May 19, 2010

శ్రీ మహా సుదర్శన యజ్ఞం సుసంపన్నం

మొన్నటి ఆదివారంతో [మే పదహారో తారీఖు] శ్రీ మహా సుదర్శన యజ్ఞం సుసంపన్నం అయ్యింది. ఓ మహా క్రతువు విజయవంతంగా ముగిసింది.
చివరి రెండురోజుల స్థూలావిష్కరణగావిస్తున్నా.
శనివారం అనగా మే పదిహెనోతారీఖు - అయ్యవారికి రథోత్సవం మరియూ వసంతోత్సవం ఆనందోత్సాహాలతో జరిపాం.
పూపల్లకిలో అయ్యవార్లను ఊరేగిస్తూ
From 2010-05-17

రథారోహణ గావించి,
From 2010-05-17
ఋత్విక్కుల మంత్ర పఠనంతో భక్తజనుల హర్షోల్లాసాల మధ్య ఊరి[గుడి] నాలుగు చెఱుగులాదిప్పి,
From 2010-05-17
ఓ చోట వసంతోత్సవంజఱుపుటకు దింపి, అయ్యవార్లకు రంగులు జల్లుతుండగా భక్తజనులు ఆనందోస్తాహాలతో రంగులు పులుముకుంటుండగా, ఉత్తరాదివారు కొందరు చేవాయిద్యాలందుకుని వాయిస్తుండగా జనులు ఆ వాయిద్యాలహోరుకు తగినట్టుగా నాట్యంచేయ ప్రారంభించారు. ఒకరికొకరు రంగులు పులుముకున్నారు. అంతలో
From 2010-05-17
ఋత్విక్కులు రుద్రం, పంచసూక్తాలు, ఉపనిషత్తులూ ఉఛ్ఛరిస్తుండగా అయ్యవార్లకు
From 2010-05-17
అభిషేకం గావించి, తిరిగి రాథారోహణగావించి, తిరిగి ఆలయమార్గముపట్టి, భక్తి శ్రద్ధలతో అయ్యవార్లను ఆలయ పునఃప్రవేశంగావించి
From 2010-05-17
సంపన్నం చేసాం.
అత్భుతాలు - ఒకటా రెండా. ఎన్నని చెప్పనూ. మచ్చుకి కొన్ని
౧. అప్పటిదాకా పడిన వాన, పల్లకీ ఆలయంలోనుండి బయటకు రాంగనే తగ్గింది. రథ కదలికతో ఆగిపోయింది.
౨. కొందరు ఔత్సాహికులు పల్లకీని పూమాలలతో అలంకరించారు.
౩. రథం అలా వెళ్తుంటే, ఓ ఔత్సాహికుడు హెలీకాప్టర్లోంచి రథంపై పూలవాన కురిపించాడు.

