సూరిగాడు మళ్ళీ బడిబాటన పడ్డాడీమద్దిన.
ఓరోజు మాయింటికాడి ప్రభుత్వ పాఠశాలకి కాలు చెయ్యి సేసాను, ఇలా మావోణ్ణి బళ్ళో నూకాలా ఎట్టా అని.
రేపే ఎత్తుకొచ్చేయండా అని సెలవిచ్చారా బడోళ్ళు.
ఎప్పుడ్రంమ్మంటా అన్నా
పొద్దునన్నా రండి
లేపోతే సాయన్కాలవన్నా రండీ
పొద్దున్నె సద్ది మూటకట్టుకొత్తా, అద్సరే ఎన్నింటికి రమ్మంటా
ఎనిమిదికి రండి
తొమ్మిదికి రండి
పదికి రండి
పస్కుండికి రండి
పన్నెండు దాటినంక రాకండి
ఒకేళ ఒచ్చేపనైతే పన్నెండు దాటినాక, సాయంకాలం రండి
వలాగే తొమ్మిదికి వత్తా
అన్జెప్పి అప్పాయింటుమెంటూ అయింటుమెంటూ తీస్కున్యా.
ఆఏళ వయ్యగారిని వమ్మగారిని పొద్దున్నే లేపి, ఇస్త్రీ సేసిన బట్టలు కట్టి, పిల్లకీ ఇస్త్రీ సేసిన బట్టలు కట్టి మొత్తానికి ఎత్తుకుళ్ళాం బడికాడికి.
లోనకి బోంగనే ఒకామె ఆడ లేడీస్, ఇస్త్రీ, ఎవురుమీరూ ఏం కత అనడిగింది. ఇట్టా పిల్లోణ్ణి బళ్ళోనూకటానికి ఒచ్చినం అనిజెప్పా. మనోడు ఇంతకు మునుపు ఆంగ్లం ఇంగిల్పీస్ మాట్టాడేవోడుగా. మొన్నిమద్దిన దేశం ఎళ్ళొచ్చాడుగా, మొత్తం మర్సిపాయ. తెలుగు మాట్టాడతా ఉడిన్డు సుబ్బనంగా. ఎవురు కనిపించిన తెలుగులోనే మాట్టాడతా ఉడిన్డు. సరే, మనకత ఇని, ఆ తెల్ల ఇస్త్రీ, మీవోణ్ణి అట్టా తీస్కెళ్తాం, మీరు అటైపు లోనకెళ్ళి అప్లికేసన్ కాయితకాలు నింపుతున్డన్డా అని సెప్పి మనోణ్ణెత్తుకెళ్ళబోయింది. నే కలిపించుకున్జెప్పా, ఓ తెల్ల ఇస్త్రీ మావోనికి నీవేంమాట్టాడతవో అరదం కాకపోవచ్చు, ఎట్టా మరి అని. ఏంపర్లేదు మేంజూస్కుంటాం మీరెళ్ళండ అంది. నాయనా జాగరత్తరా బాబూ అనిమనోడికి జెప్పి అంపించి, మేంలోపలికి జొరబడ్డాం. ఆమె మనోడి సేయి పట్టుకుని ఎళ్ళింది. పదినిమిసాలాగి తిరిగొచ్చి మీవోడు బానేజెప్పాడు అగిందానికి అనేసి ఎళ్ళిపోయింది. అమ్మనీ ఏందిరా వింటర్వ్యూనా అనుకుని, ఏమిరా ఏమడిగిందీ నువ్వేంజెప్పా అన్నా. ఏంలేదులే ఎబిసి తర్వాతేందీ అనింది డి అని జెప్పా, ఓ డబ్బా సూపించి ఇదేంది అనడిగింది స్క్వేర్ అనిజెప్పా. ట్రయాంగిల్ సూపెట్టమంది అక్కడున్న బొమ్మల్లో సూపెట్టా. ఇక పదా అంది. వచ్చినా అన్నాడు. అప్లికేసన్ కాయితకాలు నింపి డబ్బుదస్కం కట్టి ఇంటికిజేరుకున్నాం.
