చిరంజీవి తెలంగాణ పై వ్యాఖ్య. ప్రజలే వెయ్యి గొంతుకలతో అరిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలి.
ప్రజలు నిజంగానే ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటున్నారా?
ఒక ప్రత్యేక రాష్ట్రం జనజీవితాల్ని ఎలా మార్స్తుంది? ఆనాడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరుకోరుకున్నారు? గోవిందపురంలో ఒక ఎకరం పొలం సేద్యం చేస్కునే వానికి ఇవి అన్నీ నిజంగనే తెలుస్థయా?
కాంగ్రేసును బొందపెడతాం: కె.సి.ఆర్
పిచ్చివాగుడు ఆపకపోతే నీ గోరీ నీచేతే కట్టిస్తాం: జనం
Posted by భాస్కర్ రామరాజు at 4:08 AM
4 comments:
nice said...
ఈయన చెప్పే జనం ఆంధ్రా జనం మాత్రమే. తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. కాంగ్రేస్ ను బొందపెట్టాలంటే ఈ ఆంధ్రా బిడ్డకెందుకో నొప్పి..!! కలిసి ఉండాలనే పాకులాట ఎందుకో...!!
September 23, 2008 7:00:00 AM IST
భాస్కర్ రామరాజు said...
చిచ్చా!! క్యా బోలా!! మంచిగుంది నీ తెలివి. కెసిఆర్ నీ కళ్ళల్ల కారంగొడ్తడు. ముందు గజూస్కుపో పొయ్యి. నేను ఆంధ్ర బిడ్డనో నా తల్లి బిడ్డనో నాకు మంచిగదెల్సు. నాల్గున్నర సమచ్చరాలు బట్టింది కెసిఆర్ గానికి, కాంగ్రేసు బొంద బెట్టాలని తెల్సుకునేటందుకు. కల్సి ఉండాలని పాకులాటెవ్వనికుంది మియా? నాకేంలే. ఐనా కల్సుందాం అనేటందుకు నేనవ్వన్ని? వద్దనేటందుకు నువ్వెవ్వనివి? శతకోటి గొఱ్ఱెల్లో బోడిగొఱ్ఱెవా?
September 23, 2008 7:35:00 AM IST
భాస్కర్ రామరాజు said...
తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. మంచిగ చెప్పినవ్. మరి తెలంగాణ తెస్తమని జనాలకి మాయమాటల్జెప్పిన కెసిఆర్నేజేయాలే?
ప్రత్యేక రాష్ట్రం ఒక బస్తా బియ్యం ఎక్కువ పండిస్తుందా?
కాళ్లల్లో దిగిన ముల్లుతీయ్యండ్రా బాబు అని ఓ వైపు పేదోడు, రైతూ, జనం ఆత్మహత్యలు చేస్కుంటుంటే నాకునీతో కలిసి ఉండటం ఇష్టమ్లేదు, ప్రత్యేకం కావాలి అంటాడొకడు, లేదు లేదు ప్రాజెక్టులు అన్నీ మీకేనా అంటాడు ఇంకొకడూ, ప్రత్యేక రాష్ట్రం వస్తే మతాల కుమ్ములాట అవుతుంది అంటాడు ఇంకొకడు. విడిపోదాం, గౌరవించుకుందాం అంటాడు ఇంకొకడు. సందట్లో సడేమియా బాంబులేస్తాడు ఇంకొకడు. అసలు సామాన్య మానవునికి ఏంగావాలో ఎవ్వనికి పడుతుంది? వాని గురించి వానికే పడతల్లేదు....
Oct 31, 2008
Oct 30, 2008
నా మరొక బ్లాగు
ప్రాజెక్టువర్క్స్
మన తరం నుంచి ముందితరానికి మనం ఎలాంటి సమాజాన్ని ఇవ్వాలి? లంచగొండి ప్రభుత్వాల, ప్రభుత్వోద్యోగుల ఆగడాలని అరికట్టి సమూలంగా లంచాన్ని రూపుమాపాలంటే? మన మౌళిక అవసరాల్ని మనమే నిర్మించుకోవాలంటే? మనకి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రక్తం కావాలి. అలాంటి ఒక్కో ఆలోచన ఒక్కో కొత్త ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుల్ని ముందుకుతేవటమే నా ఈ బ్లాగు లక్ష్యం. యువతకి మార్గనిర్దేసమే ప్రాజెక్టుల లక్ష్యం
http://projectsforfuture.blogspot.com/
మీరూ నాలాగా ఆలోచిస్తున్నారా? మీకు నాలా మన సమాజం, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఇలా ఎందుకు ఉండకూడదూ అనిపిస్తున్నదా? మీకూ నా దేశంలో ప్రజలకి ఇవి ఎందుకులేవు అనిపిస్తున్నదా? మీరూ సమాజంలో మార్పు కోరుకుంటున్నారా? నాతో మీ ఆలోచనల్ని పంచుకోండి. నా ఈ-పోష్టు projectsforfuture@gmail.com

Oct 27, 2008
దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి, మీలో కొత్తవెల్గుల్ని నింపాలనీ, మీలో మీరు కొనుగొనని కొత్త మిమ్మ్మల్ని చూపాలనీ ఆశిస్తూ..
