Mar 31, 2009

కేకు - తలా ఓ ముక్క

పుట్టినరోజు పిల్కాయ -

కేకు -

Mar 30, 2009

నాలుగో ఏడు

నాకు బాగా గుర్తు. ఆరోజు, మార్చ్ 29, 2005. సాయంత్రం ఐదు అలా అయ్యిందనుకుంటా. దేనికో ఆ రోజు కార్యలాయం నుంది, తొందరగా ఇంటికి చేరుకున్నా. ఇంట్లో అందరికీ కొంచెం ఉద్విగ్నగా ఉంది. ఇంటికి చేరుకోంగనే హరి, ఇక వెళదాం పద అంది. గొంతులో ఓ గుక్క కాఫీ పోస్కునేలోపు, తను, కావాల్సిన అన్ని సర్దుకుంది. ఓ కఱ్ఱల సంచీ సిద్ధం చేస్కుంది. నేను తనూ నా బండి, టి.వి.యస్ స్కూటి మీద బయలుదేరాం. అమ్మా నాన్నా ఆటోలో బయలుదేరారు. అప్పట్లో మేము రాజా అన్నామలై పురం లో ఉండే వాళ్ళం. వెళ్లాల్సింది లజ్-కార్నర్. అభిరామపురంలోంచి సందులు గొందులద్వారా వెళ్తే పెద్ద దూరమేమీ కాదు. వెళ్లాసిన చోటకు చేరుకున్నాం. హరి ని చేర్చుకున్నారు, అందరితో పాటుగా తనకీ ఓ మంచం ఇచ్చారు. కొంతసేపయ్యాక ఇక మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు. నేను, నా స్నేహితుడు బయట అరుగు మీద పడుకోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మానాన్నని ఇంటికి పంపేసాం. ఇక స్నేహితుడు రావటమే తరువాయి. ఇంతలో హరి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకి వచ్చింది. అలా నడిచి వద్దామా అంది. సరే అన్నా. సాయంత్రం ఏడు ఎనిమిది అవుతోంది. ఇంకా కొంచెం వేడిగనే ఉంది. వద్దులే అందాం అనుకున్నా కానీ సరే పదా అని బయటకి వచ్చాం. పక్కనే ఓ చిన్న హోటేల్ ఉంది, వెళ్లి ఓ కాఫీ ఎక్కువ డికాషన్తో తాగాం. చేతిలో చెయ్యిపెట్టి నడుచుకుంటూ మళ్లీ వెనక్కి వచ్చాం. అంతలో అక్కడామే, ఎక్కడకి వెళ్ళారు మీరు చెప్పకుండా అని ఛీవాట్లేసింది తమిళంలో. ఇంతలో స్నేహితుడు వచ్చాడు. ఇక మాకు బయట జాగారం, పిలవని మిత్రబృందాలు మీదపడి పలకరించి వెళ్తున్నారు అదే దోమలు. మొత్తానికి ఏమీ పిలుపు లేదు లోపటి నుండి. ఇంకోవైపు మా అమ్మ నాన్న నుండి దూరవాణి, ఏరా ఏమైనా తేలిందా కదిలిందా కధ అని.
మర్రోజు, మార్చ్ 30, చెన్నైలో మరీ పొద్దున్నే ఉదయిస్తాడు సూర్యుడు, ఐదుకల్లా తెల్లారిపోతుంది. లేచాం, మితృడు కూడా తన గూటికి వెళ్లి కార్యలయానికి వేళ్లిపోతా అని నిష్క్రమించాడు. లోపలి నుండి ఏమీ వార్తలేదు, నేనూ ఇంటికి వెళ్లాను, మా అమ్మ అప్పటికే తయ్యారుగా ఉంది ఇడ్లీ, కాఫీ గట్రా అన్ని తయ్యారుచేసి తను తిని నాకోసం చూస్తోంది. అమ్మని హరి దగ్గర దింపటానికి వెళ్ళేప్పటికి తనని ఇంకో గదిలోకి మార్చారు. గది బాగనే ఉంది. ఏ.సి కూడా ఉంది. అమ్మని అక్కడ దింపి నేను కాలకృత్యాలు తీర్చుకోటానికి తిరిగి ఇంటికి చేరుకున్నా. ఎనిమిది టైం, ఏమి కబురులేదు. నాన్నా నేను బయలుదేరాం అక్కడకి. తొమ్మిది. నెమ్మదిగా నొప్పులు వచ్చిపోతున్నాయ్ అని చెప్పారు, సేయింట్ ఇసబెల్స్ ఆశుపత్రి నర్శులు. అమ్మ లోపల ఉంది, నేనూ నాన్న బయట. పది నలభైకి అనికుంటా తను లేచి లేబర్ రూం వైపు వెళ్లిపోతోంది, నేను ఆగు ఆగు నర్శ్ ని పిలుస్తా అనేలోపే తను లోపకి వేళ్లిపోయింది. సరిగ్గా పదకుండు పదకుండు కి, మూడేమూడు పెద్ద నొప్పులతో ఇంతకళ్లతో, సూరిగాడు పుట్టాడాని, పదకుండూ పదిహేనుకి బయటకి తీస్కొచ్చి మాకు చూపించారు. అమ్మా నాన్న కళ్లల్లో ఆనంద భాష్పాలు, నాకు ఊరట. వెంటనే నామెడలోని గాలి గొలుసుని నర్శ్ ఇచ్చేసా. ఆమె తీస్కోలేదు. బంగారంది కావాలి అంది. మనదగ్గర లేదు అన్నా, సరే అని పిల్లాడ్ని జస్ట్ బార్న్స్ రూమ్ లోకి తీస్కెళ్లిపోయింది.

