Dec 31, 2010

అతివలపై అకృత్యాలకు అడ్డేలేదు: డీజీపీ అరవిందరావు

అతివలపై అకృత్యాలకు అడ్డేలేదు
మహిళలపై పెరుగుతున్న నేరాలు
తగ్గిన రోడ్డు ప్రమాదాలు: డీజీపీ అరవిందరావు


30story19.jpg


లెట్స్ సెలబ్రేట్ బ్రొ!!!!

Dec 29, 2010

ఎద్దెమ్మ బర్త్‌డే, పాటీ కేక్

ఎద్దెమ్మ అంటే ఏందంటా అనుకుంటున్యారా? ఎద్దెమ్మ = ఏనుగు.
పాటీ సీటు మీద క్రేయాన్స్ కొవ్వొత్తులంటయ్యా.
పాట మాత్రం హేపీ బర్త్‌దే సూయా అంట
బర్త్‌దే పార్తీ అంటయ్యా. ఎవురెవురొచ్చారో తెలుసా?
ఎద్దెమ్మ, వాళ్ళా నాన్న అమ్మ, సూయా, బురుగు (అంటే పురుగు అని, కొంచెం ఉపయోగించబ్బా) నిమ్మకాయసరస్, పిసిస్ (పిసిస్ అంటే ఏందో అని మోకాలు గోక్కోమాక, పిసిస్ అంటే స్పైడర్)
నువ్వూ వస్చావా మరి?

Dec 27, 2010

భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

మన సంపదలను సాధ్యమైనంతవరకూ తురుష్కుడు తెల్లోడు కొల్లకొడితే, మిగిలిన అడుగు బొడుగు మన ప్రాంతీయ (దుర్) అభిమానులు తమ రాజకీయ స్వార్థం కోసం కొల్లగొట్టా౨రు, కొడుతున్నారు, కొడతారు.
ఉదాహరణకు -
భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్కృత మరియూ ప్రాకృత భాషా చేవ్రాత ప్రతులను సేకరించి భద్రపరచటంలో పేరు ప్రఖ్యాతులు పొందింది. వీరివద్ద కొన్ని వేల ప్రతులు సేకరింపబడి భద్రపరచబడ్డాయి.
ఐతే, రాజకీయావేశాలకు, ప్రాంతీయ తత్వానికీ చారిత్రాత్మకత ఆవశ్యకత అవసరం పట్టవు. ౨౦౦౩ డిశెంబరులో కొందరు మరాఠా ముష్కరులు విలువైన ప్రతులను దహనం చేసారు.

Vandalism in 2003

The institute was vandalized in December 2003 by a mob made up of members of an extremist self styled Maratha youth squad, calling themselves the Sambhaji Brigade, named after Shivaji's elder son. They claimed to be angered by the help provided by the institute's staff (in translating manuscripts) to a Western writer, Dr. James Laine, who discussed the telling and retelling of stories about Shivaji's parentage and life in his book on narrations of the Shivaji story.[5] The mob also *damaged thousands of manuscripts[6]* and attacked Shrikant Bahulkar, a Sanskrit scholar who had only explained some Sanskrit references to Laine.[7] The incident provoked widespread reaction[8] and historian Gajanan Mehendale to destroy parts of his in-progress biography of Shivaji.[9][10]

http://en.wikipedia.org/wiki/Bhandarkar_Oriental_Research_Institute

ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మన దేశంలో. మహారాష్ట్రలోనే కాదు మన కళ్ళముందే ఎన్నో ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రాంతీయ దురభిమానం కళ్ళకు గంతలు కట్టేస్తుంది. విలువైన మన సంస్కృతి అర్థంలేని ఆవేశంలో మట్టిపాలౌతోంది. రేపటి మన భవిష్యత్తుకి(ముందు తరాలకు) వారసత్వంలా అందించాల్సిన ఈ సంపదను కేవలం ఐదునిమిషాల ఆవేశానికి బలి ఇవ్వటం ఎంతవరకూ సబబూ?

మా పల్నాటిలోని కోటలు చాలా వరకూ నాశనం అయ్యాయి. కొన్ని భూస్తాపితం అయ్యాయి. కొన్ని కేవలం గోడలుగా మాత్రమే మిగిలి పొయ్యాయి. దోచుకోబడ్డాయి, దోపిడీ కాబడ్డాయి. శిధిలమైయ్యాయి. మహాభారతానికి దీటైన నిజ చరిత్ర కేవలం పుస్తకాలలో మిగిలింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణంకాగా ప్రజలలో లోపించిన స్పృహ మరో కారణం.


