Oct 4, 2010

గెలికితే ఏటౌద్దీ?

ఓ ఇదేం పెద్ద ప్రశ్నకాదు. గిలికితే ఏటౌద్దీ? రెండు విధాలు -
తెలిసి గెలికవా?
తెలియక గెలికావా?
అబ్బే అట్టా కాదబ్బా, తెల్సీ తెలియకుండా కూడా గెలకచ్చూ అన్నాడంట నాబోటిగాడు.
ఏంకత అంటే, పోయినేడాది మాయమ్మకు ఓ ల్యాపీ అంపించా. ఎచ్.పి పవీలియన్, డివి-౭ సిరీస్. నాలుగు జిబి రా౨ము..గట్రా.
ఇంటరునెట్టుకి తగిలించింది మితృల సహాయంతో...మొదటినాల్రోజులు బెమ్మానంగా పని సేసింది. దెన్ స్టార్ట్స్ స్ట్రగుల్. ఏందివయ్యా అంటే క్రా౨ష్ అవుతున్నది పావుగంట-అఱగంట కాంగనే.
మొన్నీమద్దిన అన్నయ్య గుంటూరెళ్ళినప్పుడు కొత్తదెత్తుకెళ్ళి దాన్ని తెచ్చి నా సేతిలో పెట్టాడు.
అవున్రొరేయ్ ఎందుకు క్రాషౌతున్నదంటా అన్నాడు అన్న. ఏమోరా అన్నా. పంఖా పని సేస్తల్లేదేమో దుమ్మో మట్టో దారవో వడ్డం పడుండిద్దేమో సూద్దామా అన్నాడు జంకుతా. మనం బుస్సున పైకిలేసి, స్క్రూడ్రైవర్ పట్రా అన్నా. జంకుతా జంకుత తెచ్చాడు. లా౨ప్టాప్ సెడగొట్టం అనే ఓ బృహత్తర కార్యక్రమానికి తెరదీసాం. మొత్తానికి ఊడదీసాం. పంఖా పనిసేయట్లేదని అరదం అయింది. సరే బిగించేద్దాం పంఖా కొని తర్వాత ఏయొచ్చు అనుకున్నాం. తిరిగి పెడతా ఉంటే జిఫ్ కనెక్టర్ ఊడిపోయింది. హమ్మనీ ఎన్కమ్మ నుకున్నాం. ఆయాల బీరుకొట్టి తొంగున్నాం.

ఇది తెరతీయటం పేర్లుపట్టం పటుకే అని తెలియజేస్కుంటన్నా. ఇప్పుడు వసలు కతలోకొస్తే -
రెండువారాలక్రితం
శనోరం మద్దేనం
జిఫ్ కనెక్టర్ని సోల్డరింగ్ గన్ తో అంటిద్దాం అనుకున్నా. మళ్ళీ ల్యాపీని ఊడదీసా....సోల్డర్ సేయటానికి రాలా. మదర్బోర్డ్ పైన జిఫ్ కనెక్టర్ పెట్టడానికి టైనీటీనీగా ఉండి, నాకు రాలేదు. సరే బంకపెట్టి అతికిద్దాం అని ప్రయత్నించా. అహా!! అతుక్కుందిగానీ, కనెక్టివిటీ పోయింది.


ఇంతకీ జిఫ్ కనెక్టర్ అంటే ఏంటీ అంటారా?
ల్యాపీలో కీబోర్డ్, డిస్ప్లే, పవర్, ఇత్యాదివి మదర్బోర్డ్ కి కనెక్ట్ చేసే కార్డ్స్ కొన్నుంటాయి. నేచెప్పేది పవర్/ఆడియో కంట్రోల్స్ ని మదరబోర్డ్ కి కనెక్టు చేసే కనెక్టర్ గురించి. ఇది పోతే పవర్ రాదు.

http://en.wikipedia.org/wiki/Zero_Insertion_Force

అదీ కథ....

