Jun 29, 2020

10k Miles

Happy to share that I completed 10000 recorded miles in more or less 11 years.

Jun 28, 2020

పీవీ నరసింహారావు గారికి భారతరత్న

కీ|శే|| శ్రీ పి.వి.నరసింహారావు (28 జూన్ 1921 – 23 డిశెంబర్ 2004) 

పీవీ గారి గురించి రాసేంత గొప్పవాణ్ణి కాదు.

ఆయన గొప్పతనం ఇప్పటికే అనేకులు ప్రచురించారు. నేను కొత్తగా ఇన్‌వెన్‌ట్ చెయ్యటంలేదు.

కానీ పీవీ గారిలో ఓ నాటక కర్త ఉన్నాడనీ, ఆయన రాసిన నాటకం ఒకటి ఎప్పుడో ఎక్కడో విన్నట్లు నాకు జ్ఞాపకం.

ఎవరికైనా పీవీ గారి నాటకాలు కానీ నాటికలు కానీ దొరికితే పంచమని ప్రార్థన.

KCR గారు పీవీ గారి శతజయంతి ఉత్శవాలు జరిపించటం KCR ఔన్నత్యానికి నిదర్శనం.

KCR పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే నినదించటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.

ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ ఈవిషయాన్ని గట్టిగా ప్రస్తావించలేదు.

అయితే - ఈ ప్రస్తావనని కేవలం KCR మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏక కంఠంతో నినదిస్తే తప్పక నెరవేరుతుందని నా అభిప్రాయం.

పీవీని కేవలం తెలంగాణాకి పరిమితం చేయటం అర్థరహితం. 

దేశప్రధాని అందరికీ ప్రధాని అని గుర్తుంచుకోవాలి.
దేశప్రధానికి ప్రాంతీయతని అంటగట్టటం అవివేకం.

[తెలుగులకు ఉన్న దరిద్రం ఏవిటంటే - గిరిగీసుకుపోయి దాంట్లోనే మగ్గటం.
కూపస్తః మండూకః అని సామెత.
ఎందుకంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుగు వాడు. ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని కోరింది తమిళ్నాడు ప్రభుత్వం. అంధ్ర ప్రభుత్వం కాదు.
ఇలాంటివి అనేకం.]

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో

వేటూరి వారి శృంగారం భలే ఉంటుంది. వేటూరి శృంగారాత్మక అలంకారాలుకు శృంగారలంకారం అని పేరు పెట్టొచ్చేమో. ఉదాహరణకు ఈ పాట. రాఘవేంద్ర రావు మార్కు ఫక్తు కమర్షియల్ పాట. ఇందులో ఏమిరాసినా, ప్రేక్షకుడు తెరమీద శ్రీదేవి ఒలికించే శృంగారంలో మునుగిపోతాడేకాని పాటని పట్టించుకోడు. నెగ్లిజిబుల్ అటెన్షన్. శ్రీదేవి వక్షం మీదనే లేక బొడ్డు మీదనే దృష్టి, దర్శకుడి సాక్షిగా.  ప్రేక్షకుడిని అలా కట్టేయగలగడం దర్శకుడి గెలుపు. 
కానీ పాట కట్టినవాడికో? శృంగారకావ్యాన్ని వండి వడ్డించటానికి ఓ వేదిక.

చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి "నీ చోటు ఈడుంది" రమ్మంటే 
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

బుగ్గ మీద చేయివేస్తే పచ్చని బుగ్గ చెంగావి రంగులోకి మారి గన్నేరు మొగ్గలా అయ్యిందట. (చెంగావి = చెన్ను కావి - లేత ఎరుపు లేక కెంపు/ కాషాయం)
ఈడు వచ్చి "నీ చోటు ఇక్కడ ఉంది" అని రమ్మంది సరే, వస్తే ఎక్కడ వేసుకుంటావు గూడు?
కౌగిళ్ళలో నన్ను కూడు అంటే చేరుకో
(కూడు - భోజనం కాదు)
అలా చేరితే అది కళ్ళకు మాంచి భోజనం సుమా! 
(ఇక్కడ కూడు - విందు)
నిన్ను నేను నన్నువు నువ్వు జీవితాంతం చూస్కోవచ్చు కళ్ళనిండా


చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ 
కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో రావయ్యో ఆగడాల  పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా
 
ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ 
పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా 
అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట 
వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది 
రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు
 
ఎల్లువొచ్చి గోదారమ్మా 
ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే 
ఎండీ గిన్నేలయ్యేనమ్మో 
కొంగుచాటు అందాలన్నీ 
పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యఓరయ్యో..రావయ్యో
పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల కోక 
అయ్యిందిలే గళ్ళ కోక 
నీ మాట విన్న నా జారు 
పైట పాడిందిలే గాలిపాట 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు 
నే కోరిన మూడూ ముళ్ళు 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ
నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి 
పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. 
ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..


ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

Jun 23, 2020

Oxycontin

అంకం 1 
"ఏంటీ?" 
"పళ్ళు మీద పళ్ళు" 
"రాఘవేంద్ర రావు పూనాడా?" 
"లేదు" 
"మరీ?" 
"పళ్ళు తిక్కిరిబిక్కిరిగా ఉన్నాయి. ఫ్లూటు ఊత్తుంటే నొప్పి"
"అలా చెప్పండి. ఓహ్! గుడ్ న్యూస్. మీవాడు కారణ జన్ముడు. సాధారణంగా పన్ను మీద పన్ను రావటం మీరు చూసుంటారు. మీవాడికి పళ్ళు మీద పళ్ళు. " 
"బాబోయ్! ఏంచేమంటారూ?" 
"పెద్దగా ఏంలేదు. 4 మోలార్స్ పీకించుకురండి. క్లిప్స్ పెడదాం." 

