తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు
తండ్రి జాడ కోసం కుమార్తెల వేడుకోలు తూప్రాన్, న్యూస్‌టుడే: 'ఎందుకు నాన్నా ఇలా చేశావు..? తెలంగాణ అందరికి కావాలె.. కానీ నువ్వు మాకు కావాలె.. ఎట్లాగైన నువ్వు రావాలి.. మరణ లేఖ రాశావని.. తిరిగి రానన్నావని వింటుంటే బాధేస్తుంది..' తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ప్రాణత్యాగం చేసుకుంటానని, ఇంటి నుంచి వెళ్లిపోయిన మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనింటి రమేశ్ కుమార్తెలు సోనీ (15), సంఘవి (12) వేడుకోలు ఇది. వచ్చే నెల 1వ తేదీలోగా తెలంగాణ ఇవ్వాలని కోరుతూ రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బస్టాండ్‌లో శనివారం లేఖ వదిలారు. ఆదివారం ఆ లేఖ పోలీసులకు అందింది. అదే రోజు రాత్రి తూప్రాన్‌లో గాలించినా వివరాలు లభ్యం కాలేదు. సోమవారం పాఠశాలలు తెరిచాక విషయం బయటకొచ్చింది. రమేశ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. మెదక్ ఎంపీ విజయశాంతి ఫోన్లో మాట్లాడారు. రమేశ్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి ఫోన్ చేశారు. కుమార్తెలతో మాట్లాడారు. ఎక్కడున్నారోఅడుగుతుండగానే కట్ చేశారు. సిగ్నల్స్ ఆధారంగా యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్నట్లు తెలిసి బంధువులు వెదికారు. దొరకలేదు.
తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జనాలకు ఎమ్తో అవసరం. తెలంగాణ ఇవ్వాల్సిందే. తెలంగాణ రావాల్సిందే. కానీ తెలంగాణ రావాలంటే ఇదికాదు పోరాడే విధానం. ఇంకా ఎందరు తండ్రులను బలిస్తారో అటు ప్రభుత్వం వారూ ఇటు కేసీఆరు. పోరాడండి, ప్రాణాలు తీయకండి. ఆ బలిపశువుకి పెండ్లై ఉండచ్చు, పిల్లలుండచ్చు, నువ్వు వెళ్ళి ఓ పాలి చూసొచ్చి, విజయశాంతి ఫోన్లో మాట్టాడినంత మాత్రాన వీళ్ళ జీవితాలు తెల్లారవు. తెలంగాణ తెస్తాం లేకుంటే ప్రాణాలు ఇస్తాం అంటూ రెచ్చగొట్టటాన్ని అటు ప్రభుత్వం గానీ ఇటు చట్టసభలు గానీ న్యాయాస్థానాలు గానీ ఇంతవరకూ తప్పుబట్టకుండా జనాల మానాన ఆత్మహత్యలు చేస్కుంటుంటే నడీనడుమ మనకెందుకనీ, రెచ్చగొట్టేటోడు మన కేసీఆరేగా సాయంత్రం ఐతే అందరికీ సుక్క పోపిస్తడు, మనోడేలే అని ఒదిలేయటం అచేతన వ్యవస్థకి సంకేతం, మన దురదృష్టం
చచ్చి సాధించేటిది ఏమీ లేదు
జై హింద్
"చచ్చి సాధించేటిది ఏమీ లేదు"
ReplyDeleteఅవును "నాన్నా" ఏమీ లేదు, బేగి వెనొక్కొచ్చీ
వెనక్కి రావాలన్నా రాగలడా శివరామప్రసాద్ గారూ?
ReplyDeleteరానిస్తారా?
అసలు ఉన్నాడంటారా?
*రాజకీయ హత్యలు* ఆపే ప్రభుత్వాలూ లేవూ, చట్టాలూ లేవు, న్యాయస్థానాలూ లేవు, రక్షకభటులూ లేరు...
అందరూ ఆ తానులోని గుడ్డలే!!