అయ్యా!! మర్రోజే ఆదివారం. మహాయజ్ఞం. నూటా ఎనమండుగ్గురు ఋత్విక్కులు, నూటా ఎనమండుగ్గురు యజమానులు. వార్తా పత్రికల వార్తాహరులు, ఎలక్ట్రానిక్ మాధ్యమాహరులు, ఆఊరి మేయరు, సెనేటరు ఇత్యాది రాజకీయ గణ తాకిడి, ఈ మహాక్రతువుని వీక్షంపగోరి వచ్చే భక్తజన సందోహం, ఇంత మంది మాత్రమే వస్తారు అనే లెక్కా పత్రం వేయగలమా? మరి వచ్చేవారి వాహనాల విడిది, వి.ఐ.పిలకు విడిది, ఋత్విక్కులకు విడిది, అంత సులభమా ఇలాంటివాటిని అమర్చటం? వచ్చెవారికి అన్నపానీయాలు, పిల్లల గోలలు...
యాజమాన్యం ముందుగానే ఊహించి, యోచించి, సకలఏర్పాట్లుగావించారు.
శనివారం మధ్యాహ్న భోజనాలు అవ్వగానే ఏర్పాట్లకి నడుంబిగించాం. అతిపెద్ద సమస్య కళ్ళముందే తెరలుతెరలుగా ఆటలాడుతూ దోబూచులాడుతూ భయపెట్టింది. అదే వాతావరణం. వరుణుడు దోబూచులాట్టం మొదలుపెట్టాడు. ఒక్కోసారి తేలిగ్గా జల్లు కురిపించాడు. ఒక్కోసారు ఘాట్టిగా మొట్టాడు. జరిగేది యజ్ఞకార్యం. వాన ప్రతిబంధకమే. ఎందుకంటే యజ్ఞకుండాలు ఏర్పాటు చెయ్యాలా? ఋత్విక్కులు కూర్చోవాలా? యజమానులు కూర్చోవాలా? నుల్చుని చెయ్యటానికి ఇది వంటకాదు కదా!! శనివారం మధ్యాహ్నానికల్లా వంద అడుగుల లోతునా వందడుగుల వెడల్పున ఓ పెద్ద డేరా లేచింది. వాన పోతని ఆపగలిగింది. మరి ఇరతరత్రాలలో పడిన వాన నీటి ప్రవాహాన్ని ఎలా అడ్డుకుంటాం? డేరా తడికెల గోడలకు కిందనుండి పట్టలు బయటకి పోనిచ్చి వాటిపై ఇసుక బస్తాలు అడ్డంపెట్టి అతి కష్టంతో మొత్తానికి వాననీటిని నిలువరించారు.
ఇక డేరాలోపలి ప్రహసనం - ఆదివారం పొద్దున్నే ఆరున్నరకల్లా కార్యక్రమం మొదలు. ప్రధాన హోమకుండం. దానికి ఇరువైపుల ఆరు ముఖ్య హోమకుండాలు. అయ్యవార్లను కొలువుచేసే వేదిక. ఇవి కాక నూటా ఎనమండుగ్గురు ఋత్విక్కులకు హోమకుండాలు. ఎన్ని ఇటుకలు కావాలీ? ఎలా అమర్చాలి? కొలతతో గీతలు గీసారు. అడ్డగీతలు నిలువు గీతలు గీసారు. టేపు తెచ్చారు. చతురస్రాలు గీసారు. ప్రతీ చతురస్రంలో యజ్ఞకుండం ఏర్పాటుచెయ్యల్ని ప్రతిపాదించారు.
ఇక ప్రతీ కుండంవద్ద యజమానికి కావల్సిన వస్తువులను ఓ ట్రేలో పెట్టించారు. ఋత్విక్కుకు కావాల్సిన వస్తువులన్నీ ఒక ట్రేలో పెట్టించారు. అనగా యజ్ఞసామాగ్రి, సమిధలు, కర్పూరం, అగ్గిపెట్టె, నెయ్యి, కలశం, ఇత్యాదివి. పులు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధం లాంటివి. నీళ్ళు, గ్లాసులు లాంటివి. పసుపు కుంకుమ గంధం చిన్ని చిన్ని మూతల్లో అమర్చారు. అలానే రోజ్ వాటరు. ఒక బొట్టు అంటే ఒక బొట్టు, కాదు మూడున్నర బొట్లు అంటే అంతే పరిమాణంలో ఆ చిన్ని చిన్ని మూతల్లో చక్కగా అమర్చారు. ఆచమనం చేసినాక చేయి తుడుచుకోటానికి పేపరు టవల్ తో సహా.
ఇంతలో ఆలయ ప్రధానార్చకులు ప్రోక్షణ కార్యక్రమాన్ని గావించారు. అటుపిమ్మట పాదరక్షలతో ప్రవేశం లేదు.
౧౦౮ యజ్ఞకుండాలు తెచ్చిపెట్టాం. వీటిని తెచ్చేప్పుడూ, అమర్చేప్పుడూ పారాయణం చేయాలని సూచించటంతో, సుదర్శన మూల మంత్రం జపిస్తూ యజ్ఞకుండాలను అమర్చాం. ౧౦౮ పీటలు ఋత్విక్కులకు, ౧౦౮ * ౨ పీటలు యజమానికి ఒకటి అతనికి ఒకటి అతని సహధర్మచారిణికి. ౧౦౮ మంది ఋత్విక్కులకు శుక్రవారమే దీక్షావస్త్రాలు అందించారు, అనగా పసుపు బట్టలు, నూతన యజ్ఞోపవీతాలు అందించారు. దీక్ష కూడా ఇచ్చారు. మరి యజ్ఞకార్యక్రమానికి ఆచమనం చేస్కోటానికి కొత్తవి ఉద్ధరిణె, పంచపాత్ర ఇత్యాదివి అమర్చారు.
అలానే స్రుక్కులు, స్రువాలు, ఒక్కో ఋత్విక్కుకి ఒక స్రుక్కు ఒక స్రువం. ఇలా అమర్చి, అటు ఇటు కుర్చీలు అమర్చి ఒకట రెండా? ఎన్ని అమరాలి, ఎంత శ్రమ? ఎంత ఓపిక? ఎంత ప్రి ప్లాన్? ఎంత అలోచనా? మరియూ ఎంత అనుసంధానం? అంతే కాక సూక్ష్మ వివరాలను సైతం దృష్టిలో ఉంచుకుని చేయాలి. అంటే, ఋత్విక్కులందరూ తూర్పువైపుకే ముఖంపెట్టి కూర్చోవాలి, ఇత్యాదివి, చక్కగా సిద్ధం చేసారు.

