Sep 15, 2010

ప్రత్యేక పల్నాడూ కావాలి


ప్రత్యేక పల్నాడూ కావాలి

శ్రీకృష్ణ కమిటీకి స్పష్టం చేసిన పల్నాడు ప్రజలు
రింగు రోడ్డుకు వేలకోట్ల ఖర్చు ఆపాలని వినతి
పిడుగురాళ్ల, మాచవరం - న్యూస్‌టుడే
రింగు రోడ్డు.. భూసేకరణ అంటూ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. ఆంధ్రా, రాయలసీమ డబ్బంతా తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నారు.. ఇకనైనా ఆపండి.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకు పైసా ఖర్చు చేయొద్దు.
- రత్నప్రసాద్‌, పిల్లుట్ల
తెలంగాణా వెనకబడింది అంటున్నారు.. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పల్నాడు వెనకబాటుతనం కన్పించడం లేదా..! ఒక్క పి.జి. కాలేజీ కూడా లేదిక్కడ.. తెలంగాణా జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణా అంటూ ఏర్పడితే ప్రత్యేక పల్నాడు రాష్ట్రం ఏర్పడాలి. విజయపురిసౌత్‌ రాజధాని కావాలి.
- కంభంపాటి కోటేశ్వరరావు, న్యాయవాది, పిడుగురాళ్ల

మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడులో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించిన తీరిది. కమిటీ సభ్యులు అబూసలేషరీఫ్‌, బి.ఎన్‌.జోషి మంగళవారం సాయంత్రం పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెర్వు, మాచవరం మండలం కొత్తగణేశునిపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పలువర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత పాలకులు రాజధానిని అభివృద్ధి చేయటానికే ఎక్కువ మొగ్గు చూపారని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్పటి నుంచి అభివృద్ధి చేసి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని విశ్వనాథం మాస్టారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులో సగం హైదరాబాద్‌ అభివృద్ధికే ఖర్చు చేశారని.. ఇపుడు కూడా రింగు రోడ్డు పేరుతో వేల కోట్లు ఖర్చు చేయటం ఆపాలని కె.రత్నప్రసాద్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చినందువల్ల మాకేమీ అభ్యంతరం లేదు.. హైదరాబాద్‌ అందరి సొత్తూ అని ఆయన అన్నారు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు చూపుతున్న బూచి తెలంగాణా. అదే పేరుతో ప్రతిసారీ ప్రత్యేక ప్యాకేజీలు అదనపు నిధులు పొందుతున్నారని న్యాయవాది కంభంపాటి కోటేశ్వరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉంటేనే బాగుంది.. ఇప్పుడే కర్ణాటకతో నీటి గొడవలు పడుతున్నాం. తెలంగాణ విభజిస్తే చుక్క కూడా కిందకు రానివ్వరని తుమ్మలచెర్వుకు చెందిన జానీభాషా చెప్పారు. అనంతరం అబుసలేషరీఫ్‌ వినతిపత్రాలను స్వీకరించారు.
http://eenadu.net/story.asp?qry1=13&reccount=27
----------------------------------------------------------------------------------------------------------
ఔను! పల్నాడు రాష్ట్రం కావాలి. ఏం? ఎందుకు అడక్కూడదూ?
నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా ఎంతనీరు పల్నాడుకి అందుతోందీ?
తాగునీటికి అల్లల్లాడే ప్రజానీకం ఎంతో తెలుసా?
సిమెంటురాయికీ సిమెంటు కర్మాగారాలు పెట్టేందుకు పనికొచ్చే నేల, వాటి కాలుష్యాన్నుండి కాపాడుకోలేకపోతోంది, ప్రభుత్వం చిన్నచూపుతో.
సున్నపురాయి ప్రజల కళ్ళలో కన్నీళ్ళను రప్పిస్తోంది బట్టీల పొగతో.
మిరగాయ పంట, పత్తి, కందులు, శనగలు, నువ్వులు, ఏంతక్కువ మా పల్లెలకు?
ప్రతీ రాయీ సరిత్ర పలుకుతుంది. ప్రతీ సెట్టు సెరిత్ర సెప్తాయి. ఔను, పల్నాటి రాష్ట్రం కావల్సిందే.

6 comments:

  1. ఆ వార్త చదివగానే మీరు గుర్తొచ్చారు. :)

    ReplyDelete
  2. అతు చేసి ఇటూ చేసి మొత్తం రాష్ట్ర దుస్తితికి కారణం కృష్ణా జిల్లా తుగోజీ పాగోజి వాళ్ళే అనేట్లు వున్నారే (మరి ఆ మూడూ జిల్లలకే గా ఆయకట్టు సాగు కింద కృష్ణ నీళ్ళు వస్తాయి) ఇదేమి ఘోరం రా నాయనా. :-(

    ReplyDelete
  3. ఔను, పల్నాటి రాష్ట్రం కావల్సిందే ! మీకు నా ఫుల్ సపోర్ట్ ,

    ReplyDelete
  4. అవును పల్నాడు రాష్ట్రం కావాలి, పనిలో పని కూకట్ పల్లి రాష్ట్రం, స్థంబాద్రి రాష్ట్రం కూడా ఇచ్చెయ్యాలి.

    ReplyDelete
  5. maku ma krishan rastram kavali

    ReplyDelete