అని..వాహ్....భలే ఉంది సినిమా.
Subscribe to:
Post Comments (Atom)
బావుంది పోలిక :)
ReplyDeleteమీ పోలిక కేంద్రంలో మూడో ఫ్రంట్ కి ఇంకా బాగా సరిపోతుందేమో.
ReplyDeleteadbhutamgaa vunnadi mee polika
ReplyDeleteha ha. baga chepparu.
ReplyDeleteబాబూ...............భాస్కర్ ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ రాజకీయరచనలూ ఉఉఉఉఉ మొదలుపెట్టావా ఆఆఆఆ ???
ReplyDelete:) :)
కుమ్మో కుమ్మో