10 comments:

  1. సూరిబాబు చేతిలో పెట్టలేకపోయారా, అతికించి పడేసేవాడు.

    ReplyDelete
  2. పనిలేనిమంగలాడూ పిల్లి తలగొరిగాడంటే ఇదే మరి తోక్కలోది ఎవడు చెయ్యాల్శిన పనాడే సెయ్యాల.మన దగ్గర స్క్రూ డ్రైవర్ సోల్డరింగ్ కర్రా ఉందని అన్నీ ఊడదీస్తే ఇట్నే అవుద్దిమరి

    ReplyDelete
  3. చిన్నప్పుడు అన్నదమ్ములిద్దరూ కలిసి చెడనూకిన కార్లబొమ్మల పక్కన ఇదీచేరిందా? మిగతా పనేదైనా ఉంటే సూరిగాడిని, సంటిదాన్ని, మీఅన్నవాళ్ళ పిల్లోణ్ణీ ఓసూపు సూడమను

    ReplyDelete
  4. హ హ. నేను పోయిన వారమే ఇట్లాంటి తింగర పనోటి చేసా. అతి సన్నటి స్క్రూ డ్రైవర్(టార్క్) హోం డిపోలో కొనుక్కొచ్చి మరీ నా ఫోన్(HTC Touchpro 2) విప్పా.

    మదర్ బోర్డ్, తరవాత డిస్ప్లే గ్లాస్ కూడా తీసేసి, దాని మీద ఎక్కడో మారు మూలలో ఉన్న చిన్న "నీటి" మరకని నా తనివి తీరా తుడిచేసి, విజయ గర్వంతో ఫోన్ అంతా మళ్ళీ బిగించేసా. దానికి స్లైడింగ్ తో పాటూ, టిల్టింగ్ కూడా ఉండేసరికి బిగించడం కష్టమయినా చక్కగా మళ్ళీ అసెంబుల్ చేసానని నన్ను నేనే భుజం తట్టుకొన్ని ఫోన్ ఆన్ చేస్తే ఏముంది. డిస్ప్లే మొత్తం చంక నాకి పోయింది.

    ఏం చేస్తాం. మళ్ళీ స్ప్రింట్ వాడి దగ్గరికెళ్ళి భోరు మంటే, ఇన్సూరెన్స్ ఉందిగా ఓ వంద డిడక్టబుల్ తీసేసుకొని కొత్త ఫోన్ ఇచ్హాడు అదే మోడల్.

    పని లేని మంగలి పని చేస్తే, పిల్లి కేమో కానీ, మనకి బాగా క్షవరం అవుద్దని అర్ధం అయింది.

    ReplyDelete
  5. "రా౨ము" RAM అనేందుకు ఈప్రయోగం బాగుందే! దీని పుట్టుపూర్వోత్తరాలు కొంచెం చెప్తారా?
    btw, మనం కూడా అసుమంటి మనిలేని మంగలి టైపే లెండి!

    ReplyDelete
  6. charapanaa battudive nayanaa
    maa ammamma maa annani chinnappudu ela edaina padu cheseppudu ee matanedi

    ReplyDelete
  7. అయ్యయ్యో
    Hp
    i5 processor
    :(((
    మ్యూసియం పాలేనా

    ReplyDelete
  8. కెలికితే ఏటౌతాదీ, ఇట్టాగే ఔతాది. నా కాడా ఓ ల్యాపీ ఉండేది. ఏదో సిన్న ప్రాబ్లెం ఒత్తే నేను మా రూమ్మేటు కెలికి మొత్తానికి దాన్ని దొబ్బెట్టేహాం.

    ReplyDelete
  9. పప్పుభాయ్, అందరి గూళ్ళల్లో కామెంటింగేనా, మనం సొంతంగా గిలికేదేవన్నా ఉందా? తవర్గోరు గిలికి చాన్నాళ్లయిందని సవినయంగా మనవి జేసుకుంట్నావండి.

    ReplyDelete