Aug 27, 2011

అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం - రాహుల్‌గాంధీ

ఈసీ తరహాలో లోక్‌పాల్‌
అవినీతి నిర్మూలనకు రాజ్యాంగబద్ద వ్యవస్థ
రాహుల్‌ గాంధీ సూచన
ఒక్క లోక్‌పాల్‌తో అవినీతి పోదని స్పష్టీకరణ
వ్యక్తుల డిమాండ్లు
ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరచకూడదని వ్యాఖ్య
లోక్‌సభలో ప్రసంగం
లోక్‌పాల్‌ చట్టం ఒక్కటే దేశంలో అవినీతిని నిర్మూలించలేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం, పటిష్ఠమైన రాజ్యాంగ వ్యవస్థ ఉండాలని అన్నారు. అన్నా హజారే దీక్ష నేపథ్యంలో రాహుల్‌ తొలిసారిగా లోక్‌పాల్‌పై నోరు విప్పారు.
-ఈనాడు
మరి ప్రధని ఏం పేర్కున్నారూ? వారు *పార్కున్నారా?*
కానీ, మన్మోహన్ని చూస్తే జాలిగా ఉంది. సదరు పేర్కొనటాలు *ఎసాసినేషన్* కన్నా ఏం తక్కువ కాదు.
ఇప్పటికైనా అమ్మగారి ఉప్పు తింటం ఆపి, ఆరడుగుల గొయ్యి తొవ్వుకోటం బెటరు మన్మోహన్, పాపం మన్నుమోహన్!!

కాంగ్రేసు పార్టీలో ఇది కొత్తగాకపోయినా, మరీ ఇంత ఎసాసినేషనుకి పాల్పడతారని ఉంహించినా, ఇంత తొందరగా అని ఊహించలేదు. ఇహ ఇప్పుడు ఏదోక ఉప్పుతిన్న గొఱ్ఱెని బలిస్తే, జనాల్లో సానుభూతి ఉప్పెనలా పొంగి, పొర్లి, అట్టడుక్కి దిగజారిపోయిన కాంగ్రేస్ ప్రాణం మళ్ళీ పైకిలేచొచ్చి, జవజీవాలు ఎడాపెడా నింపేస్కుని వచ్చే ఎన్నికల్లో జనగొఱ్ఱెలచేత పట్టంగట్టిచ్చుకుని శ్రీ విరాట్ రాజాధిరాజ రాజ మార్తాండ శ్రీశ్రీశ్రీ రెవరెండ్ రాహులు గాంధీ నెత్తిన కిరీటాన్ని పెట్టించే దురాలోచనకి మౌనసాక్షిలా కుక్షిలా గొఱ్ఱెలా చూస్తూ ఉండిపోతాను. అంతకన్నా ఏం చేయగలం?
అవినీతి నిర్మూలనకు దృఢమైన రాజకీయ సంకల్పం ఉండాలని ఎంతచక్కగా చెపుతున్నాడో చూసి తరించండయ్యా!!
వచ్చే ఎన్నికల్లో నేను కాంగ్రేసుకి వోటు వెయ్యబోతున్నాను..

No comments:

Post a Comment