ఆశాభోస్లే తెలుగులో ఎన్నిపాటలు పాడిందోగాని, నేను విన్నది మాత్రం ఇది.
సినిమా - చిన్ని కృష్ణుడు
సంగీతం - పంచందా (ఆర్.డి. బర్మన్)
పాడినవారు - ఆశా తాయి, మరియూ బాలు.
రాసిన వారు - వేటూరి
సినిమా దర్శకత్వం - జంధ్యాల
ఆశా:
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
బాలు:
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట
మతి కృతి పల్లవించే చోట
ఆశా:
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
బాలు:
సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట
కృషి ఖుషి సంగమించే చోట
ఆశా:
జీవితం సప్త సాగర గీతమ్
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
ఈ పాట బాగుంటుంది. అయితే, ఆశా కొన్ని పదాలని ఖూనీ చేసింది. ఒకచోట కౌగిలించే చోట ని కోగిలంచే చోట అని పాడింది. జంధ్యాల వారు ఇలా ఎందుకుచేరబ్బా? నా చిన్న మట్టి బుర్రకి కొన్ని చరణాలు అర్ధంకాలా అవి.
ఇక్కడ వినండి ఈ పాటని:
మీకు అర్ధం అయితే చెప్పండి...
Mar 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
Beautiful song! మీది మట్టి బుర్ర కాదు, ఆవిడే కొన్ని పదాల్ని మార్చేసినట్లున్నారు :(
ReplyDeleteHere's what I could makeout-
2.31- ఈ చికాకు...స్వర్గ సోపానమూ
2.48- ఏది స్వప్నం disney జగతిలో!
4.30- ఆలిబర్తి శిల్పశిలలలోరేఖాజ్యోతులూ
ఐక్యరాజ్యసమితిలోన కలిసే జాతులూ
4.57- someone తీర్చి కన్న ప్రేమ సామ్రాజ్యమూ
ఆలిబర్తి ని తీసుకొచ్చి శిల్పశిలల్లో ఎందుకు పెట్టారో!!
teresa గారూ!! మంచిగున్నరా?
ReplyDeleteఆలిబర్తి ఏందండీ! సమఝ్గాలె!! నాకు ఎలా అర్ధంగాలే, మీరు ఎలా పట్టిన్రు ఆ పదాలు:):)
సమస్యాపూరణం చేసినందుకు ఇనాం,
తెరెసా గారికి ఓ థంసప్....
Thanks for sharing good song :)
ReplyDeleteఉభయకుశలోపరి.
ReplyDeletelucia Aliberti is an Italian singer/ composer.
Disneyని ఇరికించారుగా అందుకని Aliberti కూడా పట్టుకోగలిగాను :)
ఆ లాస్ట్ someone, Yanni అనుకున్నాను గానీ అతకలేదు. వేటూరి గార్ని అడగాల్సిందే!
someone .. అని ఉన్నచోట పదం ఏవియానిక్స్ avionics అయి ఉండనోపు.
ReplyDeletechala bagundi can you give me the downlod link for the mp3 songs please
ReplyDeleteteresa garu,
ReplyDeleteee chikaku swarga sopanam kaadandi ...meeru mareenu ! lol
ee chicago ... tower ye swarga sopanamu ! enni sarlu vinna adem tower oo artham kaledu !
achu hindi paata style lone paadaaru ... modati sari vini idi telugenaa anukunna ! ee hindi singers ni telugu singing ban cheyinchi punyam kattukovali evaro !
4:58
Eviyani beach kanna prema samrajyamu ? anukuntaa kadaa teresa garu ?
Ammaloo ayyaloo.. Adi "Aa liberty"
ReplyDeleteI think its the Statue of Liberty
alaage "ఋషి ఖుషి సంగమించే చోట"
ReplyDeleteadi "కృషి ఖుషి" అనుకుంటా.
అలాగే "ఈ మయామీ బీచి కన్న ప్రేమ సామ్రాజ్యమూ"
నాకర్థమయ్యినంతవరకు ఇదీ సంగతి :)
ఆశమ్మ గారి ఉఛ్ఛారణ వల్ల ఇంతమందికి ఇన్ని రకాలుగా అర్థమయ్యాయి లిరిక్స్. సరే
ReplyDeleteమొదటి చరణం ఇదీ
1.ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చిగాగో సియర్స్ టవరే(sears tower) స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం
డిస్నీ(డిజినీ అంది ఆశా) జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
2. ఆ లిబర్టీ(statue of liberty) శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
బాలు పాడింది బాగానే తెలుస్తోందిగా.
కానీ అమెరికాను ఇంతకంటే అందంగా వర్ణించడం సాధ్యమా అనిపిస్తుంది ఈ పాట వింటుంటే!
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteభాస్కర్ గారు,
ReplyDeleteచికాగో ని చిగాగో అని తప్పుగా టైప్ చేసాను.
sears tower,miami beech అన్నమాటల్ని అర్థం చేసుకోడానికి నాకు వారం పట్టింది.(ఇప్పుడు కాదులెండి. అమెరికాలో ఒక స్టేజీ షో లో పాడ్డానికి విన్నప్పుడు)
R.D.Burman సంగీతం ప్రభావం వల్ల కావొచ్చు, ఈ పాట హిందుస్తానీ కళలతో, తెలుగు పాటలా ఉండనే ఉండదు కానీ ట్యూన్ మాత్రం బాగుంటుంది.