అంకం 2 
 "అయ్యా! తమరు సర్జన్. మావాడికి పళ్ళ మీద పళ్ళు. అవి మీకు తెచ్చి పెట్టును ఇళ్ళ మీద ఇళ్ళు. దయుంచి ఆ నాలుగు మోలార్స్ పీకితే" 
"ఆగండాగండి. ఏదీ నన్ను చూడనీ. ఓయా. బాగుంది బాగుంది. పీకేద్దాం. కానీ గమనించారా? మీవాడికి జ్ఞాన దంతములు కూడా వంకరగా వచ్చుచున్నవి. అవి భీ పీకేస్తాం. మొత్తం ఎంది. ఇప్పుడు పీకితే చిన్నరాయితో పోవును. పెద్దైయ్యాక పీకితే పెద్దరాయి." 
"అయ్యా. మా కుటుంబం కూర్చుని నిర్ణయించి అప్పాయింటుమెంటు తీసుకోగలవారము"  

అంకం 3 
"ఇదిగిదిగో ఇదీ విషయం" 
"ఏరా?" 
"ఏంటీ? 8?" 
"గలవా?" 
"మరొక్కసారి ఆలోచించుకో?" 
"సరే" 

అంకం 4 
"అయ్యా డాక్టరు వర్యా! మావాడు తాయారు. మీరు తాయారా?" 

మొన్న మొత్తానికి 8 పళ్ళు పీకి చేతిలో పెట్టారు. వాడి బాధ వర్ణనాతీతం. బుగ్గలు రెండూ బాగా వాచిపొయ్యాయి. 
గంట ఆపరేషన్. Antibiotics ఇచ్చారు. నొప్పితగ్గటానికి ibuprofen తో పాటు Oxycontin ఇచ్చారు. పెద్ద సందిగ్ధం. 
వెయ్యాలా వద్దా? వేస్తే ఏంటీ? వెయ్యకపోతే ఎలా? 
మొత్తానికి ఈరోజుకి కాస్త వాపు తీసింది. మందులు వేసుకుంటూనే ఉన్నాడు. 
Oxycontin తో సహా...

Jun 18, 2020

ఆ రకంగా నేను కూడా అలా

ఆ రకంగా నేను కూడా అలా దుమికానన్న మాట



By the way, I made that plyometrics jump box.

Jun 16, 2020

అన్నయ్యకు అభినందనలు.


ఒకానొక రోజున 2012లో మా అమ్మకి రొమ్ము క్యాన్సర్ అనే ఓ స్థితి కలిగింది. ఆమె చాలా భయపడింది. మేము ఇక్కడ తను ఒక్కతే అక్కడ. మాకు బాగా కావాల్సిన ఓ వ్యక్తి మా అమ్మగారిని ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరకి తీసుకువెళ్ళారు. సదరు డాక్టరు ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడు. నీడిల్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ తేండి అన్నాడు. మా అమ్మ ఏదో ప్రశ్న అడగబోతే గెట్ ఔట్ అన్నట్లుగా ప్రవర్తించాడు. కసురుకున్నాడు. విసుక్కున్నాడు.
మా అమ్మ పాపం బిక్కచచ్చిపోయింది. ఇంటికొచ్చి చేలా బాధపడింది. వైద్యో నారాయణో హరిః అన్నది మన సంస్కృతి. మా మాతామహులు ఆయుర్వేద భిషక్.

నేటి డాక్టర్లు ఇలా తయ్యారయ్యారు. రోగికి మనోధైర్యం ఇవ్వాల్సిన వైద్యుడు రోగిని మానసికంగా హత్య చేస్తున్నాడని గమనించటం లేదు.
నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఇలా చెప్పుకొచ్చింది.
నా మిత్రుడికి కాల్ చేసి అతని అన్నగారితో మాట్లాడాను. ఆయన యండి రేడియాలజి చేసి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నట్టు నాకు జ్ఞాపకం. నాకు గుర్తున్నంతవరకు గుంటూరులో పోస్టింగు. వాడికి ఫోణ్ చేసి ఇదిరా పరీస్థితి అని వివరించాను. వాడు అన్నయ్యతో మాట్లాడి ఆయన నెంబరు నాకిచ్చి మాట్లాడమన్నాడు.
ఆయన నన్ను వెంటనే రిసీవ్ చేస్కుని ఏ ఆసుపత్రీ? ఎవరా డాక్టర్ అని అడిగారు.
పలానా అని చెప్పాను.
అరేయ్ అతను నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాని భరోసా ఇచ్చాడు.
అన్నట్టుగానే మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడి, తన కారులో మా అమ్మని తీసుకుని సదరు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే అతను అప్పుడు, ఈయన మీకు ఏవైతాడూ ఇంతక ముందు చెప్పలేదే అని చేతిలో చేయివేసి లోపలకి తీసుకెళ్ళి నీడిల్ పరీక్షలు గట్రా చేసి ఏవీ లేదని మొత్తానికి నిర్ణయించి పంపించాడు ఇంటికి క్షేమంగా.

ఈరోజున అన్నయ్య HOD అవ్వటం గొప్ప విషయం.

ఈయన నన్ను సొంత తమ్ముడిలా ఆదరించాడు. ఈయనే కాదు వీళ్ళ కుటుంబం మొత్తం నన్ను కుటుంబంలోని వ్యక్తిగా చూసుకున్నారు.
అన్నయ్యకు కృతజ్ఞతాభినందనలు.