జై హింద్

Dec 26, 2010

నాన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఏమిస్తావ్

"నాన్నా క్రిస్మస్ గిఫ్ట్ ఏమిస్తావ్"
సూరిగాడి సొద మొదలుపెట్టాడు.
ఏంకావాలిరా నాన్నా అని అడిగాను. వాడికి మనసులో ఏదోక పెద్ద కోఱిక ఉండేఉంటుంది తప్పకుండా అని అనిపించింది. కొంత ఊహించా కూడా. వాడి కార్ల పిచ్చి కళ్ళముందు ఒకసారి మెదిలింది. ఎప్పుడు వాల్మార్ట్ వెళ్ళినా టాయ్స్ దగ్గరకి వెళ్దామని అడుగుతాడు. వద్దురా బాబూ, వెళ్ళినప్పటినుండి కొను కొను అడి ఏడుస్తావు, నాకు తలనొప్పి రా నాయనా అంటే, లేడు నాన్నా జస్ట్ చూసి వచ్చేద్దాం అంటాడు. జస్ట్ టు సీ అంతే, నో బైయింగ్ అని ఖచ్చితంగా అంటాడు. ప్రామిసులు గట్రా చేస్తాడు. నా రోజు బాగుంటే, వచ్చేస్తాడు జస్ట్ చూసి. ఖరాబు రోజున ఏడ్చి నాకు అదు కావాలా అని రచ్చ రచ్చ చేస్టాడు. తప్పు వాడిది కాదుగా. కన్జ్యూమరైజ్డ్ మార్ట్ ది. కన్జూమర్ని అవసరంలేకపోయినా ఎట్రాక్టు చేసి కొనిపించే మార్ట్ హృదయలేమిది. ఏమైనా వాడికి ఏంకావాలో నాకు సగం అర్థం అయ్యింది. లైటెనింగ్ మెక్వీన్ కావాలంటాడు.
LightningMcQueen.jpg
సరే, మాంచి సమయంచూసి ఏరా నాన్నా ఏంకావాలో చెప్పరా అని అడిగిందే తడావు, లైటెనింగ్ మెక్వీన్ రిమోట్ కంట్రోల్ కార్ కావాలి నాన్నా అన్నాడు.
రోజూ ఆఫీసు నుండి ఇంటికెళ్ళంగనే తెచ్చావా అని అడగటాం లేదురా ఇంకా టైం ఉందిగా అనటం అలవాటైపోయింది వాడికీ నాకూ.ఇక నిన్న క్రిస్మస్ ఈవ్. ౨౪ డిశెంబరు. ఇక కొందాం అని బయల్దేరాం. వా.మా వెళ్ళాం. ఎంత వెతికినా మనకి కావాల్సింది దొరకలా. ఎట్లా నాన్నా అంటాడు మొహం చిన్నబుచ్చుకుని. సరేరా టాయ్స్-స-రస్ లో ప్రయత్నిద్దాం అని అటు వెళ్ళాం. చలిగా ఉంటంతో,  బ్యాచీని కార్లోనే వదిలి లోనకి ఏతెంచా. వెతికా మొత్తం, దొరకలా. ఐతే, ఒక ర్యాకు మొత్తం రి/కం అంటే రిమోట్/కంట్రోల్ కార్లు ఉన్నాయ్. అక్కడే ఫెర్రారి మోడాల్ ఒకటి కనిపించింది. వెంటనే కాల్ కొట్టా, ఏరా రెడ్ ఫెర్రారి ఉంది మరి ఏంచేద్దాం అన్నాను. ఓకే, ఐ'ల్ ప్రిటెండ్ దట్ అస్ మెక్వీన్ అన్నాడు. హమ్మయ్యా బతికాం అనుకున్ని కొన్నా. కారుదగ్గరకి పోంగనే ఇటివ్వు చూస్తా అన్నాడు. ఇచ్చాణు. నచ్చింది.
మొత్తానికి వాడికి నచ్చి వాణ్ణి ఎంటర్టైన్ చేస్తోందీ కార్ గిఫ్ట్. ఇదే ఆ కారు.

Dec 25, 2010

తమ్ముడు సుబ్బులు పుట్టిన్రోజు

ఈపొద్దు
ఏసు ప్రభువు పుట్టినాడంట.
కావొచ్చు
మాకేంది?
ఇయ్యాల్నే మా సిన్నోడు సుబ్బులు [అ.క.అ సుబ్రహ్మణ్య సైతన్య http://swarnmukhi.blogspot.com/]
పుట్టినేల
మనోడికి
నా శుభాకాంక్షలు
ఇట్టనే జీవితంలో ఉన్నతులు పొందాలని
నా ఆశీస్సులు

Dec 24, 2010

కార్ వార్మింగ్ కొన్ని నిజాలు

మాకో ఫ్లైయర్ వచ్చింది ఈరోజు.
కారుని వార్మ్-అప్ చేయటం వల్ల మైలేజీ తగ్గుతుంది.