అయ్యా!! మరుసటి రోజు అనగా ఆదివారం రానే వచ్చింది. ఆదిత్యుడు మబ్బుల్లో చిక్కుకుని తన తొలికిరణాలను బయల్పరచలేదు. ఇంతలో అలారాలు మోగుతున్నాయి ఒక్కొక్కరివి. తొలి కోళ్ళు కూయటం మొదలెట్టాయి. హడావిడి కువకువ మొదలైంది అందరిలో. గుళ్ళోనే కునుకులు తీసిన ప్రాణాలు ఒక్కొక్కటీ లేచి కాలకృత్యాలతో స్నానాదులు ముగించి తమకిచ్చిన దీక్షావస్త్రధారణ కావించి గుళ్ళోకి జొరబడ్డాయి. బయటనుండి వచ్చే ఋత్విక్కులు చక్కగా పసుప్పచ్చని పంచెలు చుట్టుకుని చేరుకున్నారు. కళకళ్ళాడుతూ కనిపించింది ఆలయమంతా.
From 2010-05-17

ఇక కార్యక్రమం మొదలైంది. పంచసూక్త పారాయణతో సుదర్శన భగవానుని యజ్ఞశాలా ప్రవేశం గావించాం. అయ్యవార్లను వారికై అలంకరించిన ప్రత్యేక వేదికపై అలంకరించాం. యజ్ఞశాల శుద్ధి గావించి, దేవతాస్థాన పూజ చేసాం.
ఏఏ ఋత్విక్కు ఏఏ స్థానంలో కూర్చోవాలో, ఏఏ యజమాని ఎక్కడెక్కడ కూర్చోవాలో వాళ్ళ వాళ్ళా పేర్లతో సహా నెంబర్లు వేసి ఉంచారు ముందే. పీటలపై అంటించారు. ఋత్విక్కులు వారివారి స్థానాల్లో ఆశీనులైయ్యారు. తమకిచ్చిన సామగ్రిని ఒకమారు సరిచూసుకుని సిద్ధమయ్యారు. యజ్ఞశాల శుద్ధి గావించి, దేవతాస్థాన పూజ చేసాం. ఇక యజమానుల రాక మొదలయ్యింది. వారి వారి కేటాయింపబడ్డ స్థానలకు చేరుకుని, భర్త, భర్తకు శాస్త్రోక్తంగా ఎడమవైపున భార్యా పీటలపై కూర్చున్నారు.
సంకల్పం చెప్పించాం. విశ్వక్సేన, గణేశ, మహా సుదర్శన కలశ స్థాపన గావించాం.
ఆలయ ప్రధానార్చకులైన శ్రీ శ్రీనివాసాచార్యులవారు, అష్టబలి గావించేందుకు ఎనిమిది దిక్కులకూ వెళ్ళి, ప్రతీ దిక్కు అధిపతిని ప్రార్ధించి, అయ్యా మీమీ గణాలను ఇక్కడకు పంపండీ, మా ఈ సుదర్శన మహా యజ్ఞ కార్యాన్ని సదా రక్షించండీ అని ప్రార్ధించి, అష్టదిక్బంధనం చేసారు. అష్టబలి, యాగస్థలం చుట్టు ఎనిమిది దిక్కులనూ దారంతో బంధించటంద్వారా సుసంపన్నం అయ్యింది. ఈ బంధం కార్యక్రమాంతంలో మాత్రమే తీస్తాం. ఈదిక్బంధం చేసాక ఇక ఏప్రాణీ అనగా యజమాని గానీ ఋత్విక్కుగానీ యజమానులుగానీ, ప్రేక్షకవీక్షకులు గానీ యజ్ఞశాలలోకి ప్రవేశింపజాలరు మరియూ యజ్ఞశాలను వీడజాలరు.
అటుపిమ్మట పుణ్యహవచనం, యజ్ఞకుండ శుద్ధి గావించి, అగ్ని ప్రతిష్ఠాపన గావించాం. ౧౦౮ సార్లు శ్రీ మహా సుదర్శన మూలమంత్రాన్ని పఠిస్తూ హోమ కార్యం చేసాం.
From 2010-05-17

