Aug 17, 2011

కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తోంది తప్పా?

సెక్షన్ ౧౪౪, ౧౫౧, ౧౫౫ సిఆర్పిసి...

చట్ట ప్రకారం అన్నా హజారే తలపెట్టింది తప్పా?
నిరాహారదీక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో చేయొచ్చా?
బ్లాక్మైల్ చేస్తున్నట్టు కాదా?
కాంగ్రేస్ ప్రభుత్వం అన్నా హజారేని అరెస్టు చేయటం తప్పా?
ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్స్ ఏంటీ?

సైఫుద్దిన్ సోజ్ వాదన ఏంతంటే - ప్రజాస్వామ్యంలో, ప్రజలే ఎన్నుకుంటున్నప్పుడు, డెమొక్రటిక్ ప్రాసెస్ ద్వారా చట్టాలను చేయలనీ, డెమొక్రాటిక్ వేలో వాటిని సాధించుకోవాలనీ అంటాడు.

భలే చెప్పాడు పెద్దమనిషి. ఇప్పటికి ఇది రెండోసారి కాంగ్రేస్ ప్రభుత్వం ఇలా చట్టాన్నీ డెమొక్రసీనీ పరిరక్షించేందుకు ముందడుగు వేసి పోరాటకర్తలను జైల్లోకి తోయటం. మొన్న బాబా రాందేవ్ సంఘటన. ఇప్పుడు అన్నా హజారే.
రెండు సంఘటనల్లో కామన్గా కనిపించేది, కాంగ్రేస్ ప్రభుత్వ వెన్నెముకలేని తత్వం. అది -
బాబా రాందేవ్ అక్రమంగా సంపాదించాడు అంటూ లీగల్ ప్రాసెస్ లేవతీయటం.
ఇప్పుడు అన్నా హజారే లంచగొండి, రెండు లచ్చలు ఖర్చుపెట్టుకున్నాడు పుట్టిన్రోజుకి అని.

ఐతే! బాబా రాందేవ్ విషయంలో ఏం జరిగిందో అప్డేట్ ఎక్కడా లేడు? ఎందుకూ?
సరే ఇవన్నీ పక్కనపెట్టి ప్రస్తుతంలోకి వస్తే -

సైఫుద్దిన్ సోజ్ పొద్దున్నే కామ్గ్రేసు తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇలా -
డెమొక్రటిక్ ప్రాసెస్ ద్వారా చట్టాలను తెచ్చుకోవాలి పోరాడాలన్నప్పుడు, మమతా బెనర్జీ ఆరోజున నిరాహారదీక్ష చేస్తుంటే అరెస్టు ఎందుకు చేయలేదూ?
ఆ సంఘటన స్వతంత్రానికి పూర్వం జరగలేదే? నిన్నకాక మొన్ననేగా జరిగిందీ?


కాంగ్రేస్ ఇప్పుడు మీట్ అవబోతోందట.
అమ్మ లేదు కాబట్టి పాపం మన్మోహన్ సింగు గార్కి ఊపిరి ఆడక వాడిపేరేందివయ్యా? హా!! రాహుల్ గాంధీకి కాల్ చేసాట్టా ఏం చేద్దాం ఆని?
ఆడు ఇటలీకి కాల్ చేసి కనుక్కుని చెప్తా అనుంటాడు, ఎదవ.



అన్నా హజారేని అరెస్టు చేయటం మీరు సమర్థిస్తారా?
ఇప్పుడు కాంగ్రేస్ ప్రభుత్వానికి కిం కర్తవ్యం?

రండి లైవ్ బ్లాగ్ చేద్దం!!
ప్లీజ్ పోస్ట్ అప్డేట్స్. దేశంలో ఉన్నవారు అప్డేట్స్ పోస్ట్ చేయ ప్రార్థన

3 comments:

  1. Arresting him is politically suicidal. I pity them.

    ReplyDelete
  2. ప్రజాస్వామ్యంలో ఇలా దీక్షలని అడ్డుపడడం చట్ట విరుద్ధం.

    దీక్ష చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే అడ్డుకోవచ్చు, కానీ ఇలా ముందే కాలికి అడ్డు పడుతున్నారంటే "పొయ్యే కాలం దగ్గర పడ్డట్టే" .

    ReplyDelete