ఆ తరవాతోరం బడి తెరిచారు. మొట్టమొదట్రోజు రానే ఒచ్చింది. మాకు ముందర్రోజునుండే నిద్ర కరువాయ. ఏందిరా అంటే మరి ఆడికి డబ్బా ఏంబెట్టాలా అని ఆడోళ్ళ టెన్చను. ఆళ్ళను జూసి మనకి టెన్చను. మొట్టమొదట్రోజు, ఎదో డబ్బలోకి పెట్టింది, మనోణ్ణి లేపి లేపి లేపితే, ఎంతసేపటికీ లెగడే. మొత్తానికి కరుణ రధం కదిలింది లేగిచాడు, స్నానం గీనం టిపినీ గిపినీ తిన్నాడు. డబ్బా, సన్చి మూట ముల్లే సర్దుకుని బడిబస్సు ఎక్కటానికి లెగిచాడు. ఇంటిఆడోళ్ళు ఎళ్ళారు బస్సెక్కించటానికి. ఏమాత్రం ఏడవకుండా ఎక్కిండు బస్సు. ఆరోజంతా మాకు టెన్చను. బడోళ్ళూ ఫోను జేత్తరేమో మీవోడు కక్కున్నాడనో లేపోతే లాగులో దొడ్డికూకున్నాడనో ఉచ్చపోశ్కున్నాడనో అని. సాయంకాలానికి బస్సుదిగాడు చ్చేమంగా. ఉఫ్ఫు ఉఫ్ఫూ అనుకుంటా ఇంటికిజేరి ఆకలిఆకలి ఒన్నంపెట్టు అని జీవితంలో మొట్టమొదటిసారి అడిగి పెట్టించుకుని తిని, సాల్లేదు ఇంకొంచెంపెట్టు అని పొట్టనిండా తిని కూకున్నాడు నాకోసం.
ఇప్పటికి వారం దాటింది బడికెళ్ళబట్టి.
మొన్న ఓ కాయితకం పంపించారు. మీవోణ్ణి కాలిబంతి టీంలో జేర్పిత్తారా లేక అమెరికన్ కాలిబంతిలో జేర్పిత్తారా ఐస్ స్కేటింగులో జేర్పిత్తారా లేకుంటే ఐస్ హాకీలో జేర్పిత్తారా అని. కాలిబంతి అన్నాడు వాడే. పిల్ల సాకర్ బాల్ సాకర్ బాల్ అని అరిచింది. కిమ్మనకుండా కాలిబంతి అన్జెప్పి పంపించాం.
నిన్న ఇంకో కాయితకం. ఇంటికాడి బాష ఇంగిల్పీస్ కాపోతే అట్టాంటి బిడ్లకు ఏరే కల్లాసులుండాయి. మీవోణ్ణి పంపిత్తారా? పానిక్స్, వొకాబ్యులరీ నేర్పిత్తారు అని రాసుంది.
దీనెక్క, మనోడికి ఏందిరా ఏవన్నా ఇబ్బందిగా ఉందా ఏంది ఇంగిల్పీసు? ఆళ్ళ టిచెరమ్మ సెప్పేది అరదం కావట్లేదా ఏందీ? ఎట్రా అనుకున్నాం. ఆణ్ణే అడిగాం. ఏందిరా నాన్నా అరదం కావట్లేదా ఏందీ? ఆడోళ్ళు మొదలెట్టారు ఇక నెత్తిన కుండకి చిల్లుబెట్టటం. కళ్ళొత్తుకున్టా అట్టాకాదురా ఇనాల సెప్పేది నువ్వు ఇనవు అదిజేయవు ఇదిజేయవు అని. ఆడు అసె నువ్వుండు, ఏంలేదన్నాగా అంటాడు. పదినిమిసాలాగి నాకు ఏం అరదం కాటల్లా అంటాడు. మళ్ళొచ్చి అహే అరదం అవుద్దిగా అంటాడు.