వీడు పుట్టినప్పటి నుండీ గోలగాడే. ఉన్నట్టుండి ఏడ్చేవాడు. తల ప్రాణం తోక్కొచ్చేది ఆ ఏడుపుని ఆపటానికి. సరే మొత్తానికి...ఈరోజు వాడి పుట్టిన రోజు. నాలుగోది. అప్పుడే నాలుగేళ్లైంది వాడు పుట్టి. రేపీపాటికి నాన్నా ఆపీస్ కెళ్లొస్తా అంటాడేమో, వచ్చే ఏడాదికి, డాడ్, షీ ఈజ్ నాన్సీ, యువర్ డాటర్-ఇన్-లా అంటాడేమో...ఈ క్రింది ప్రకటనలో లాగా

[మానాన్న ఉండి ఉంటే వీణ్ని చూస్కుని వాడితో ఆడుకుంటూ ఆడిస్తూ చాలా ఆనందిస్తూ ఉండిఉండేవాడు. మా అమ్మ నుండి అల్లంత దూరంలో ఉన్నాం మేము. అమ్మలేకుండా వాడి పుట్టినరోజు పడుగ అదో వెలితిగా ఉంది. తోందర్లో పిల్లలు, నానమ్మ దగ్గరకావాలని కోరుకుంటా.]

Mar 27, 2009

ఉగాది శుభాకాంక్షలు

బ్రహ్మాండమంతటికీ విరోధీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది ప్రాముఖ్యం - చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఆశువుగా ఓ కవిత రాసేద్దాం అనుకున్నా కానీ, రాయలేను. ఆశువుగా ఓ వంటకం చెయ్యమన్నా రాయమన్నా రాయగలుగుతానేమో కాని, కవితా!! వల్లకాదు వల్లకాదు వరదారాజా!!!
మొత్తానికి ఉగాది కదూ! సరే, ఉగాది రోజున, ఓ కవిత, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం - విధిగా వినాలి, తినాలి, చెయ్యాలి.
ఆరోజుల్లో, రేడియోలో ఉగాది రోజున కవి సమ్మేళానాలు వస్తుండేవి (ప్రత్యక్ష రేడియో ప్రసారం). ఇంట్లో అందరూ పనులన్నీ పక్కనపెట్టి రేడియో దగ్గర కూర్చుని వినటం ఆనవాయితీ. మా నాన్న పడక్కుర్చీలో, మనం కింద, అప్పుడే కుంకుడుకాయల్తో తలస్నానం చేయ్యటం మూలానో ఏమో కళ్ళు ఎఱ్ఱగా అయిపోయి, ఇల్లంతా కొంచెం పొగతో అంటే తల ఆరటం కోసం సాంబ్రాణి వేసేవాళ్ళుగా, మరియూ ముద్దపప్పు మరి కుంపటి మీదనేగా వండేడి ఆ పొగ, అలా కూర్చుని రేడియో వినటం. ఇంత సుందరమైన దృస్యం అది. అహా!! ఉగాది పచ్చడి, మావిడి తోరణాలు, ఓ పండుగ వాతావరణం, ఇంకో వైపు వంటింట్లో మా అమ్మ గారెలు, పొంగలి/పరమాన్నం చేస్తూ...ఇప్పుడు రెడీమేడ్ పచళ్లే వచ్చాక కవితలెక్కడ వింటాం, విన్నా ఈ సోకాల్డ్ కవులదగ్గర కులంకంపో లేక బ్రాందీ కంపో. ఈ పచ్చళ్ళమ్మే దుకాణాలపై నా వ్యాఖ్య "సందుకో స్వగృహా, ఉన్న గృహాల్ని ముంచేసాయ్".
ఉగాదికనే కాదు, ఏ పండగైనా గారెలు, పరమాన్నం లేక పొంగలి లేకపోతే ఏదో వెలితి.
[కన్న కొడుకులు లేక కూతుళ్లు ఎక్కడో దూరాలలో ఉంటూ, గడచిన రోజుల్ని నెమరేస్కుని బతికే ఆ తల్లితండ్రుల ఒంటరి జీవితాలకి పండుగ అనేదే లేకుండా పోయిందీ ఈ రోజుల్లో. పిల్లలొస్తేనే మాకు పండుగ అనే తల్లితండ్రుల కోసం - దేవుడా, కనికరించి, ఈ ఏడాదైనా ఆ తల్లితండ్రులని తమ పేగులవద్దకు చేర్చు, వారి జీవితాల్ని మళ్లీ పండుగమయం చేయి]
నాకు బాగా గుర్తు, ఓ సంవత్సరం ఉగాది కవి సమ్మెళనానికి గొల్లపూడి మారుతీ రావుగారు అధ్యక్షతవహించారు. బ్రహ్మాండాంగా నడిచింది ఆ సమ్మేళనం. ఆరోజులు మళ్లీ వస్తే బావుండనిపిస్తోంది. ఎందుకంటే కవులు, కవితలు, సాహిత్యాభిలాష లాంటివి ఇప్పుడిప్పుడే నాలో జీవం పోసుకుంటున్నాయి.
ఈ సంవత్సరంకూడా సాధ్యమైనంతలో సత్-చింతన కలిగి, సత్-సాంగత్యంతో, సత్-బాటలో పయనించాలని కోరుకోటమే, ప్రయత్నించటమే.
ఇక్కడి మా ఊళ్లో శనివారం ఉగాది ఉత్సవాలు జరుపబోతున్నారు. నేను ఓ "తెలుగు బ్లాగరు"గా తెలుగుబ్లాగుల సమాహారాల వివరాలనూ, నా బ్లాగులను ఒక కరపత్రంలా ముద్రించి అందరికీ "తెలుగులో రాయండి, తెలుగు మాట్లాడండి, తెలుగు చదవండి" లాంటి నినాదాలతో పంచబోతున్నా. అలానే తె.బ్లా సమాహారాలైన "కూడలి", "జల్లెడ", "లోగిలి" ఇత్యాది వివరాలను జనుల ముందుంచబోతున్నా.
అలానే మన మాష్టారుగారు దుర్గేశ్వర రావు గారు మొదలుపెట్టిన "హనుమత్ రక్షా యాగం" గురించిన కరపత్రం కూడా అందరికీ అందించబోతున్నా.
మీ అందరికీ విరోధీ నామ సంవత్సరం శుభమౌగాక.
మీ కోరికలు నెరవేరు గాకా.
మీ అందరి మనస్సులు ఆ భగవంతుని సేవకు అంకితమౌగాక.
మీ అందరికీ మానసిక ధృడత్వం కలుగుగాక.
మన దేశం, రాష్ట్రం ఉగ్రవాదుల బారిన పడకుండా, నిజమైన అభివృద్ధి వైపు పయనించుగాక.
ప్రపంచం ఆర్ధిక మాద్యం నుండి కోలుకుని సక్రమమైన మార్గంవైపు నడుచుగాక.

