జీటీవీ వారి అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో మొదటివరసలోని కార్యక్రమం సరెగమప.
సోనూ నిగం నిర్వహణలో మే ౧, ౧౯౯౫ లో మొట్టమొదటి ప్రసారం జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమంపేరు సరెగమ. ఇప్పుడు సరెగమప.
అప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది నేపథ్యకాయకులని దేశానికి పరిచయం చేసిందీ కార్యక్రమం.
శ్రెయ ఘోషాల్, శేఖర్, పార్థీవ్ గోహిల్, మొహమ్మద్ వకీల్, అవధూత్ గుప్తె, ఆర్తి కక్కర్, హిమనీ కపూర్, కునాల్ గన్జావాలా లాంటి ఎందరో నేపథ్యగాయకులు ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయంకబడ్డారు.
బాగుంది.
ఐతే గత నాలుగేళ్ళుగా వింతపోకడలు పోతోందీ కార్యక్రమం. దీన్ని కాపీకొడుతున్నాయి మిగతా ఛానల్స్.
౨౦౦౬/౨౦౦౭ అనుకుంటా ఆదిత్య నారాయణ్ నిర్వహణలో సరెగమప ఛాలెంజ్ వచ్చింది. దాంట్లో మధ్యప్రాచ్యం నుండి కొందరు, పాకిస్తాన్ నుండి కొందరు వచ్చారు పోటీకి. ఆ మధ్యప్రాచ్యం నుండి వచ్చినవాళ్ళు కూడ తర్వాత పాకిస్తాన్ వారే అని తేలింది. అమానత్ ఆలి ఫైనల్ దాకా వచ్చాడు.
ఇప్పుడు స్టార్ వాడి చోటే ఉస్తాద్ అని ఒక కార్యక్రమం. సగంమంది దేశీయులు మిగతా సగం పాకిస్తానీయులు. జెడ్జులు సోనూ నిగం మరియూ రాహత్ ఫతే ఆలీ ఖాన్.
ఇక ఈ పాకిస్థానీ పిల్లలు పాడితే రాహత్ పాట లేక మౌలా మెరె మౌలా. నాకేం అభ్యంతరం లేదు వాళ్ళేం పాడితే. కానీ! పాటలపోటీల్లో పాల్గొనేందుకు వందకోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఎవరూ దొరకటంలేదా? ఇదేం కర్మం వేరే దేశం వాళ్ళను తెచ్చి మన నెత్తిన రుద్దటం? నాకు మింగుడు పట్టంలేదు.
నాకైతే పాకిస్థానీయుల పాటలు నేనెందుకు వినాలీ అనిపిస్తుంది. రాహత్ ఫతే ఆలీఖాన్ కావచ్చు లేక అద్నాన్ సమి కావొచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు. సరే ఒకజమానా జనాభా బ్రిట్ ఇండియా అవిభక్త భారతం అందరం కల్సి ఉండేటోళ్ళం వాళ్ళకి మనకి రూట్స్ ఒకటే. గులాం అలి ఖాన్, బడే గులాం అలి ఖాన్, నుస్రత్ ఫతే ఆలీఖాన్ సాబ్ యాట యాట యాట. ఆ జమానా ఐపోయింది. ఇప్పటి ప్రపంచంలో ఇదేం గోలయ్యా. మన దేశంలో పోటీదారులు కరవైయ్యారా అంటే అదీలేదు. అసలు ఇట్టాంటి అంతర్‌రాష్ట్ర కార్యక్రమాల్లో కేవలం ఉత్తారిది వాళ్ళనే తీస్కుంటున్నారు.
దక్షిణాది జనాభాని తొక్కుతారు పైకి రానీకుండా ఇట్టాంటి కార్యక్రమాల్లో. కొందరు నా ఈ మాటను వ్యతిరేకించవచ్చు. కానీ ఇది నిజం. ఎలా అంటారా?