ఇయ్యల ఫోణుజేసి కనుక్కో అనిజెప్పి ఆపీస్కొచ్చా. ఆడోళ్ళు ఫోన్ జేసి ఏందీ సంగతీ అనడిగితే. మీవాడు యా౨క్టివ్, చక్కగా మాట్టాడతాడు, ఏవీ సమస్యల్లేవు. ఆమాటకొస్తే అందరికన్నా ముందున్నాడు. అట్టా ముందున్నోళ్ళకి ప్రత్యేకంగా కల్లాసులుంటై. ఆళ్ళకి ఇంకా బాగా నేర్పిస్తరు. అదే ఆ కాయితకం అన్జెప్పిందంట.
మనోడు కూసింత సదూకుంటే అదే సాలు అనుకున్నాం ఊపిరిపీల్సుకుంటా.
Sep 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
సూరిగాడికో ఈరతాడు, ఈరగంధం
ReplyDelete:) :)
ReplyDeleteసూరిగాడా మజాకా :)
ఎనకమాల పిల్లలకు కాకుండ ముందుండే పల్లకాయ్‌లకు కూడా చెప్తాండారా...సెభాశో
ReplyDeletepublic స్కూళ్ళలో ESL(English as Second Language) పిలకాయలకోసం, ఓ పంతులునో, పంతులమ్మనో పెడతారు, వాళ్లకోసమయినా మన పిలకాయలను జేర్చమని ఓ మాట అడుగుతుంటారు, ఆ ESL గలాసుల వలన మంచిదే, ఒకటో, రెండో తరగతి వరకు పెడితే ఇంగలిపీసు బానే నేర్పిస్తారు. మా టెక్సాస్ లో అయితే అందులో చేరిన పిలకాయలకు ఎండాకాలం కూడా ఓ నెలన్నర ఎండాకాలం బడి పెడతారు (మనకు కాస్త ఎండాకాలం తీరుబాటు అవుతుంది, లేకపోతే వీళ్లను బిజీ అట్టిపెడతానికి మన ఓపిక అయిపోతుంది).
ReplyDeleteమీ కాడన కూడా ఇదే system ఉంటే, సుబ్బరంగా ESL గలాసులలో జేర్చేయండి, మాఓడిని జేర్చుదామంటే, ఇంగలిపీసు తెగ మాట్టాడతాఉన్నాడు, అదీకాక మీ (వి)దేశీయులు ఈ ఏడాది ఎక్కువయ్యారు, అయ్యోరి గలాసులో ఖాళీ లేదు అని జేర్చుకోలా :((. అదే మూడేళ్ళకితం మా పిల్లను అది వద్దు వద్దు అంటున్నా (మాతో సహా), బతిమాలి బామాలి ESL లో పెట్టుకొన్నారు అయ్యోరు ఆ ఏడాది కాస్త ఖాళీ, ESL నిండలేదని :))
సూపరు :)
ReplyDeleteసూరిగాడికొకటి,వాణ్ణావిధంగా తీర్చిదిద్దిన వాళ్ళమ్మ బాబులకో రెండు వీరత్రాళ్ళు.
ReplyDeleteమొత్తానికి మీ వాడిని బళ్ళో ఏసి రోజుకో కాయితం చదువుతూ కంగారడుతున్నారన్నమాట. ఇప్పుడే ఏం చూసేరు సంతాకాలు పెట్టీ పెట్టీ, ఆ కాయితాలు చదివి చదివి.... అహె స్కూల్ వద్దు పాడు వద్దు ఇంకో రెండేళ్ళు ఆగుదాములే అనిపిస్తుండి చూడండీ.
ReplyDelete:-) చాలా బాగుంది
ReplyDeleteముందుబడ్డోళ్లకి టీచరు ముందుండి నేర్పిస్తది,ఎనకబడ్డోళ్ళకి ఎనకమాలుండి నేర్పిస్తది అందుకని ముందుబడ్డా ఎనకబడ్డా జేబుకి సిల్లే మరి.