Mar 26, 2009

గంట మీటింగు, ఇరవై సెకండ్లలో పూర్తి

మా టోనీ గాడు, వాడి కెమెరాతో, కెమెరా లోని టైమెర్ సహాయంతో ప్రతీ పది నిమిషాలకి ఒక స్నాప్ తీసేలా సెట్ చేసి, గంట నిడివి మీటింగుని తన కెమెరాలో బంధించి, ఒక మూవీలా తయ్యారుచేసాడు - ఇదిగో ఇక్కడ చూడండి. గంట మీటింగు, ఇరవై సెకండ్లలో పూర్తి...

Mar 21, 2009

జెయింట్ ఫర్ సేల్

ఇదో తెల్ల ఏనుగు మాత్రం కాదు, కాని కొంచెం కుంటుపడిందంతే.

విషయానికొస్తే - సూర్య సూక్ష్మ వ్యవస్థ అనగా సన్ మైక్రోసిస్టంస్ అమ్మకానికొచ్చింది. మీలో ఎవ్వరైనా ఆసక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చు.
నా దృష్టిలో దీన్ని వీళ్లు కొనగలరు.
౧. ఐ.బి.యం
౨. యాపిల్
౩. హెచ్.పి
౪. సిస్కొ
లాస్ట్ బట్ నాత్ దీ లీస్ట్ ౫. ఒరాకిల్

