Jun 28, 2020

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో

వేటూరి వారి శృంగారం భలే ఉంటుంది. వేటూరి శృంగారాత్మక అలంకారాలుకు శృంగారలంకారం అని పేరు పెట్టొచ్చేమో. ఉదాహరణకు ఈ పాట. రాఘవేంద్ర రావు మార్కు ఫక్తు కమర్షియల్ పాట. ఇందులో ఏమిరాసినా, ప్రేక్షకుడు తెరమీద శ్రీదేవి ఒలికించే శృంగారంలో మునుగిపోతాడేకాని పాటని పట్టించుకోడు. నెగ్లిజిబుల్ అటెన్షన్. శ్రీదేవి వక్షం మీదనే లేక బొడ్డు మీదనే దృష్టి, దర్శకుడి సాక్షిగా.  ప్రేక్షకుడిని అలా కట్టేయగలగడం దర్శకుడి గెలుపు. 
కానీ పాట కట్టినవాడికో? శృంగారకావ్యాన్ని వండి వడ్డించటానికి ఓ వేదిక.

చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి "నీ చోటు ఈడుంది" రమ్మంటే 
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

బుగ్గ మీద చేయివేస్తే పచ్చని బుగ్గ చెంగావి రంగులోకి మారి గన్నేరు మొగ్గలా అయ్యిందట. (చెంగావి = చెన్ను కావి - లేత ఎరుపు లేక కెంపు/ కాషాయం)
ఈడు వచ్చి "నీ చోటు ఇక్కడ ఉంది" అని రమ్మంది సరే, వస్తే ఎక్కడ వేసుకుంటావు గూడు?
కౌగిళ్ళలో నన్ను కూడు అంటే చేరుకో
(కూడు - భోజనం కాదు)
అలా చేరితే అది కళ్ళకు మాంచి భోజనం సుమా! 
(ఇక్కడ కూడు - విందు)
నిన్ను నేను నన్నువు నువ్వు జీవితాంతం చూస్కోవచ్చు కళ్ళనిండా


చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ 
కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో రావయ్యో ఆగడాల  పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా
 
ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ 
పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా 
అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట 
వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది 
రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు
 
ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో 
కొంగుచాటు అందాలన్నీ 
పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యఓరయ్యో..రావయ్యో
పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల కోక 
అయ్యిందిలే గళ్ళ కోక 
నీ మాట విన్న నా జారు 
పైట పాడిందిలే గాలిపాట 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు 
నే కోరిన మూడూ ముళ్ళు 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ
నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి 
పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. 
ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..


ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

8 comments:

  1. వేటూరి మాటలుతో గారడీ. పండు పువ్వు బిందె తో రాఘవేంద్ర బురిడీ.

    ReplyDelete
    Replies
    1. ఆ పాటలో బిందెలు ఎందుకు వాడినాడో, అన్ని బిందెలు ఎక్కడ తెచ్చినాడో - ఆయనకే తెలవాలె.

      Delete
  2. వేటూరివారు ఈ పాటలో యాసని ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు.
    వెల్లువొచ్చి - ఎల్లువొచ్చి

    ReplyDelete
  3. రెల్లు పూలు వెండి గిన్నెలు - ఏమా రహస్యం?

    ReplyDelete
  4. శోభన్ బాబు డాన్సు చేస్తే కామిడీ గా ఉంటుంది. అతను అన్ని పాటలలో హీరోయిన్ వైపే చూస్తూ తల ముందుకు వెనక్కు ఊపుతూ స్టెప్పులు వేస్తాడు.

    ReplyDelete
    Replies
    1. కృష్ణ డాన్సు మరింత కామెడీగా ఉంటుంది ;)

      Delete
    2. సరదాగా చెప్పుకుంటే : పెద్ద ఎన్టీఆర్ - ఏనుగు డాన్స్, ఏ ఎన్ ఆర్ - జింక డాన్స్, సూపర్ స్టార్ కృష్ణ - రోబోట్ డాన్స్, శోభన్ బాబు - స్పాండిలైటిస్ గుర్రం డాన్స్, కృష్ణం రాజు - జిరాఫీ డాన్స్. Just for funny comparison. I love them all. All of them are great actors. Each one of them has unique style.

      Delete