Sep 7, 2009

బడిబాగోతం - 200వ పోస్టు

ఆరోజుల్లో బళ్ళోజేరడం అంటే, ఎళ్ళటవ్, జేరడం అంతే. ఒకటో కలాసు అంటే ఓ పలక, ఓ బలం, ఓ జోలెసంచి గుడ్డదే. నెత్తికి నాలుకిలోల ఆవుదం. బుగ్గలమీన పౌడ్రి. కాళ్ళకి సిల్పర్లు. [అనవర్గారూ - ఈ వర్ణనతో ఓ బొమ్మ, ప్లీజూ]
ఇక రెండో మూడో కలాసుకొస్తే, లెపాక్షి నోటుబుక్కు. ఒకటో రెండో. అంతే. నాలుక్కో ఐదుకో నాలుగు నోటుబుక్కులు.
తర్వాతర్వాత నోటూబుక్కులు పెరిగిపొయ్యి ఒక్కో సబ్జెక్టుకి ఒక్కోటి. మరి లెక్కలు గట్రా సేసోటానికి పొడుగు నోటుబొక్కు. యాణ్ణుంచీ? కుట్టుకోడమే.
ఠావులు తెచ్చుకుని, పెద్ద సూత్తో [కొందరు టంకంతో], టయందారం పెట్టి కుట్టుకునేవాళ్ళం. భలే ఉండేయి ఆ నోటుబొక్కులు. సిరిగిపొయ్యేవి కావు. కొన్నికొన్ని సార్లు ఠావులు సింపి సగం నోటుబొక్కులు కుట్టుకునేవాళ్ళం. ఎలా, రెండుమూడు ఠావుల తీస్కుని మద్దన దారంపెట్టి సింపేసి కుట్టుకునే వాళ్ళం
ఇక అట్టలు. సోవియట్ భూమి పుస్తకాలు తెచ్చుకుని, పిన్నులు పికేసి, అట్టలేస్కునే వాళ్ళం. మమూలట్ట, దొంగట్ట. దొంగట్టేస్తే సెక్కుసెదిరేది కాదు సమచ్చరం మొత్తం. అట్టానే ప్రంట్ లైన్ మద్దెన మూడు పేజీలు, సివరి రెండుపేజీలి భలే గట్టిగుండేవి.
ఏందయ్యా ఈ ఉపోద్ఘాతం అంటే, సూరిగాడు బళ్ళో పడ్డాడు. బడి దారిన పడ్డాడు. ప్రి-కె అంట, కె-ఫోర్ అంట. పొద్దున్నే 8.10 కి దింపాల్నంట. 11.30 కి ఇంటికెత్తుకెళ్ళొచ్చంట. పోయినేడాది జేర్చాం కే-త్రీలో. అమ్మవస్తే వెళ్తా లెకపోతే ఎళ్ళ అన్నాడు. ఓ రోజు దింపేసి ఆళ్ళ అమ్మ దాక్కుంది ఏంజేస్తాడో చూద్దాం అని. అంతే లంకించుకున్నాడు. గో ఎవే, ఐ వాంట్ మై మాం, లెట్ మి గో హోం, ఆల్ బై మైసెల్ఫ్ అని అందర్నీ తోసేసి నెట్టేసి గందరగోళం చేసాడు. ఈసారి, పపం వాళ్ళ అమ్మ బాగనే ట్రైనింగ్ ఇచ్చింది నెల ముందునుండి. పాటీ ట్రైనింగ్ అయ్యాడు. వాడికి వాడే బ్రష్ చేస్కుంటున్నాడు. అన్నీ *ఆల్ బై మైసెల్ఫ్* అనే ట్యాగ్ పెట్టేస్కుంటాడు. ఈ మద్దన స్నానం కూడా ఆడే. జలకాలాటలు. రోజుకి నాలుగుసార్లు. తొట్టిస్నానం కూడా చేస్తున్నాడు.
మొట్టమొదటిరోజు, ఏంచేస్తాడో నాయనా అని గుండెలు దడదడలాడతా ఎళ్ళినా. మొత్తానికి, పాతికమంది పిల్లకాయలు. పారెనర్స్ మాత్రం నలుగురున్నారు. నిగతా అంతా మనోళ్ళే. సగం తెలుగే అనుకుంటా. ఆణ్ణి దింపి ఓ ఐదునిమిషాలున్నా. కొంతమంది లంకించుకున్నారు. ఏదుపులు, శోకాలు. మనోడుమాత్రం గుంభనంగా కూకున్నాడు. అరేయ్, ఎళ్తన్నా, అనిసెప్పా. ఓకే, నో ప్రాబ్లం, టెన్షన్ పడకూ అని చెప్పాడు. 11.30 వచ్చా. ఏట్రా అన్నా. నేను ఏడ్వలేదు, నేను గుడ్బాయ్, నాకు మిస్ ఓబులేసు [ఏదోపేరు నాకు నోరు తిరగటల్లా] స్టికర్లు రెండు ఇచ్చింది అని పొంగిపొర్లి కిందపడి దొర్లాడు. ఇప్పటికి మూడ్రోజులు అయ్యింది. నాలుగు స్టిక్కర్లు అందుకున్నాడు, అంటించుకున్నాడు.
మూడ్రోజులకే తెలుగు మారింది. మేము ఇంటికాడ తెలుగే అని నిక్కొవక్కాణిస్తున్నాం.