భాస్కర్, హరిత, సూర్య ప్రణవ్ మరియూ అనఘ
భాస్కర్, హరిత, సూర్య ప్రణవ్ మరియూ అనఘ
Oct 24, 2008
ఇంట్లో చిరుతిండ్లు అ.క.అ. snack @ home
సీజనల్: ఉడకబెట్టిన కందికాయలు, పుల్లశనగ గుగ్గిళ్ళు, కంది గుగ్గిళ్ళు, ఉడకబెట్టిన వేరుశనగలు/వేరుశనక్కాయలు,వేపిన వేరిశనక్కాయలు, అలచంద గుగ్గిళ్ళు, తాటిముంజలు, రేక్కాయలు, పుల్లరేక్కాయలు, ఈత కాయలు, నేరేడు కాయలు, తేగలు, తాటి బూరెలు, తాటి కుడుములు, తంపటేసిన వేరుశనక్కాయలు, శనక్కాయలు, చెరుగ్గడలు, పెసర కాయలు, మొక్కజొన్న కండెలు.
నిలవ ఉండేవి : కారప్పుస, చెక్రాలు, కజ్జికాయలు, చెక్కలు(తెల్ల నువ్వులేసినవి, సగ్గుబియ్యంవి), కొబ్బరిలౌజు, బెల్లప్పుస, వేయించిన అటుకులు, మైసూర్పాక్, బూంది, బూంది లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు, గోధుమ పిండితో చేసేవి కొన్ని - గవ్వలు, అరటికాయలు గట్ర. ఎప్పుడో ఒకటి రెండు సార్లు కట్టెలపొయ్యిమీద చేసిన కారప్పూస తిన్న జ్ఞాపకం. అదుర్స్.
పండగలకి పబ్బాలకి చేసేవి: సజ్జ బూరెలు. అరిశెలు, గారెలు
అప్పటికప్పుడు తినేవి: వడలు, పకోడి, తప్పాల చెక్కలు, "పుట్నాలపప్పు/వేయించినశనగపప్పు ఉల్లిపాయలు కారం ఉప్పు నెయ్యి".
మరపురాని సీతాకాలం లేక వానాకాల వంటలు - అలా బయట చిత్తడి చిత్తడిగా ఉంటే పొట్టలో గురుగురు అని ఎవో పేగులకేకలు వింపడుతుంటే -డబ్బాలోంచి సగ్గుబియ్యం వడియాలు తీసి ఫటాఫట్ వేయించేది మా అమ్మ..వహ్.
కుంపట్లో మా అమ్మ పప్పు వండాక, దాంట్లో చిక్కుడుకాయలు కాల్చుకు తినేవాళ్లం. అలానే, నిప్పుల్లో ఉల్లిపాయలు కాల్చి తింటుంటే..అప్పుడప్పుడూ పిత్తులు గట్రా రావట్లేదనుకోండి - బెష్ట్ మార్గం - గెణుసుగడ్డలు. కుంపట్లో గెణుసుగడ్డలు కాల్సుకుతింటే మర్నాడు క్లాసులో ఎవ్వడూ ఉండకూడదు.. ఎండాకాలం శెలవుల్లో గెణుసుగడ్డల్ని ఉడకబెట్టేది మా అమ్మ. కింద పెద్ద గిన్నె, నిండా నీళ్లు, పైన ఇంకో చిన్న గిన్నెలో రెండో నాలుగో గెణుసుగడ్డలు వేసి మూతపెట్టేస్తే అవి ఉడికేవి. భలేవుండేవి.