Dec 22, 2010

రోడ్డుపై చిల్లర వ్యాపారాలుకు కూడా గతిలేని హిందువులు

రోడ్డుపై చిల్లర వ్యాపారాలుకు కూడా గతిలేని హిందువులు
ఏంచేస్తారులే పాపం ఉన్నదంతా వెయ్యేళ్ళ ముస్లింపాలనలో దోపిడీకాబడ్డారుగా
పేవుమెంటులపై పూలమ్ముకుంటున్న ముస్లిములను చూస్తూ
పళ్ళమ్ముకుంటున్న పల్లీలమ్ముకుంటున్న ముస్లిములను చూస్తూ
ఆ పక్కనే కొంచెం జాగా కోసం కాలుపెడితే
తన్ని తరిమేసే వ్యాపారాత్మకతను నిస్సహాయంగా చూస్తూ
దూదేకుతున్నా
వీధిఅరుగుపై దర్జీపని చేస్తున్నా
గడియారాలు బాగు చేస్తున్నా
ఎవరికైనా కావాల్సింది బ్రతుకుతెఱువే అని గుర్తించని వారికి
కనీసం అదీలేకుండక
కడుపులో కాళ్ళు పెట్టుకుని
ఆర్తితో
కండ్లనీటితో
బిచ్చమెత్తుకుంటున్న హిందువులు ఎందరో
ఎవరైనా ఆ పట్టెడన్నం కోసమే
ఎవరికైన ఆ పట్టెడన్నమే
కోఱుకునేది కావాల్సింది
ముస్లిములు ఆకాశం నుండి రాలేదు
వారిని కూర్చోబెట్టి పోషించటానికి
వారు దోచిన దేశమే కదా
వారు దోచుకున్న దేశమే కదా
వారు దోచుకోబట్టే కదా
ఈ దేశం
ఒకనాడు వెలుగు వెలిగిన దేశం
ఒకనాడు ఆర్థికంగా వెలిగిన దేశం
ఒకనాడు శక్తితో వెలిగిన దేశం
ఈనాడు ఇలా
బిచ్చమెత్తుతూ
ఈనాడు ఇలా
ప్లాటుఫారంపై మిగిలిన అస్థిపంజరంలా
ఇంకేంకావాలయ్యా మీకూ
మా ఊళ్ళను ఆక్రమించారు
మా గుళ్ళను పగులగొట్టారు
మా దేవుళ్ళ కాళ్ళను విరగొట్టారు
మా స్నానాల ఘాటూలను బాంబులతో పేల్చేసారు
మా వీధులు రక్తపు ఏర్లైయ్యాయి
మా పండుగలు బిక్కుబిక్కుమన్నాయి
మా ఆనందాలు దేబిరించాయి
మా పార్లమెంటుకే ఎసరుపెట్టారు
మా దేశపు సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చారు
కనిపించిన సామాన్యులను కాల్చివేసారు
మా హృదయాలను చీల్చివేసారు
మిగిలిన దేవళాలనూ పేల్చేస్తామన్నారు
ఔనులే మా మంచితనం మీకోవరం
మా అనైకమత్యం మీకో వరం
అనైతికతను ప్రశ్నిస్తే మతం పేరు చెప్తారు
నీ రక్తం భరతమాత తిలకం కాదు
భరతమాతని చీల్చి
ఆ రక్తంతో మీకో కోట కట్టించాం
అది మీరు మరచారు
మరో మారు చీల్చి ఇచ్చాం
మరోమారు పక్కలో పొడిచరు
డొక్కల్లో పొడిచారు
పొడుస్తూనే ఉన్నారు
భరతమాత రక్తంతో
పండగలు చేస్కున్నారు
దేనికైనా ఓ రోజొస్తుంది
దేనికైన ఓ అంతం ఉంటుంది
నా రేపటితరం
దీన్ని ప్రశ్నిస్తుంది
నా రేపటి తరం
దీనికి ముగింపు రాస్తుంది
ముగింపుకి పునాదిని నేనే వేస్తా
ముగింపుకి పునాదిని ఇప్పుడే వేస్తున్నా
నా రాజ్యాన్ని నేనే కాపాడుకునేందుకు ముందుకు వస్తున్నా
ఓ హిందూ సోదరా లే
నిద్దురలే
నీ ఇంటిని కాపాడుకునే రోజు వచ్చింది
ఇకలే
ఎదురించి పోరాడు
మన ఇంటిని మనమే కాపాడుకుందాం
మన వీధిని మనమే కాపాడుకుందాం
మన గుడిని మనమే రక్షించుకుందాం
మన రాజ్యానికి మనమే కాపలా కాసుకుందాం

Dec 20, 2010

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం - రాహుల్‌

హిందూ తీవ్రవాదం ప్రమాదకరం
ఉగ్రవాదం కన్నా దానితోనే దేశానికి ఎక్కువ ముప్పు
అమెరికా రాయబారితో రాహుల్‌ వ్యాఖ్యలు
వెల్లడించిన వికీలీక్స్‌
భారత్‌ పట్ల అవగాహన లేని అజ్ఞాని
భాజపా, ఆరెస్సెస్‌ ఆగ్రహం
వివరణ ఇచ్చిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకన్నా అతివాద హిందూసంస్థలే భారత్‌కు ఎక్కువ ప్రమాదకరమని కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ అభిప్రాయపడినట్లుగా అమెరికా అధికారపత్రం ఒకటి వెల్లడించింది. వికీలీక్స్‌ బయటపెట్టిన లక్షలాది అమెరికా రహస్య విదేశాంగ పత్రాల్లో ఇది కూడా ఉంది. గత ఏడాది జులైలో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ గౌరవార్థం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏర్పాటు చేసిన విందు సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పత్రం తెలిపింది. విందులో తన పక్కనే కూర్చున్న అమెరికా రాయబారి తిమోతి రోమర్‌తో రాహుల్‌.. దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలతోపాటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ మరో ఐదేళ్లలో దృష్టి సారించిన ప్రధాన అంశాలపైనా చర్చించారని పేర్కొంది. లష్కరేతోయిబా కార్యకలాపాలపై రోమర్‌ ప్రశ్నించినప్పుడు.. 'భారత్‌లోని కొందరు ముస్లింలు కూడా ఆ సంస్థకు మద్దతిస్తున్నారు. అయితే, మతఘర్షణలు పెంచుతూ, ముస్లింలపై రాజకీయ దాడులు చేస్తున్న అతివాద హిందూ సంస్థల పెరుగుదలే దానికన్నా మించిన ప్రమాదం' అని రాహుల్‌ చెప్పారు.

