కీ|శే|| శ్రీ పి.వి.నరసింహారావు (28 జూన్ 1921 – 23 డిశెంబర్ 2004)
పీవీ గారి గురించి రాసేంత గొప్పవాణ్ణి కాదు.
ఆయన గొప్పతనం ఇప్పటికే అనేకులు ప్రచురించారు. నేను కొత్తగా ఇన్‌వెన్‌ట్ చెయ్యటంలేదు.
కానీ పీవీ గారిలో ఓ నాటక కర్త ఉన్నాడనీ, ఆయన రాసిన నాటకం ఒకటి ఎప్పుడో ఎక్కడో విన్నట్లు నాకు జ్ఞాపకం.
ఎవరికైనా పీవీ గారి నాటకాలు కానీ నాటికలు కానీ దొరికితే పంచమని ప్రార్థన.
KCR గారు పీవీ గారి శతజయంతి ఉత్శవాలు జరిపించటం KCR ఔన్నత్యానికి నిదర్శనం.
KCR పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే నినదించటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.
ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ ఈవిషయాన్ని గట్టిగా ప్రస్తావించలేదు.
అయితే - ఈ ప్రస్తావనని కేవలం KCR మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏక కంఠంతో నినదిస్తే తప్పక నెరవేరుతుందని నా అభిప్రాయం.
పీవీని కేవలం తెలంగాణాకి పరిమితం చేయటం అర్థరహితం.
దేశప్రధాని అందరికీ ప్రధాని అని గుర్తుంచుకోవాలి.
దేశప్రధానికి ప్రాంతీయతని అంటగట్టటం అవివేకం.
[తెలుగులకు ఉన్న దరిద్రం ఏవిటంటే - గిరిగీసుకుపోయి దాంట్లోనే మగ్గటం.
కూపస్తః మండూకః అని సామెత.
ఎందుకంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుగు వాడు. ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని కోరింది తమిళ్నాడు ప్రభుత్వం. అంధ్ర ప్రభుత్వం కాదు.
ఇలాంటివి అనేకం.]
అవును. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అడిగితే బీజేపీ అంగీకరించ వచ్చు. పీవీ మీద గౌరవం , సోనియా కు శాస్తి చేయడం కోసం పీవీకి భారతరత్న ఇవ్వ వచ్చు. ఇదే మంచి తరుణం.
ReplyDeleteMLCగా గెలిచి మంత్రి అయిపోయిన వాళ్ళే ఆడంబరంగా తిరిగే రాజకీయ కులంలో - అత్యంత నిరాడంబరంగా, మినిమలిస్టుగా నిలిచారు పీవీ.
ReplyDeleteగొప్ప విషయం.