కొనుక్కుని ఇంట్లో తినేవి: అప్పట్లో స్వీట్లు ఒక అద్దాల బండిలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువగా కొన్నుకునేవి - పూసమిఠాయి, బాదుషా, జాంగ్రీ, పేడా, బర్ఫి మరియూ చేగోడీలు. నాకు మహా ఇష్టం చేగోడీలు. కాని కొనుక్కుని తినేది చాలా తక్కువ. ఎప్పుడో, సంవత్సరానికోసారి. అంతే. చిప్సు అంటే ఏంటో తెలియదు. చిప్సు తింటారని పెద్దయ్యాక తెల్సింది.అప్పుడప్పుడూ కొన్ని కొత్తవి తెలుస్తుండేది. వేయించిన బియ్యం. దోసకాయ ఒరుగులు - దోసకాయ విత్తనాలు నోట్టోవేస్కుని పైపొట్టు చాలా నేర్పుతో చెయ్యి పెట్టకుండా తేసేసి తినెయ్యటం. మంచి గుమ్మడికాయ విత్తనాలు.

Oct 22, 2008
చలి మొదలైంది
రోజులు గిర్రున తిరుగుతున్నై.
ఇక మేమూ రగ్గులు దులిపాం. ఇక కరెంటు బిల్లు పేల్తుంది, మూలిగే నక్కమీద తాటికాయ పడట్టు.
కారుకి కూడా ఎక్కువ దాహం వేస్తుంది చలికాలంలో. జనాలకి చిరాకులు పెరుగుతయి. పిల్లలు కొంచెం క్రాంకీ గా ఉంటుంటారు. చిన్నపిల్లల్లతో మరీ కష్టం. దయ్యాల పండక్కి పోయినేడాది మావోడు ట్రిక్ ట్రీటు అని మా సందంతా తిరిగొచ్చెప్పటికి న్యుమోనియా వచ్చింది. సచ్చాం. ఈఏడాది ఏంజేస్తడో చూడాలి, ఇక్కడ అప్పుడే జనాలు దయ్యాల్ని, భూతాల్ని, గుమ్మడికాయల్ని గుమ్మాలకి తగిలించేసారు. కొన్ని గుమ్మడి కాయలు కుళ్లికూడా పోయినయి. దయ్యాలపండగేందో నాకర్ధంగాలా. సరే నల్గురితో పాటు నారాయణ.
నిన్న పొద్దున కార్ అద్దాలమీద సీజను మొట్టమొదటిసారి ఐసు లేయరు ఫార్మ్ అయింది. ఆకులు రాలుతున్నాయి.
కాలాలు మారుతున్నా నాలో ఎటువంటి మార్పు లేదు. పని, ఇల్లు, పిల్ల, పీచు, పని, ఇల్లు, పిల్ల, పీచు....చలిప్రదేశమ్లో ఆహారం పాడైపోదు, అట్టానే మనిషిక్కూడా ఆ స్టేట్ వచ్చేస్తుందేమో.
పోయినేడాది స్నో బానే పడింది. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో. సగటు స్నోఫాల్ 64.1 ఇంచులు.
2006-2007 చలికాలమ్లో నా జీవితమ్లో ఒక మోస్తరి నుంచి కొంచెం భయంగొల్పే రెండవ మంచుతుఫాను చూసా. 2003-04 లో అమెరికా వచ్చినప్పుడు మొట్టమొదటి అనుభవం. కాని అప్పుడు నేను డ్రైవింగు గట్రా చెయ్యలేదు.