ఇంతలో రాజకీయ వర్గాగమనం ఆరంభమైంది. కేన్సాసు నగర మేయరు, సెనేటరు ఇత్యాది రాజకీయ నయకవినాయక గణం వేంచేసి తమతమ ప్రసంగాలను అందరిముందర ఆవిష్కరించారు.
From 2010-05-17
వారి ఘోష అయ్యాక పూర్ణాహుతి గావించి, లఘు ఆరాధన చేసి, మహా నైవేద్యాది విన్యోగాలు చేసి, హారతులిచ్చి, యజమానిలకు ప్రసాదాది బహుమతులిచ్చి ఆ యజ్ఞనారాయణుడికి మనసారా నమస్కారాలు దెల్పుకుని కోరికలు మనసునందే దెల్పుకుని యజ్ఞ కార్యాన్ని సంపూర్ణం గావించాం.

నా అనుభవాలు, నా అనుభూతులూ, తెరవెనుక కథలు సవివరంగా మరో టపాలో రాస్తాను.

10 comments:

  1. Annaya Chalabaga Kallaku Kattinattu Rasavu. Andharitho Paatu neeku subhakanshalu.
    Uma Maheshwar

    ReplyDelete
  2. అంత మంచి కార్యక్రమాల్లో పాల్గోవటం నిజంగా అదృష్టమే.కన్నుల పండుగగా ఉందండీ...మాక్కూడా ఫోటోల ద్వారా ఆనందాన్ని పంచినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. As a person who has been visiting this temple for 10 years now, I can say that this is not only one of the best events, but also organized in the best possible manner, if not THE perfect manner!.

    I was so worried on Saturday that the effort of hundreds of people, is going to be defeated in the hands of rain Gods. However it was a great relief to see the rain receding on Sunday.

    I especially liked the part where mayors, state representatives, the senator(who is running for KS Governor now) spoke and revealed that they were much more intimate with indian community than I originally anticipated.

    I made sure that Senator Brownback took a pradakshinam around the Balaji and other inner temple Gods..He also went around nava grahas too..I was explaining him about different Gods and he was very keen about Ganesha.

    I wish one of our activists didn't solicit(not forcing though) the senator to wear a 'hanuman ring', that's when he pushed back saying 'I have my own faith'..I don't know why our guys do that kind of stupid stuff..that's when we lose respect.

    Anyway, Congratulations and lots of appreciation to you for all your efforts. It WAS REALLY A GREAT EVENT, WITH GREAT CO-ORDINATION.

    ReplyDelete
  4. అన్నాయ్, కొలువుకెల్తు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గోన్నావంటే, అభినందనలు!!

    ReplyDelete
  5. మిత్రమా, చాలా బాగా రాశావు, ఈ కార్యక్రమం అయ్యి ఇల్లకు వస్తునప్పుదు ఎదొ కాస్త వెలితి అనిపించింధి ,మనమందరం 10 రూజులు కలిసి చెసిన పూజలు,చదివిన సూక్తలు, నెర్చుకున్న విద్య, చీసిన పనులు,వెసిన ఛలొక్తులు.. గడిపిని సమయమం మరువలెనిది..... అయినా ఆ భగవంతుడు మనకి మళ్ళి ఇటువంటి అవకాశలు కలిపించమని ఫ్రార్ధిధాం.

    ReplyDelete
  6. Intha manchi telugu bashalo vivarinchinanduku, meku ma vandanamalu.
    Ravi K

    ReplyDelete
  7. chaala baaga vivarincharandi.. maa ammagariki nenu sarigga explain cheyyaleka poyanu kaani mee letter chadivi explain chestunte chaala happy ga feel ayyaru. Thanks for sharing ---

    Jaya Kallur...

    ReplyDelete
  8. కన్నుల ముందు జరిగినట్లే వర్ణించారు.యెంత భాగ్యం మీది

    ReplyDelete