సగం కిరస్థానీ సగం పార్సీ అయిన ఓ మేధావీ, నీకు దేశం దాసోహం అంటోంది. నువ్వే మాకు మార్గదర్శకుడివీ అంటోంది. రాజావారి మాటలు కొందరు కుత్తేలకు, అరుంధతీ రాయిలకు సమ్మగా వినసొంపుగా అనిపించవచ్చు.


కుట్ర ఉండవచ్చన్న కాంగ్రెస్‌
రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగటంతో కాంగ్రెస్‌ వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదం, మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దేశానికి ప్రమాదమేనని, వాటిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలన్నదే రాహుల్‌గాంధీ అభిప్రాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ పేర్కొన్నారు. వికీలీక్స్‌ వెల్లడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అన్న అనుమానాలున్నాయని, సత్యాసత్యాలు నిగ్గు తేల్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.

కుట్ర ఉంది వికీలీక్సులో కాదురా రాజకీయ దురహంకారీ. కుట్ర ఉన్నది నీ మనసులో, వెన్నెముకలేని నీ రాజకీయ స్వార్థపు విధేయతలో, కుట్ర ఉన్నది ఏంచేసైనా మళ్ళీ ఎలక్షన్లు గెలవాలనే సంకుచిత ఆలోచనలో.

Dec 17, 2010

పుట్టిన్రోజు గ్రీటింగు ముక్క


8 రాక్స్ అంటా.
ఆణిల్చుకున్నది ఆడేనంట, డైవింగుకొచ్చాడంట.
బ్రౌను రంగులో ఉంది షిప్ రెక్ అంట.
కింద రేడియం రంగు సీ వీడ్ అంట.
కింద ఆకుపచ్చ చక్రం సీ యా౨నిమోన్ అంట. అంటే ఏమ్దో నాకు తెలవదబ్బయా.
అట్ట సెప్పుకుంటా పోతే ఓ బొక్కే రాయొచ్చులే గానీ, కాయితకం ఎనకమాల ఇట్టా రాసిండబ్బా

సంటిది నాదీ, ఏపీ బర్త్‌డే అంది.
అదయ్యా ఈపొద్దు సంగతి.

స్పాన్టేనియస్ ఆర్ట్

మొన్న అనఘ వాడి పెన్ను లాక్కుందని నా మీద అలిగి మూల కూర్చుని పెన్నుతో ఈ బొమ్మ బెరికాడు.


ట్రీ ఫేస్
ముందు కళ్ళు మూసుక్కూర్చుంది వాడేనట. దాకలమూచి ఆడుతున్నాడంట.
అటు ఇటు ఉన్న పిల్లకాయలు నిక్, పియర్స్ ఇత్యాది వాడి క్లాసు మేట్లు. బహుశా వాడి రెసెస్ టయం అయిఉండచ్చు.

అదీ కథ ఈ దినం.

Dec 12, 2010

ఆలయ రక్షణ భారం దేవుడిదే

ఆలయ రక్షణ భారం దేవుడిదే
ఆందోళన రేకెత్తిస్తున్న ఐ.ఎం. హెచ్చరికలు
చేతులు ఎత్తేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
దేవాలయాల్లో విధ్వంసం రేపుతామని కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ బహిరంగంగా హెచ్చరించినప్పటికీ మన రాష్ట్రంలో మందిరాలకు కనీస రక్షణ కల్పించే పరిస్థితి కనిపించడంలేదు. ఉన్న సిబ్బందిని ఇతరత్రా తప్పనిసరి విధులకు వినియోగించాల్సి వస్తుండటంతో హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా దేవాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గ దేవాలయం వంటి పెద్దపెద్ద ప్రార్థనా మందిరాలు తమ ఖర్చుతో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌.పి.ఎఫ్‌.)ను నియమించుకొని తంటాలు పడుతున్నాయి. కాని మధ్య, చిన్నతరహా దేవాలయాలకు కనీస భద్రత కరవైంది. ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు వీటి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అయోద్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్‌ముజాహిద్దీన్‌ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్‌ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్‌ భత్కల్‌, సాంకేతిక నిపుణుడు పీర్‌భాయ్‌ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.

-----------------------------------------------------------------

చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకు డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థని నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.



Dec 10, 2010

టా౨బ్లెట్ల యుద్ధం

NOTION INK వాడి ADAM అనే ఓ TABLET తొందర్లో రిలీజు కాబోతోంది అమెరికా మార్కెట్టులో.
ఇది దేశీయ కంపెని. బంగళూరు దీని ప్రధాన కేంద్రం.

Apple వాడూ ఏ ముహూర్తాన ipad అన్నాడోగానీ, టా౨బ్లెట్ల యుద్ధం మొదలైంది.