కానిప్పుడు కుటుంబం, గట్ర, నా సొంత కారు, నేనే డ్రైవరు. తుఫాను మొదలైంది. మరి ఆఫీసుకి ఎళ్లటానికిబయల్దేరా. నెమ్మదిగా నెట్టుకుంట నెట్టుకుంట చేరా మొత్తానికి. ఇక మద్దానం 4 అలా బయల్దేరా తిరిగి ఇంటికి. దారిలో ఒక షవల్ కొన్నా అనుకోకుండా. మా ఇల్లు ఇంకో మైలు దూరమనంగా మంచులో చుక్కికున్నా. పడిన స్నో ని ప్లో చేసే బళ్ళు ఉంటయి. అవి ఒక పారలాంటి ఇనప పళ్లెంతో పడిన మంచుని పక్కకి నెట్టుకుంటూ పోతుంటయి. ఆటి ఎనకమాల పెద్ద పెద్ద ట్రక్కులు ఉప్పు ఏస్కుంటా/జల్లుకుంటా ఎళుతుంటయి. పక్కకి నెట్టి నెట్టి వారెమ్మటి స్నో పేరుకుపొతుటుంది. నాకార్ కొంచెం స్కిడ్ అయి దానిమీదకెక్కింది. ఇంకేముంది, ఇరుక్కుపోయింది నా కారు, కారు ఇరుసు కింద స్నో. నాది నిస్సాన్ ఆల్టిమ, సెడన్. సెడాన్ ఎత్తు 13 అంగుళాలు ఉంటుందేమో, మళ్లా అది ముంగటి గాన్ల డ్రైవు (ఫ్రంట్ వీల్ డ్రైవ్). టైర్లు కింద ఆనట్లా. గ్యాసు (యాక్సిలరేటరు ని ఇక్కడ గ్యాసు అనికూడా అంటారు) ఎంత తొక్కినా టైర్లు తిరుగుతున్నయి కానీ కారు అట్టనే ఉండిపోయిది. కార్లోంచి కిందకి దిగటమే కష్టం ఐపోయింది. డ్రైవ్ వే వైపు ప్లో వాన్లు ట్రక్కులు. నెమ్మదిగా దిగి రెండో వైపు వెల్తే గజ్జల్దాకాదిగిపోయినై కాళ్ళు స్నోలోకి. ఎట్టనో లోపల థర్మల్ ఏస్కున్న కాబట్టి బతికిపోయ్యా. మొత్తానికి ఒక గంటసేపు కుస్తీపడి ఆ పక్కనున్న ఇంటి వాళ్ల దెగ్గర ఒక పెద్ద షవల్ దెచ్చి, ఇరుసు కింద స్నో మొత్తాన్ని తీసి బయటపడేసరికి కాళ్లు దిబ్బలెక్కి, జివ్వు జివ్వు మని లాగటం మొదలెట్టినై. ఎట్టనో కుస్తీపడి ఇంటికిజేరి వెంటనే వేడి వేడి నీళ్లల్లో కాళ్లెట్టుకుని ఒక కప్పు వేడి వేడి కాపీ పీకితేగానీ బండి మళ్లీ లైన్లోకి రాలా. ఇదిచదివినోళ్లు అనొచ్చు, అంత కక్కుర్తి దేనికి, ఆయాల ఇంటిపట్టునే ఉండొచ్చుకదా అని. సీత కష్టాలు పీతకష్టలు నాయనా. సర్వర్ల మీద పని, ఆయాల తప్పకుండా ఎళ్లి తీరాల్సిన రోజు, ఎందుకంటే ఆ ముందురోజు రేత్తిరి మైంటెనెన్సు కిటికీ ఉండింది.
ఆయాలో మర్రోజో నా కారు ఇట్టా ఉంది.
స్నోఫాల్ రికార్డుల పట్టిక :
Season    Albany Binghamton Buffalo Rochester Syracuse City With Most Snow
2000-01 77.1     112.6          158.7   133.0       191.9      Syracuse
2001-02 47.4     63.5            132.4   58.1         59.4        Buffalo
2002-03 105.4   117.6          111.3   135.2       153.2      Syracuse
2003-04 65.1     106.4          100.9   125.6       181.3      Syracuse
2004-05 75.9     106.5          109.1   113.6       136.2      Syracuse
2005-06 30.2     74.9            78.2     73.9         124.6      Syracuse
2006-07 45.9     78.6            88.9     107.2       140.2      Syracuse
2007-08 61.1     70.7            103.8   106.0       109.1      Syracuse
(Snow Fall in inches)

From snow |

Oct 17, 2008
తినుబండారాలు a.k.a snacks
నిన్న మా బుడ్డోడికేవో బిస్కెట్లు కొన్నాం.పెప్పరిడ్జ్ ఫార్మ్ వాళ్లవి ఛెస్మెన్ కుక్కీస్.
నేనూ ఓటి నోట్టోవేస్కున్నా. అమెరికాకొచ్చాక, కాస్త రుచి తగిలిన బిస్కెట్లు ఇవే. మావోడికి మరి అవి ఎలా కొనాలనిపించిందో తెలుసా? ఆటిమీద గుఱ్ఱం బొమ్మ ఉంటంవల్ల. సరే అట్టా తినుకుంటా వారెమ్మెటి కార్ని తోల్కుంట ఎల్తుంటే చిన్నపటి బిస్కెట్లు, చాక్లెట్లు, తినుబండారాలు గుర్తొచ్చినై.
