"ఏంటీ?"
"పళ్ళు మీద పళ్ళు"
"రాఘవేంద్ర రావు పూనాడా?"
"లేదు"
"మరీ?"
"పళ్ళు తిక్కిరిబిక్కిరిగా ఉన్నాయి. ఫ్లూటు ఊత్తుంటే నొప్పి"
"అలా చెప్పండి. ఓహ్! గుడ్ న్యూస్. మీవాడు కారణ జన్ముడు. సాధారణంగా పన్ను మీద పన్ను రావటం మీరు చూసుంటారు. మీవాడికి పళ్ళు మీద పళ్ళు. "
"బాబోయ్! ఏంచేమంటారూ?"
"పెద్దగా ఏంలేదు. 4 మోలార్స్ పీకించుకురండి. క్లిప్స్ పెడదాం."
అంకం 2
"అయ్యా! తమరు సర్జన్. మావాడికి పళ్ళ మీద పళ్ళు. అవి మీకు తెచ్చి పెట్టును ఇళ్ళ మీద ఇళ్ళు. దయుంచి ఆ నాలుగు మోలార్స్ పీకితే"
"ఆగండాగండి. ఏదీ నన్ను చూడనీ. ఓయా. బాగుంది బాగుంది. పీకేద్దాం. కానీ గమనించారా? మీవాడికి జ్ఞాన దంతములు కూడా వంకరగా వచ్చుచున్నవి. అవి భీ పీకేస్తాం. మొత్తం ఎంది. ఇప్పుడు పీకితే చిన్నరాయితో పోవును. పెద్దైయ్యాక పీకితే పెద్దరాయి."
"అయ్యా. మా కుటుంబం కూర్చుని నిర్ణయించి అప్పాయింటుమెంటు తీసుకోగలవారము"
అంకం 3
"ఇదిగిదిగో ఇదీ విషయం"
"ఏరా?"
"ఏంటీ? 8?"
"గలవా?"
"మరొక్కసారి ఆలోచించుకో?"
"సరే"
అంకం 4
"అయ్యా డాక్టరు వర్యా! మావాడు తాయారు. మీరు తాయారా?"
మొన్న మొత్తానికి 8 పళ్ళు పీకి చేతిలో పెట్టారు. వాడి బాధ వర్ణనాతీతం. బుగ్గలు రెండూ బాగా వాచిపొయ్యాయి.
గంట ఆపరేషన్.
Antibiotics ఇచ్చారు. నొప్పితగ్గటానికి ibuprofen తో పాటు Oxycontin ఇచ్చారు.
పెద్ద సందిగ్ధం.
వెయ్యాలా వద్దా?
వేస్తే ఏంటీ?
వెయ్యకపోతే ఎలా?
మొత్తానికి ఈరోజుకి కాస్త వాపు తీసింది.
మందులు వేసుకుంటూనే ఉన్నాడు.
Oxycontin తో సహా...
No comments:
Post a Comment