వీటిల్లో ఐ.బి.యం కొనబోతోందని పుకార్లు కూడ వినిపిస్తున్నాయ్. అయితే ఇక్కడ కొన్ని సాంకేతిక మైన సమస్యలు ఉన్నాయి. చంద్ర బాబు, రాజశేఖరు ఇద్దరు రెండువర్టికల్స్. ఇద్దరు ఒకటైతే ఎలా ఉంటుంది? ఫండమెంటల్ సమస్యలు ఎదురౌతాయ్.
ఎలా?
సన్ వాళ్ల అత్యతం ప్రాచుర్యం పొందిన టెక్నాలజీ - స్పార్క్ సిస్టంస్, మరియూ సొలారిస్ అనే ఓయస్.
ఐ.బి.యం వారి అత్యతం ప్రాచుర్యం పొందిన టెక్నాలజీ - పవర్ సిస్టంస్ మరియూ ఎ.ఐ.యక్స్ అనే ఓయస్.
సొలారిస్ అనేది ఎ కంప్లీట్ యునిక్స్. ఇది యస్.వి.ఆర్ ఫోర్ ఆధారిత ఓయస్.
ఎ.ఐ.యక్స్ అనేది కూడా కంప్లీట్ యునిక్స్. ఇది యస్.వి.ఆర్ త్రి ఆధారిత ఓయస్.
ఈ రెండు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయ్ మార్కెట్లో. నాకు తెలిసి, సొలారిస్ మార్కెట్లో లీడింగ్ సర్వర్ బ్రాండ్. అలానే సొలారిస్ ఎ.ఐ.యక్స్ కన్నా అడ్వాన్స్డ్. కాబట్టి ఐ.బి.యం సున్ ని కొంటే మార్కెట్లో ఆల్రెడీ సన్ ని వాడుతున్నవాళ్ల ఆలోచనా ధోరణి మారిపోతుందేమో. ఐ.బి.యం వారు సన్ ని కనక కొంటే ఔను సొలారిస్ ఎ.ఐ.యక్స్ కన్నా అద్భుతమైనది అని చెప్పాల్సి రావొచ్చు. అలా చెప్పగలరంటారా?

ఇక యాపిల్ వారు - వీరు ఐఫోన్ వచ్చాక అస్సలు సర్వర్ టెక్నాలజీస్ని మూసేస్కుంటున్నారు అని వినికిడి. కాబట్టి వీరు కొనరు.
హెచ్.పి - వీళ్లు ప్రొప్రైటరీ సర్వర్స్ ఉన్నాయి. వాటిని ప్రోలియంట్ సర్వర్స్ అంటారు. వీరి ఓయస్ హెచ్.పి-యుయక్స్. కానీ ఇదో చెత్త యునిక్స్. ఇది స్కొ యునిక్స్ కి ఎక్స్టెంషన్ గా ఉంటుంది. అయినా వీరి ముఖ్య మార్కెట్టు కంజ్యూమర్ రేంజ్. కాబట్టి వీరూ కొనరు.
సిస్కో - సిస్కో కనుక సన్ ని కొంటే అదో పెద్ద అస్సెట్ అవుతుంది సిస్కోకి. వాళ్లిప్పటిదాకా ఇన్ హ్యాండ్స్ విత్ హార్డ్వేర్ ఉన్నారు కాని వారి సొంత సర్వర్ టెక్నాలజి లేదు. మరియూ ఐ.బి.యం మొనొపొలి కాకుండా ఆపినవారైతారు.

ఇక మిగిలింది - ఒరాకిల్. వీరికి ప్రత్యేమకైన ఓయస్ లేదు, సర్వర్ టెక్నాలజీ లేదు. ఎన్నో సార్లు ప్రయోగాలు చేసి చేతులు కళ్ళు కాల్చుకున్నారు కూడా. వీరు కనక సన్ ని కొంటే ఓ నిండుతనం వస్తుంది అని నా అభిప్రాయం. ఐతే, కొందరు ఇలా అయితే అది సన్ కి లాభం కాని ఒరాకిల్ కి ఏమి లాభం లేకపోగా, వాళ్లకి డిబి2 లాంటి ముద్ర పడుతుంది అని.

మీకు తెలుసుగా డిబి2 అనేది అత్యంత మెరుగైన డేటాబేస్ సిస్టం అని. ఐతే దానిమీద ముద్ర - వెన్ యూజ్డ్ ఆన్ ఎ.ఐ.యక్స్ లేక మెయిన్ఫ్రేమ్స్ మాత్రమే. మరియూ దీని లైసెన్సు చాలా ఖరీదు కూడా..

చూద్దాం ఏంజరగబోతోందో..

Mar 20, 2009

ఆహార పరిశోధకులు

మనం తినే ఆహారంలో ట్రాన్స్-ఫ్యాట్ ఎంత ఉటుంది?
మనం వాడే నూనెలు ఎంతవరకూ మంచివి?
అసలు ఫ్రై కోసం వాడే నూనెని ఎన్నిసార్లు తిప్పి తిప్పి వాడొచ్చు?
ఏ నూనె మంచిది?
ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ఈ కార్యక్రమాన్ని చూసి తీరాల్సిందే. ఇది ఫుడ్నెట్వర్క్ వారి ఫుడ్ డిటెక్టివ్స్ అనే కార్యక్రమం.