చిన్నప్పటి ఆల్టైం హిట్ బిస్కెట్లు - బ్రిటానియా. అవి ఇప్పటి 5 రూపాయల్ బిళ్ళంత ఉండేవి. మా బుడ్డోడు తింటున్నాడు చూడండి ఇక్కడ, అవే.నోట్టోఏస్కుని అట్టే నాలికతో పైనోటికేసి నొక్కిపెట్టి, కొంచెంసేపు నానినాక నాలికతో నొక్కితే సుర్రున కరిగిపోయేవి. అలా నాలికమీదపెట్టి పైనోటికేసి నొక్కి నొక్కి కాయలు కాసేవి.
తర్వాత బాగా ఇష్టంగా తిన్నవి చందమామ బిస్కెట్లు. ఉఫ్ఫ్.. వీటిరుచే వేరు. మళయాళం వాళ్లు ఎక్కడికెళ్లినా టీ కొట్టు పెట్టినట్టే బేకరీలుకూడా పెడతారు. అలాంటి బేకరీలో చేసేవే ఈ చందమామ బిస్కెట్లు. నోట్టోవేస్కుంటే కరిగిపోతాయ్. అలాంటివే కొబ్బరి బిస్కెట్లు, జీడిపప్పువి మొవి.
ఇంక, అత్యంత ఇష్టమైన చాక్లేట్లు - parrys. చాలా తక్కువ ఖరీదు. బ్రంహాండమైన రుచి. ఎప్పుడో ఓసారి eklairs తినేవాళ్లం. అవి కొంచెం ఖరీదు, ఒక్కోటి అర్ధ రూపాయ్.
నాటు నాటుగా తినేవి, తెగ ఎగబడి తినేవి "కొబ్బరి బిళ్లలు". మా బడి గేటు దగ్గర ఒక బూబమ్మ కిందపెట్టుకు కూర్చుని కొబ్బరి బిళ్లలు, గొట్టాలు, రేగి అప్పచ్చులు, నూగుజీడీలు, పుల్లశనగ గుగ్గిళ్ళు అవి ఇవి అమ్ముతుండేది. 5 పైసల్కి ఒక బిళ్ల. తెగతినే వాళ్లం. అలానే గొట్టాలు. 5 పైసలకి 5. ఒక్కోవేలుకి ఒక్కోటి పెట్టుకుతినేవాళ్లం. అప్పుడప్పుడూ గుంటపునుగులు వెల్లుల్లి కారప్పొడి.
ఇంక నూగుజీడీలు: పెద్దవి చిన్నవి. పెద్దది ఐతే నోట్టో పట్టేది కాదు చీకి చీకి..చిన్నవి ఆ బుగ్గలో ఓటి ఈబుగ్గలో ఓటి పెట్టుకుని చీకేటప్పుడు ఒకసౌండు, ఇషక్ ఇషక్ అని..
ఇంక, పప్పుండలు... మా ఇంటో ఒక కుటుంబం అద్దెకుండేవాళ్లు. వాళ్లది పప్పుండల వ్యాపారం. వేడి వేడి పప్పుండలు, ఆ బెల్లప్పాకం వాసన, యాలుకల వాసన...నాయనా!! పార్ధాయ ప్రతిబోధి చెట్టూ, రిక్షా పై విమానయాత్రా...
తర్వాత్తర్వాత మిరపకాయ బజ్జీలు, పునుగులు. వహ్.. పల్నాళ్లో పుట్టినందుకు, గుంటూరు జిల్లావాణ్ణైనందుకూ నాకు చాలా గర్వంగా ఉంది.
ఇంతకముందు గుంటూర్లో బోంబే టీష్టాల్ అని లక్ష్మీ పురమ్లో ఉండేది. అక్కడ ఉల్లి మిర్చి బజ్జి. అంటే, వేడి వేడి మిరపకాయ బజ్జిని నిలువునా కోసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసిం, కారం ఉప్పులో నిమ్మకాయ పిండి దాన్ని ఆ ఉల్లిపాయలమీద జల్లి ఇస్తాడు...జీవితం ఎటుపోతుందో..నాలిక అలా కిందపడి కొట్టుకుండేది ఆ రుచికి. అలా తిన్నాక, అసలే వేడి వాతావరణం, ఆపైన, మిర్చి బజ్జి, ఆపైన కారం ఇన్ నిమ్మ రసం, చెమట కక్కి దెబ్బకి చొక్కా తడిసాక, వేడి వేడి చాయ్ కొడితే...గణేస్ నిమర్జనమ్లో తీన్మార్ కి డాన్సేసినట్టు అహా షేకు షేకు అవుతుండేది మనసు.అట్టానే, బ్రాడిపేట 2/1లో ఒక బజ్జి బండి. వానిదెగ్గర పునుగులు. వేడి వేడి పునుగులు, వాయి తీయ్యంగనే ఖతం. వానిష్. ముందుగానే బుక్ చేస్కోవాలి ఆర్డరు. అలా వేడి వేడివి, కారప్పొడితో తిని వగర్స్తూ ఓ షోడా తాగితే...అహా జజ్జినక జజ్జినక..
