Aug 24, 2011

వాషింగుటన్ను దగ్గర్లో భూకంపం

అమెరికా రాజధాని వాషింగుటన్ను దగ్గర్లో, వర్జినియా రాష్ట్రంలో, రిచిమండుకి అతి దగ్గర్లో భూమి కంపించింది. ఛార్లెట్స్‌విల్ (అనుకుంటా) ఎపిసెంటర్. రిచర్డ్ స్కేలుపై ౫.౯ తీవ్రతగా నమోదైంది.
ఆల్బనీలోని మిత్రులకు ఫోన్ చేసి అడిగాను. ఏంటి మాష్టారూ అని, నేను కూర్చున్న కుర్చి రెండు సార్లు కంపించింది భాస్కర్ అన్నారాయన. భూకంపం వచ్చిన ఎపిసెంటరునుండి ఆల్బనీ కనీసం నాలుగొందల యాభై మైళ్ళు ఉంటుంది.

వర్జీనియా/వాషింగుటన్ను/మేరీలాండ్/నార్త్ కారొలీనా ఇత్యాది రాష్ట్రాల్లో ఉన్న జనాలు సేఫ్ గా ఉండాలనీ, ముందు జాగ్రత్తలు తీస్కోవాలనీ కోరుకుంటున్నాను. అలానే, తమతమ అనుభవాలను పంచుకోవాలనీ కోరుకుంటున్నాను.

3 comments:

  1. @భాస్కర రామ రాజు గారు
    నాకు ఇలాంటివి ఎందుకో తెలియదు కానీ చాలా ఆసక్తి. వాళ్ళ ఆలోచనలు, అనుభూతులు ఆ క్షణంలో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత. మీ ఈ టపాకి ఎవరయినా రాస్తే మీతో పాటు నేను కూడా సంతోషిస్తాను.

    ReplyDelete
  2. మేము మేరీలాండ్ లో వుంటామండి. బాగానే కంపించింది భూమి. రెండు సార్లు కంపించింది.
    అందరం బయటకి పరుగు పెట్టాము. నాకు మొదట వచ్చిన ఆలొచన నా సెల్లు ఎక్కడ వుంది, బ్యాగు తీసుకోవాలా , లాప్టాప్ తీసుకొవాలా .కార్ ఎలా వుందొ , మీటింగ్ లొ వున్నాం కదా , ఆ మీటింగ్ మళ్ళీ ఎప్పటికి మార్ఛాలి అని ఆలొచిస్తూ బయటకి పరుగు పెట్టాను.

    ReplyDelete
  3. Here in CT our office building shook little bit but only for few seconds. Some do not even recognize it.

    Finally something has shakened Washington, D.C. Hope they will wake up now.:)

    ReplyDelete