Ted Allen అనేవాడు దీనికి వ్యాఖ్యాత. మొన్న దీన్లో ఈ క్రిందివాటిని గురించిన కార్యక్రమాన్ని చూపించాడు, టెడ్ ఆల్లెన్ గాడు:
రుచి పరీక్ష. అంటే, కళ్లు, ముక్కు మూస్కుని ఓ పదార్ధాన్ని తిని అదేంటో చెప్పాలి. బంగాళదుంపని ఇలా తిని అదేంటో చెప్పగలరా, అలానే కళ్లు ముక్కు మూస్కుని ఓ యాపిల్ ముక్కని తిని అదేంటో చెప్పగలరా.
అలానే, ఫ్రైడ్ ఫుడ్ ఎంతవరకూ ఆరోగ్యకరం? ఏది అత్యంత వాడతగిన, ఆరోగ్యకరమైన నూనె? చివరగా, కత్తిపెట్టి తరగటానికి/కొయ్యటానికి, చెక్కపీట బెస్టా లేక ప్లాస్టిక్కు పీట బెస్టా?
వీడి రీసెర్చి, పరీక్షల ప్రకారం - బెస్ట్ నూనె - వెజిటెబిల్ ఆయిల్. మనం అనుకున్నట్టుగా పల్లీ నూనె మరీ అంత డేంజరస్ కాదు. అదో పెద్ద కాన్స్పిరసి అనిపించింది నాకు. ఐతే, మళ్లీ మళ్లీ వాడటం ఏడీ మంచిది కాదు. ఇలా మళ్లీ మళ్లీ వాడితే ట్రాన్స్-ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది నూనెల్లో, పల్లీ నూనెలో కూడా. పొద్దుతిరుగుడు నూనే కూడా అంటే, మళ్లీ మళ్లీ వాడకూడదు.
మాంసం తినేవాళ్లు, కత్తితో మాంసాన్ని కొట్టటానికి చెక్కపీటనో(వుడెన్ బోర్డ్) లేక ప్లాస్టిక్కు పీటనో(ప్లాస్టిక్ బోర్డ్) వాడతారు. వీళ్ల పరీక్ష -
౧. కొత్తవి, అప్పుడే తీసిన చెక్క,ప్లాస్టిక్కు పీటలు -
వీటిమీద మాంసాన్ని కొట్టి లేక తరిగి, కడిగి, మరుసటిరోజు వాటి మీద ర్యాండంగా అక్కడక్కడా పరీక్ష కలెక్టర్ తో అద్ది, పరీక్షా విధానానికి వాటిని గురిచేసి, పరీక్షచేసి ఇలా తేల్చారు -
కొత్త చెక్క పీటైనా, లేక ప్లాస్టిక్కు పీటైనా, ఒక సారి వాడాక వాటిపై సమానమైన బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, తేలిందేంటంటే - మాంసాహారులు - బహుపరాక్ అని. మీరు వాడే బోర్డ్స్ ని వినిగర్ తో శుభ్రంగా కడుక్కుని తీరాలి అని.
౨. పాతవి చెక్క, ప్లాస్టిక్కు పీటలు-
వీటిమీద గాట్లు పడి ఉంటాయి కాబట్టి, ఆ గాట్లలో పదార్ధం కొంత మిగిలి ఉండే అవకాసాలు ఎక్కువ. పైన పరీక్షలు వీటీమీద జరిపితే తేలింది ఇది-
పైన వాటికన్నా వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. ఐతే - చెక్కలో ఆ శాతం తక్కువగా ఉంది. కారణం - కొంత శాతం బ్యాక్టీరియాని చెక్క పీల్చేస్కుంటుంది, మరియూ, చెక్కలోని కొన్ని గుణాల వల్ల, కొంత శాతం బ్యాక్టీరియా నశిస్తుంది.
యేమైనా వినిగర్ తో, వేడి నీళ్లలో ఈ పీటల్ని శుభ్రంగా కడుక్కుని వాడుకోవటం మంచిదీ.
వీళ్లు తేల్చిందేమంటే, చెక్క పీట మంచిది అని.
వీళ్లు ఇచ్చే సలహా - కూరగాయలు తరగటానికి ఒక పీటనీ, మాంసాలను కొట్టటానికి ఇంకో వేరే పీటనీ వాడటం ఆరోగ్యకరం అని.

Mar 19, 2009

మాలామాల్ వీక్లీ


2006 లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగులో కూడా తీసారు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అని.
సరే కధ ఏంటంటే, ఓ ఊళ్ళో లాటరీ టిక్కెట్లు అమ్ముకునే ఒకాయన, తను అమ్మిన ఓ టిక్కెట్టుకి బంపర్ డ్రా తగిలిందని తెల్సుకుంటాడు. అది ఎవరికి దొరికిందీ ఏంటి అని ఊరుని తూర్పార పడితే యాంతొని అనే వాడి టిక్కెట్టే అని తెల్సుకుని, వాడి దగ్గరకి వెళ్లి బాసు, నాకు ఇనాం మంచిగా ఇవ్వు అని చెప్పేంతలో యాంతొని చచ్చిపొయ్యాడని తెల్సుకుంటాడు. అదే సమయంలో అక్కడకి ఇంకోఅతను వచ్చి యాంతొనిని ఇతను చంపుతున్నాడు అనుకుని జనాల్ని పిలవటానికి వెళ్లబొయ్యేంతలో ఆ టికెట్లతను, బాసూ ఇదీ సంగతి, డ్రా తగిలింది, వాడు ఆ ఆనందంలో సచ్చిపోయినట్టున్నాడు అన్జెప్పి, మనమిద్దరం సగం సగం కొట్టేద్దాం అంటాడు. ఇంతలో ఇంకోడు తగులుతాడు, వాడికీ నచ్చజెప్పి, సరే డ్రా ని ముగ్గురం సమానంగా పంచుకుందాం అంటాడు. ఇంతలో ఆ యాంతొని గాడి సిస్టర్ వస్తుంది. ఆమెకి నచ్చజెప్పి అందరం సమానంగా పంచుకుందాం అంటాడు టికెట్లవాడు. ఇంతలో కొంతమంది కూలీలు వచ్చి, యాంతొని మమ్మల్ని రమ్మన్నాడు, డ్రా గెల్చిడాటకదా డబ్బిస్తా అన్నాడు అందుకే వచ్చాం అంటారు. టిక్కెట్లవాడు అందర్నీ లెక్కబెట్టి, సరే అందరం సమానంగా పంచుకుందాం అంటాడు. ఇంతలో మరి యాంతొని శవాన్ని ఖననం చేద్దాం అనుకుంటారు అందరూ. దానికి ఓ పాదరీని తెస్తారు అతన్నీ చేర్చుకుంటారు భాగస్తుడిగా. ఇలా ఊరంతా దాదాపు ఆ డ్రా డబ్బులో భాగస్తులౌతారు.
ఇప్పుడీ కధ దేనికంటే -