లత తెలుగును బాగానే ఉచ్ఛరిస్తుంది కానీ ఆశా వల్ల కాదు. పాలు -నీళ్ళు అనే సినిమాలో "ఇది మౌనగీతం" అని ఒక పాట పాడారు. అందులోనూ అన్నీ దోషాలే! ఈ మధ్య చందమామ లో "నాలో ఊహలకు" అనే పాట కూడా అంతే!
పొరుగింటి పుల్ల కూర రుచి అనుకోడమే కాకుండా ఆ కూర 'రుచిగా 'కుదిరే మార్గం సంగీత దర్శకులు ప్రయత్నిస్తే బాగుంటుంది.
భలే! పొద్దు గడికంటే interesting గా సాగిందిగా ఈ సప్త సముద్రాల పయనం! పాట బాగుంది గానీ పదాలని అర్థం చేస్కోడానికి పది రోజులు పట్టడంతో దాని మజా ఎక్కువైంది :)
ReplyDeleteSri- చికాకే స్వర్గ సోపానం అనలేదండీ, మధ్యలోgap చూడలేదా?
Interpreters అందరికీ అభినందనలు :)
తెరెసా గారు,సుజాత గార్ల సహకారంతో మొత్తానికి సమస్యాపూరణం చేసేసా.
ReplyDeleteఎంతో సహనంతో సాహసంతో ఈ సమస్యని పూరించిన తెరెసా గారికీ, సుజాత గారికీ జై.
@డీప్యూ: ఇట్ ఈజ్ సింపులు. సింప్లీ క్లిక్ ఆన్ "డివ్ షేర్" ఆన్ ది ప్లేయర్, టేక్స్ యూ టు డౌన్లోడబుల్ పేజ్. ఎంజా!!!
@శ్రీ: ధన్యవాదాలు.
@కలలబేహారి: ఔను, మిజమే అది స్ట్యాట్చ్యూ ఆఫ్ లిబర్టీ నే...
"ఋషి ఖుషి" కరెక్టు అనిపిస్తోంది, ఋషి కి మామూలుగా ఖుషి ఉండదు, కాబట్టి ఋషి కూడ అమ్రికే వస్తే ఏంజా చేస్తాడు అని...
కాదండీ, అది కృషీ, ఖుషీ నే. "Work hard, Party harder" అన్న అర్థంలో వాడారనుకుంటా. Anyway, Looks like the entire song is open to interpretation :)
ReplyDeleteకలలబేహారి... పదం కొంచెం బరువుగా లేదూ :)
అమ్మో! అమ్మో! ఇదంతా తెలుగే! :(
ReplyDeleteఅదేదో సస్పెన్స్ సినిమాలో డిటెక్టివ్ హీరో నేరపరిశోధన లో భాగం గా ఒక టేపుని పదే పదే రివైండ్ చేసి విని దొంగని ఇట్టే పట్టేస్తాడు. నే అలానే చేయాల్సొచ్చింది..
ఇక్కడ దొంగెవరో తెలుసు.. ఆ పదాల్తోనే వచ్చింది తంటా.. :)
భాస్కర్ గారూ, ఈ పాటని నేనెప్పుడూ మర్చిపోనిక...
కలలబేహారి = కలల వ్యపారి. కలతో వ్యాపారం చేయువాడు. అబ్దుల్ కలాం ని కలలవ్యాపారి అన్నారెవరో. వ్యాపారం అనేది లాభంకోసమే చెయ్యాల్సిన పనిలేదు, తృప్తికోసం కూడా చెయ్యొచ్చు.
ReplyDeleteడ్రీమర్ అనంగనే దేనికో కలలబేహారి అని టైపు చేసేసింది నా ఏడమ చెయ్యి.
మీరులేవనెత్తిన అంశానికి వస్తే, చూద్దాం ఇంకా సమస్యా పూరణం చెయ్యగలిగిన వాళ్లేమైనా సూచనలిస్తారేమో...
బాలూ గారు కూడా బానే ఖూనీ చేసినట్టున్నారు..నాకైతె "కవులు" "కౌలు" అని వినపడుతోంది..అలానే ఆశా గారి "వెలుగు నీడలు" లో "వెలుగు" అదేదో లా వినిపిస్తోంది "వెదుగు" లా,,,
ReplyDelete@ఉమా - అది మూజిక్కు మ"హత్య"మ్ నాయనా..ట్రాకుని మూజిక్కు మింగేసింది.
ReplyDeleteఅన్నట్టు అసలీ సినిమా ఏంది? దీనికధ ఏంది? ఎవ్వరికైనా తెలుసా?
Dreamer, మీరు కరక్టు! కృషి-ఖుషి సంగమించే చోట..!