Apple ipad
new-product-wifi.jpg

పది టా2బ్లెట్లు ipad తో పోటీపడేవి ఇవిగో
JooJoo
for_home_page_use.png

HP Slate
c02063984.jpg
Exopc slate

product-slate-c.jpg

IVD Vega
ICDVega01.png
Viliv X70
s5_1.jpg

Plastic Logic QUE proReade
r
plasticlogic.jpg

Archos 9
A101it_sleek_design.png
Dell Steak
streak-design1.jpg

Asus Eee Tablet
78112.jpg
Notion Ink Adam
notion.jpg
Lenovo IdeaPad
lenovoideapad.jpg

అదబ్బా ఇంకా ఏవన్నా ఉన్యాయేమో, నాకు పెద్దగా తెలవదు. ఇవన్నీ దాదాపు మూడు వందల డాలర్ల నుంచి ఆరు వందల డాలర్ల ధరల్లో ఉన్నాయి. చాలామటుకు లైనక్స్ మీద చేసినవే.

Dec 9, 2010

చలికాలంలో కార్ మైలేజీ తగ్గును

నిన్న మొన్నటిదాకా నా కారు 23 నుండి 23.3 దాకా ఇచ్చింది మైలెజి గా౨లెనుకి. ఈ మధ్య సలికాలం మొదలైందయ్యా ఏటి సేత్తాం. ఉన్నట్టుండి మైలేజి 22.6 కి దిగింది.


సలికాలం మైలేజి తగ్గుద్దంటా అబ్బయ్యా. ఎందుకో? అనుకున్టన్నవా? కొన్ని కారణాలు ఇవిగో -
రోలింగ్ రెసిస్టన్స్ పెరగటం. Rolling resistance at 0 degrees F is 20% greater than at 80 degrees
స్లష్ స్నో లాంటి రోడ్డు కండీషన్స్ కూడా రోలింగ్ రెసిస్టెంమ్స్ లాంటివే. ఇవికూడా కారణభూతమౌతాయి.
ముఖ్యమైన కారణం లోయర్ ఏవరేజ్ ఇంజెన్ టెంపరేచర్. ఎందుకంటే చలికాలంలో ఇంజను ఆపరేషనల్ టెంపరేచర్‌కు చేరటానికి పట్టే సమయం ఎక్కువ. అంతేకాక ఆపినాక తొందరగా వేడిని కోల్పోతుంది కూడా. Since the engine management system orders up a richer mixture when cold (proportionately more fuel in the air/fuel combination), more fuel is being burned overall.
అంతేకాదు ఇంజను ఆయిల్ చలివల్ల జీబుకొంటుంది. జీబుకొనుట = థికెన్ కావటం. అంతేకాదు బేరింగుల గ్రీజు, ఇతరత్రా ద్రవాలు కూడా థికెన్ అవుతాయి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ కావాల్సొస్తుంది ఈ థికెన్డ్ ద్రవాలతో బండిని గుంజటం. అంటే ఇంజెను ఎక్కువ తాగుతుంది ఆల్కాహాల్ని, తూచ్, కాదు గ్యాసుని. సింతటిక్ ఆయిల్స్ వాడినట్లైతే దీన్ని తగ్గించవచ్చు. నా కారుకి సింతటిక్ ఇంజన్ ఆయిల్ వాడతాను.
ఇక ఇవికాక, చలిప్రదేశాలకోసం సరఫరా చేసే గ్యాసు వేరేగా ఫార్ములైజ్ చేస్తారట better cold vaporization characteristics కోసం. అదికూడా మైలేజీని తగ్గిస్తుందట.
ఇక ఆ తర్వాతి విషయం, ఎలక్ట్రిక్ లోడ్. ఇదికూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చలి ప్రదేశాల్లో డే లైట్ తక్కువ. కాబట్టి హెడ్లైట్ల వాడకం పెరుగుతుంది. హీటర్ వేస్కుంటాం. సైడ్ మిర్రర్స్ హీట్ చేస్తాం. ఎనక విండో హీటార్ వేస్తాం. ఇవన్నీ భారమే కదా. అంతేకాక చలి ప్రదేశాల్లో బ్యాటరీలు తొందరగా డిస్ఛార్జ్ అవుతాయట.
అంతేకాక మంచుపడిన రోజుల్లో కారు పైన పడిన స్నోని సరిగ్గా తొలగించనందువల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ అనేది పెరుగుతుందట.

కాబట్టి అబ్బాయ్! చలికాలంలో, తీస్కోవాల్సిన జాగ్రత్తలు -
౧. టయర్లలో పీడనం సరిగ్గా ఉందోలేదో చూస్కోవాలి
౨. బయల్దేరే ముందు ఇంజన్ని వేడెక్కనిచ్చి అప్పుడు గ్యాస్ పెడల్ తొక్కాలి
౩. ఇంజెన్ స్టార్ట్ చేయంగనే హీటర్లు గట్రా వేస్కోవద్దు. ఇంజన్ హీటెక్కినాక వేస్కుంటే బెటర్
౪. ఎడపెడా యాక్సిలరేటర్ తొక్కకుండా నింపాదిగా తొక్కటం
౫. బ్రేకుల వాడకం తగ్గించుకోవడం
౬. ఫిల్టర్లను మార్చుకోవడం
ఇత్యాదివి మైలేజీని పెంచుతాయట.

Dec 8, 2010

క్రెయాన్స్‌అట

అయ్యా, ఇవి క్రేయాన్సటయ్యా.
బొమ్మలేసాడు బానే ఉంది. కింద క్రేయాన్స్ అని రాసాడు. ఆ అచ్చరాలకు రంగు పులిమాడు.

