ఈరోజు పొద్దునపొద్దున్నే మా గురూగారు శ్రీ శ్రీనివాసాచార్యులు గారు ఫోన్ చేసారు. ఏమన్నా అతిముఖ్యం ఐతే తప్ప చేయరు. మాష్టారూ చెప్పండీ అన్నా. భాస్కరం ఈ రోజు అనంత పద్మనాభ చతుర్దశి. గణేశ నిమజ్జనం. నువ్వు సకుటుంబ సమేతంగా రావాలి అని ఆర్డరు వేసారు. సాయంత్రం ఆరున్నరకల్లా వాలా౨ను గుళ్ళో, మా గణపతిని తోడుతీసుకుని.

ఒక పెద్ద వేదికపై వినాయకుడిని అలంకరించారు. అదే వేదికకింద భక్తులు తెచ్చిన వినాయకులను ఉంచారు.
పూజ గట్రా అయ్యాక ఋత్విక్కులు (అంటే మేము) ఐదుసార్లు గణపతి అథర్వశిర ఉపనిషత్తు పటిస్తుండగా ఊరేగింపుగా గణపతిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసాం. ఐదుసార్లు పటించాం గణపతి అథర్వశిర ఉపనిషత్తుని.

అదీ సంగతి.
ఏమిటీ ఈ మూడు లైన్లు ఐదు సార్లు పఠించారా? మా ఊరి గుళ్ళో పిల్లకాయలుచ్చుకునొచ్చిన ఏకదంతుడి బొమ్మలకు ఒక్కోటి చొప్పున ఒక్కో గణపతికి "శీర్షం" ఐదారేడెనిమిత్తొమ్మిది సార్లు కుమ్మేసారు...Just kidding
ReplyDeleteసకుటుంబ సమేతంగా గణపతి గోరిని నీటిలో ముంచొచ్చినందుకు అభినందనలు....
పైన రాసింది ఇంత "కళ్ళెట్టుకు" చూసి నాకేటి రాదనుకునేరు...! రుద్ర "పాఠం"తో సహా అన్నీ కంఠతా వొచ్చు మగానుబావా! :)
కన్నుల పండుగ !!
ReplyDeleteచాలా గొప్పగా వుందండి .
ReplyDeleteవంశీ అన్నాయ్ - నువ్వు మరీనూ!! పాఠాలు కంఠతా వొచ్చా?? :):)
ReplyDeleteపరిమళం, మాలా కుమార్ - ధన్యవాదాలు.
ఇందులో మరీను ఏముంది! నిజంగానే నాకు రుద్రం కంఠతా వచ్చు! ఇంకా "భీముడి" లాటి అనుమానమైతే ఇదిగో మా సిద్ధివినాయకస్వామి గుడి నంబరు - 916 483 4760. దీనికి ఫోన్ చేసి మా పెద్దగురుగారు, ప్రధాన పూజారి శ్రీ సుబ్బారావు గారిని అడిగి "స్థాపితహః" - ఆయనతో మాట్టాడాక మళ్ళీ ఇక్కడే ఓ కామెంటేస్తే, అశ్మములు తీసుకుని వచ్చెద!
ReplyDelete