May 3, 2010

సమతౌల్యం

ఇందాక దేనికోసమో గెలుకుతుంటే కొన్ని అత్యంత ముఖ్యమైన సూత్రాలు వాక్యాలూ తగిలాయ్. పంచుకుందామని వాటి సారం ఇక్కడ పెడుతున్నా.

మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, తినే తిండిలో ప్రొటీన్ మాత్రమే ముఖ్యం అనుకుంటారు. మాంసాహారం తింటే, అందులో అంతా ప్రొటీనేకదా, కార్బ్స్ ఉండవు కదా, అందుకే అది బెస్ట్ అనుకుంటారు.

ఐతే, అది తప్పు. మనిషికి కావల్సింది కేవలం ప్రొటీనే కాదు, దాంతోపాటు కార్బోహైడ్రేటులు అనగా పిండిపదార్ధాలు కూడా అవసరం. లో కార్బ్ ఇజ్ నో గుడ్. ఓన్లీ ప్రొటీన్ నో గుడ్.

ప్రొటీన్లో కూడా గుడ్ ప్రొటీన్ బ్యాడ్ ప్రొటీన్ ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ లోకూడా గుడ్ కార్బ్స్ బ్యాడ్ కార్బ్స్ ఉంటాయి.
కొవ్వులో కూడా మంచివి చెడ్డవీ ఉంటాయి.

ఏది ఆరోగ్యకరమైన సమతౌల్యతా? అని అడగవచ్చు.
ప్రతీమనిషికీ ప్రొటీన్, కొవ్వు, పిండి పదార్ధాలు అత్యంత అవసరం. శరీరాన్నిబట్టి నిష్పత్తిలో తేడాలు ఉండవచ్చు. సాధారణంగా, సరాసరి, 40-30-30 అనేది రూలట.
అంటే మనం తినే ఆహారంలోంచి
40% శక్తి, అనగా కేలరీసు గుడ్ కార్బోహైడ్రేటులనుండి లభించాలి
30% ప్రొటీన్ నుండి.
30% కొవ్వు నుండి.
పిల్లలకి కొవ్వు ఎక్కువ అవసరం. వారి మెదడు పెరిగే వయసులో కొవ్వుల అవసరం ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటినుండే లో ఫ్యాట్ అని ఇస్తే అది మెదడుపై ప్రభావం చుపే అవకాశాలు ఉన్నాయట.

వేగన్స్ - చాలామంది వేగన్స్ లో, విటమినుల లోపం, మినరల్స్ అనగా ధాతువుల లోపం లాంటివి ఉంటాయట. కారణం సంపూర్ణ ప్రొటీను తీసుకోకపోవటం అట. ఈ లోపల వల్ల ఆస్టెయోపొరోసిస్, అనీమియా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయట. బి 12 విటమిను డెఫిసియన్సీ ఉండే అవకాశం కూడా ఉందట.

కాబట్టి చక్కటి ఆహార సమతౌల్యత అనేది చాలా ముఖ్యం

ప్రొటీన్ -
గుడ్ ఏది, బ్యాడ్ ఏది?
మాంసాహరమే శరణ్యమా ప్రోటీన్ పొందటానికి?
ఎలాంటి సమతౌల్యం పాటిస్తే సంపూర్ణ ప్రొటీన్ పొందవచ్చూ?
కార్బ్స్ -
గుడ్ కార్బ్స్ ఏవి, బ్యాడ్ కార్బ్స్ ఏవి?
కొవ్వు -
గుడ్ కొవ్వు బ్యాడ్ కొవ్వు ఏంటీ?

ఒక్కోసారి ఒక్కోటి!!

5 comments:

  1. నాకు ఉపయోగపడే పోస్టులు. మిగతావాటికోసం కూడా ఎదురు చూస్తాను.

    ReplyDelete
  2. anna, entidi??
    sagam cheppi sagam cheppakundaa ila madhyalo vadileyyadam baaledu.. tondaragaa purti cheyyi ikkadaprajalu waiting..

    -Karthik

    ReplyDelete
  3. ప్రొటీన్లో కూడా గుడ్ ప్రొటీన్ బ్యాడ్ ప్రొటీన్ ఉంటుంది. ?? First time వింటున్నా ఈ విషయం. మీ తరువాతి పోస్ట్ లో ముందుగా ప్రోటీన్ గురించే రాయమని మనవి జేసుకుంటున్నాం అద్దెచ్చా :-)

    ReplyDelete