Dec 7, 2010

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు

కాశిలో గంగా హారతి సమయంలో పేలుడు
లక్నో: కాశీలో ఈరోజు సాయంత్రం గంగాహారతి సమయంలో పేలుడు సంభవించింది. ఇక్కడి దశ అశ్వమేథ ఘాట్‌లో మంగళవారం గంగానదికి సాంప్రదాయకంగా మహా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. శివుడు, మహాకాళేశ్వరుని ఆలయాలకు సమీపంలో ఈ ఘాట్‌ ఉంది. హారతిని వీక్షించేందుకు వందలమంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. హారతి కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించటంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ విదేశీయుడు మృతి చెందగా 20 మంది వరకు గాయపడ్డారు. నదిలో పడవలో ఉండి చూస్తున్న భక్తులకూ శకలాలు తగిలాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకు పేలుళ్లు వినిపించాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం వారణాశి జిల్లా ఆసుపత్రికి తరలించారు.గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇంత గోల దేనికి, కాశీ విశ్వనాథ ఆలయం తాళాంచేతులు వీళ్ళకే ఇచ్చి, అబ్బాయిలూ కూలగొట్టండీ అంటే సరిపోతుందిగా. గోల వదిలిపోతుంది.
ప్రశ్న, ఇలా ఎంతకాలం?

పేలుడు మా పనే: ఇండియన్‌ ముజాహిద్‌
లక్నో: కాశీలో పేలుడుకు పాల్పడింది తమ సంస్థేనని ఇండియన్‌ ముజాహిద్‌ ప్రకటించింది. దీంతో విదేశీయుల లక్ష్యంగానే వారు ఈ పనికి పాల్పడి ఉంటారని కేంద్ర హోం శాఖ నిర్ధారణకు వచ్చింది. పేలుడు శబ్ధాలు రెండు కిలో మీటర్ల దూరం వరకు వినిపించడంతో చాలా శక్తివంతమైనవే ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వరుసపేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా కేంద్ర హోం శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

హోం శాఖ ఏం నిర్థారణకు వస్తే మనకేంటి? అవ్వాల్సిన పని అయ్యాక, రెడ్ ఎలర్టులు ప్రకటించి ప్రయోజనం ఏంటీ? వీళ్ళు అంతలోపలిదకా వెళ్ళి బాంబులు పెట్టగల్గుతున్నారంటే, ఏంటో, నోటమాట రావట్లా.

ఇంకెన్ని ఘోరాలు జరగబోటున్నాయో ఏంటో.

నేనూ వెళ్ళాను రెండు సార్లు ఈ హారతిని చూట్టానికి. అత్భుతంగా ఉంటుంది మహా హారతి.
పరమేశ్వరా నీ ఇంటిని ఇక నువ్వే కాపాడుకోవాలయ్యా

Dec 6, 2010

గిల్లికజ్జాలు

తూయా! స్తాపిత్ [షూయా కాస్తా తూయా అయ్యిందిప్పుడు]
[ఆడు పట్టించుకున్నట్టు లేదు, మళ్ళీ అరుపు]
తూయా! స్తాపిత్
[కూసింత హెచ్చు స్వరంలో]
తూయాయాయాయా! స్తాపిత్‌త్‌త్‌త్ [మరీ హెచ్చు స్థాయిలో]
[నే డ్రైవింగ్ సీట్లోంచి అరుచుట]
అరేయ్, తంతా నిన్ను ఆపు. ఎందుకు దాన్ని ఏడిపిస్తా
నేనేం చేయలేదు నాన్నా [వాడి గొంతులో నవ్వు]
మరేంటటా అమ్మగారి గోల?
[మావిడ కల్పించుకుని]
ఏంలేదులే నువ్వు నడపవయ్యా
అదేంటి? ఏంలేకుండా అరవటానికీ ఎవరనుకున్నావ్? అనఘ
మరేంలేదులే, టెన్షన్ పడక. ఆడు అడు సీట్లో పిల్స్ ఇటు సీట్లో కదా కూర్చుండేది
అవును
ఆడు వాడి కిటికీలోంచే చూస్కోవాలంట. తల ఇటు తిప్పి పిల్స్ కిటికిలోంచి చూస్తే అమ్మగారికి కోపం
వాట్????%$‌&‌&‌&*(&(&*#%@#$%


అదయ్యా సంగతి.

మైక్ టెస్టింగ్..అలో వేణు .. అలో అలో

బాసూ వేణు శ్రీకాంత్ యాడిన్యా ఎన్టనే ఈడకి లగెత్తుకొచ్చాయలని సవినయంగా మైకట్టుకుని సెప్తా ఉన్యా.

ఇయ్యాల వేణుశ్రీకాంత్ పుట్టన్రోజు
వేణూ బ్రదరూ, ప్రతీ ఏడాదీ ఇలానే సేస్కోవల నువ్వీరోజు

ఇంతవరకూ బానేఉంది, కానీ, బాసూ, ఇదేంబాలేదు.
ఇదేం బాలేదు బ్రదరూ
మా కెమారాలు లోడ్ సేసిపెట్టుంచాం
మా బా౨టరీలు సార్జింగు సేసి పెట్టుంచాం
టిక్కెట్లు బుక్కు సేస్కుని పెట్టుంచాం
మా పిల్లకాయలకు సెలవలు పెట్టుంచాం
సెప్పుల్లో కాళ్ళ పెట్టుంచాం
బువ్వ కూడక తినకుండా కూకోనున్నాం
నువ్వు పప్పన్నం పెట్టిస్చావని
ఎదురు సూచా ఉన్నాం
ఎంతకాలం ఇట్టా ఉండమంటా?

