Aug 5, 2011

సోనియాకు సర్జరీ


అమెరికాలోని క్యాన్సర్‌ ఆసుపత్రిలో?
నెల రోజులు అక్కడే విశ్రాంతి!
ఉన్నట్టుండి గురువారం ప్రకటన
వ్యాధి విషయంలో అంతా గోప్యం
పార్టీ పగ్గాలు రాహుల్‌ బృందానికి
కమిటీలో అంతా ఆమె సన్నిహితులే
మారుతున్న రాజకీయాలకు సంకేతం?
ఉదరకోశ సమస్యలకు గాను ఆమెకు సర్జరీ చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా మరోవైపు క్యాన్సర్‌ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు వార్తలు వస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి రాజకీయాల్లో చురుకుగా ఎప్పుడు పాల్గొంటారన్నది చెప్పటం కష్టంగా తయారైంది.

అయ్యారే!! సోనియా గాంధీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోతే దేశ భవితవ్యం ఏంటి? మన్మోహన్ సింగ్ ఒక్కడే ఎలా రాణించగలడూ? ఏ నిర్ణయాన్నైనా ఎలా తీస్కోగలడూ? అసలు కాంగ్రేస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? పార్టీ పరమైన నిర్ణయాలు ఎవుళ్ళు తీస్కుంటారు? తెలంగాణ ఎవరిస్తారు? కేసీఆరుకి మూటలు ఎవరిస్తారు?
ఏంటో ఒక్క *(అ)భారతీయ మహిళ* అడ్దంపడితే చూడండి ఎన్ని ప్రశ్నలో.

నాకు దిగులుగా ఉంది
బాధగా ఉంది
అంతకన్నా భయంగా ఉంది
భవిష్యత్తు ప్రశ్నగా ఉంది
ఆమె కోలుకోవాలనీ
మరిన్ని డబ్బులు మూటగట్టుకోవాలనీ
దేశాన్ని *హస్త* గతం చేస్కోవాలనీ
ఆమె దేశానికి మరింత సేవ చేయాలనీ
అసలు ఆమే ప్రధాన మంత్రి అవ్వాలనీ
నా అభిలాష


No comments:

Post a Comment