ఇదీ సూరిగాడి బడిబాగోతం

200 వ పోష్టు సందర్భంగా నా 10k నడక, అంకితమిస్తున్నా
Name: iMapMyRun Sep 6, 2009 11:02 PM
Type: Regular Walk
Date: 09/06/2009
Start: 21:14:52
End: 23:00:54
Time Taken: 01:46:02

Workout Route: iMapMyRun Sep 6, 2009 11:02 PM
Total Distance: 6.38 mi.
Workout Stats
Pace: 16:36 (avg)
Speed: 3.61 (mi/hr) (avg)

http://www.mapmyfitness.com/view_workout?w=590125229256021045

13 comments:

  1. మా పాపను నర్సరిలో స్కూల్లో చేర్చిన రోజు గుర్తు వచ్చిందండి..అమ్మ బయటే ఉండు..అక్కడే నించో అని చెప్పి వెళ్లింది..స్కూలువాళ్ళు కనిపించొద్దు,మీరెళ్ళిపొండి,వాళ్ళకు అలవాటైపోతుంది..అని చెప్పారు...ఆ రొజంతా ఏమీ తోచలేదు..ఏమీ చెయాలనిపించలేదు..21/2 ఏళ్లు నాతొనే అంటిపెట్తుకుని ఉన్న పిల్ల ఇంక జనసందోహంలోకి వెళ్ళిపోయింది..దాని జీవన పయనం మొదలైంది..తింటొందో లేదో,ఎవరన్నా కొడతరేమో,తోసేస్తారేమో,తీచరు తిడితే ఏడుస్తుందేమో..అని బోలెడు ప్రశ్నలు..
    రెండు రొజులు ఏడ్చింది కానీ తరువాత అస్సలు ఏడ్వలేదు అది.ఇంట్లో ఒక్కర్తికీ బోర్ కొట్టేసి,స్కూల్లో పిల్లలు కనిపించెసరికీ అదే నచ్చింది దానికి.
    తింటొందో లేదో,ఎవరన్నా కొడతరేమో,తోసేస్తారేమో,తీచరు తిడితే ఏడుస్తుందేమో..అని బోలెడు ప్రశ్నలు..కాని నాకే అలవాటవ్వడానికి చాలా రోజులు పట్టింది..

    congrats for the 200th post!!

    ReplyDelete
  2. మరే ఎంచక్కా బ్లాగులు రాసుకుంటూ తిరక్కుండా మెల్లి మెల్లిగా మా దారిలోకి వచ్చేస్తున్నారు.బాక్ టు స్కూల్ మొదలైందన్నమాట." బెస్ట్ ఆఫ్ లక్" మీకు, సూరిబాబు క్కాదు (ఆ ఇంగిలీషు మీరు నేర్చుకోడానికి)-Kidding :)

    ReplyDelete
  3. ముందుగా మీకు ద్విశత టపోత్సవ శుభాకాంక్షలు !
    సూరిబాబుకు అభినందనలు !మరిన్ని స్టిక్కర్లు అందుకోవాలి :)

    ReplyDelete
  4. మీ డబల్ సెంచురీ ఇలాగే కొనసాగి బ్రియాన్ లారాను దాటాలి. మీ సూరిగాడికి స్టిక్కర్లతో నిక్కర్లు నిండిపోయి మురళీధరన్‌ను దాటాలి.

    ReplyDelete
  5. 2౦౦ టపాలా? ఏం ఓపిక తమ్మీ నీది. నేను గూడా సిన్న దబ్బనంతో తయారు సేసుకున్నా నోటు బొక్కులు.

    200 టపాల సందర్భంగా మరో 3౦౦ రాయమని నా శాపం.

    ReplyDelete
  6. ఓహ్, శుభాకాంక్షలండీ. అలాగే మీ సూరి బాబు కి ఆల్ థి బెస్టు.

    నేను కూడలి లో కి అడుగుపెట్టిన రోజు చూసిన మొట్ట మొదటిసారి చూసిన మీ పోస్టు ఇప్పటికీ జ్ఞాపకమే.

    " కే సీ ఆర్: తెలంగాణా లో నక్సల్స్ సమస్య కి ఆంధ్రా పాలకులే కారణం"

    మీ సటైరు: మా ఇంట్లో దున్నపోతు ఈనింది, దానికి కే సీ ఆరే కారణం

    మా ఇంట్లో కూడా చెప్పి చెప్పి ఎంత నవ్వనో తెలుస.

    ReplyDelete
  7. ha ha ఈ 200 టపాల వెనుక మీ సూరిబాబు కృషికూడ ఉంది ..తన పేరు చెప్పి సగం పోస్ట్లు వేసారు ..కాబట్టి సగం శుభాకాంక్షలు సూరికి చెందుతాయని మనవి చేసుకుంటున్నాను అద్యక్షా :) ఇంకా చక్కని టపాలతో అందరిని అలరించాలి మీరు

    ReplyDelete
  8. మీ అబ్బాయి తో పాటు మీరు కూడా స్కూల్ కి వెళ్లి చదువుకోవటం లో బిజి నా ఏమిటి? ౨౦౧ పోస్టు ఎప్పుడండి ?

    ReplyDelete
  9. 200 పోస్టుకు శుభాకాంక్షలు. అట్టల గురించి భలే చెప్పినారు. సోవియట్ భూమి అట్టలు, సిమెంట్ కలర్ పేపర్ తో వేసిన అట్టలు భలే గుర్తొచ్చినాయి.

    ReplyDelete
  10. సూరికి మీకు శుభాకాంక్షలు

    ReplyDelete