Mar 27, 2009

ఉగాది శుభాకాంక్షలు

బ్రహ్మాండమంతటికీ విరోధీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది ప్రాముఖ్యం - చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఆశువుగా ఓ కవిత రాసేద్దాం అనుకున్నా కానీ, రాయలేను. ఆశువుగా ఓ వంటకం చెయ్యమన్నా రాయమన్నా రాయగలుగుతానేమో కాని, కవితా!! వల్లకాదు వల్లకాదు వరదారాజా!!!
మొత్తానికి ఉగాది కదూ! సరే, ఉగాది రోజున, ఓ కవిత, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం - విధిగా వినాలి, తినాలి, చెయ్యాలి.
ఆరోజుల్లో, రేడియోలో ఉగాది రోజున కవి సమ్మేళానాలు వస్తుండేవి (ప్రత్యక్ష రేడియో ప్రసారం). ఇంట్లో అందరూ పనులన్నీ పక్కనపెట్టి రేడియో దగ్గర కూర్చుని వినటం ఆనవాయితీ. మా నాన్న పడక్కుర్చీలో, మనం కింద, అప్పుడే కుంకుడుకాయల్తో తలస్నానం చేయ్యటం మూలానో ఏమో కళ్ళు ఎఱ్ఱగా అయిపోయి, ఇల్లంతా కొంచెం పొగతో అంటే తల ఆరటం కోసం సాంబ్రాణి వేసేవాళ్ళుగా, మరియూ ముద్దపప్పు మరి కుంపటి మీదనేగా వండేడి ఆ పొగ, అలా కూర్చుని రేడియో వినటం. ఇంత సుందరమైన దృస్యం అది. అహా!! ఉగాది పచ్చడి, మావిడి తోరణాలు, ఓ పండుగ వాతావరణం, ఇంకో వైపు వంటింట్లో మా అమ్మ గారెలు, పొంగలి/పరమాన్నం చేస్తూ...ఇప్పుడు రెడీమేడ్ పచళ్లే వచ్చాక కవితలెక్కడ వింటాం, విన్నా ఈ సోకాల్డ్ కవులదగ్గర కులంకంపో లేక బ్రాందీ కంపో. ఈ పచ్చళ్ళమ్మే దుకాణాలపై నా వ్యాఖ్య "సందుకో స్వగృహా, ఉన్న గృహాల్ని ముంచేసాయ్".
ఉగాదికనే కాదు, ఏ పండగైనా గారెలు, పరమాన్నం లేక పొంగలి లేకపోతే ఏదో వెలితి.
[కన్న కొడుకులు లేక కూతుళ్లు ఎక్కడో దూరాలలో ఉంటూ, గడచిన రోజుల్ని నెమరేస్కుని బతికే ఆ తల్లితండ్రుల ఒంటరి జీవితాలకి పండుగ అనేదే లేకుండా పోయిందీ ఈ రోజుల్లో. పిల్లలొస్తేనే మాకు పండుగ అనే తల్లితండ్రుల కోసం - దేవుడా, కనికరించి, ఈ ఏడాదైనా ఆ తల్లితండ్రులని తమ పేగులవద్దకు చేర్చు, వారి జీవితాల్ని మళ్లీ పండుగమయం చేయి]
నాకు బాగా గుర్తు, ఓ సంవత్సరం ఉగాది కవి సమ్మెళనానికి గొల్లపూడి మారుతీ రావుగారు అధ్యక్షతవహించారు. బ్రహ్మాండాంగా నడిచింది ఆ సమ్మేళనం. ఆరోజులు మళ్లీ వస్తే బావుండనిపిస్తోంది. ఎందుకంటే కవులు, కవితలు, సాహిత్యాభిలాష లాంటివి ఇప్పుడిప్పుడే నాలో జీవం పోసుకుంటున్నాయి.
ఈ సంవత్సరంకూడా సాధ్యమైనంతలో సత్-చింతన కలిగి, సత్-సాంగత్యంతో, సత్-బాటలో పయనించాలని కోరుకోటమే, ప్రయత్నించటమే.
ఇక్కడి మా ఊళ్లో శనివారం ఉగాది ఉత్సవాలు జరుపబోతున్నారు. నేను ఓ "తెలుగు బ్లాగరు"గా తెలుగుబ్లాగుల సమాహారాల వివరాలనూ, నా బ్లాగులను ఒక కరపత్రంలా ముద్రించి అందరికీ "తెలుగులో రాయండి, తెలుగు మాట్లాడండి, తెలుగు చదవండి" లాంటి నినాదాలతో పంచబోతున్నా. అలానే తె.బ్లా సమాహారాలైన "కూడలి", "జల్లెడ", "లోగిలి" ఇత్యాది వివరాలను జనుల ముందుంచబోతున్నా.
అలానే మన మాష్టారుగారు దుర్గేశ్వర రావు గారు మొదలుపెట్టిన "హనుమత్ రక్షా యాగం" గురించిన కరపత్రం కూడా అందరికీ అందించబోతున్నా.
మీ అందరికీ విరోధీ నామ సంవత్సరం శుభమౌగాక.
మీ కోరికలు నెరవేరు గాకా.
మీ అందరి మనస్సులు ఆ భగవంతుని సేవకు అంకితమౌగాక.
మీ అందరికీ మానసిక ధృడత్వం కలుగుగాక.
మన దేశం, రాష్ట్రం ఉగ్రవాదుల బారిన పడకుండా, నిజమైన అభివృద్ధి వైపు పయనించుగాక.
ప్రపంచం ఆర్ధిక మాద్యం నుండి కోలుకుని సక్రమమైన మార్గంవైపు నడుచుగాక.

10 comments:

 1. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. భాస్కర్ గారూ,

  మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 4. బాచి బాబూ నీకూ నీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున ఉగాది శుభాకాంక్షలు

  ReplyDelete
 5. మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.

  ReplyDelete
 6. సోదరా మన ఊరు గుర్తుకు తెచ్చావు.
  తెలుగు బాష వ్యాప్తి కోసం నీ వంతు క్రుషి చేస్తున్నావు.

  ReplyDelete
 7. మీకు మీ కుటుంబానికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 8. మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు

  ReplyDelete
 9. మీ అందరికీ నా నమస్తే..కామెంటు పెట్టిన అందరికీ ధన్యవాదాలు..పెట్టనివారికి కూడా :):)
  పప్పూ యార్ - ఉగాది శుభాకాంక్షలు...
  ఆత్రేయ గారు - మీకూనూ
  విజయమోహన్ గారు - ఈ మధ్య నా బ్లాగువైపు రావటమే మానేసారు. సుస్వాగతం. మీకూనూ, ఉగాది శుభాకాంక్షలు
  అమ్మ ఒడి - ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు
  అరుణాంక్ - :):) శుభాకాంక్షలు
  అమర్ - వచ్చేఏటికి, నువ్వు పెళ్లిచేస్కుని అత్తవారింట ఉగాది సెలబ్రేట్ చేస్కోవాలని దీవిస్తున్నా
  జ్యోతి గారు - మీకు కూడా శుభాకాంక్షలు

  ReplyDelete
 10. మీకు మీ కుటుంబానికి కూడా ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete