Sep 20, 2010

సూరిగాడి సిత్రకళ

 

అయ్యా ఇయ్యల గణేస్ నిమర్జనం..ఇంటికాడ మరి పొద్దునపొద్దున్నే పిల్లాజెల్లా భక్తిపారవశ్యంలో మినిగితేలారు. మనం ఆపీస్ కార్యాలయానికి ఏతెంచాం.
ఆపీస్ కాణ్ణుంచి మిట్ట మద్దానం వింటికి సేరేప్పటికి సూరిగాడు నీకో సర్ప్రైజ్ అన్నాడు. పిల్ల నవ్వింది. ఏట్రాబాబూ అన్న.
బొమ్మలేసే బోర్డేత్తుకొచ్చి సుపించాడు. పైన బొమ్మ.
ఆడి ప్రకారం
౧. ఉండ్రాళ్ళు - పద్దెనిమిదంట.
౨. దానిమ్మ కాయ
౩. గారెలు
౪. పుల్లు పుచ్చకాయ, మరియూ పుచ్చకాయ ముక్కలు
౫. దాచ్చాపళ్ళు
౬. కుడుములు
౭. సాక్లేటు
౮. మామిడి
౯. ఆప్‌పిళ్
౧౦. రాంములక్కాయ
౧౧. అప్పడం
౧౨. సెపాతి రొట్టె
౧౩. అరటిపండు
౧౪. మొక్కజొన్న కంకి అంట
౧౫. ఈ నెంబరు నే పెట్టకపోయినా, కుడైపు, కింద ఉండ్రాళ్ళ పైన సుక్కలు సుక్కలు బూందీ అంట అది.
౧౬. యాణ్ణో జాంగ్రీ ఉందంట.

ఆడికి ఇన్‌స్పైరేషన్ ఇదీ...మా ఇంట వినాయకుడు
From గణేశ


యావత్ జనులకూ గణేశ్ నిమర్జనం సందర్భంగా శుభాకాంక్షలు.


8 comments:

  1. :-) బాగుంది.. సూరి గాడు కత్తి కదా అసలు :)

    ReplyDelete
  2. భలే ఉందండీ సూరిబాబు క్రియేటివిటీ.....ఎవరబ్బాయి మరి !!

    ReplyDelete
  3. సిత్రం బావుంది కానీ తెలుగువాళ్ళం మరాఠీ లో గణనాయకునికి హారతి పట్టాలా? ఒక వేళ ఎక్కడా దొరక్కపోతే మీరే మీ ఇంట రికార్డ్ చేసి పెట్టండి
    తెలుగుకున్న తెగులు తగ్గించండి

    ReplyDelete
  4. హరే, సుబ్బు - నేనో ఓ :)లి
    కృష్ణప్రియ గారూ, సునీతగారూ - ఏటీ? కత్తా??? బాబోయ్....సూరిగాడు సూరిగాడే..
    పరిమళం - :):)
    లలితమ్మ గారూ - నమస్తే
    రహ్మానుద్దీన్ షేక్ - దొరికింది పెట్టా...మనకంత సీన్ సిత్రం లేద్ భాయ్

    ReplyDelete