కరెక్టుగా ఈ కధ మహా కూటమికి సరిపోతుంది. సీట్ల పంపకాలు, టీ.ఆర్.యస్ భాగం, కమ్యూనిష్టుల భాగం ఇంకా తేలక ముందే, మందా కిట్న మాదిగ మేమూ జేరతాం, మాకెంత అని. అంతలోనే జూ.యంటీఆర్, మావాడికి సీటు కావాలి అని..వాహ్....భలే ఉంది సినిమా.

Mar 13, 2009

పిల్లలు - ఊహ - మరోప్రపంచం

ఈపూట ఇంటికొచ్చినాక, మావాడి ఘనకార్యాలన్నీ ఏకరువు పెట్టింది మావిడ (ఇదో కొత్త పదం, సాధారణంగా మా ఆవిడ అంటారు, మనం కొంచెం గమ్మత్తుగా మావిడా అని క్రియేటు జేసాం). సూర్యా, నువ్వు వేసిన బొమ్మ చూపించావా అనంగనే మావాడు మొహం వెయ్యి వోల్టులతో వెలిగిన బల్బులా పెట్టి ఓ బొమ్మని తెచ్చాడు. దాని రెండు వెర్షన్స్ ఇక్కడపెడుతున్నా.
ఇది అసలు బొమ్మ. దీని పేరు, వాడు పెట్టింది ఉల్ఫ్ ఆన్ ఏ రాక్.

ఇప్పుడు నెర్రేటేడ్ బొమ్మ ఇది.

వాడి నెర్రేషన్ ప్రకారం -
1. ఉల్ఫ్
2. హార్ట్ (ఇక్కడా హార్ట్ దేనికి వేసాడో అర్ధం కాలేదు)
3. రాక్
4. ఎన్నో తోకలు ఉల్ఫ్ కి (అన్ని దేనికో. అవసరం వచ్చినప్పుడూ వాడికి ఒకటి ఇస్తుందనేమో)
5. మబ్బు - లైటెనింగ్స్
6. A D F H - వాడి భాషలో, డేంజరస్ స్పెల్లింగు అది.

Mar 12, 2009

మ్యాన్ - సూపర్ మ్యాన్ - ఔర్ వో

ఈ మధ్య ఏదో సినిమాలో, ధర్మవరపు సుబ్రహ్మణ్యం సునీల్ అనుకుంటా ఇలా మాట్టాడుకుంటారు -
మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటి అని
మ్యాన్ జెట్టీ వేస్కుని పంట్లాం వేస్కుంటే, సూపర్ మ్యాన్ పంట్లాం పైన జెట్టీ వేకుంటాడు.
బానే ఉంది, నవ్వుకున్నాం, మరి జెట్టీని తలకి వేస్కుంటే ఏమంటారు?
ఇక్కడ చూడండి

మొన్న వారంతం, నేను కార్ స్టార్ట్ చేసి వస్తా ఈ లోపల నువ్వు అండర్ ప్యాంట్స్ వేసుకుని ప్యాంటేస్కో అనిజెప్పి వెళ్లిచ్చి చూస్తే ఇదిగో ఇలా తలకి వేస్కుని మైమరచిపొయ్యి టీవీ చూస్తున్నాడు సూరిగాడు.