Dec 3, 2010

భావం - భాష

భావాన్ని వ్యక్తపరచాలంటే భాష కావాలి.
మన భాష తెలుగు. కాబట్టి మనం మన భావాలని తెలుగులో వ్యక్తపరుస్తాం.
మరి తేడా ఎక్కడా? భావంలోనా భాషలోనా?
ఉదాహరణ -
౧. రేడియో విరిగింది.
మొన్నీ మధ్య టీవీలో ఓ ప్రకటన చూసా. విక్స్ అనుకుంటా. ఒక ముసలాయన కుర్చిలో కూర్చుని రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటుంటాడు. రేడియో కిందపట్టమో జరుగుతుంది. అరెరె రేండియో విరిగిందే అంటాడా ముసలాయన, వెంటనే ఓ ఔత్సాహిక కుఱ్ఱాడు కామెంటరీ చెప్పేందుకు ముందికి వస్తాడు...బ్లబ్లబ్ల.
రేడియో విరిగేందేవిట్టా వాడి బొంద.
లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి మాస్ కమ్యూనికేషన్స్ చదువాతారు కొందరు. మాస్ తో కమ్యూనికేట్ చేయాలంటే దృశ్యం ఎంత ముఖ్యమో శ్రవణం కూడా అంతే ముఖ్యం అనే ఓ సింపుల్ పాయింటుని సదరు కళాశాల అధ్యాపకులు నేర్పరా ఏవిటి వీళ్ళకి?

సరే పరాయి భాషనుండి దిగుమతి చేస్కున్న ప్రకటన, తెలుగీకరించారనుకుందాం. ఇంతక మునుపట్లో కూడా ఇలా జరిగిందే మరి. ఇదేమీ కొత్త కాదుగా. విక్స్ కి గోలీలో ఖిచ్ ఖిచ్ దూర్ కరో. గొంతులో గుర గురా విక్స్ తీస్కో అనే ఓ వాక్యాన్ని తెలుగులో చెప్పించటానికి ఓ పెద్ద భాషమీద పట్టు, భాషాపాండిత్యం ఏం అక్కర్లేదుగా.
౨. మరక మంచిదే. మరకవల్ల ఏమన్నా లాభం కలిగితే మరక మంచిదే.
ఈ ప్రకటన ఓ దౌర్భాగ్యపు నీచ నికృష్టపు విలువలకు నిదర్శనం. ఇందులో భాషా ప్రయోగమే కాదు దృశ్య ప్రయోగం కూడా ఘోరం. చదువు మనిషికి ఆలోచలని రేకెత్తించేలా ఉండాలి. ఇది తీసిన వాడేవడోగానీ వాడికి కనీస లాజిక్కు లేదు.
పిల్లాడు బడికెళ్ళాడు.
స్నేహితుణ్ణి అడుగుతాడు రోజీ మిస్ రాలేదేం అని.
వాళ్ళ కుక్క పిల్ల సచ్చిందిగా అందుకే రాలేదు అని చెప్తాడా సదరు మితృడు.
కట్ చేస్తే రోజీ మిస్ ఇల్లు
పిల్లాడు, కుక్క సచ్చిందని బాధపడకు రోజీమిస్ నేనున్నాగా అని కుక్కలా ప్రవర్తిస్తాడు.
మిస్ అయిన లాజిక్కు -
పిల్లాడికి రోజీ మిస్ ఇల్లు ఎలా తెలుసు?
పిల్లాడు బడి ఎగ్గొట్టి రోజి మిస్ ఇంటికి ఎలా వెళ్ళాడు?
ఆ వయసు పిల్లాడు ఒక్కడే ఎలా వెళ్ళగలడూ?
మరక మంచిదే, మరక వల్ల లాభం కలిగితే వాడి పిండాకూడు కలిగితే మరక మంచిదే? ఏం మరకా? వాడి బొంద మరకా?
బడి ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరిగితే పడే మరక సంగతేవిట్టా?
[బడీ అయ్యాక, ఇంట్లో చెప్పి, వాళ్ళా నాన్న దింపితే....నాకు కొంచెం అకల్ ఉంది బట్]

ఇలా ప్రకటనల్లో వచ్చే తెలుగు, లేక మన యాం౨కరు అమ్మాయిల ముద్దు ముద్దు (ఆపాట పట్టుకుని ముక్కు మీద గుద్దు గుద్దు) తెలుగు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి. అదలా ఉంచితే, మనలోనే కొందరు ఖూనీ చేసేస్తున్నారు తెలుగుని, తమ మాతృభాషని.
వీపు ఇరగ్గొడతా అంటాడు ఓ మితృడు
నెయ్యి గుప్పెడు తింటే అత్భుతం ఈ పచ్చడితో అంటాడు ఇంకో మితృడు
చేయి పగిలిందంటాడు ఇంకొకడు
తల విరిగింది అంటాడు మరొకడు

ఎక్కడా లోపం?