మొదట్లో బ్రాడీపేట 4/7 లో రెడ్డి మసాలా, జిలేబి ఉండేది. తర్వాత్తర్వాత 4/14లో పెట్టాడు రెడ్డి. ఒక సాదా మసాల - మరమరాలు, వేయించిన వేరుశనగ ఇత్తనాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగిన మిర్చి, కొన్ని అలచందలు ఉదకబెట్టినవి ఒక కొబ్బరి ముంతలో వేసి బాగా కలిపి, ధనియాపొడి, ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి మళ్లీ గిలక్కొట్టి ఒక ఆకులో వేసి, తాటాకుని ఒక ని స్పూన్లా వేసి ఇస్తాడు. జజ్జనకా, అహా జజ్జనక...ఇది అయ్యాక, బఠాణి మసాలా - బఠాణీలు టమాటాలు, కారెట్టు, అలా ఉడుకుతూ ఉంటాయ్..దాన్లోంచి ఒక పెద్ద స్పూన్ తీసి, ఉల్లి, కొత్తిమీర పుదినా వేసి నిమ్మకాయ పిండి ఇస్తే...జజ్జనకా అహా జజ్జనకా...అలా పొట్టపగలా తిన్నాక, రెడ్డి బండికి ఎదురుగానె జిలేబి బండి..వేడి వేడి జిలేబి. 100గ్రాములు ఒక్కరూపాయే..
పట్టాభిపురం గుడిదెగ్గర,బాషా మసాలా అని ఒక బండి ఉండేది. అహా ఏమి రుచి...అనరా మైమరచి...
తర్వాత్తర్వాత గప్చుప్లు. ఇవి వచ్చిన కొత్తల్లో ఒకటి రెండు బళ్లు మాత్రమే ఉండేవి. వాడిదెగ్గర, ముందుగా ఒక మసాలా కట్లెట్ - అంటే ఉడకబెట్టిన బంగాళాదుంప, ఎదో మసాల, దాన్ని పెద్ద పెనం మీదపెట్టి మాష్ చేసి, పాని పోసి కొన్ని బఠాణి వేసి మెత్తగా నూరి ఒకటిరెండు పూరీలు నలిపేసి ఇస్తాడు. బానే ఉండేది. అది అయ్యాక ఒక పాతికో ముప్పైయ్యో పానీపూరీలు తినే వాళ్లం.
ఇప్పట్లో, మనకి పొరుగింటిపిల్ల కూర సారి పుల్లకూర రుచి. మనవి మర్చిపోవటం అంటే మనకి మహా సరదా. ఎక్కడ చూసినా బేకరీలు పిజ్జాలు బర్గర్లు గోల.
ఇక..చివరాకరికి ఇక్కడ...అమెరికన్ వడలు..ఒక్కటికూడా తినలేము. బేగల్, పొటాటో విడ్జెట్స్ తినలేము, ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేము. ఏందయ్యా అంటే అలా ఆప్-పిళ్ (యాపిల్), పీచ్, గట్రా పళ్లు తింటమే.. ఒకప్పటిరుచిని తల్చుకుంటూ....

Oct 14, 2008
Oct 10, 2008
పాపే!!!
అవును...
ఈరోజు, అనగా, అక్టోబరు తొమ్మిది, గురువారం, మధ్యనం మూడుగంటలా పదిహేను నిమిషాలకి ఆ దుర్గాదేవి మాకు అమ్మాయిని ప్రసాదించింది. తల్లి, పిల్ల ఇద్దరు క్షేమం..

Oct 9, 2008
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాళ్ళకు చాలు పప్పుబెల్లాలు...
బ్రంహాండమంతటికీ విజయదశమి శుభాకాంక్షలు...