ఈ కార్యక్రమాలకి జరిగే ఆడిషన్స్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. దహేలి, ముంబై, కలకత్తా, కాన్పూర్, ఇండోర్, అహమ్మదాబాదు, అల్లహాబాదు, వాడిబొందబాదు, వాడిబోలెబాదుల్లో జరిగాయి కానీ చెన్నపట్నం, హైదరబాదు, బంగళూరు లేక తిరువనంతవురం లాంటి దక్షిణభారత నగరాల్లో/పట్టణాల్లో జరిగిన దాఖలాలు ఉంటే నాకు చెప్పండి.
ఏం పాకిస్థానీయులు పాడినంత సమ్మగా మా ఊరోళ్ళు పాడలేరా? అసలు రానిస్తేగా తెలిసేది పాడగల్రో లేదో.
సరే నా ఊరోళ్ళని రానివ్వకపోయినా పర్లేదు. పాకిస్థానోళ్ళనేందయ్యా నెత్తికెత్తుకునేదీ అంట. మొన్నామధ్యటి ఎపిసోడ్ ఆగస్టు పధ్నాలుగు. దేశభక్తి గుర్తుకొచ్చి ఆ పాటలు పాడారు. ఏంపాడాలి? రెండు శత్రుదేశాలు ఒకే వేదిక మీద తమ తమ దేశభక్తి గీతాలను పాడితే, నాకైతే రాళ్ళేయాలనిపించింది పాక్తిస్తానీయులపై. నా రక్తం మరిగింది. మరగటానికి కారణాలు లేవంటారా?
టీవీ యాజమాన్యాలకు కావాల్సింది టీఆర్పీ రేటింగ్స్. రెండు దేశాల మధ్య నిజంగా సత్‌సంబాధాలను ఏర్పరుచుదామనే ఈ కార్యక్రమాల రూపకల్పన చేస్తారంటారా?
ఇప్పటి సరెగపపా కార్యక్రమంలో కూడా కుర్రం అని ఒక పాకిస్తానీ ఉన్నాడు. వీళ్ళు ఎలా రాగలుగుతున్నారో అసలు దేశంలోకి?
Subscribe to:
Post Comments (Atom)
i am with you on this one.
ReplyDeletegood point
ReplyDeleteసంగీతానికి భాషలేకపోయినా బిజినెస్సుందన్నాయ్
ReplyDeleteమీరన్నది నిజమే...
ReplyDeleteకొద్ది రోజులు పోతే ఉగ్రవాదుల కొరకు జీహాద్ పాటలు పోటీలు పెట్టినా పెట్టొచ్చు...
>>>సంగీతానికి భాషలేకపోయినా బిజినెస్సుంది...
:-):-)
_______________________________________
ReplyDeleteదక్షిణాది జనాభాని తొక్కుతారు పైకి రానీకుండా ఇట్టాంటి కార్యక్రమాల్లో. కొందరు నా ఈ మాటను వ్యతిరేకించవచ్చు. కానీ ఇది నిజం. ఎలా అంటారా?
ఈ కార్యక్రమాలకి జరిగే ఆడిషన్స్ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. దహేలి, ముంబై, కలకత్తా, కాన్పూర్, ఇండోర్, అహమ్మదాబాదు, అల్లహాబాదు, వాడిబొందబాదు, వాడిబోలెబాదుల్లో జరిగాయి కానీ చెన్నపట్నం, హైదరబాదు, బంగళూరు లేక తిరువనంతవురం లాంటి దక్షిణభారత నగరాల్లో/పట్టణాల్లో జరిగిన దాఖలాలు ఉంటే నాకు చెప్పండి.
ఏం పాకిస్థానీయులు పాడినంత సమ్మగా మా ఊరోళ్ళు పాడలేరా? అసలు రానిస్తేగా తెలిసేది పాడగల్రో లేదో.
_______________________________________
Very true!!