యాడా ఏదీ దొరకలా. ఇందాక యాణ్ణో గెలుకుతా ఉంటే ఓ తీగ నా మౌజు కాలికి రగిలింది. ఏందిరా అబ్బియ్యా అనిజూస్తే ఇదీ కత -
ఒపెరా మిని అంట దించుకో
ఒపెర మిని తెరువు
అడ్రస్సు బారు, మందుకొట్టే కాదులేప్పా, అడ్రస్సు బారులో opera:config అనంటా కొట్టు.
కిందకంటబో
Use bitmap fonts for complex scripts
అని ఉండిద్ది. ఉంటంఉంటం no అనుండిద్ది. దాన్ని yes కు మార్చి, save కొట్టు.
అడ్రస్సు బారులో బ్లాగు ఓపెన్ కొట్టు.....
టట్టడాయ్
అదన్నమాట
ఇంటికెళ్ళినాక స్క్రీన్ షాట్ పెడతాలేబ్బా......
ఇంక ఎంజా మాడు ఏంది గుడ్లప్పగించి సూస్తా
అప్డేట్ -
ఒపెరాలో బ్లాగ్

ఫైర్ఫాక్స్ ఆన్ డ్రాయిడ్, ఈనాడు మొబైల్ -

బాగుంది. వావ్ కేక.
ఐతే ఫైఫాక్స్ బ్లాగ్ తుస్సుమంది -

ఈనాడు ఒపేరాలో ఫ్లాప్

ఈనాడు రాటంల్యా
ReplyDeleteఈనాడుకి ఆని సొంత ఫాంటు ఉంది. మరి దాని సంగతేంటో సూడాల
యూనికోడ్ మాత్రం వస్చాంది
కత్తి కదా అసలు. :) అచ్చ తెలుగులో ధన్యవాదాలు.
ReplyDeleteఈనాడు ఇప్పుడు ప్రయత్నించండి ఈ రోజే యునికోడ్ చేసాడు.
ReplyDeleteఈనాడు.నెట్ అని వేస్తే ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ లొ దినపత్రిక యథారూపంగా కనిపిస్తుంది.
ReplyDeleteమీ వ్యాఖ్య చూసి గూగుల క్రోమ్ లో అదే అడ్రస్ కి ఆన్లైన్ ఈనాడు ఓపెన్ అయింది. దినపత్రిక యథారూపంకాదు. కానీ బాగుంది.
ఈనాడు మొబైల్ కాదా అది? ఈనాడు రూపం మార్చేసాడుగా!! ఛండాలంగా ఉంది....
ReplyDeleteయాండా పద్దమ్మగోరూ
ReplyDeleteఏంది పొద్దున పొద్దున్నే భయంపెడతా ఉన్యారూ?
సిన్నపిల్లాణ్ణిజేసి!! అహా! మీకు నేయవా అద్దెచ్చా?
డియన్‌సి గారూ - :):) ఈనాడు కొత్త రూపం ఇప్పుడే చూస్తాయ్..:):)
మందాకిని గారూ - నమస్తే!! నేనూ అదే..ఆశ్చర్యపోయాను..ఇదేవిట్రా అనుకుని. నాకు నచ్చల్యా
chaala bagundi, it is really excellent, i am reading koodali now in my HTC WILDFIRE ANDROID PHONE.
ReplyDeletethanks for your info.
bye
I am using Opera mini on my java phone( 2.5G ). నా మొబైల్ లొ తెలుగు రావటం లేదు అని బాధ పదుతున్నా. అయితే ఆండ్రాయిడ్ లొ వస్తుందేమో, అది కొనాలి కాబోలు అనుకున్నా. ఆందులో కూడా ఇలా మార్పు చేయక పోతే రాదని తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన మార్పులు చేసాక, నా ఒల్డ్ మొబైల్ లో కూడ తెలుగు వస్తుంది. Thanks..
ReplyDelete