భాస్కర్, హరిత, సూర్యా మరియూ ఓ(ఈరోజో రేపో విడుదల - అబ్బాయో అమ్మాయో ఇంకా తెలియదు)

Oct 8, 2008
పుల్లాట
చిన్నప్పుడు విపరీతంగా, అత్యంత ఉత్సుకతతో, అత్యంత తక్కువ ఖర్చుతో ఆడుకున్న ఆటల్లో ఇదొకటి.
దీనికి కావాల్సింది,ఐసుపుల్లలు. ఎన్ని? ఎన్నైనా. ఒక 11 అనుకోండి. 11లో ఒకటి తీసి పక్కనబెట్టి, మిగతా 10 ని గుప్పిట పెట్టి నేల మీద ఒక జానెడు ఎత్తులోంచి నిలువుగా జారెయ్యాలి. పుల్లలు ఒక దాని మీద ఒకటి ఇష్టంవచ్చినట్టు పేరుకుంటయ్. అప్పుడు ఇందాక పక్కనబెట్టిన పుల్లతో ఒక్కోపుల్లని, మిగతా పుల్లలు కదలకుండా తియ్యటం. ఎవరు ఎక్కువ తీస్తే ఆళ్ళు గెల్చినట్టు.
ఈ ఆట "ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్" మరియూ "కాన్సంట్రేషన్" ని పెంచుతుంది.
టిప్: ఐసుపుల్లలు లేకపోతే? వెదురు పుల్లలు ఐసుపుల్లంతవి. అవికూడాలేకపోతే, చీపురుపుల్ల. అవికూడా లేకపోతే...అరెయ్ అరెయ్ అరెయ్..నాకింకో పేరు కూడా ఉంది..బాషా బాషా బాషా..ఆడితే ఆడులెకపోతే వెళ్ళి క్రిక్కెట్టుజూస్కోపో....

Oct 7, 2008
బియ్యం
ఈరోజు బియ్యం కొంటానికి వెళ్ళా. లక్ష్మి బ్రాండ్ సోనా మసూరి బియ్యం, 20 lb సంచి ముఫైఎంది డాలర్లు. పోయినేడాది ఇదే సీజన్లో అదే సంచి తొమ్మిది డాలర్లు. 20lb=8.93 kg. అంటే ఒక్కో కిలో 4.26 డాలర్లు. అంటే డాలరు ఒక్కింటికి 46 రూపాయలు వేస్కుంటే కిలో బియ్యం తస్సదియ్య 196 రూపాయలు. ఇడ్లీలోకి, దోశెల్లోకి బియ్యం కావాల్సిందే.
ఉద్యోగానికీ భరోసాలేదు. ఎప్పుడు ఏ పుట్టిమునుగుతుందో తెలీదు. బైల్ ఔట్ అంటారు, అదేదో రన్ ఔట్లా. షేర్లు అరవైల్నుంచి వందశాతం తగ్గినై. ఏందీగోల. సచ్చిన పావుని ఎంతమంది ఎన్నిసార్లు సంపుతారో.
అటైపు సూద్దాం అంటే తెలంగాణా అంటాడొకడు, కిలో బియ్యం ఉచితం అంటాడింకోడు, నీకు పూరా జీవితం ఉచితం అంటాడింకొకడు.
రేపటికి నా ఉద్యోగం ఉంది. చూద్దాం ఎల్లుండి ఎలా ఉంటుందో?

Oct 6, 2008
నానమ్మలు ఏడుస్తున్నారు
నిజంగా
ఇదేదో ఆడవాళ్ళమీదకోపంతోనో, లేక స్త్రీద్వేషంతోనో రాయటమ్లేదు.
