May 21, 2010

ఈ విషయాలు చెప్పకుండా పూర్తైనట్టు కాదు

నిన్నటి నా టపాలో యజ్ఞం పూర్తైంది అని రాసాను. కానీ ఈ విషయాలు చెప్పకుండా పూర్తైనట్టు కాదు.
పూర్ణాహుతి అయ్యింది, నైవేద్యాది కార్యక్రమాలు అయ్యాయి. యజమానులు ఋత్విక్కులని వీడి, అయ్యవార్ల దర్శనం చేస్కుని యజ్ఞశాలనుండి నిష్క్రమించారు. భక్తజన సందోహం అయ్యవార్ల దర్శనం చేస్కున్నారు. ఇక మిగిలింది ఋత్వికులు. మేంకూడా అయ్యవార్ని దర్శనం చేస్కున్నాం. అయ్యిందా. అప్పుడు, మరి యజ్ఞశాలనుండి అయ్యవార్లను ఆలయ పునఃప్రవేశం గావింపవలె కదా?
From 2010-05-17

From 2010-05-17

From 2010-05-17

అది చేసాం. ఆలయ పునఃప్రవేశం గావించిన పిమ్మట, ఆలయ అర్చకులు, అయ్యవార్లకు ఉపచారాలు చేసి, ఇక అప్పుడు ఋత్విక్కులందరికీ ఈ కార్యక్రమం ఘనంగా జరిపినందుకు ఆశీర్వచనవాక్కులు పలికారు.

ఈ కార్యక్రమం ఇటు నడుస్తూఉండగా, అక్కడి యజ్ఞశాలలో, సర్దేపనిలో సేవకులు మునిగిపోయి మొత్తం శుభ్రంగా సర్దేసేసి, శుభ్రంచేసేసారు.

అటుపై, మా అందరికీ భోజనాలు ఏర్పాటైంది.
వెళ్ళాం. తిన్నాం. అయ్యా ఋత్విక్కులారా, కొద్దిగ సేపు విశ్రాంతి తీస్కోండీ. అందరం ఓ సారి సమావేశమై ఓసారి మాట్టాడుకుందాం అని చెప్పారు.

ఎవరెవరు ఏం చెప్పారూ? ఏంటా కబుర్లు...తర్వాతి టపాలో చెప్తా. ఒకసారి చెప్పేది కాదు....

6 comments:

  1. tension lo pettaru.. :)

    anyways i'm glad to see you performing all the rituals.

    ReplyDelete
  2. బాగుంది, కబుర్ల కోసం ఎదురు చూస్తూ...

    ReplyDelete
  3. Guruvu Gaaru,
    I didn't see group pictures above..I thought below pictures would add to what you had posted above

    http://picasaweb.google.com/nkumartel/May162010WorldPieceMahaYagnaKansasCity#5471969888552997506

    http://picasaweb.google.com/nkumartel/May162010WorldPieceMahaYagnaKansasCity#5471969010923653762


    http://picasaweb.google.com/nkumartel/May162010WorldPieceMahaYagnaKansasCity#5471968885697855122

    ReplyDelete
  4. కార్తీక్, గీతాచార్య - ధన్యవాదాలు
    వేణూ బ్రదర్ - ఇదిగో ఇప్పుడే ఓ పోస్టేసా
    కుమార్ - అన్నా, నువ్వు అక్కడే ఉండీ కనీసం హలో కూడా చెప్పకపోవటం కొంచెం బాధగా ఉందన్నా.
    చక్కటి ఫోటోస్ అందించావు. ధన్యవాదాలు.

    ReplyDelete