Dec 2, 2010

కసబ్‌ పడవలో రాలేదు.. రైల్లో వచ్చాడు

కసబ్‌ పడవలో రాలేదు.. రైల్లో వచ్చాడు
ముంబయి: ముంబయి మారణకాండకు అజ్మల్‌ కసబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు బొంబాయి హైకోర్టులో వాదించారు. 26/11 దాడుల కోసం తొమ్మిది మంది ఉగ్రవాదులతో కలిసి ముంబయి తీరంలోని బద్వార్‌ పార్కుకు కసబ్‌ ఓ పడవలో వచ్చినట్లు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.కసబ్‌ మరణశిక్ష నిర్ధరణపై గురువారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన చిన్న పడవలో 10 మంది వ్యక్తులు, వారి బ్యాగులతో సహా ప్రయాణించడం సాధ్యం కాదని కసబ్‌ న్యాయవాదులు అమిన్‌ సోల్కార్‌, ఫర్హానా షా ధర్మాసనానికి తెలిపారు. ఆర్థర్‌ రోడ్డు జైలులో ఉన్న పడవను స్వయంగా పరిశీలించాలని న్యాయమూర్తులను కోరారు. దీనిపై అవసరమైన ఆదేశాలను తర్వాత జారీ చేస్తామని జస్టిస్‌ రంజనా దేశాయ్‌, ఆర్‌.వి.మోర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదులతో కలిసి కసబ్‌ ఓ పడవలో ముంబయి వచ్చినట్లు ఆధారాలు లేవని సోల్కార్‌ వాదించారు. ఆయన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వచ్చారని చెప్పారు. తర్వాత హిందీ సినిమాలు చూడడానికి ముంబయి చేరుకున్నారని తెలిపారు. జూహూ బీచ్‌ వద్ద 26/11 రోజున కసబ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి కేసులో ఇరికించారని వాదించారు. తదుపరి ఆదేశాల కోసం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
----------------------
నేను మొట్టమొదటి నుండీ మొత్తుకుంటూనే ఉన్నా. కసబ్ అసలు ఆరోజు ముంబైలోనే లేడు. ఎక్కడో లాహోర్లో ఉంటే మన పోలీసులు అన్యాయంగా అక్రమంగా దారుణంగా అతన్ని అరెస్టు చేసి ముంబైకి ఎత్తుకొచ్చి ఇరికించారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.
హిందీ సినిమాలు సూట్టానికి పాకిస్థాన్ నుండి ముంబై వచ్చాట్ట పాపం కసబ్. పత్రికల భాష చూడండి ఆయన, ఇంకానయం వారు శ్రీ కసబ్ గారు అనట్లా.
రెండేళ్ళాయ ఈ ఘోరకలి జరిగి. కసబ్ కేవలం సినిమాలు సూట్టానికే ఒచ్చినోడని ఎనక్కి పంపిస్తే పోలా, మనకి ఖర్చన్నా తగ్గుద్ది.
ఛీఛీ.....

Dec 1, 2010

ఆర్ట్

ప్రతీ మనిషిలోనూ ఎదోక కళ ఉంటుంది. ఐతే చాలామంది దాన్ని గమనించరు, నర్చర్ చేయరు.
మొన్నటి ఆదివారం మా దేవాళయంలో అఖండ రుద్ర పారాయణ జరిగింది. ఆరున్నరకల్లా గుళ్ళో ఉండాలి అన్నారు పెద్దలు. నాలుగున్నరకి లేచి ఐదుంబావు కల్లా రోడ్డెక్కి ఆరు ఇరవై కల్లా గుళ్ళో ఉన్నాను. ఎరేంజ్‌మెంట్లు మొదలెట్టాము అందరం. పారాయణ చెసేప్పుడు అభిషేకానికి అవసరమైనన్ని పాలు పండ్లు పండ్ల రసాలు ఇత్యాది సామగ్రిని సిద్ధం చేసాం. అంతలో గురువుగరు అబ్బాయ్ ఆ పెద్ద బల్ల తీసుకురండి ఇటు అని పురమాయించారు. ఎందుకన్నా అనుకుంటూనే తెచ్చి పెట్టాం. దానిపై ఓ వస్త్రాన్ని పరిచి, పైన ముగ్గులు వేసి, అదిగో ఆ డబ్బా ఇటు తే అన్నారు గురువుగారు. పై కాయితం తీసి చూస్తే అందు బుల్లి బుల్లి శివలింగాలు. చక్కగా నల్లటి రంగులో, తెల్లని నామంతో. వందకు పైగ ఉన్నాయి.
From కార్తీకమాసం

సరే ఆరు గంటల కార్యక్రమం అయ్యాక ప్రసాదాది కార్యక్రమాలప్పుడు ఎవరు చేసారయ్యా ఇన్ని లింగాలను ఎలా అని అడిగితే శ్రీ వినయ్ కుమార్ గారు చేత్తో చేసారని తెలిసింది. ఆయన అటుగా వెళ్తుంటే అభినందనలు తెలియపరచాను కరచాలనం చేసాను, అయ్యా చేయిని ఊపకండి ఇంకా నొప్పులుగా ఉన్నాయి అన్నారతను.
మట్టితో చేసి, కాల్చి, నల్లరంగు వేసి.........................ఎంత కళాత్మకత, ఎంత ఆర్టిస్టిక్ విజన్, థాట్.
హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. వారు, అయ్యా మా పిల్లకు కూడా సహాయం చేసారని వినయంగా తెల్పారు.

ఓం నమఃశివాయ.

From కార్తీకమాసం