Mar 11, 2009

జీవితం సప్త సాగర గీతం

ఆశాభోస్లే తెలుగులో ఎన్నిపాటలు పాడిందోగాని, నేను విన్నది మాత్రం ఇది.
సినిమా - చిన్ని కృష్ణుడు
సంగీతం - పంచందా (ఆర్.డి. బర్మన్)
పాడినవారు - ఆశా తాయి, మరియూ బాలు.
రాసిన వారు - వేటూరి
సినిమా దర్శకత్వం - జంధ్యాల

ఆశా:
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా

ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ

బాలు:
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట
మతి కృతి పల్లవించే చోట
ఆశా:
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
బాలు:
సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట
కృషి ఖుషి సంగమించే చోట
ఆశా:
జీవితం సప్త సాగర గీతమ్
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా

ఈ పాట బాగుంటుంది. అయితే, ఆశా కొన్ని పదాలని ఖూనీ చేసింది. ఒకచోట కౌగిలించే చోట ని కోగిలంచే చోట అని పాడింది. జంధ్యాల వారు ఇలా ఎందుకుచేరబ్బా? నా చిన్న మట్టి బుర్రకి కొన్ని చరణాలు అర్ధంకాలా అవి.
ఇక్కడ వినండి ఈ పాటని:

మీకు అర్ధం అయితే చెప్పండి...

Mar 6, 2009

దూడజచ్చింది

ముంగటి మాట. గొడ్డు గోదా ఉన్న ఇంటో కష్టాలు కన్నీళ్లు ఉండవంటారు. ఎందుకయ్యా అంటే అట్టాంటియన్నీ ఆ మూగ గొడ్డుకి సెప్పుకుని కూసింత ఊరట పడతారు. అదో దైర్నం.
ఏఏటికాయేడు మాఇంట గొడ్డు గోదా పెరగతనే ఉండాయి. పోయినేడాది రెండుగేదెలు, ఓ పెయ్య, ఓ పడ్డ ఉంటే, ఈ ఏడాది రెండుగేదెలూ సూలుకొచ్చినయ్యి. నూకల సివరావయ్య దున్నపోతుసేత దాటిపిచ్చినం. రెండుమానికల నూకలు ఎత్తకపోయిండు దున్నపోతుకని. దసరా మర్నాడు, ఓ గేదె ఈనింది.
మా ఇండ్లల్ల దూడిబుట్టినా పిల్లలు పుట్టినంత సంబరంగుండిద్ది. అయి, అటు ఇటూ దూకుతుంటయా పిల్లకాయలమాదిరి, సూట్టాకి సమ్మంగుడిద్ది. పిల్లకాయలమాదిరిగనే దొరికింది నోటికాడబెట్టుకుంటయి. మనెమ్మటాబడతయి, కాళ్లకడ్డంబడతయి, గారాలు బోతయి, ఒక్కోపలి జొన్న సొప్పకాడికిబొయ్యి కొరుకుతయి. ఆ సొప్ప అంగిట్లో గుచ్చకపోయిద్ది. కుడితిలో మూతులుబెడతయి. అందుకే ఆటికి సిక్కం గడతం. మా ఇంటికాడి పిల్లలు ఆటితో పొద్దస్తమానం ఆడతనే ఉంటరు. పిల్లోళ్లకి అదో ఆట, సంబరం.
పొద్దున, సోయంకాలఁవ్ దూడని పాలకి వదుల్తం. అది కడుపునిండా పాలు కుడుసుకున్నాక, మా ఆడోల్లు పాలుపిత్తుక్కుంటరు. ఒక్కోపాలి అరగంటో ఆలసం అయితే బర్రె సేపుకొచ్చి పాలుకారిపోతయ్యి. పాలు కేంద్రానికి పోస్తం. ఏదో సలికాలానికి ఎండ్లకాలం, ఏడినీళ్లకి సన్నీళ్లు, ఓ నాలుగు రాళ్లు ఎనక్కేస్కోఅచ్చని ఆశ. మడిసి ఆశాజీవి. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా, గొడ్డుగోదా ఉంటే ఓ దైర్నం, అయ్యి, తరగని ఆస్థులు. అయ్యి అట్టా పెరుగుతనే ఉండాల. వచ్చేఏటికి ఆరుగావాల.
ఈపాలి, దీపాలపండక్కి ఓ రెండోరాలా ముందు, సిన్న దూడకి నోటెమ్మట నురగపడింది. పశువులాస్పత్రికి ఎత్తుకెళ్లినా. కాంపాండరు గోపయ్య, సూసిండు. ఓ నాలుగు గొట్టాలిచ్చిండు. ఇంటికెత్తుకొచ్చిన దూడని. నల్లని దూడ. తెల్ల కాళ్లు. మహా ఉషారైన దూడా. మట్టితిన్నపావులా నేలకోరగిలబడి కూసున్నది. కళ్లూదోమాదిరిగైఉండయ్యి.
మర్రోజు పొద్దునికి దూడపోనేపోయ్యింది. దూడజచ్చింది. ఓ అయిపు గేదె అరుపులు, రంకెలు బెడుతుండింది. సేపుకొచ్చిందాయా, ఇంకో అయిపు, కన్న పేగు సూస్కోవాలిగా, దోడని నాక్కోవాలిగా, తల్లిపానం. ఇంటికాడి ఆడోళ్లందరూ, జేజమ్మ, నా యమ్మ, నా పెండ్లాం ఓ చోటజేరి కళ్లల్ల నీళ్లు గుక్కుకుంటూండిరి. పిల్లకాయలు దూడజుట్టూ జేరి ఓ మాదిరిగా సూస్తుండిరి.
ఇంతలా నేబొయ్యి మా ఊరి ఎట్టోడికి జెప్పొచ్చినా. ఆడు బండిగట్టుకొచ్చి, దూడని దీసకపోయ్యిండు. లోన బొమికలు అన్నీ తీసిపక్కన్నూకి, దాన్ల గడ్డిపెట్టి కుట్టి ఇంటికాడ నూకిండు. వానికో మానిక వడ్లుబోసి దూడని అట్టా పెట్టినం గుమ్మంకాడ.
సోయంకాలఁవ్ పాలపితికే ముంగట, ఈ దూడబొమ్మ చేత పాలు తాగిపించినట్టుగా జేస్తేనే ఆ గేదె పాలిచ్చేది, లేకుంటే తన్నుద్ది.
వచ్చేఏటికి ఇంకో రెండు గొడ్లు పెరుగుతై అనుకుంటే బగమంతుడు ఇట్టాజేసిండు.

