Aug 17, 2011

హత్యకు గురైన శ్లేషా మసూద్

సహ కార్యకర్త దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లో పట్టపగలే ఘాతుకం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో సమాచార హక్కు కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆమె పేరు శేష్లామసూద్‌. మంగళవారం ఉదయం 11 గంటలకు సొంత ఇంటిముందే కారులో కూర్చున్న ఆమెను దుండగుడు ఒకరు కాల్చి చంపాడు. శేష్లామసూద్‌ కొంతకాలంగా సమాచారహక్కు చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతోపాటు ఆ చట్టం ఆధారంగా పలు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని పలు అభయారణ్యాల్లో పులులు భారీగా మృత్యువాత పడుతుండడం, అడవుల పరిరక్షణ తదితర అంశాలపై ఆమె చురుగ్గా స్పందించేవారు. ఇటీవలే అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే దీక్షకు మద్దతుగా తాను కూడా నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఆమెను కాల్చి చంపడానికి దారితీసిన కారణాలేంటో ప్రస్తుతానికి తెలియరాలేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు
సహ? ఏంటో ఈనాడుకి రోజురోజుకీ మతిపోతున్నట్టుంది.
మొన్న
లోకాయుక్త కుమారుడు అమెరికాలో మృతి అని ఓ వార్త
వార్తలోకి వెళ్తే, రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ ఆనందరెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి(35) గురువారం అమెరికాలో మృతి చెందారు.

ఏవిటీ వార్తాహరుల విధానం? లోకాయుక్త కుమారుడు ఏవిటీ?
సహ ఏవిటీ?

సమాచార హక్కు కార్యకర్త దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ప్రభుత్వం అసలు పని చెస్తోందా? అవినీతిపై పోరాడేవారిని బోనులో పెట్టే కేంద్రప్రభుత్వం, మరోవైపు చట్టాలకోసం పోరాడేవారిని కాల్చేస్తుంటే కిమ్మనకుండా కూర్చునే రాష్ట్ర ప్రభుత్వాలు. వెరసి ప్రజాస్వామ్యం. మీరు ఓట్లేసి గెలిపించిందేగా అని దబాయింపు ఆపై.

దానికి మళ్ళీ పోరాటాలు ప్రజాస్వామ్య విధానాల్లోనే చేయాలని ప్రభుత్వాల ఉక్కుపాదం. కాల్చేవారు దోపిడీదారులు ప్రజాస్వామ్య విధానంలోనే ప్రాణాలను హరిస్తున్నారుగా అని వదిలేస్తారేమో?

No comments:

Post a Comment