ఈరోజున, మగపిల్లోడు, ఇంజనీరింగో లేక, యం.సి.ఏ నో చెయ్యటం దెగ్గర్నుంచి ఇంటికి దూరంగనే ఉంటున్నడు. వాడు చదువు పూర్తిజేసి, ఉద్యోగం వచ్చి, సెటిల్ అయ్యి, బంగళూరో పాటిబండ్లో ఎదోచోట బ్రహ్మచారిలా మిగతా మూకల్తో కల్సి ఉంటూ, మొత్తమ్మీద ఇంటికి దూరంగనే ఉంటాడు. ఈలోపల ఆన్-సైట్ అది ఇదీ. ఈలోపల ఏదో టీకొట్టోడు (అదేనండీ మన కన్సల్టెన్సీలు - అమెరికాలో అవి చాయ్ దుకాణాల్లానేగా) పట్టేస్తడు. హెచ్-1. మనోడు అమ్రికాలో వాల్తడు. ఈలోపల పెళ్ళి. పెళ్ళికాంగనే ఆ పిల్లకి అత్త మామల్తో కల్సి ఉండి, వాళ్ళ టెంపర్మెంట్సు తెల్సుకునే అవకాశం, సమయం లేవు. పెళ్ళి అవ్వటం అమెరికా ప్రయాణం. ఇక్కడకి రాంగనే ఐసోలేటెడ్ జీవితం. దాంతోటి, పెద్దోళ్ళు ఎవ్వరూ లేకపొయ్యేసరికి, మనం ఏది ఆలోచిస్తే అదే కరెక్టు. మొండితనం, పంతం, పట్టుదల పెరిగి మఱ్ఱిచెట్టంత అయితై. ఈలోపల కడుపు కాకరకాయ. ఇన్వైటేషన్ లెటర్సు ఎవరికి పంపాలి? పిల్ల తల్లికే!!! కానుపు ఐంది. ఇక్కడా పిల్లాడి తల్లితండ్రులకి దిగులు, పేపర్లు పంపిస్తా రండీ అన్నా ఒక రకమైన అభిమానం, కానుపు మమ్మల్ని పిలవలేదు కదా అని. ఈలోపల ఆ పిల్లకి మొదలే దూరమైన అత్త మామలు ఇంకా దూరమై, భారంగా కూడా కనబడ్తారు. అప్పటిదాకా గుర్తురాని "పేరెంట్స్ రావాటానికైయ్యే ఖర్చు" అప్పుడు గుర్తొస్తుంది. మొత్తానికి నాయనమ్మలు, అటు కొడుకూ దూరమై, ఇటు కొడుక్కి పుట్టిన నలుసునీ కూడా చూస్కోలేక ఏడుస్తున్నారు.

Oct 2, 2008
గాంధి ని చంపేసాను
గాంధి ని చంపేసాను
అవును. నేనే. గాంధిని అత్యంత దారుణంగా, హేయంగా, ఆతని అరుపులు ఎవ్వరికీ వినబడనీయకుండా నేనే చంపేసాను. దేనికంటే.. సత్యాగ్రహమంటాడా? అహింసా? ఖాదీయా? ఉపవాసం చేయమంటాడా?
కట్నాలకోసం అమ్మాయిల్ని అతిదాఋణంగా హింసిస్తున్న సమాజాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా అఱవకుండా, తిలాపాపంలో పాలుపంచుకుని గాంధీని చంపేసాను.
అడుగడుగునా లంచాలతో జనాల రాక్తాన్ని పీల్చుకుంటున్న అధికారగణం మీద యుద్ధాన్ని ప్రకటించకుడా, నాకు చేతనైనంతవఱకూ లంచాల్ని ప్రోత్సహిస్తూ గాధీని చంపేసాను.
కులం కులం అని కుచ్చితాలుపెంచుకుంటున్న జనాల్ని సరైన మార్గంలో పెట్టకుండా నేనూ ఒక కుల కుంపట్ని వెలింగించి గాధీ చంపేసాను.
మతం తన పరిధులు దాటి గజ్జిగా మాఱితే నేను దాన్ని కడుక్కోకుండా అందఱికి అంటిస్తూ గాంధీని మళ్ళీ చంపేసాను.
సత్యాగ్రహం అనేపదానికి సమాజం "అ" చేర్చినప్పుడు కిమ్మనకుండా నేనూ అసత్యాగ్రహాన్ని ప్రచారం చేస్తూ గాంధీని అతిదారుణంగా చంపేసాను.
అహింస పరమో ధర్మహ కి బూజు పట్టించి దాన్ని హింస పరమో ధర్మహ లా మార్చినప్పుడు సమాజాన్ని ఎదురించటం మానేసి నేనూఒక కత్తి పట్టి గాంధీని నఱికేసాను.
పేదరికాన్ని రూపుమాపేందుకు అప్పులు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాన్ని ఎదురించటం పక్కనబెట్టి ప్రపంచీకరణ పేరుతో మన సహజ వనరుల్ని అమ్ముకుంటూ గాంధీని చంపేసా.
అభివృద్ధి పేరుతో సంస్కృతినీ సంప్రదాయాన్ని గాలికొదిలేస్తూ గాంధీని మళ్ళి చంపేసా
అవును నేనే, గాంధీని, నాలో ఉన్న గాంధీని చంపేసాను

Subscribe to:
Posts (Atom)