ReplyDeleteభాస్కర్ గారు,
సినిమా సి-క్లాసు చెత్త సబ్జెక్టే! అప్పట్లో అమెరికాను సినిమాల్లో చూపించహ్డం ఒక పెద్ద అడ్వంచర్ కాబట్టి ఏదో ఒక సబ్జెక్టు పట్టుకుని అమెరికాకు లింకెట్టి తీసేవారనుకుంటా. "అమెరికా అబ్బాయీ "అమెరికా అల్లుడు" సినిమాలు కూడా ఇలాటి కోవలోవే!
పడమటి సంధ్యారాగం...does make sense a little..!
This comment has been removed by the author.
ReplyDeletehttp://www.eere.energy.gov/kids/tvads.html
ReplyDeletehttp://apps1.eere.energy.gov/education/lessonplans/
sorry, not related to your post ! But thought you'd be interested, as you wrote some energy conversation posts !
please read it as conservation ! ;-)
ReplyDeleteభేషైన పాట,సొగసైన ఎంపిక!(ఈ మధ్య కాలంలో మావాడి దెబ్బకు కె ఐ యన్ జీ వస్తున్నాడూ కింగ్ అన్నపాట వినకతప్పకపోయినా)
ReplyDeleteనేను తరచూ వినేపాటల్లో ఇదొకటి(మనసున మల్లెల మాలలూగెనే,మా ఊళ్ళో ఒక పడుచుంది,ఆజ్ సె పెహలే ఆజ్ సే జాదా ఇవిమరికొన్ని)
ఈ సినిమా,పడమటి సంధ్యారాగం దాదాపు ఒకేసారి అమెరికాలో తీసారు ఇందులో అంతకన్నా పెద్ద రహస్యమేమీలేదు.
సుజాత గారన్నట్లు లత,ఆశా ల విషయములో పొరుగింటిపుల్లకూర పెద్దగా వర్తించదులెండి.ఎందుకంటే లత సంతానం,ఆఖరిపోరాటం తప్ప తెలుగులొ పాడినవెన్నున్నాయి?
అలాగే ఆశా పాలు-నీళ్ళు,చిన్నికృష్ణుడు,చందమామ ఇవి తప్ప లేవని అనుకుంటున్నాను.యన్ టీ ఆర్ అంతటివాడు గ్నానం,రొండు అనగా,ఈ గాయనీమణులు ఒకటీరెండు
మాటలు ఎలా పలికితే పాడితే ఏమిలెండి? గమనించారా అడ్నాన్ సామి అసలు ఒక్క తప్పు లేకుండా తెలుగులో పాడుతాడు?
ఇక ఆలిబర్తి కొస్తే అది ఆ లిబర్టీ కొచ్చిన గొడవ.
ఇంతకీ మొన్నమనవాళ్లెవరో రాసారు యస్పీ కూడా ఎక్కడో ఇలాగే కొన్ని ఉఛ్ఛారణ దోషాలతో ఏదో టీవీకార్యక్రమంలో మాట్లాడారని :)
ఇక్కడ చూసి ఆనందించండి
http://www.youtube.com/watch?v=Dyi-LQkWtAQ
@సుజాత గారు, శ్రీ గారు మరియూ డ్రీమర్ - గాట్ ద పాయింట్, ఎగ్రీడ్, ఛేంజ్డ్ టూ :):)
ReplyDelete@శ్రీ జి- యా, తప్పకండా ఓ పోస్టేసేస్తా కన్జర్వేషన్ మీద.
@ అన్నా నమస్తే - సొగసైన ఎంపిక - మనం ఎప్పుడూ అంతే, మరే, పల్నాడు కదా :):)
మీరన్నట్టు, ఆశాభోస్లే తప్పుపాడితే అది భాష రాక, తెలీక - పెద్ద తప్పేం కాదు. కానీ బాలు, ఉచ్ఛారణా దోషం, మేబి, చాలా వరకూ నేను నమ్మలేకపోయినా, ఎవ్వడూ వంద శాతం భాషమీద పట్టు ఉన్నవాడు లేడు అని నా అభిప్రాయం.
మీగొట్టం, బూతు కాదు, యూట్యూబ్ అని, ఈ పాట యూట్యూబ్ లోకి ఎక్కిందంటే అబ్బో...
ఔను, అద్నాన్ సమి, చక్కగా పాడాడు.
నేను గమనించిన ఇంకో విషయం - కమిటేడ్ యాక్ట్రెసెస్లలో ఒకరైన "సోనాలి బింద్రె" కూడా చక్కటి లిప్ మూమెంట్స్తో నటిస్తుంది. మన్మధుడు కావొచ్చు, లేక, ఇంద్ర కావొచ్చు, లేక, ఖడ్గం కావొచ్చు.
మన దౌర్భాగ్యం, పరభాషా ప్రవీణులచే పాటలు పాడించటం. ఉదాహరణ, ఉదిత్ నారాయణ్. ఈతని పాట నే అస్సలు వినా, నా, పాటని ఫార్వర్డ్ కొట్టేస్తా. వల్లకాదు.
కాస్తో కూస్తో పరాయి పాటగాళ్లలో వినతగ్గ భాష - హరిహరన్, మరియూ శంకర్ మహదేవన్.