Mar 5, 2009

సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ

जैसे सूरज कि गर्मी से जलते हुए तन को
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ

Film: Parinay (1974)
Music: Jaidev
Lyrics: Ramanand Sharma
Singer (s): Sharma Bandhu

जैसे सूरज की गर्मी से जलते हुए तन को
मिल जाये तरुवर कि छाया
ऐसा ही सुख मेरे मन को मिला है
मैं जबसे शरण तेरी आया, मेरे राम

भटका हुआ मेरा मन था कोई
मिल ना रहा था सहारा
लहरों से लड़ती हुई नाव को
जैसे मिल ना रहा हो किनारा, मिल ना रहा हो किनारा
उस लड़खड़ाती हुई नाव को जो
किसी ने किनारा दिखाया
ऐसा ही सुख ...

शीतल बने आग चंदन के जैसी
राघव कृपा हो जो तेरी
उजियाली पूनम की हो जाएं रातें
जो थीं अमावस अंधेरी, जो थीं अमावस अंधेरी
युग-युग से प्यासी मरुभूमि ने
जैसे सावन का संदेस पाया
ऐसा ही सुख ...

जिस राह की मंज़िल तेरा मिलन हो
उस पर कदम मैं बढ़ाऊं
फूलों में खारों में, पतझड़ बहारों में
मैं न कभी डगमगाऊं, मैं न कभी डगमगाऊं
पानी के प्यासे को तक़दीर ने
जैसे जी भर के अमृत पिलाया
ऐसा ही सुख ...
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా
అయిసా హి సుఖ్ మెరె మన్ కొ మిలా హై
మై జబ్ సె శరణ్ తెరీ ఆయా, మెరే రామ్
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా
భటకా హువా మెరా మన్ థా కోయి
మిల నా రహా థా సహారా
లహరోం సే లడ్తీ హుయీ నావ్ కో
జైసె మిల్ నా రహా హో కినారా, మిల్ నా రహా హో కినారా
ఉస్ లఢ్కఢాతీ హుయీ నావ్ కో జో
కిసీ నె కినారా దిఖాయా
అయిసా హి సుఖ్ మెరె మన్ కొ మిలా హై
మై జబ్ సె శరణ్ తెరీ ఆయా, మెరే రామ్
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా
శీతల్ బనీ ఆగ్ చందన్ కె జైసి
రాఘవ్ కృపా హో జొ తెరీ
ఉజియాలీ పూనమ్ కీ హో జాయే రాతేఁ
జో థీ అమావాస్ అంధేరీ, జో థీ అమావాస్ అంధేరీ
యుగ్ యుగ్ సే ప్యాసీ మరుభూమి నె జైసె
సావన్ కా సందేశ్ పాయా
అయిసా హి సుఖ్ మెరె మన్ కొ మిలా హై
మై జబ్ సె శరణ్ తెరీ ఆయా, మెరే రామ్
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా
జిస్ రాహ్ కీ మంజిల్ తేరా మిలన్ హో
ఉస్ పర్ కదం మై బఢావూఁ
ఫూలోం మె ఖారొం మె, పత్ఝడ్ బహారోం మే
మై న కభీ డగ్మగావూఁ, మై న కభీ డగ్మగావూఁ
పానీ కె ప్యాసె కో తక్దీర్ నె జైసె
జీ భర్ కె అమృత్ పిలాయా
అయిసా హి సుఖ్ మెరె మన్ కొ మిలా హై
మై జబ్ సె శరణ్ తెరీ ఆయా, మెరే రామ్
జైసె సూరజ్ కి గర్మి సె జల్తె హుయె తన్ కొ
మిల్ జాయె తరువర్ కి ఛాయా



ఈ పాట ఇప్పుడు నా పాడ్కాస్ట్ లో లభ్యం. ఐట్యూన్స్లో వినటంకోసం ఇక్కడ నొక్కండి లేక ఇక్కడ
http://bhaskar.posterous.com/untitled-29052