ReplyDeleteసూరిగాడు సుపరూ :)
ReplyDeleteచాలా బాగుంది:-)
ReplyDeleteసూరిగాడు అప్పుడే ఇంత చదివేస్తే పెద్దయ్యాక ఇంకెంత చదువుతాడో
ReplyDeleteపుత్రోత్సాహము తండ్రికి
ReplyDeleteపుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
శ్రావ్యగారు
ReplyDeleteపుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, స్కూల్లా
పుత్రుని కనుగొని ఫీజులడగగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తారా గారు నిజమే ఇప్పుడు కరెక్టు గా ఉంది :)
ReplyDeleteసూరిగాడు జిందాబాద్
ReplyDeleteసూరిగాడి స్కూలు ఇంకా జిందాబాద్
తారగారి కంద పేరడీ జిందా తిలిస్మాత్, సారీ, జిందాబాద్!! :)
సుబ్బులు, హరే, నాగార్జున - :)
ReplyDeleteకృష్ణ - ఇంటరెస్టింగ్ పాయింట్.
వేణు సోదరా ధన్యవాదాలు
విజయ్ సోదరా - మీలాంటి వారి ఆశీర్వాదం
భావన గారూ - హ్మ్!! ఏమైనా బడి మానిపించుటకు మనసొప్పదు..ఏమంటారు?
కృష్ణప్రియ - ధన్యవాదాలు
పప్పు యార్ - :) ఐతే గుడ్డిలో మెల్ల. మనం పైసా కట్టాల్సిన పని ల్యా.
చైతు తమ్మీ - :)
సునీత గారు - బహుకాల దర్శనం.
మాష్టారూ - పెద్దల ఆశీస్సులు.
శ్రావ్యా :):)
తార - బాసూ నువ్వు మరీ టాన్గే ఖీంచ్ రహేహో
అన్నగారు :):) జిందా తిలిస్మాత్ :):)
రాజుగారు మనమకి హిందీ వచ్చిచావదు మీరలా అంతేసి పొడుగుపదాలు వాడితే కష్టం.. నాకర్ధమైనంతవరకూ
ReplyDeleteటాన్గే ఖీంచ్ రహేహో
టాంఘా = గుర్రపు బండి, టాన్గే = గుర్రపు బల్లు
ఖీంచ్ రహేహో = లాగుతున్నావు..
గుర్రపు బల్లని లాగుతున్నానా?
కొత్తపాళి గారు జిందా తిలిస్మాత్ :):)
టాంగే అంటే కాళ్ళు అనిక్యుడా అరదం ఉంది నాయనా....తారా
ReplyDeleteఒకే పదానికి అన్ని అర్ధాలు ఏంటండి?
ReplyDeleteమన తెలుగే తీసుకోండి నేను గుర్రపు బల్లు అన్నా మీరు బళ్ళు అనే తెలిసిపోయింది కదా..
అసలు ఒకే పదానికి రెండు మూడూ అర్ధాలు ఉంటే నాలాంటోడు ఏలా బతుకుతాడు..
>>మన తెలుగే తీసుకోండి నేను గుర్రపు బల్లు అన్నా మీరు బళ్ళు అనే తెలిసిపోయింది కదా..<<
ReplyDelete’లాగు’, ’తేలు’ హి హ్హిహ్హి నాకు తెలిసి ఇవి కొన్ని మాత్రమే...
లాగు = Log?
ReplyDelete@నాగ్ సరదాగా.
ReplyDeleteపాడుతా తీయగా = తియ్యకపొతే పాడవా? ఏమి తియ్యాలి?
పాడుతా తీయగా చల్లగా = ఏమి చల్లాలి?
@తారగారు: వాహ్.... వాహ్‌వాహ్ వాహ్
ReplyDelete:) :)
ReplyDeleteతార ROFL
అబ్బాయిలు, ఆ పాట మొత్తానీ అలానే ఖూనీ చేయొచ్చు, కానీ ఆ పాట అభిమానులను దయతల్చి వదిలేశాను :))
ReplyDeleteఅందులోనూ మన నాన్నగారికి బ్లాగులో అంటే.....
భాస్కర్ రామరాజు గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు
ReplyDeleteహారం
సూరిబాబుకి ఆ గణేశుడు సిద్ధి , బుద్ధుల నిచ్చి బడిబాట విజయవంతం చేయాలని కోరుకుంటూ ...మీకు, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteచాలా బాగుంది. Soooooooooper..
ReplyDelete